ఆర్మూర్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల ఏడున ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ ఆర్మూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొం టారని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదివా రం తెలిపారు.
ఆర్మూర్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి రూ. 114 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సీఎం శం కుస్థాపన చేస్తారన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా ఈ పథకానికి మళ్లిస్తారని వివరించారు. ఉదయం 9:30కు ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో అల్పాహారం తీసుకుంటారు.
అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్మిం చిన శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తారు. తరువాత జిరాయత్‌నగర్ కాలనీలో గల మినీ స్టేడియంలో నిర్వ హించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌కు చేరుకుం టారు. అక్కడ వ్యవసాయ రంగంలో జాతీయ గుర్తింపు పొందిన రైతులతో సమావేశమవుతారు.
గ్రీన్‌హౌజ్ వ్యవసాయం, తెలంగా ణ ప్రభుత్వం రైతులకు అందించే ప్రయోజనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు అంకాపూర్‌లో విత్తన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు గురించి చర్చిస్తారు. అనంతరం నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకొని అధికారులతో సమీక్ష జరుపుతారు. వ్యవసా యపరంగా ముందున్న జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడానికి గల అవకాశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.
7న కేసీఆర్ రాక
Published Mon, Aug 4 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement