platform ticket
-
అమెజాన్ సంచలన ప్రకటన.. భారత్‌లో ఆ ప్లాట్‌ఫాం బంద్!
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత అకాడమిక్ సెషన్లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్‌ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది. ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్‌ని ఆన్లైన్లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
దసరా ఎఫెక్ట్: ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు పెంపు.. స్పెషల్ ట్రైన్స్ ఇవే..
దసరా పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగానే కాచిగూడ రైల్వే స్టేష్లన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచింది. కాగా, పెరిగిన ధరలు నేటి(సెప్టెంబర్ 25) నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 9 తర్వాత మళ్లీ టికెట్ ధర రూ. 10కి చేరుతుంది. ఇదిలా ఉండగా.. దసర పండుగ సందర్బంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతున్నట్టు వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. Temporary Increase in Platform Ticket Price to Rs. 20/- at #Kacheguda Railway Station during #Dussehra Festival Season. The hike in platform ticket price is applicable up to 09th October, 2022. *Rail users may kindly note the same and extend cooperation. pic.twitter.com/WW7k52GrM3 — South Central Railway (@SCRailwayIndia) September 26, 2022 ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇవే.. - సెప్టెంబర్ 28న.. సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్. - సెప్టెంబర్ 29న.. యశ్వంత్ పూర్ నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 9న.. తిరుపతి నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 10న.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడుస్తుంది. Kindly note: SCR to run #Train No. 07265/66 Secunderabad- Yesvantpur-Secunderabad Special train Ex. Secunderabad on 28.09.22 and Ex. Yesvantpur on 29.09.22 under TOD(trains on demand) to clear extra rush.#SWRupdates .@DDChandanaNews pic.twitter.com/QUJY6oADaN — South Western Railway (@SWRRLY) September 26, 2022 -
పండగవేళ ప్రయాణికులకు షాక్! ఈ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఛార్జీల పెంపు
సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. పండగ వేళ రద్దీ నియంత్రణ పేరుతో ప్రజల నెత్తిన పిడుగు వేసింది రైల్వేశాఖ. స్టేషన్లలోకి ప్రయాణికులతోపాటు వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రాకను నియంత్రించేందుకు ప్లాట్‌ఫారమ్ ధరలను భారీగా పెంచింది. నగర పరిధిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 15 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధరలను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నిత్యం లక్ష మందికి పైగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్లో ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ప్రస్తుతం రూ.10 ఉన్న టిక్కెట్టు ధరను రూ. 20 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల పెంపు నుంచి నగర పరిధిలో కాచిగూడ స్టేషన్‌కు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో ఇక తెలంగాణ వ్యాప్తంగా వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాచలంరోడ్డు, మంచిర్యాల, రామగుండం, పర్లీ వైద్యనాథ్, తాండూరు, వికారాబాద్‌లతో పాటు కర్నాటకలోని బీదర్ రైల్వే స్టేషన్లలో కూడా రూ.10గా ఉన్న ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధర రూ.20కి పెరిగింది. పెరిగిన ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్టు ధరలు 2022 జనవరి 10 నుంచి 20 వరకు అమల్లో ఉంటాయి. ఏపీపై స్పష్టత లేదు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులో విస్తరించి ఉండగా ఇందులో తెలుగు రాష్ట్రాలే కీలకం. అయితే ఫ్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరల పెంపుకు సంబంధించి ఏపీ, మహరాష్ట్ర పరిధిలోకి వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణతో పాటు కర్నాటకలోని బీదర్‌కి సంబంధించిన వివరాలే వెల్లడించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు! -
రైల్వే స్టేషన్లో ఆ టికెట్ కన్నా ప్లాట్‌ఫామ్ టికెటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం ధర పెరిగింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు అని చెబుతూ గతంలో మాదిరి ఈసారి కూడా ధరలు పెంచేశారు. రూ.30 ఉన్న టికెట్‌ను రూ.50కి దక్షిణ మధ్య రైల్వే పెంచేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్టేషన్లో రద్దీని నియత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. లాక్డౌన్ మళ్లీ విధిస్తారేమోననే భయంతో ప్రజలు, వలస కార్మికులు ఇళ్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణం టికెట్ కన్నా ప్లాట్‌ఫాం టికెట్ అధికంగా ఉందని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ప్లాట్ఫారం టికెట్ రూ.50.. రద్దీని తగ్గించేందుకే
ముంబై సెంట్రల్: ప్లాట్ఫారం టికెట్ ధరను రైల్వే ఏకంగా రూ.50కి పెంచేసింది. ఒకవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ముంబైకర్లు సతమతమవుతుంటే ప్రభుత్వం పెంచిన ప్లాట్ఫారం టికెట్ల ధరలు వారికి అశనిపాతంగా మారాయి. గత కొద్ది రోజులుగా ముంబై పరిసర నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్టా, ప్రభుత్వం అనవసరమైన అధిక రద్దీని తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణీకులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారనీ, జనాల రద్ధీని తగ్గించేందుకు ప్లాట్ఫారం టికెట్ల ధరలు అమాంతం పెంచేసి యాభై రూపాయలు చేసింది. గతంలో ఈ ప్లాట్ఫారం టికెట్ ధర పది రూపాయలు ఉండేది. నిజానికి ధరలు పెంచాలనే నిర్ణయం 24 ఫిబ్రవరి రోజే తీసుకున్నామనీ, ఈ పెంచిన ధరలు జూన్ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శివాజీ సుతార్ తెలిపారు. ముంబై మహానగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, కల్యాణ్, పన్వేల్, భివండీ రోడ్ స్టేషన్లలో ప్లాట్ ఫారం టికెట్ల ధరలు యాభై రూపాయలు ఉంటాయనీ, ఇవే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రేట్లను పెంచామనీ ఆయన అన్నారు. చదవండి: (మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ) -
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50
►పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే అన్ని పెద్ద స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేంరుకు ఆ నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణికులు లేని కారణంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 మధ్య ప్రయాణించాల్సిన 23 రైళ్లను సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. చెన్నైలోనూ ప్లాట్ ఫాం టికెట్ ధరను దక్షిణ రైల్వే రూ. 50 చేసింది. ►అఫ్గానిస్తాన్, ఫిలిప్పైన్స్, మలేసియాల నుంచి మార్చి 31 వరకు భారత్‌కు ఎవరూ రాకూడదని నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు, టర్కీ, బ్రిటన్ల నుంచి ప్రయాణికులను భారత్ ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. ►రాష్ట్రంలో ఏ నగరాన్నీ లాక్డౌన్ చేయాలని అనుకోవడం లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకో వాలని, లేదంటే, అన్ని రైలు, బస్సు ప్రయాణాలను నిషేధిస్తామని హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు. ►కరోనా కట్టడికి రూ. 200 కోట్లతో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రకటించారు. మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా హాల్స్, స్టేడియంలు, ఆడిటోరియంలను, ఏప్రిల్ 15 వరకు అన్ని విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశించారు. ►విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ముందుజాగ్రత్తగా తన ఇంట్లో ఏకాంతవాసంలోకి వెళ్లారు. ఆయన మార్చి 14న కేరళలో ఒక ఆసుపత్రి(ఎస్సీటీఐఎంఎస్టీ)ని సందర్శించారు. ఇటీవల స్పెయిన్ వెళ్లివచ్చిన ఆ ఆసుపత్రి వైద్యుడికి వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఆ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ►ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయాలు, ఇతర ప్రైవేటు పాఠశాలలు పరీక్షల ఫలితాలు ఆన్లైన్లోనే ప్రకటించాలని, పేరెంట్–టీచర్ మీటింగ్స్‌ను జరపకూడదని నిర్ణయించాయి. ►ప్రస్తుతం కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు 72 ఐసీఎంఆర్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఎన్ఏబీఎల్ అక్రెడిటేషన్ పొందిన ప్రైవేటు ల్యాబ్స్ అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. ►మార్చి 31 వరకు ముఖ్యమైన కేసులను మాత్రమే, అదీ ఆడియో– వీడియో కాన్ఫెరెన్స్ ద్వారానే విచారించాలని కేంద్ర సమాచార కమిషన్ నిర్ణయించింది. ►కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం తొలికేసు నమోదైంది. దాంతో ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, సినిమా హాల్స్ మొదలైన వాటిని మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
కరోనా ఎఫెక్ట్: షాకిచ్చిన రైల్వేశాఖ
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి.. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీచేశాయి. అదే విధంగా వివాహ వేడుకలను కూడా వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టు ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచినట్లు పేర్కొంది.(చదవండి: ‘గ్రాండ్ ప్రిన్సెస్’లో చిక్కుకున్న భారతీయులు!) ఈ మేరకు రైల్వే శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘దేశంలోని 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచనున్నాం. అయితే ఇది తాత్కాలికమే. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పశ్చిమ రైల్వే ముంబై, వడోదర, అహ్మదాబాద్, రట్లాం, రాజ్‌కోట్, భావ్‌నగర్ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50కి పెంచింది’’ అని పేర్కొన్నారు. రైల్వే ప్లాట్‌ఫాం ధరను పెంచేందుకు 2015 మార్చిలో డివిజన్ రైల్వే మేనేజర్లకు అధికారం ఇస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం భారత్‌లో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది. ఇక ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.(‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం!) చదవండి: ‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం! వైద్యులు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటారో తెలుసా? కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు -
30 బస్కీలు తీస్తే టికెట్ ఉచితం
న్యూఢిల్లీ: ‘ఫిట్ ఇండియా’కు ప్రచారం కల్పించేందుకు భారత రైల్వే ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో 30 బస్కీలు తీస్తే ఉచితంగా ప్లాట్ఫారం టికెట్ లభించనుంది. ఈ తరహా పథకాన్ని రైల్వే శాఖ అమలు చేయడం ఇదే మొదటిసారి. ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్లో ‘స్క్వార్ట్ మెషీన్’ను అధికారులు ఏర్పాటు చేశారు. దాని ముందు 30 బస్కీలు తీస్తే చాలు ప్లాట్ఫారం టికెట్ జనరేట్ అయి ఉచితంగా లభిస్తుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్లో ‘దవా దోస్త్’ జెనరిక్ మెడికల్ షాప్‌ను కూడా రైల్వే ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు నాణ్యమైన మందులను సరసమైన ధరలకే అందిస్తామని రైల్వే తెలిపింది. జెనరిక్ ఔషధాలను ప్రోత్సహిస్తున్న ‘దవా దోస్త్’కు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం రాజస్తాన్, ఢిల్లీలో 10 దవా దోస్త్ దుకాణాలున్నాయి. ఈ ఏడాది 100 దుకాణాలు.. వచ్చే నాలుగేళ్లలో 1,000 దుకాణాల ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. -
అలా చేస్తే ప్లాట్‌ఫాం టికెట్ ఫ్రీ!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓ మెషీన్ అటు ప్రయాణికులను, ఇటు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఖర్చూ లేకుండా ఆ మెషీన్ ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్లు అందిస్తోంది. దాంతో అక్కడ ఉచిత టికెట్ల కోసం కాసింత ఒళ్లు వంచుతున్నారు. ఇంతకూ విషయమేంటంటే ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ ఇచ్చే యంత్రాన్ని నెలకొల్పారు. ఆ యంత్రం ఎదురుగా నిలుచుని కొద్దిదసేపు సిట్ అప్స్ చేస్తే చాలు.. మెషీన్ ఉచిత ప్లాట్‌ఫాం టికెట్ ఇచ్చేస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఫిట్నెస్తో మనీ సేవ్ చేసుకోండని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఫిట్నెస్ను పోత్సహించేందుకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఒక అసాధారణ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం’అని పేర్కొన్నారు. వీడియోలో ఓ వ్యక్తి మెషీన్ ఎదురుగా నిలుచుని కాసేపు సిట్ అప్స్ చేయడంతో.. అతనికి ఉచిత ప్లాట్‌ఫాం టికెట్ లభించింది. ఈ వీడియో ట్విటరటీ దృష్టిని ఆకర్షించింది. గంటల వ్యవధిలోనే అది వైరల్ అయింది. 1.5 లక్షల వ్యూస్, 29 వేల లైకులు, 10 వేల రీట్వీట్లతో అది దూసుకుపోతోంది. అద్భుతం అని కొందరు. ఫిట్‌నెస్‌పై అవగాహనకు అద్భుతమైన చొరవ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘విదేశాల్లో అమల్లో ఉన్న ఇలాంటి ప్రయోగాలు తొలిసారి భారత్‌లో ప్రవేశపెట్టారు. థాంక్యూ సర్’అని ఓ నెటిజన్ ధన్యవాదాలు చెప్పారు. -
అలా చేస్తే ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్ ‘కొట్టేయొచ్చు’
-
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలు తాత్కాలికంగా పెంపు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీ రూ.20 కి పెరుగనుంది. సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తాత్కాలికంగా చార్జీలను పెంచినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులతో పాటు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, ఇతరుల రద్దీని నియంత్రించేందుకే చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు స్పష్టం చేశారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లుకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలుమార్గాల్లో అదనంగా రైళ్లను నడుపుతోంది. -
‘ప్లాట్‌ఫాం’పై ప్రయాణికుల కొత్త ఎత్తుగడ!
సాక్షి, విజయవాడ: రైల్వే శాఖ ఇటీవల రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కు పెంచింది. పెరిగిన ధరలు దసరా పండుగ సందర్భంగా పదిరోజులపాటు అమలులో ఉంటాయని ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్ టికెట్ల కన్నా.. గుంటూరు ప్యాసింజర్ రైలు టికెట్లు పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి. కారణం ఏంటని ఆరా తీసిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల వ్యూహంతో బిత్తరపోతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో తమ బంధువులకు స్వాగతం పలికేందుకు, లేదా వీడ్కోలు పలికేందుకు వస్తున్న వారు.. ఫ్లాట్ ఫామ్ టికెట్‌కు బదులు పది రూపాయలు పెట్టి.. గుంటూరు పాసింజర్ టికెట్లు కొంటున్నారు. దీంతో వారికి రూ. 20 ఆదా కావడమే కాకుండా రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో చాలామంది తెలివిగా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ప్లాట్‌ఫామ్ టికెట్ల కన్నా గుంటూరు ప్యాసింజర్ టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు తాజాగా ప్రయాణికులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ప్రయాణికుల భద్రత కోసమే పెంచాం ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంచడం వల్ల రైల్వే శాఖకు వచ్చే ఆదాయం అతి స్వల్పమని, ప్రయాణికుల భద్రత కోసమే పెంచామని విజయవాడ రైల్వే ఏడీఆర్ఎం సుమన తెలిపారు. రైల్వే స్టేషన్లో కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండకపోతే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించడానికే ధరలు పెంచామని తెలిపారు. 'ఫ్లాట్‌ఫామ్ టికెట్లు మాత్రమే కొనండి, తక్కువ ధర అని గుంటూరు ప్యాసింజరు రైలు టికెట్లు కొనకండి' అని ఆమె ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. -
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర పెంచిన రైల్వే శాఖ
సాక్షి, విజయవాడ : దసరా పండుగ రానున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అవకాశముండడంతో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల ధరను రెండు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ. 10 గా ఉండగా దానిని రూ. 30 కి పెంచింది. ఈ పెంపు శనివారం నుంచే అమల్లోకి వస్తోంది. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లలో ఈ పెంపు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు
న్యూఢిల్లీ: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాల ద్వారా భారతీయ రైల్వేకి 2018–19 సంవత్సరంలో రూ.140 కోట్ల ఆదాయం చేకూరింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో ప్రకటించారు. ప్రకటనల ద్వారా రూ. 230.47 కోట్ల ఆదాయం చేకూరిందని చెప్పారు. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఓపెన్ బిడ్ల ద్వారా రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు, ప్రకటనల కోసం కాంట్రాక్టుకు ఇస్తాము. ఈ బిడ్ల ద్వారానే రేట్లు నిర్ణయిస్తారు. కనుక వీటి నిర్ధిష్టమైన రేటును చెప్పడం సరి కాదని మంత్రి స్పష్టం చేశారు. మొదటగా లైసెన్సు రుసుముగా కనీస ధరను నిర్ణయిస్తారు, ఆ తరువాత బిడ్డింగ్ జరుగుతుంది, దాని పైన కొటేషన్ ధరను సమర్పించాల్సి ఉంటుంది’’ అని గోయల్ తెలిపారు. -
సంక్రాంతికి ఊరెళుతున్నారా? ఇది చదవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : తెలుగువారు ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ దృష్ట్యా అటు రైల్వే, ఇటు ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించగా, మొత్తం 3,262 స్పెషల్ బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఇక దక్షిణమధ్యరైల్వే ప్రధాన కేంద్రం సికింద్రబాద్ స్టేషన్లో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచారు. ఈ పెంపు తాత్కాలికమేనని, సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 11 నుంచి 17 వరకు పెరిగిన ధరలు అమలవుతాయని పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ సీజన్లలో రైళ్లు ఎక్కేవారికంటే వారికి తోడ్కోలు, వీడ్కోలు కోసం ఫ్లాట్ఫాంపైకి వచ్చేవారితో రద్దీ పెరుగుతుండటంతో దానిని నియంత్రించేందుకే ధరలు పెంచుతుండటం తెలిసిందే. సంక్రాంతి స్పెషల్ రైళ్లు : పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్–విశాఖ, సికింద్రా బాద్– దర్బం గా, హైదరాబాద్– రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి(07479) స్పెషల్ ట్రైన్ : ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. హైదరాబాద్–విశాఖ(07148/07147) స్పెషల్ ట్రైన్ : ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్–దర్భంగా(07007/07008) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ –రెక్సాల్ (07005/07006) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది. స్పెషల్ బస్సులు : జనవరి 10 నుంచి 13 వ తేదీ వరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూలు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను సిద్ధంచేశారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్ వైపు 115, నెల్లూరు 143, వరంగల్ 384, కరీంనగర్ 280, ఖమ్మం 430, మహబూబ్ నగర్ 179, ఆదిలాబాద్, నిజామా బాద్ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్ ఈఎల్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. -
‘కాచిగూడ’ ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రూ.10 నుంచి రూ.20కు పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుందన్నారు. అనవసరమైన వ్యక్తులను నియంత్రించేందుకే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచినట్లు తెలిపారు. -
సికింద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు
రూ.10 నుంచి రూ.20కి పెంచుతూ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు పెరగనున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచారు. సంక్రాంతి, శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 10 నుంచి 16 వరకు తాత్కాలికంగా ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
బస్టాండ్‌లోకి వెళ్లాలా.. రూ.5 కట్టాలి
రైల్వే స్టేషన్ల తరహాలో ప్లాట్‌ఫామ్ టికెట్ల విధానం సాక్షి, హైదరాబాద్: మీ కుటుంబ సభ్యులు, బంధువులెవరినైనా బస్ ఎక్కించేందుకు బస్‌స్టేషన్‌లోకి వెళుతున్నారా.. అయితే మీరూ టికెట్ తీసుకోవాల్సిందే! ఐదు రూపాయలు సమర్పించుకోవాల్సిందే! కారణం... రైల్వేస్టేషన్ల తరహాలో బస్స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ విధానాన్ని అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోజూ లక్ష మందికిపైగా రాకపోకలు సాగించే హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)లో దీనిని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సదుపాయాల కల్పన, సుందరీకరణ నగరంలోని ప్రధాన బస్స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో సుమారు రూ.13 కోట్ల వ్యయం తో చేపట్టిన అదనపు సదుపాయాల ఏర్పాటు, సుం దరీకరణ పనులు తుది దశకు చేరుకున్నారుు. బయటి నుంచి చూస్తే షాపింగ్ మాల్స్‌ను తలపించే విధంగా సుందరీకరణ పనులు చేపట్టారు. కొత్త మార్బుల్స్‌తో ఫ్లోరింగ్ పునర్నిర్మించారు. ప్రయాణికులు కూర్చునేందుకు కొత్త సీట్లు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్‌లో ప్రస్తుతం లోపల ఉన్న సుమారు 20 టికెట్ బుకింగ్ కౌంటర్ల విండోలను బయటి వైపు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు టికెట్ తీసుకున్న తరువాతే లోపలికి ప్రవేశించే విధంగా మార్పులు, చేర్పులు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రయాణికులను మాత్రమేలోనికి రానిస్తూ, తోడుగా వచ్చిన వారికి ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటేనే లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. టికెట్టేతర ఆదాయం పెంపుపై దృష్టి టికెట్టేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఆర్టీసీ పలు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్)లలో వాణిజ్య కార్యకలాపాలను విసృ్తతం చేసి, అదనపు ఆదాయం పొందేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఎంజీబీఎస్‌లో మినీ థియేటర్లు, షాపింగ్ మాల్స్‌తో పాటు, వాణిజ్య ప్రకటనల కోసం స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. భారీ తెరలు.. మినీ థియేటర్లు ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో బస్సుల సమాచారం లోపభూరుుష్టంగా ఉంది. ఏ బస్సు ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉందో తెలుసుకోవడం కష్టం. అనౌన్సమెంట్ పద్ధతి కొనసాగుతున్నా.. అది కొన్ని ప్లాట్‌ఫామ్‌లకే పరిమితమవుతోంది. అన్ని ప్లాట్‌ఫామ్‌లకు, బయట ఉన్నవారికి వినబడేలా... రైల్వే తరహాలో అధునాతన టెక్నాలజీతో అనౌన్స్మెంట్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. బస్సుల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేందుకు నాలుగు వైపులా నాలుగు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ప్రయాణికులకు వినోదాన్ని కూడా అందిస్తారు. ఇక వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా ఎంజీబీఎస్‌లో రెండు మినీ థియేటర్లు, మరో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మల్టీలెవల్ పార్కింగ్‌పై కూడా ఆర్టీసీ దృష్టి సారించింది. ఎంజీబీఎస్, జేబీఎస్ చుట్టూ అందుబాటులో ఉన్న స్థలాల్లో ఈ తరహా పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా భవిష్యత్తులో మెట్రో రైలు ప్రయాణికులకు కూడా ఈ పార్కింగ్ ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బయటి వారిపై నియంత్రణ ప్రస్తుతం ఎంజీబీఎస్‌లో సుమారు 72 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నారుు. రోజూ దాదాపు 3,500 బస్సులు ఇక్కడి నుంచి తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారుు. దాదాపు 1.3 లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు. దసరా, సంక్రాంతి వంటి పర్వదినాలు, తీర్థయాత్రలు, వేసవి సెలవుల వంటి సందర్భాల్లో ఈ సంఖ్య రెండింతల వరకు చేరుతుంది. అయితే ప్రయాణికులతో పాటు దాదాపు 10 నుంచి 25 శాతం మంది బయటి వ్యక్తులు (బంధువులు, స్నేహితులు, ఇతరులు వంటి వారు) బస్‌స్టేషన్ లోపలికి వస్తున్నట్లు అంచనా. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ప్లాట్‌ఫామ్ టికెట్‌ను ప్రవేశపెట్టి, అవసరం ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించాలని భావిస్తోంది. -
ప్లాట్‌ఫామ్ టికెట్ ధరకు రెక్కలు!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పండుగ బాదుడు నేటి నుంచి 26 వరకు అమలు సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పండుగ బాదుడు షురూ చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీని రూ.10 నుంచి అమాంతం రూ.20కి పెంచేసింది. శనివారం నుంచి ఈ నెల 26 వరకు ఈ చార్జీలు అమల్లో ఉంటాయి. అయితే ప్రయాణికుల తాకిడి భారీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఈ స్టేషన్లో సాధారణ రోజుల్లో సుమారు 15 వేల ప్లాట్‌ఫామ్ టికెట్లు విక్రయిస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య 25 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు ప్లాట్‌ఫామ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. తద్వారా సాధారణ రోజులతో (రూ.1.5 లక్షలు) పోలిస్తే పెంచిన చార్జీల వల్ల రోజుకు రూ.5 లక్షల ఆదాయం రైల్వేకు లభిస్తుంది. రద్దీనిబట్టి ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారి. ఈ తరహా పెంపు అధికారాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్‌కు కట్టబెట్టారు. స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉందని భావిస్తే వారు చార్జీ ఎంతైనా పెంచవచ్చు. -
రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర పెంపు!
న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి ప్లాట్‌ఫాం టిక్కెట్ల రేట్లను రైల్వేశాఖ పెంచనుంది. ప్రస్తుతం రూ.5 గా ఉన్న ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.10కి పెంచనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో కూడిన టిక్కెట్లను అన్ని రైల్వే స్టేషన్లకు సకాలంలో సరఫరా చేయాలని జోనల్ రైల్వేలను రైల్వే శాఖ ఆదేశించింది. ర్యాలీలు, ఉత్సవాల సందర్భంలో ప్లాట్‌ఫాంలపై రద్దీని నియంత్రించేందుకు టిక్కెట్ రేట్లను పది రూపాయలకంటే ఎక్కువగా పెంచేందుకు డివిజనల్ రైల్వే మేనేజర్లకు రైల్వేశాఖ అధికారం కల్పించింది. -
ఆన్లైన్లో ప్లాట్‌ఫామ్, పార్కింగ్ టికెట్లు
హైదరాబాద్ : ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం ప్రయాణికులు భారీ క్యూలో నిలబడే ఇబ్బందులు తప్పనున్నాయి. ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం కౌంటర్ల వద్ద భారీగా జనం క్యూ కట్టడం చూస్తూ వుంటాం. ఈ సమస్యను చెక్ పెట్టేలా ఆన్లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుగోలు చేసుకునే రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ఈవిషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్‌తో పాటు పార్కింగ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. -
మెట్రోకు ‘ప్లాట్‌ఫాం’ కష్టాలు..!
సాక్షి, ముంబై: మెట్రో ప్రయాణికులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇకపై ఘాట్కోపర్ మెట్రో స్టేషన్ మెయిన్ గేట్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టికెట్ కొనాల్సి ఉంటుంది. మెట్రో ప్రయాణికులు ఘాట్కోపర్ స్టేషన్‌కు వెళ్లాలంటే సెంట్రల్ రైల్వేకు చెందిన ఘాట్కోపర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సెంట్రల్ రైల్వేకి చెందినది కావడంతో మెట్రో ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై అకస్మాత్తుగా మెట్రో ప్రయాణికుల వల్ల రద్దీ పెరిగిపోవడంతో లోకల్ రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో తమ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగిస్తున్న మెట్రో ప్రయాణికులు ఇక మీదట ఫ్లాట్‌ఫాం టికెట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో వారంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో టికెట్ విండో, ఏటీవీఎంలను ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నామన్నారు. కాగా మెట్రో ప్రారంభంలో సెంట్రల్ రైల్వే మెట్రో ప్రయాణికులకు తమ పరిధిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకునేందుకు అనుమతించింది. కానీ ఇప్పుడు మెట్రో ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకోవాలంటే ప్లాట్‌ఫాం టికెట్, లేదా రైల్వే పాస్ తప్పనిసరి చేశారు. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోకుంటే మెట్రో ప్రయాణికులకు జరిమానా విధించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు. రైల్వే ప్రవాసీ సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ... ఈ విషయమై రైల్వే అధికారులతో త్వరలోనే మాట్లాడతానన్నారు. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అదనంగా వేల సంఖ్యలో ప్రయాణికుల భారాన్ని మోయలేదని అభిప్రాయపడ్డారు. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు.