
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగిన దరిమిలా రైల్వే అధికారులు స్టేషన్‌లో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. సోమవారం మరోమారు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఏర్పడటాన్ని చూసిన అధికారులు ప్లాట్‌ఫారం టిక్కెట్లు విక్రయాలను నిలిపివేశారు.
న్యూఢిల్లీ రైల్వే అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికు సంఖ్య తగ్గాకనే ప్లాట్‌ఫారం టిక్కెట్లను విక్రయిస్తామని తెలిపారు. ప్రయాణికులు రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్లాట్‌ఫారం టిక్కెట్ల కౌంటర్ దగ్గర ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ అతికించారు. దానిలో ప్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆన్‌లైన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్లను విక్రయిస్తున్నారా? లేదా అనేది తెలియరాలేదు. కాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..