express rail
-
ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణీకులకు గాయాలు!
పాట్నా: ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లపై దాడుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు రైలు ప్రమాదం జరిగేందుకు కుట్రలు చేస్తున్నారు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టడం, పట్టాలకు ఉన్న హుక్స్ తీయడం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం రైళ్లు సమయంలో రాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ రైలుపై గురువారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రైలు జైనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ముజఫర్‌పూర్ – సమస్తిపూర్ మార్గంలో సమస్తిపూర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ సమీపంలో రాత్రి 8:50 గంటల ప్రాంతంలో దాడి ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు రైలుపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో స్లీపర్ కోచ్, రైలు ప్యాంట్రీకార్, పక్క కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. #BigBreaking || બિહારના સમસ્તીપુરમાં સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત#Bihar #Dibrugarh #Samastipur #SwatantrataSenaniExpress #TrainAttack #SwatantrataExpress pic.twitter.com/5NqENieALn— Gujarati Daily Times (@GujaratiDailyT) September 27, 2024 రైలుపై రాళ్ల దాడి ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. వారికి హుటాహుటిన సమస్తిపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రాళ్ల దాడి ఘటనపై రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాడి కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వుతియా పండుగ వేడుకల్లో విషాదం.. 46 మంది మృతి -
సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం!
శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్హి(బీహార్) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ డిసెంబర్ 30న రానున్నారు. ఈ సందర్భంగా మోదీ.. అయోధ్య జంక్షన్లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచే రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. అంతే కాదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ- దర్భంగాల మధ్య నడవనుంది. మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీస్ ఢిల్లీ- దర్భంగా మధ్య ఉంటుంది. ఈ రైలు దూర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరో అమృత్ భారత్ రైలు బీహార్‌లోని సితామర్హి (జానకీ మాత జన్మస్థలం)-రక్సాల్ మీదుగా అయోధ్య గుండా ఢిల్లీకి చేరనుందని సమాచారం అమృత్ భారత్ రైలు నాన్-ఏసీ రైలుగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రిపూట రైలు సర్వీసులుగా నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ప్రవేశపెట్టనున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
‘సమతా’కు తప్పిన ముప్పు.. ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పార్వతీపురం టౌన్: పార్వతీపురం గుండా వెళ్తున్న సమతా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయన్న విషయం పార్వతీపురం పట్టణమంతా వ్యాపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం టౌన్–పార్వతీపురం స్టేషన్ల మధ్యలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చేపట్టిన మెగాబ్లాక్ పనులు పూర్తి చేసిన రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాయంత్రం 5 గంటల సమయంలో లైన్స్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో రావాల్సిన నిజాముధ్దీన్– విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ మరికొద్ది సేపటిలో 3వ నంబర్ ఫ్లాట్‌ఫారం మీదికి రానున్నదని రాత్రి 7.20 గంటలకు పార్వతీపురం స్టేషన్లో అనౌన్స్ చేశారు. పది నిమిషాల్లో హారన్ కొడుతూ 7.30 గంటలకు సమతా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ మాత్రమే 3వ నంబర్ ప్లాట్ ఫాం మీదికి వచ్చింది. విడిపోయిన బోగీలలో వెనక బోగిలో ఉన్న గార్డ్ ఈ విషయాన్ని గమనించి ఇంజిన్ లేకున్నా కదులుతున్న బోగీలను ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపడంతో బోగీలన్నీ పార్వతీపురం టౌన్–పార్వతీపురం స్టేషన్ల మధ్యలో ఆగిపోయాయి. ఇంజిన్ లేకుండా బోగీలన్నీ సుమారు అరకిలోమీటరు వరకు ప్రయాణించాయి. గార్డు అప్రమత్తం కావడం వల్ల పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. మెగాబ్లాక్లో భాగంగా చేపట్టిన మెయింటనెన్స్ పనుల్లో ఎక్కడో ఒకచోట కపిలింగ్ ఊడిపోవడం వల్ల ఇంజిన్ నుంచి బోగీలు వేరు పడ్డాయని టెక్నీషియన్లు తెలిపారు. తర్వాత ఇంజిన్‌ను వెనక్కి తీసుకువెళ్లి టెక్నీషియన్లు కపిలింగ్ వేయడంతో రాత్రి 9 గంటల సమయంలో పార్వతీపురం స్టేషన్ నుంచి గంటన్నర ఆలస్యంగా సమతా ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం బయలుదేరింది. -
పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు 8 స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్ డివిజన్ రాజ్‌కియవాస్-బొమద్రా సెక్షన్ పరిధిలోని పాలీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ముంబై నుంచి జోధ్‌పుర్‌కు వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది వాయవ్య రైల్వే. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొంది. ‘సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెళ్తున్నారు. వాయవ్య రైల్వే జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు జైపూర్‌లోని కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.’అని తెలిపారు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వెల్లడించారు.సంఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలోనే హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది వాయవ్య రైల్వే. జోధ్‌పుర్ 0291- 2654979(1072) 0291- 2654993(1072) 0291- 2624125 0291- 2431646 పాలి మర్వార్ 0293- 2250324 138 1072 "Within 5 minutes of departing from Marwar junction, a vibration sound was heard inside the train & after 2-3 minutes, the train stopped. We got down & saw that at least 8 sleeper class coaches were off the tracks. Within 15-20 minutes, ambulances arrived," says a passenger pic.twitter.com/aCDjmZEFyq — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 2, 2023 ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
కొడుకా.. నువ్వులేక మేము బతుకుడెట్లా!
సాక్షి, పెద్దపల్లి : ‘ఎంత పనాయేరా కొడుకా.. నువు లేక మేము బతుకుడెట్లా’ అని విశాల్ తల్లిదండ్రులు, సోదరి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. సోమవారం పెద్దపల్లి రైల్వేస్టేషన్లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం ఆగిన సమయంలో రైలు దిగిన విశాల్(21)ను సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన పెద్దపల్లిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. మందమర్రి సింగరేణి బొగ్గుగని వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్–పద్మావతి దంపతులకు కుమారుడు విశాల్, కూతురు ఉన్నారు. కూతురు హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. సెలవులు రావడంతో ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి శ్రీనివాస్ బయల్దేరగా లగేజీ ఎక్కువగా ఉంటుందని విశాల్, తల్లి పద్మావతి సైతం బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ రైల్లో సోమవారం ఇంటికి బయల్దేరారు. ప్రాణం తీసిన క్రాసింగ్.. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు క్రాసింగ్ కోసం ఆగడమే విశాల్ ప్రాణాలను తీసిందా.. అనే భావన అందరిలో నెలకొంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు నుంచి దిగిన విశాల్ పక్కనే ఉన్న పట్టాలపైకి వెళ్లిన సమయంలో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో ప్రమాదం జరిగింది. చదవండి: డెలివరీకి డబ్బు కావాలి, డ్రాప్ చేయాలని అడిగింది.. ఆపై బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం -
యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దారి దోపిడి
-
కడపలో 5 నిమిషాలు ఆగనున్న ‘హరిప్రియ’
సాక్షి, కడప : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి మేర కు హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలు (డైలీ) ఇకపై కడప రైల్వేస్టేషన్లో ఐదు నిమిషాలు ఆగనుంది. ప్రస్తుతం రెండు నిమిషాలు మాత్రమే ఆగడం వల్ల తమలపాకు, పండ్ల తోటల రైతులు ఇబ్బంది ఎదుర్కొనే వారు. తమ ఉత్పత్తులను రెండు నిమిషాల్లో రైల్లోకి తరలించడానికి ఇక్కట్లు పడేవారు. రైతులు ఈ విషయాన్ని అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన జూన్ 5వ తేదీన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ భూపాల్‌రాజుకు లేఖ రాశారు. కేవలం రెండునిమిషాల పాటు ఆపడం వల్ల ఫలితం లేదని, కనీసం ఐదు నిమిషాలు ఆగేలా చూ డాలని విజ్ఞప్తి చేశారు. మూడు సార్లు ఫోన్లో ఈ విషయంపై ఫాలోఅప్ చేశారు. ఎట్టకేలకు ఎంపీ అభ్యర్థన మేరకు కడపలో హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలును ఐదు నిమిషాల పాటు ఆపుతున్నట్లు రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. -
ఈ‘సారీ’ అంతే...!
జిల్లాకు రైల్వే పరంగా ఏమీ ఒరగలేదు. ఆశించినంతగా బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంతో ప్రయాణీకులు మండిపడుతున్నారు. ఇక్కడి నేతలూ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం కూడా వారి ఆగ్రహానికి కారణమవుతోంది. గత నిర్ణయాలకూ నిధుల మంజూరి కాకపోవడమూ విమర్శలకు తావిస్తోంది. స్టేషన్ మహబూబ్‌నగర్, గద్వాల, న్యూస్‌లైన్: కేంద్ర రైల్వేశాఖమంత్రి మల్లికార్జున్ ఖర్గే బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ రైల్వేబడ్జెట్‌లో పాలమూరు జిల్లా మీదుగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపేందుకు ఓకే చేశారు. గత రెండేళ్ల నుంచీ రైల్వే బడ్జెట్లో ఫలక్‌నూమా నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు చేపట్టాలని ప్రతిపాదించినా అవి కేవలం సర్వేలకే పరిమితం చేశారు. తాజాగా వాటి ఊసే లేదు. ఆర్ఓబీల విషయంలో ఏమాత్రం పట్టించుకోనట్లు కనిపిస్తోంది.జిల్లాలో ఉన్న 50కి పైగా కాపలాలేని లెవల్ క్రాసింగ్ గేట్ల విషయంలోనూ పట్టించుకోలేదు. డబుల్ డెక్కర్ పరుగులు తీయనుంది... రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పాలమూరు జిల్లాకు మూడు వీక్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించారు. కొత్తగా బడ్జెట్లో ప్రకటించిన వివరాల ప్రకారం కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ డబుల్‌డెక్కర్ రైళ్లు జిల్లా మీదుగా పరుగెత్తనున్నాయి. కాచిగూడ-నాగర్సోల్ వీక్లిరైల్ కూడా ఇలానే వెళ్లనుంది. కనిపించని కరుణ... మహబూబ్‌నగర్, గద్వాల, జడ్చర్ల, షాద్‌నగర్ తదితర ముఖ్యమైన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలూ లేవు. మహబూబ్‌నగర్, గద్వాల రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడచినా ఎటువంటి పనులు జరగలేదు. ఈ బడ్జెట్లోనైనా రైల్వే స్టేషన్లలో సౌకర్యాల మెరుగు, ఆధునికీకరణకు నిధులొస్తాయనుకున్నా ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇటీవల ప్రతిపాదించిన ద్రోణాచలం నుంచి వయా గద్వాల, రాయచూరుల మీదుగా ముంబైకి వెళ్లే రైళ్ల ప్రస్తావన కనిపించడం లేదు. గద్వాల - రాయచూర్‌ల మధ్య ఈ బడ్జెట్లో ఒక్క రైలును కూడా అదనంగా నడిపేందుకు నిర్ణయించలేదు. దీనితో ఈ ప్రాంత ప్రజలకు నిరాశను కల్పించేలా ఉంది. గద్వాల - మాచర్ల రైల్వే లైన్, మహబూబ్‌నగర్ -గుత్తి డబుల్ లైన్లకు బడ్జెట్లో మోక్షం కల్పించలేకపోయారు. ఇక గద్వాల రైల్వే జంక్షన్లో శిక్షణా సంస్థల ఏర్పాటు, గద్వాల జంక్షన్ అభివృద్ధికి నిధులు వంటి ప్రస్తావన లేనే లేదు. పగటి పూట నడిచే కాచిగూడ -తిరుపతి, గుంటూరు - కాచిగూడ డబుల్ డెక్కర్ రైళ్లతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు సౌకర్యంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఈ ప్రాంతంనుంచి వెళ్లే భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది. -
ఎవరా వ్యక్తులు?
సాక్షి, అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు బీ-1 బోగీలో ప్రయాణిస్తున్న వ్యక్తుల వల్లే బోగీ తగలబడి 26 మంది మృతి చెందారని సరిగ్గా నెల రోజులకు ప్రాథమికంగా నిర్ధారించారు. డిసెంబర్ 28న కొత్తచెరువు సమీపంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇపుడు ఆ ప్రమాదం జరగడానికి కారకులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సి ఉంది. ఆ వ్యక్తులను గుర్తిస్తారా లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీ-1 బోగీలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు లేదా ప్రయాణీకుల తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు తన విచారణలో తేలిందని బెంగళూరులోని రైల్వే సేఫ్టీ సౌత్ సర్కిల్ కమిషనర్ సతీష్ కుమార్ మిట్టల్.. లక్నోలోని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు బుధవారం వెల్లడైంది. పేలుడు, విద్రోహ చర్య కారణం కాదని, ప్రయాణీకులు ఆక్సిజన్ లేని వాయువుని పీల్చడం వల్లే మృతి చెందినట్లు తెలుస్తోందని నివేదికలో పేర్కొన్నారు. సతీష్ కుమార్ మిట్టల్‌తో పాటు చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ విక్రాంత్ కల్రా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏసీ రైల్వే బోర్డు డెరైక్టర్ జైదీప్, ఆర్డీఎస్ఓ డెరైక్టర్ ఎం.జమాలి, చీఫ్ ఎలక్ట్రికల్ సర్వీస్ ఇంజనీర్ వి.వి.కోకటే, ట్రాక్స్మిషన్ చీఫ్ ఇంజనీర్ రాంగోపాల్, చీఫ్ కమర్షియల్ మేనేజర్ అనిల్ పవిత్రాన్, చీఫ్ వర్క్‌షాప్ ఇంజనీర్ టి.వి.సుబ్బారావు, బెంగళూరు డివిజనల్ రైల్వే మేనేజర్ అనిల్ కుమార్ అగర్వాల్‌తో కలిసి డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీన రెండు రోజుల పాటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో స్థానికంగా వున్న స్టేషన్ మేనేజర్‌తో పాటు ఇతర రైల్వే సిబ్బంది సరిగా సమాచారం ఇవ్వలేదని నివేదికలో వివరించారు. మృతులతో పాటు క్షతగాత్రుల వివ రాలు ఇవ్వాలని పలుమార్లు అడిగినా పెద్దగా స్పందించలేదని చెప్పారు. -
అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం
ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్ : తిరుపతి నుంచి అమరావతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడటంతో శనివారం రాత్రి ధర్మవరం స్టేషన్లో ఒకటిన్నర గంట పాటు ఆగిపోయింది. శనివారం రాత్రి 9 గంటలకు రైలు ధర్మవరం సమీపంలోకి రాగానే పెద్ద శబ్దంతో పాటు డీజిల్ వాసన గుప్పుమంది. దీంతో కొందరు ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అంతలో రైలు ధర్మవరం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలు ఇంజిన్‌ను తనిఖీ చేయాలని ప్రయాణికులు సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో ప్రయాణికులు రైలును ముందుకు కదలనివ్వబోమంటూ పట్టాలపై కూర్చున్నారు. దీంతో రైల్వే అధికారులు ఇంజిన్‌ను పరిశీలించారు. డీజిల్ ట్యాంక్‌కు రంధ్రం పడినట్లు గుర్తించారు. కాసేపట్లోనే డీజిల్ అంతా కారిపోయింది. చివరికి గుంతకల్లు నుంచి మరో ఇంజన్‌ను తెప్పించి రైలును నడిపారు. దీంతో రైలు అక్కడే ఒకటిన్నర గంట పాటు ఆగింది. ప్రయాణికులు పట్టుబట్టకపోయి ఉంటే ప్రమాదం చోటుచేసుకుని ఉండేదని అధికారులు పేర్కొన్నారు. -
రైలుపై మావోయిస్టుల దాడి
మావోల కాల్పుల్లో ముగ్గురు జీఆర్పీ జవాన్ల మృతి ముంగేర్: బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో శనివారం ఓ ఎక్స్‌ప్రెస్ రైలుపై మావోయిస్టులు దాడిచేసి జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీ) జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సాయంత్రం 5:45 గంటలకు సాహెబ్‌గంజ్-పాట్నా ఇంటర్-సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు జమాల్పూర్, ఆశిక్‌పూర్‌ల మధ్య ఓ సొరంగం, బ్రిడ్జిల మధ్య రైలు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మరణించిన, గాయపడిన జవాన్ల నుంచి మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక స్టెన్ గన్, ఏకే-47, 460 బుల్లెట్లను నక్సల్స్ దోచుకుని, పారిపోయారని జమాల్పూర్ రైల్వే ఎస్పీ అమితాబ్ కుమార్ తెలిపారు. కాల్పుల్లో హవల్దార్ అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు భోలా ఠాకూర్, ఉదయ్‌సింగ్‌లు మరణించారని, వీరితోపాటు గాయపడిన ఇద్దరు జవాన్లూ బీహార్ మిలిటరీ పోలీస్(బీఎంపీ) 12వ యూనిట్‌కు చెందినవారని పేర్కొన్నారు. 8 నుంచి 10 మంది వరకూ మావోయిస్టులు జమాల్‌పూర్‌లో రైలు ఎక్కారని దాడిలో గాయపడ్డ జవాను ఒకరు తెలిపారు. రైలులోని మావోలు పాసిఖానా వద్ద చైను లాగడంతో రైలు ఆగిందని, దాంతో పట్టాల వెంబడి దాక్కున్న మావోయిస్టు మహిళల బోగీలో రక్షణగా ఉన్న జవాన్లపై కాల్పులు జరిపారని చెప్పారు.