Learning Center
-
స్కూల్ ఫంక్షన్ లో పిల్లలతో సరదాగా హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
అమెజాన్ సంచలన ప్రకటన.. భారత్‌లో ఆ ప్లాట్‌ఫాం బంద్!
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత అకాడమిక్ సెషన్లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్‌ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది. ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్‌ని ఆన్లైన్లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం.. సన్నద్ధమవ్వండిలా..
8 నుంచి 14వరకు ఎంపిక ప్రక్రియ సంగారెడ్డిలో విస్తృత ఏర్పాట్లు సంగారెడ్డి జోన్: భారత వాయు సేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగాల కోసం రాష్ట్రస్థాయి రిక్రూట్మెంట్ ర్యాలీ మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈనెల 8 నుంచి 14 వరకు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ర్యాలీని జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా అభ్యర్థుల నియామకానికి చర్యలు చేపడుతోంది. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ ర్యాలీ జరుగనున్నది. ఎయిర్‌మెన్ ఉద్యోగాల్లో రెండు కేటగిరీల్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ (విద్యా శిక్షకుడు), సెక్యూరిటీ ఉద్యోగాల నియామకానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణాలోని పది జిల్లాల నుంచి నిరుద్యోగ పురుష అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి డా.రజనిప్రియ, యూత్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు తదితరులతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయమై వారితో చర్చించారు. విద్యా శిక్షకుల పోస్టుకు (గ్రూప్ ఎక్స్) ఎంపిక ఇలా.. 8వ తేదీ : ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు వుంటాయి. 9వ తేదీ : రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ర్యాలీకి తీసుకురావాల్సినవి.. గ్రూప్ ఎక్స్ అభ్యర్థులు.. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, బీఈడీ లేదా 2 సంవత్సరాల బోధన అనుభవం, ఉత్తీర్ణత సాధించిన ధ్రువపత్రాలు. గ్రూప్ వై అభ్యర్థులు.. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన ధ్రువపత్రాలు. వీటికి సంబంధించి నాలుగు సెట్ల జిరాక్స్ కాపీలు. గ్రూప్ ఎక్స్,వై : ఏడు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు. హెచ్‌బీ పెన్సిల్, రబ్బరు, షార్ప్‌నర్, గమ్, టేప్, స్టాప్లర్, బ్లూ/బ్లాక్ బాల్ పెన్నులు. సెక్యూరిటీ విభాగం (గ్రూప్ వై)పోస్టుకు ఎంపిక ఇలా .. 10వ తేదీ : ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. 2.4 కి.మీ.పరుగు పందెం పోటీలు ఉంటాయి. 11వ తేదీ : ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, 5కి.మీ.పరుగు, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 12వ తేదీ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, 2.4కి.మీ.పరుగు పోటీలు నిర్వహిస్తారు. 13వ తేదీ : ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, 5కి.మీ. పరుగు, ఉత్తీర్ణులైన వారికి అదేరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 14వ తేదీ : ఫలితాలు వెల్లడిస్తారు. -
సాగుకు శిక్షణ కేంద్రం కావాలి
ఆర్మూర్/ఆర్మూర్ అర్బన్: ఆధునిక పద్ధతులతో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించిన అంకాపూర్ గ్రామం దేశ రైతాంగానికి శిక్షణ కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తొలిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1986లో అంకాపూర్ గ్రామానికి స్వయంగా కారు నడుపుకుని వచ్చానన్నారు. గ్రామ రైతులకు పత్రిక విలేకరిగా పరిచయం చేసుకుని, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించినట్లు చెప్పారు. అంకాపూర్ గ్రామస్తుల మర్యాదస్తులని, తనకు కోడికూరతో భోజనం చేయించి పంపారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి సాగు పద్ధతులను చూసిన తర్వాతే తన వ్యవసాయ క్షేత్రానికి అంకురార్పన చేశానన్నారు. ఆడవాళ్ల పెత్తనం కారణంగానే అంకాపూర్ ఆర్థిక పరిపుష్టి సాధించిందన్నారు. ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చుట్టుపక్కల 250 గ్రామాల్లో వ్యవసాయ విప్లవానికి అంకాపూర్ నాంది పలికి ందన్నారు. అంకాపూర్ రైతులు వాణిజ్య పంటలు పండిస్తూ అన్ని గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. దేశంలో వ్యవసాయ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న పంజాబ్ రాష్ట్రానికి విత్తనాలను సరఫరా చేస్తున్న ఘనత ఈ గ్రామానికే దక్కిందన్నారు. ఇక్కడి అభివృద్దే తనను గ్రామానికి రప్పించదని కీర్తించారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా అంకాపూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని, ఆధునిక హంగులతో అతిథి గృహాన్ని ని ర్మించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చినపుడల్లా ఇక్కడే బస చేస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బ్రహ్మాండమైన విత్తనాలు పండించే సారవంతమైన భూములు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఆధునిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకుని వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామ న్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాలను అవలంభించాలని రైతులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వ ఖర్చుతో రైతు బృందాన్ని ఇజ్రాయిల్ పంపుతామన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వ్యవసాయ విధానాల్ని అధ్యయనం చేసేందుకు అంకాపూర్ రైతులను పంపేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు.