ఆర్మూర్/ఆర్మూర్ అర్బన్: ఆధునిక పద్ధతులతో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించిన అంకాపూర్ గ్రామం దేశ రైతాంగానికి శిక్షణ కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాను తొలిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1986లో అంకాపూర్ గ్రామానికి స్వయంగా కారు నడుపుకుని వచ్చానన్నారు. గ్రామ రైతులకు పత్రిక విలేకరిగా పరిచయం చేసుకుని, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించినట్లు చెప్పారు. అంకాపూర్ గ్రామస్తుల మర్యాదస్తులని, తనకు కోడికూరతో భోజనం చేయించి పంపారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి సాగు పద్ధతులను చూసిన తర్వాతే తన వ్యవసాయ క్షేత్రానికి అంకురార్పన చేశానన్నారు. ఆడవాళ్ల పెత్తనం కారణంగానే అంకాపూర్ ఆర్థిక పరిపుష్టి సాధించిందన్నారు.
ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చుట్టుపక్కల 250 గ్రామాల్లో వ్యవసాయ విప్లవానికి అంకాపూర్ నాంది పలికి ందన్నారు. అంకాపూర్ రైతులు వాణిజ్య పంటలు పండిస్తూ అన్ని గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. దేశంలో వ్యవసాయ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న పంజాబ్ రాష్ట్రానికి విత్తనాలను సరఫరా చేస్తున్న ఘనత ఈ గ్రామానికే దక్కిందన్నారు. ఇక్కడి అభివృద్దే తనను గ్రామానికి రప్పించదని కీర్తించారు.
జిల్లాకు వచ్చినప్పుడల్లా
అంకాపూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని, ఆధునిక హంగులతో అతిథి గృహాన్ని ని ర్మించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చినపుడల్లా ఇక్కడే బస చేస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బ్రహ్మాండమైన విత్తనాలు పండించే సారవంతమైన భూములు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఆధునిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకుని వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామ న్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాలను అవలంభించాలని రైతులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వ ఖర్చుతో రైతు బృందాన్ని ఇజ్రాయిల్ పంపుతామన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వ్యవసాయ విధానాల్ని అధ్యయనం చేసేందుకు అంకాపూర్ రైతులను పంపేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు.
సాగుకు శిక్షణ కేంద్రం కావాలి
Published Fri, Aug 8 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement