
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
ప్రస్తుత అకాడమిక్ సెషన్‌లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్‌ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది.
ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్‌ని ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో ఆన్‌లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్‌అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి.
చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!