పాట్నా: ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లపై దాడుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు రైలు ప్రమాదం జరిగేందుకు కుట్రలు చేస్తున్నారు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టడం, పట్టాలకు ఉన్న హుక్స్ తీయడం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం రైళ్లు సమయంలో రాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రైలు జైనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ముజఫర్‌పూర్ – సమస్తిపూర్ మార్గంలో సమస్తిపూర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ సమీపంలో రాత్రి 8:50 గంటల ప్రాంతంలో దాడి ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు రైలుపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో స్లీపర్ కోచ్, రైలు ప్యాంట్రీకార్, పక్క కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
#BigBreaking || બિહારના સમસ્તીપુરમાં સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત#Bihar #Dibrugarh #Samastipur #SwatantrataSenaniExpress #TrainAttack #SwatantrataExpress pic.twitter.com/5NqENieALn
— Gujarati Daily Times (@GujaratiDailyT) September 27, 2024
రైలుపై రాళ్ల దాడి ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. వారికి హుటాహుటిన సమస్తిపూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రాళ్ల దాడి ఘటనపై రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాడి కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: వుతియా పండుగ వేడుకల్లో విషాదం.. 46 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment