సాక్షి, కడప : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి మేర కు హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలు (డైలీ) ఇకపై కడప రైల్వేస్టేషన్‌లో ఐదు నిమిషాలు ఆగనుంది. ప్రస్తుతం రెండు నిమిషాలు మాత్రమే ఆగడం వల్ల తమలపాకు, పండ్ల తోటల రైతులు ఇబ్బంది ఎదుర్కొనే వారు. తమ ఉత్పత్తులను రెండు నిమిషాల్లో రైల్లోకి తరలించడానికి ఇక్కట్లు పడేవారు. రైతులు ఈ విషయాన్ని అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన జూన్ 5వ తేదీన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ భూపాల్‌రాజుకు లేఖ రాశారు.
కేవలం రెండునిమిషాల పాటు ఆపడం వల్ల ఫలితం లేదని, కనీసం ఐదు నిమిషాలు ఆగేలా చూ డాలని విజ్ఞప్తి చేశారు. మూడు సార్లు ఫోన్లో ఈ విషయంపై ఫాలోఅప్ చేశారు. ఎట్టకేలకు ఎంపీ అభ్యర్థన మేరకు కడపలో హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలును ఐదు నిమిషాల పాటు ఆపుతున్నట్లు రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు.
కడపలో 5 నిమిషాలు ఆగనున్న ‘హరిప్రియ’
Published Sun, Jul 19 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement