ARMUR
-
బడుగుల నేత 'అర్గుల్ రాజారాం'
సాక్షి, నిజామాబాద్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, ఆర్మూర్, బాల్కొండ, నియోజకవర్గాల ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన మహా మనీషి అర్గుల్ రాజారాం. ఆర్మూర్ నుంచి ఒకసారి, బాల్కొండ నుంచి వరసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నత మంత్రి పదవులు నిర్వహించారు. బీసీ నేతగా ఎదిగి ఆదర్శప్రాయమైన రాజకీయాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన శిష్యులు పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి తదితరులు రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీల పాత్ర పోశించారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్ ప్రాంతంలోని 38 వేల 792 ఎకరాలకు సాగునీరందించే గుత్ప ఎత్తిపోతల పథకానికి అర్గుల్ రాజారాం పేరు పెట్టారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దివంగత నేత అర్గుల్ రాజారాం కుటుంబీకులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 మార్చి 18న ఆవిష్కరించారు. ఆదర్శం ఆయన రాజకీయ జీవితం.. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని మధ్య తరగతి, బలహీన వర్గానికి చెందిన అర్గుల్ రాజన్న, రాజవ్వ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బికాం పట్టా పొందారు. విద్యార్థి దశనుంచే సోషలిస్టు భావాలతో ముందుకుసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో జరిగిన తొలి విడత ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డితో కలిసి క్రియాశీలంగా పాల్గొన్నారు. ► సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ శిష్యరికంతో 1952లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ► 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫత్తేపూర్ శ్రీధర్‌రెడ్డిపై బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► 1967లో బాల్కొండ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జౌళి, చేనేత, చక్కర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. ► 1969లో తెలంగాణ ఉద్యమంలో అగ్రనేతగా ముందున్నారు. మర్రి చెన్నారెడ్డితో పాటు రాజమండ్రిలో జైలు జీవితాన్ని గడిపారు. ► 1972లో ధర్మోరా రాజేశ్వర్‌రెడ్డిపై అర్గుల్ రాజారాం బాల్కొండ స్థానానికి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ► 1972లో విద్యుత్ శాఖ మంత్రి, పశు గణాంక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ► 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్కొండ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ► ఇదే సమయంలో అర్గుల్ రాజారాం అనుచరుడు శనిగరం సంతోష్‌రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ► శనిగరం సంతోష్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్‌లతో పాటు ఆర్మూర్ పంచాయతి సమితి మాజీ అధ్యక్షుడు కుంట గంగారాం, మగ్గిడి గంగాధర్, పడిగల హన్మాండ్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గంట సదానందం, కుద్వాన్పూర్ రామారావ్, మగ్గిడి గంగాధర్‌రావు ఆయన అనుచరగణంలోని వారే. -
ఆర్మూర్ టు టాలీవుడ్.. ఇండస్ట్రీలో రాణిస్తున్న యువకులు
సాఫ్ట్వేర్ ఉద్యోగాలతోనే సెటిల్మెంట్ అని నమ్ముతున్న తల్లిదండ్రులను ఒప్పించి తమకు నచ్చిన సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అహర్నిషలు కష్టపడుతున్నారు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు. రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో బ్యాక్ సపోర్ట్ లేకున్నా తమ సొంత టాలెంట్‌నే నమ్ముకొని నిలదొక్కుకుంటున్నారు. అటు సినిమాల్లో నటులుగా, దర్శకులుగా, నిర్మాతగా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా నిలబడి తమలోని ప్రత్యేకతను వెండి తెరపై నిరూపించకుని అవార్డులను సైతం సొంతం చేసుకుంటున్నారు. – ఆర్మూర్ మిస్టర్ హ్యాండ్సమ్ ధనుష్ శెట్టి ఆర్మూర్‌లోని గీతా భవన్ హోటల్ యజమాని లింగం శెట్టి కుమారుడైన ధనుష్ శెట్టి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో రెండేళ్లు ఉద్యోగం చేశాడు. 2016లో సౌత్ ఇండియా మిస్టర్ హాండ్సమ్గా ఎంపికయ్యాడు. నటుడిని కావాలనుకుని తండ్రి ప్రోత్సాహంతో సినీపరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తండ్రిపై ఆర్థిక భారాన్ని మో పకుండా బిజినెస్ చేస్తూ మరోవైపు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించాడు. ‘కే’ సినిమాలో హీరోగా తెరంగేట్రం చేశాడు. రెండో సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘కాలేజ్ కుమార్’లో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ప్రధాన పాత్రలో నటించాడు. మూ డో సినిమా ‘బాంబే కాలనీ’ ఆహా లో విడుదలకు సిద్ధంగా ఉంది. మంచి నటుడిగా గుర్తింపు కోసం.. సినీ పరిశ్రమలో మంచి నటుడిగా రాణించాలనే లక్ష్యంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. నా నటనను గుర్తించిన దర్శకులు మంచి మంచి బ్యానర్లలో నటించడానికి అవకా శాలు ఇస్తున్నారు. నేను ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా నిలబడేందుకు కష్టపడుతున్నా. – ధనుష్ శెట్టి, సినీ నటుడు, ఆర్మూర్ పట్టణం మొదటి సినిమాతోనే అవార్డు.. మామిడిపల్లికి చెందిన అజయ్ వేద్ హీరోగా నటించిన మొదటి సినిమా మట్టి కథలో ఉత్తమ నటనకు గాను ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఆర్మూర్‌కు చెందిన మానస హైస్కూల్ కరస్పాండెంట్ గణేశ్, పద్మ కుమారుడైన అజయ్ వేద్ బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి 2019లో రామానాయుడు స్టూడియోలో డిప్లొమా ఇన్ యాక్టింగ్ పూర్తి చేశాడు. సినీ పరిశ్రమలో అతనికి ఉన్న ఆసక్తితో పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. హీరో కావడమే లక్ష్యం.. డ్యాన్స్‌పై నాకున్న మక్కు వతో సినీ పరిశ్రమలో హీరోగా నా ప్రత్యేకతను చాటుకోవాలనే ప్రయ త్నం మొదలు పెట్టాను. షార్ట్ ఫిల్మ్‌లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి అవకాశాలు వచ్చినా హీరోగా నటించడమే లక్ష్యంగా కష్టపడి సాధించాను. తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా నా సొంత టాలెంట్‌తో రాణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. – అజయ్ వేద్, సినీ నటుడు, ఆర్మూర్ పట్టణం అన్‌స్టాపబుల్ నిర్మాతగా రజిత్‌రావు బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన రజిత్‌రావు వ్యాపార రీత్యా ఆర్మూర్‌లో స్థిరపడ్డాడు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాతగా మారి ఏ టు బీ ప్రొడక్షన్స్‌పై అన్‌స్టాపబుల్(అన్ లిమిటెడ్ ఫన్) సినిమాను నిర్మించాడు. నటుడు సప్తగిరి, బి గ్‌బాస్ ఫేమ్ సన్నీ ప్రధాన పాత్రలతో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్‌గా డైమండ్ రత్నబాబు వ్యవహరించి నిర్మించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 500 థియేటర్లలో జూన్ 9న విడుదల చేశారు. కుటుంబ సమేతంగా చూసి హాయిగా నవ్వుకొనే సినిమా తీయాలనే సంకల్పంతో అన్ స్టాపబుల్ సినిమా నిర్మించాను. మంచి ప్రజాదరణ లభించింది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నిర్మించే దిశగా ప్రయత్నిస్తాం. – రజిత్‌రావు, సినీ నిర్మాత, ఆర్మూర్ పట్టణం జానపద నృత్య కళాకారుడి నుంచి.. పెర్కిట్‌కు చెందిన జీవన్ గౌడ్ జానపద నృత్య కళాకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. పెర్కిట్‌లో దేశీ కోడి ఆర్డర్ మెస్ నడుపుకునే వాడు. పత్రికలు, పుస్తకాలు చదివి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. 2020లో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఘన్‌శ్యాం పరిచయం కావడంతో ఆ ర్మూర్ ఫోక్ సాంగ్స్ పేరిట సొంతంగా యూ ట్యూబ్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఇటీవల దర్శకుడు సంజయ్ తెరకెక్కిస్తున్న ఎర్రగుడి సినిమాలో సినీనటి మంచు లక్ష్మి పక్కన విలన్‌గా నటించాడు. నటుడిగా రాణించి మన్ననలు పొందాలి మంచి నటుడిగా రాణించా లనే లక్ష్యంతో వ్యయ, ప్రయాసలకోర్చి సినీపరిశ్రమ లో అవకాశాలు దక్కించుకుంటున్నాను. జానపద నృత్య కళాకారుడిగా నాకు వచ్చిన గుర్తింపుతో సినీపరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. – జీవన్ గౌడ్, సినీ నటుడు, పెర్కిట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాణిస్తూ.. ఆర్మూర్‌కు చెందిన దురిశెట్టి నర్సింహాచారి, శ్రీదేవిల కొడుకైన దురిశెట్టి సచిన్(బబ్లూ) ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగం ఇష్టం లేక షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం ప్రారంభించాడు. ఆయన తీసిన ప్రేయసి అనే షార్ట్ ఫిల్మ్‌కు ఐఎఫ్ఎల్ నేషనల్ లెవల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఉత్తమ డైలాగ్ రైటర్‌గా బెంగళూరు వేదికపై అవార్డును కైవసం చేసుకున్నాడు. సినిమా డైరెక్టర్ కావాలన్న పట్టుదలతో పీపుల్స్ మీడి యా గ్రూప్ వారు నిర్మిస్తున్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నేనేంటో నిరూపించుకోవాలని.. నెలవారి జీతం కోసం పని చేయకుండా సిని మా డైరెక్టర్ కావాలను కున్నాను. ప్రస్తుతం పెద్ద ఫిల్మ్ మేకర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. రానున్న రోజుల్లో మంచి సినిమా తీయడానికి స్క్రిప్‌్టను సైతం సిద్ధం చేసుకున్నాను. – దురిశెట్టి సచిన్, ఆర్మూర్ -
అమెరికా అమ్మాయి-ఆర్మూర్ అబ్బాయి. ఔను వాళ్లు ఇష్టపడ్డారు
సాక్షి, నిజామాబాద్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది పెద్దల మాట. కానీ, మనసులు కలిస్తే చాలు.. అనేది ఇప్పటి జనరేషన్లో కొంతమంది చెప్తున్న మాట. అందుకే తమ వైవాహిక బంధాలకు కులం, మతం, ప్రాంతం లాంటి పట్టింపులు లేకుండా చూసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఓ వివాహం.. స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు కారణం.. అబ్బాయి లోకల్ అయితే.. అమ్మాయి అమెరికా దేశస్థురాలు కావడం!. విధినిర్వహణలో ఆ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారు. పెద్దలకు ఎలా చెప్పాలా? అని మధనపడ్డారు. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు ఖండాలు, సప్త సముద్రాలు దాటిన ఆ ప్రేమకథ.. చివరకు పెళ్లితో సుఖాంతం అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చిఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. నర్సింగ్ పూర్తి చేసిన ఓల్సా.. భారత్‌లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల తర్వాత.. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించలిగారు. ఇవాళ(మంగళవారం) ఆర్మూర్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటినా ఈప్రేమజంటను ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది. -
క్షుద్రపూజలు చేసిన కుటుంబానికి దేహశుద్ధి
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో గల శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్న వారిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. పట్టణంలోని ప్రియాంక క్లీనిక్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు సమీర్ రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు కొందరు అటువైపు వెళ్లి చూశారు. విషయం తెలిసి ఆగ్రహంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కలకత్తాకు చెందిన సమీర్‌రాయ్ కుటుంబం పదిహేనేళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చింది. తమ ఇంట్లో తరచూ కలహాలు చోటు చేసుకుంటుండడంతో పురోహితుని సలహా మేరకు పూజలు చేసి నట్లు సమీర్ రాయ్ నమ్మించే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు. -
ఆర్మూర్‌లో ‘లవ్‌స్టోరీ’ చిత్రీకరణ
సాక్షి, నిజామాబాద్ : నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘లవ్‌స్టోరీ’. షూటింగ్ తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో చిత్ర యూనిట్ సందడి చేసింది. నాగచైతన్య, సాయిపల్లవికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ఆర్మూర్‌లోని నవసిద్ధుల గుట్ట వద్ద చిత్రీకరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఇది వరకే ఫిదా సినిమాలో తెలంగాణ యూసతో సాయిపల్లవి ఆకట్టుకుంది. కరోనా బ్రేక్ తర్వాత ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. (బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి ) -
ఇలా గెలవగానే.. అలా మార్చేశారు
ఎన్నికల ఫలితాలు ఇలా వెల్లడయ్యాయో లేదో.. కొందరు కార్పొరేటర్లు/కౌన్సిలర్లు అలా కండువా మార్చేశారు. అభివృద్ధి కోసమంటూ అధికార పార్టీ పంచన చేరారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్పై కత్తులు దూసిన వారే.. ఇప్పుడు టింగురంగా అంటూ గులాబీ గూటికి చేరిపోయారు. సాక్షి, నిజామాబాద్: ఎన్నికల వేళ విమర్శలు, సవాళ్లు విసిరిన వారే.. చివరకు వెనక్కి తగ్గారు. ఇలా గెలుపొందారో లేదో అలా జంప్ జిలానీలుగా మారారు. ‘అధికారమే’ పరమావధి అంటూ గోడ దూకేశారు. ఆర్మూర్‌లో అయితే మొన్న కౌంటింగ్ పూర్తి కాక ముందే కండువాలు మార్చడం విస్మయానికి గురి చేసింది. కొందరేమో ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. గులాబీ కండువా కప్పుకుని మురిసి పోయారు. మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికలకు ముందు కత్తులు దూసి, ఎన్నికవగానే అదే పార్టీలోకి చేరిపోవడం చూసి ఓటర్లు నోరెళ్ల బెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలకు కాంగ్రెస్ ఓటు.. నిజామాబాద్ కార్పొరేషన్ 40వ డివిజన్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.శివచరణ్.. మేయర్ ఎన్నికకు ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేయర్ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్కు అనుకూలంగా, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతుగా చెయ్యేత్తారు. ఆయనతో పాటు 38వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన గడుగు రోహిత్‌కుమార్ కూడా మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతుగా నిలిచారు. దీంతో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. స్వతంత్ర అభ్యర్థి (బీజేపీ రెబల్)గా యమున కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కౌంటింగ్ పూర్తయి ఫలితం వెలువడిన వెంటనే ఆమె టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి క్యాంపునకు వెళ్లారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్‌లో.. ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ కౌన్సిలర్‌గా గెలిచిన మురళీధర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అలాగే, కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంతియాజ్ గెలిచిన వెంటనే కండువా మార్చారు. ఇక్కడ మరో ఐదుగురు స్వతంత్ర కౌన్సిలర్లు ఆకుల రాము, వరుణ్ శేఖర్, బద్ధం రాజ్‌కుమార్, సుంకరి సుజాత, లింగంపల్లి భాగ్య కూడా కారెక్కారు. ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే ప్రజాప్రతినిధులు ఇలా పార్టీ మార్చడంతో ఓటర్లు విస్మయం చెందుతున్నారు. -
అమ్మకం వెనుక అసలు కథేంటి?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ముక్కుపచ్చలారని పసికందును అమ్మకానికి సిద్ధపడ్డ ఘటన మలుపులు తిరుగుతోంది. శిశువును అమ్మేందుకు తీసుకొచ్చిన మహిళ శిశువు తల్లికాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతికి మహారాష్ట్రకు చెందిన నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ అనంతరం వీరు ఆర్మూర్‌లోని బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నవీన్ స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక కూతురు స్నేహ (4) ఉంది. కొన్ని రోజుల క్రితం భర్త నవీన్ గంగజ్యోతిని విడిచి వెళ్లిపోయాడు. దీంతో జ్యోతి యాచిస్తూ జీవనం గడుపుతోంది. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నెలరోజులు కూడా నిండని పసికందును రూ.20 వేలకు అమ్మకానికి పెట్టింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. శిశువు జననం గురించి వివరాలు అడిగితే జ్యోతి పొంతనలేని సమాధానాలు చెబుతోంది. శిశువు బహిరంగ ప్రదేశంలో జన్మించిందని ఒకసారి, ఇంట్లోనే జన్మించిందని మరోసారి చెబుతుండటంతో జ్యోతి ఆ శిశువుకు తల్లి కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిశువుకు నెల రోజుల వయస్సు ఉంటుందని జ్యోతి చెబుతుండగా పరీక్షించిన వైద్యులు 11 రోజుల వయస్సుగా నిర్ధారించారు. ఇంతలో ఐసీడీఎస్ అధికారుల ఆధీనంలో ఉన్న శిశువు తమ బిడ్డేనం టూ ఆర్మూర్‌కు చెందిన దంపతులు అధికారులను సం ప్రదించినట్లు తెలిసింది. అధికారులు మాత్రం డీఎన్ఏ పరీక్షల అనంతరం శిశువు తల్లిదండ్రుల నిర్ధారణ తర్వాతే వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అంత వరకు పసికందును కరీంనగర్‌లోని శిశుగృహ సంరక్షణ కేంద్రానికి, అలాగే జ్యోతి, తన కూతురు స్నేహ(4)ను స్వధార్ కేంద్రానికి తరలించారు. ఐసీడీఎస్ మెట్పల్లి సీడీపీవో తిరుమలదేవి, ధర్మపురి సీడీపీవో అరుణ, జిల్లా చైల్డ్ డెవలప్మెంట్, ప్రొటెక్షన్ ఆఫీసర్ హరీశ్ ఉన్నారు. పాప కిడ్నాప్‌పై కేసు మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో తన 15 రోజుల పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సోమవారం ఫిర్యాదు చేసింది. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా పాప అమ్మకానికి పెట్టిన గంగజ్యోతి కూడా తనది ఆర్మూర్ అని చెప్పడంతోపాటు ఐసీడీఎస్ అధికారులకు అనుమానాలు కలుగుతున్నాయి. వారి వద్దనున్న పాప, కిడ్నాప్ అయిందన్న పాప ఫొటోలు ఒకేలా ఉండటంతో ఆర్మూర్‌కు చెందిన సుమలత కూతురుగానే భావిస్తున్నారు. -
చాయ్‌వాలాగా..
సాక్షి,ఆర్మూర్ అర్బన్(నిజామాబాద్): ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌రెడ్డి మంగళవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌కు వెళ్లి స్వయంగా చాయ్ చేసి పలువురికి అందించారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు -
20న ఆర్మూర్‌కు సీఎం కేసీఆర్ రాక
►ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ‘ఎత్తిపోతల’కు మిషన్ భగీరథతో అనుసంధానం ►ఈ నెల 13న ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు ►ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ►ఆర్మూర్‌లో భారీ బహిరంగ సభ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 42 వేల మంది జనాభాకు తాగునీటిని అందించడానికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఈ నెల 13న తాగునీటి పథకం ట్రయల్ నిర్వహించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని వివరించారు. ‘ఎత్తిపోతల’తో తప్పనున్న నీటి ఇబ్బందులు ఆర్మూర్ పట్టణం రోజురోజుకీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి సహజ నీటి వనరులు అందుబాటులో లేవు. దీంతో ఏళ్ల తరబడి బోరు బావులపైనే ఆధారపడి తాగునీటి సరఫరా చేస్తున్నారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కొరతతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తలాపునే ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి ఆర్మూర్ పట్టణానికి మళ్లించాలని పాలకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ పథకం నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేశారు. ఏళ్ల తరబడి నిరీక్షణ అనంతరం ప్రపంచ బ్యాంకు రూ. 114 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు దశల్లో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి విడతలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో జలాల్పూర్ వద్ద ఇన్‌టెక్ వెల్ నిర్మాణం, ఆర్మూర్ పట్టణం వరకు 19 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం, పట్టణంలోని రాజుల గుట్ట వద్ద, జిరాయత్ నగర్లో, టీచర్స్ కాలనీల్లో 4 లక్షల 50 వేల లీటర్ల కెపాసిటితో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడతలో గృహాల వద్ద నల్లాలు, మీటర్ల బిగింపునకు రూ. 2 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 2013 డిసెంబర్ 10న అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ అయిన రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2014లో ఎన్నికల కారణంగా కాంట్రాక్టర్ పనులను ప్రారంభించలేదు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 7న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్‌కు వచ్చి తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసారు. ఏడాది కాలంలో స్వయంగా తానే వచ్చి ఇంటింటికీ నల్లాను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ తాగునీటిని అందించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం డిజైన్‌లో, ఇన్‌టెక్‌వెల్ నిర్మాణంలో పలు మార్పులు చేసి అదనంగా రూ. 41 కోట్లు కేటాయించారు. ఈ మార్పుల కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలంటూ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీపై ఒత్తిడి తేవడంతో నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపంలోని జలాల్పూర్ శివారులో ఇన్‌టెక్‌వెల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 17 మీటర్ల లోతు, 46 మీటర్ల వెడల్పుతో తవ్వకం పనులు పూర్తి చేసి ఇన్‌టెక్‌వెల్ నిర్మాణాలు పూర్తి చేశారు. బాల్కొండ మండల కేంద్రం సమీపంలోని గుట్టపై నిర్మించాల్సిన నీటి శుద్ధి ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్ నుంచి ఆర్మూర్ వరకు 19 కిలో మీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఆర్మూర్‌లోని వీధుల్లో 106 కిలో మీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం పనులు జరగాల్సి ఉండగా 95 కిలో మీటర్ల పైప్‌లైన్ మాత్రమే పూర్తయింది. 90 శాతం పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తి కాగా ఈ నెల 13 లోపు మిగతా పనులను సైతం పూర్తి చేయానికి పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. జిరాయత్‌నగర్, టీచర్స్ కాలనీ, రాజుల గుట్టలో నిర్మించాల్సిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం సైతం పూర్తయ్యాయి. ఆర్మూర్ పట్టణంలో 9,997 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైగా నల్లా కనెక్షన్లను బిగించారు. 13న ట్రయల్ రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పథకాన్ని ప్రారంభిస్తుండడంతో ఈ నెల 13వ తేదీన ట్రయల్ రన్ నిర్వంహించి లీకేజీలు, చిన్న పాటి మరమ్మతులు ఉంటే పూర్తి చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయంతం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఆర్మూర్ పట్టణ ప్రజల చిరకాల వాంచ అయిన తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. -
సెల్ నంబర్ కోసం టవరెక్కిన యువకుడు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సలావుద్దీన్ తాను వినియోగించే సిమ్ నంబర్‌ను తన భార్య నుంచి ఇప్పించాలని డిమాండ్‌చేస్తూ సెల్ టవర్ ఎక్కి కలకలం సృష్టిం చాడు. సలావుద్దీన్, రిజ్వానాబేగం దంపతులు. భార్య చెల్లెలు షబానాబేగం పేరిట బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకున్నాడు. కార్డు ఐడీ అడ్రస్‌లు ఉన్న సలావుద్దీన్ మరదలు షబానాబేగం గతేడాది మరణిం చింది. మరోవైపు అతని భార్య రిజ్వనాబేగంతో గొడవల కారణంగా వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో సలావుద్దీన్ బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డును అతని భార్య తీసుకొని వెళ్లిపోయింది. సలావుద్దీన్ బ్యాంకు ఖాతాలకు, ఆధార్‌కార్డు, సిలిండర్ కనెక్షన్లకు అదే సెల్ నంబర్ ఇచ్చి ఉండటంతో సిమ్‌కార్డు డీ ఆక్టివేషన్ చేసి అదే నంబర్‌తో తనకు కొత్త కార్డు ఇవ్వాలంటూ ఆర్మూర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పాత ఐడీ ప్రూఫ్‌లు తీసుకు రావాలని బీఎస్ఎన్ఎల్ డీఈ శ్రీనివాస్ వివరించాడు. దీంతో సలావుద్దీన్ ఆగ్రహంతో శనివారం ఆర్మూర్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. ఐడీపార్టీ కానిస్టేబుళ్లు అతనితో ఫోన్లో మాట్లాడి బుజ్జగించారు. - ఆర్మూర్ -
ఉరేసుకుని రైతు ఆత్మహత్య
ఆర్మూరు: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతని గ్రామంలో ఓ అన్నదాత శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఓరుగంటి భీమయ్య(36) నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. పొలంలో మూడు వరకు బోర్లు వేయించాడు. అయినా నీరు పడక పంటలు పండలేదు. మరోవైపు సొంతంగా ఇల్లు కట్టుకుందామని నిర్మాణాన్ని తలపెట్టగా అది మధ్యలోనే ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన భీమయ్య ఊరి చివర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్మూర్ లో బీడీ కార్మికుల భారీ ర్యాలీ
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం బీడీ కార్మికులు ఆందోళన చేశారు. బీడీ కట్టలపై పుర్రె, వ్యాధి గ్రస్తుల ఫోటోలను ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వారు నిరసించారు. యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు హజరయ్యారు. స్తానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కు దిగారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. (ఆర్మూర్) -
హైకోర్టును విభజించాలి-ఆర్మూర్ బార్ కౌన్సిల్
ఆర్మూర్ : ఉమ్మడి హైకోర్టును విభజించాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గరువారం ఆందోళన చేపట్టారు. ఆర్మూర్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణ పండిత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. హైకోర్టును విభజనపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’
ఆర్మూర్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎంఈఓ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాల స్థానంలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని వేయించాలని డీఈఓ శ్రీనివాసాచారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 ఎంఈఓ కార్యాలయాలతో పాటు 25 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 1,573 ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర పటాన్ని వేయించాలని ఎంఈఓలకు ఆదేశాలు అందాయి. -
‘రావణ దహనం’ సృష్టికర్త లింగం
ఆర్మూర్ టౌన్ : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే రావణ సంహారం(దహనం) దృశ్య రూపకం పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 19 ఏళ్లుగా ఈ ఘట్టాన్ని చూసేందుకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. ఈ దృశ్యరూపకాన్ని సృష్టించి దసరా ఉత్సవాలకు శోభను తీసుకువచ్చి ప్రజలకు కనువిందు చేస్తున్నది పట్టణానికి చెందిన ఎలక్ట్రిక్ బ్రహ్మ బిరుదాంకితుడు చౌకె లింగం. స్థానిక జిరాయత్ నగర్లో నివాసముంటున్న చౌకె లింగం దసరా ఉత్సవాల్లో రావణ దహనానికి ఆద్యుడు. జంబి హనుమాన్ ఆలయంలో దసరా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా అంగరంగవైభవంగా జరిగినప్పటికీ లింగం రాకతో ఉత్సవాలకు మరింత శోభ సంతరించుకుంది. వీధి నాటకాలు, యక్షగానం, బుర్రకథలతో చౌకె లింగం ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల ప్రదర్శన.. ఈ ఏడాది పట్టణంతో పాటు మండలంలోని అంకాపూర్, మిర్ధాపల్లి, నందిపేట్ మండలం వన్నెల్(కె), బాల్కొండ మండలం బోదెపల్లి, వేల్పూర్ మండలం పడిగెల్, ఇందల్వాయి మండల కేంద్రం, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో రావణ దహనం ఘట్టాన్ని చౌకె లింగం సౌజన్యంతో నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లలో చౌకె లింగం బృందం నిమగ్నమయ్యింది. ఈ యేడు దుర్గామాత చేతిలో మహిషాసుర వధను వరుసగా రెండవ సంవత్సరం ప్రదర్శించేందుకు లింగం సన్నద్ధమవుతున్నారు. నా అదృష్టంగా భావిస్తున్నా పట్టణంలో దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రతి యేట నాకు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా ను. గతేడాది నుంచి రావణ సంహారంతో పాటు మహిషాసుర వధను ప్రదర్శిస్తున్నాం. కళాకారులకు, ప్రతిభావంతులకు ఆశించిన మేర గుర్తింపు లభించడం లేదు. - చౌకె లింగం, రావణ దహనం సృష్టికర్త, ఆర్మూర్ -
సాగుకు శిక్షణ కేంద్రం కావాలి
ఆర్మూర్/ఆర్మూర్ అర్బన్: ఆధునిక పద్ధతులతో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించిన అంకాపూర్ గ్రామం దేశ రైతాంగానికి శిక్షణ కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తొలిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1986లో అంకాపూర్ గ్రామానికి స్వయంగా కారు నడుపుకుని వచ్చానన్నారు. గ్రామ రైతులకు పత్రిక విలేకరిగా పరిచయం చేసుకుని, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించినట్లు చెప్పారు. అంకాపూర్ గ్రామస్తుల మర్యాదస్తులని, తనకు కోడికూరతో భోజనం చేయించి పంపారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి సాగు పద్ధతులను చూసిన తర్వాతే తన వ్యవసాయ క్షేత్రానికి అంకురార్పన చేశానన్నారు. ఆడవాళ్ల పెత్తనం కారణంగానే అంకాపూర్ ఆర్థిక పరిపుష్టి సాధించిందన్నారు. ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చుట్టుపక్కల 250 గ్రామాల్లో వ్యవసాయ విప్లవానికి అంకాపూర్ నాంది పలికి ందన్నారు. అంకాపూర్ రైతులు వాణిజ్య పంటలు పండిస్తూ అన్ని గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. దేశంలో వ్యవసాయ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న పంజాబ్ రాష్ట్రానికి విత్తనాలను సరఫరా చేస్తున్న ఘనత ఈ గ్రామానికే దక్కిందన్నారు. ఇక్కడి అభివృద్దే తనను గ్రామానికి రప్పించదని కీర్తించారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా అంకాపూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని, ఆధునిక హంగులతో అతిథి గృహాన్ని ని ర్మించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చినపుడల్లా ఇక్కడే బస చేస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బ్రహ్మాండమైన విత్తనాలు పండించే సారవంతమైన భూములు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఆధునిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకుని వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామ న్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాలను అవలంభించాలని రైతులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వ ఖర్చుతో రైతు బృందాన్ని ఇజ్రాయిల్ పంపుతామన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వ్యవసాయ విధానాల్ని అధ్యయనం చేసేందుకు అంకాపూర్ రైతులను పంపేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
ఆర్మూర్ టౌన్/నిజామాబాద్‌అర్బన్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈనెల 7న జిల్లా పర్యటిస్తున్నం దున ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. వ్య వసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మం గళవారం పనులను పర్యవేక్షించారు. శ్రీరాంసాగర్ నుంచి ఆర్మూర్‌కు తాగునీరును అందించే పథకానికి ఆర్మూర్‌లో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం రూ. 114 కోట్లతో చేపట్టనున్నారు. ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. తాగు నీటి పథకం శిలాఫలకం, కాకతీయ కళాతోరణం ఏర్పాట్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మినీ స్టేడియానికి వెళ్లి సభా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలు, ప్రజలు కూర్చునే స్థలాల వివరాలను ఆర్అండ్బీ ఎస్ఈ సుకన్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ ఆమో దం పొందిన 43 అంశాలను ప్రజలకు తెలియపరుస్తూ సభా ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సభా వేదికకు వచ్చే వారికి ఇబ్బం దులు తలెత్తకుండా ట్రాఫిక్, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని డీఎస్పీ ఆకుల రామ్ రెడ్డికి సూచించారు. అనంతరం పట్టణంలోని అం గడి బజార్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలా న్ని, ముఖ్య మంత్రి వచ్చి పోయే మార్గాలను మంత్రి పరిశీలించారు. ఆర్డీవో యాదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగా గౌడ్, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు న్యావనంది గంగారెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ఎస్పీ తరుణ్‌జోషి సోమవారమే ఆర్మూర్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వెళ్లే నిజామాబాద్, ఆర్మూర్ ప్రధాన రహదారి వెంబడి పిచ్చిమొక్కలను తొలగిస్తూ, డ్రైనేజీలను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. బాల్కొండ మండలం పోచంపాడ్‌లో సీఎం కేసీఆర్ బస ఏర్పాట్లను పరిశీలించారు. విత్తన పరిశోధన కేంద్రంగా అంకాపూర్ ఆర్మూర్ అర్బన్: వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ దేశంలోనే ప్రశంసలు అందుకుంటున్న అంకాపూర్ గ్రామాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ గ్రామాభివృద్ధి కమిటీ కమ్యునిటీ హాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించే సభాస్థలిని పోచారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇతర గ్రామాలను అంకాపూర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అంకాపూర్‌ను సీడ్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. తొలిసారి గా విచ్చేస్తున్న సీఎంకు గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలకాలన్నారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలను సీఎం పరిశీలిస్తారని చెప్పా రు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అంకాపూర్‌ను చాలా ఇష్టపడతారన్నారు. గ్రీన్ అగ్రికల్చర్‌ను గ్రామంలో ప్రవేశ పెట్టేందుకు కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిపారు. గ్రామ రైతాంగం, అభివృద్ధి, భూసారం, జలవనరు లు, తదితరు అంశాలపై సీఎం నేరుగా రైతుల తో చర్చిస్తారన్నారు. గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు సీఎం పర్యటన దోహద పడుతుందన్నారు. రూ. 20 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన రైతు బాంధవుడని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సల్ల చిన్న అనంత్, మాజీ అధ్యక్షుడు జి రాజన్న, సర్పంచ్ పుష్ప, వీడీసీ సభ్యులు సన్మానించారు. -
7న కేసీఆర్ రాక
ఆర్మూర్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల ఏడున ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ ఆర్మూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొం టారని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదివా రం తెలిపారు. ఆర్మూర్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి రూ. 114 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సీఎం శం కుస్థాపన చేస్తారన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా ఈ పథకానికి మళ్లిస్తారని వివరించారు. ఉదయం 9:30కు ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో అల్పాహారం తీసుకుంటారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్మిం చిన శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తారు. తరువాత జిరాయత్‌నగర్ కాలనీలో గల మినీ స్టేడియంలో నిర్వ హించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌కు చేరుకుం టారు. అక్కడ వ్యవసాయ రంగంలో జాతీయ గుర్తింపు పొందిన రైతులతో సమావేశమవుతారు. గ్రీన్‌హౌజ్ వ్యవసాయం, తెలంగా ణ ప్రభుత్వం రైతులకు అందించే ప్రయోజనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు అంకాపూర్‌లో విత్తన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు గురించి చర్చిస్తారు. అనంతరం నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకొని అధికారులతో సమీక్ష జరుపుతారు. వ్యవసా యపరంగా ముందున్న జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడానికి గల అవకాశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం. -
మహిళలు వంటింటికే!
ఆర్మూర్ : మహిళా రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. పేరుకే మహిళా ప్రజాప్రతినిధులు.. వారి వెనక కుటుంబ సభ్యులే ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం ఆర్మూర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన పట్టణం-మన ప్రణాళిక’ సమీక్ష సమావేశమే. మహిళా కౌన్సెలర్లకు బదులు వారి భర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంకంటే ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప సమావేశంలో ఎవ్వరూ ఉండకూడదని సిబ్బంది పలుమార్లు ప్రకటించారు. అయినా మహిళా కౌన్సెలర్ల భర్తలు సమావేశ మందిరంనుంచి బయటికి వెళ్లలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని అలాగే నిర్వహించారు. సమావేశానికి మహిళా కౌన్సెలర్లు బోన్ల సుజాత, లత జో శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. మిగతా మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలు జాగిర్దార్ శ్రీనివాస్, నర్మె నవీన్, పింజ వినోద్, వన్నెల్దేవి రాము, మాలిక్ బాబా, మరో కౌన్సిలర్ అన్న సుంకరి రంగన్న సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ సైతం సమావేశానికి వచ్చారు. సమావేశం ప్రారంభంలో టీఆర్ఎస్ నాయకులు, మరికొందరు మహిళా కౌన్సెలర్ల భర్తలు సైతం సమావేశానికి హాజరు కావడంతో టీడీపీ కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డికి కుర్చీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ కౌన్సెలర్‌కు కుర్చీ ఇవ్వని విధానం ఏంటని ప్రశ్నించడంతో కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోయారు. అధికారులు సైతం ఇదేమీ పట్టించుకోలేదు. -
ఆర్మూర్‌లో దర్జాగా అసైన్డ్ భూమి కబ్జా
ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంఏ కరీం అలియాస్ రూపాల కరీం అనే వ్యాపారి సుమారు 40 సంవత్సరాల క్రితం ఎన్డీసీసీ బ్యాంకులో ఉద్యోగిగా ఉంటూ కుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో నిజామాబాద్‌కు చెందిన ఎన్డీసీసీ బ్యాం కు అతని ఆస్తులన్నింటిని స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులలో ఆర్మూర్ ప ట్టణంలోని జర్నలిస్టు కాలనీలో 401/66 సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమి కూడా ఉంది. తర్వాతి కాలంలో బ్యాంకు వారు ఆ స్థలాన్ని బహిరంగ వేలం నిర్వహించారు. కొనుగోలు చేసి న పెర్కిట్ గంగారెడ్డి, రాజ్‌కుమార్ అగర్వాల్ ఆ రెండెకరాల స్థలంలో ప్లాట్లు చేశారు. ఎల్పీ నెంబ ర్ 39/95తో టౌన్ ప్లానింగ్ అనుమతిని సైతం తీసుకున్నారు. ఈ లేఅవుట్ ప్లాట్లలో తమ వద్ద తనఖాళీగా ఉన్న స్థలానికి సంబంధించి 4వ నం బర్ నుంచి 18వ నంబర్ ప్లాట్‌లో సగం వరకు, 22వ నంబర్ ప్లాట్ ను ంచి 34వ నంబర్ ప్లాట్ల వరకు ఎన్డీసీసీ బ్యాంకువారు ఎన్ఓసీ ఇచ్చారు. రెవె న్యూ అధికారుల ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ఆస్తిని కొనుగోలుదారుల పేరిట బదలాయిం చా రు. ఇదే స్థలానికి ఆనుకొని 401/66 సర్వే నంబర్‌లోనే అ దనంగా ఒక ఎకరం అసైన్డ్ భూమి ఉం ది. దీనిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడానికి రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ స్థలాన్ని ఎంఏ కరీం తన పేరున కా కుండా తన బినామీ అయిన బాలయ్య పేరిట చే యించినట్లు సమాచారం. తర్వాతి కాలంలో ఎంఏ కరీం, బాలయ్య మరణించడంతో వారి కుటుంబాల మధ్య ఈ స్థలం కోసం కోర్టులో వివా దం సాగింది. ప్రభుత్వం బాలయ్య పేరిట ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేసినట్లు రికార్డులు ఉం డటంతో, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి బాలయ్య కుటుంబ సభ్యులకు మాత్రమే అధికారం ఉంటుందని కోర్టు తీర్పు ఇచ్చింది. అసైన్డ్ భూమిలో ప్లాట్లు బాలయ్య కుటుంబ సభ్యులకు వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించిన అసైన్డ్ భూమి ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ఉంది. చుట్టూ ఇళ్ల నిర్మాణం జరగడంతో బహిరంగ మార్కెట్లో రూ. కోట్ల విలువ పలుకుతోంది. రెవె న్యూ చట్టం ప్రకారం అసైన్డ్ భూమిలో వరసగా మూడేళ్ల పాటు వ్యవసాయం చేయకపోతే ప్రభు త్వం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థలంలో సుమారుగా 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేసిన దాఖలా లు లేవు. అదే విధంగా అసైన్డ్ స్థలాన్ని కమర్షియ ల్ అవసరాలకు ఉపయోగించడానికి వీలు లేదు. అయితే, ఈ ఎకరం అసైన్డ్ భూమి గురించి తెలిసి న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పథకం రూపొందించారు. బాలయ్య కుటుంబ సభ్యుల తో కలిసి ఆ భూమిలో ప్లాట్లు చేయాలని నిర్ణయిం చారు. గతంలో ఎన్డీసీసీ బ్యాంకు వారు క్లియరెన్స్ ఇచ్చిన స్థలంలో చేసిన ఎల్పీ నెంబర్ 39/95లోనే ఈ స్థలం కూడా ఉందంటూ రికార్డు లు సృష్టించారు. లేఅవుట్‌ను సిద్ధం చేసి, స్థలాన్ని చదును చేసి హద్దు రాళ్లను పాతారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు పైసలు వసూలు
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ఇటీవల నిర్వహించిన ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైన మహిళ కౌన్సిలర్ అభ్యర్థి భర్త ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని మూడో వార్డు పరిధిలో సీనియర్ నాయకుడు తన భార్యను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిపాడు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీల్లో బోరు మోటార్లు బిగించడం, కుల సంఘాలకు, కాలనీలో ఆలయ అభివృద్ధికి డబ్బుల రూపంలో చెల్లింపులు చేశారు. కౌన్సిలర్‌గా తన భార్యను గెలిపించడం కోసం ఇవన్ని చేశారు. అయితే నాలుగు రోజుల క్రితం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో సదరు అభ్యర్థి ఓటమి పాలవడంతో ఆమె భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమ వద్ద డబ్బులు తీసుకొని తమకు ఓట్లు వేయని వార్డు పరిధిలోని ఓటర్లపై కోపంతో ఉన్నారు. వెంటనే ఆయా కాలనీల్లో తాను బిగింపజేసిన మోటార్లను తిరిగి తెప్పించుకున్నారు. కుల సంఘాలు, కాలనీ అభివృద్ధి కమిటీలకు మధ్యవర్తులుగా ఉండి డబ్బులు ఇప్పించిన వ్యక్తులను తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కాలనీ అభివృద్ధి కమిటీ వారు సమావేశం ఏర్పాటు చేసుకొని సదరు కౌన్సిలర్ అభ్యర్థి భర్తను పిలిపించి మాట్లాడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులను తిరిగి అడగడంపై ఆయా కాలనీవాసులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ
ఆర్మూర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారంతో నామినేషన్ల పర్వం ముగియడంతో జిల్లా ఎన్నికల ఉప అధికారి గజ్జన్న ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఈ పరిశీలన సమయంలో కాంగ్రెస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన నాయకులు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి షేక్ మహబూబ్ అలియాస్ గుడ్ల బాబాపై ఆరోపణలతో చేసిన ఫిర్యాదు కారణం గా ఉత్కంఠ పరిస్థితి నెల కొంది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ఎంఏ మాజిద్ నామినేషన్ ప త్రాల్లో అతని అభ్యర్థిత్వా న్ని ప్రతిపాదిస్తూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి షేక్ మహబూబ్ సంతకాలు చేశాడంటూ అతనిని పో టీకి అనర్హునిగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పీసీ భోజన్న, పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కలిసి వేరు వేరుగా ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేశారు. దీంతో జిల్లా ఎన్నికల ఉప అధికారి గజ్జన్న షేక్ మహబూబ్‌ను పిలిపించి వివరణ కోరారు. ఎంఏ మాజిద్ నామినేషన్ పత్రాలపై తాను సంతకం చేయలేదని తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీంతో పూర్తి స్థాయి విచారణ అనంతరం ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, వె ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులను పిలిపించిన ఎన్నికల అధికారి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా షేక్ మహబూబ్ పోటీ చేయడానికి అర్హుడని ప్రకటించారు. ఎవరైనా ఒక ఓటరు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రతిపాదించిన పక్షంలో అతను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అనర్హుడు అని తెలిపే ఏ నిబంధన ఎన్నికల నియమావళిలో లేనందున వారి ఫిర్యాదును తిరస్కరిస్తున్నామన్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిపై వచ్చిన ఫిర్యాదు విషయమై పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న నిజామాబాద్ అర్బన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, షేక్ మహబూబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఓటు కోసం చాటుమాటుగా..
ఆర్మూర్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మైకులు, ప్రచారాలతో హోరెత్తిన వార్డులు ప్రశాంతంగా మారాయి. అయితే ఈ ప్రశాంతత వెనుకే అసలు సిసలైన ప్రలోభపర్వం మొదలైంది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్లో తెరచాటు ప్రచారం జోరందుకుంది. పురపోరుకు మిగిలిన ఈ ఒక్కరోజును అన్నిరకాలుగా సద్వినియోగం చేసుకునేందుకు చాలామంది అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలు ఎరజూపుతూ ఓట్లు రాబట్టుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. వయసుల వారీగా తమ వార్డు/డివిజన్ పరిధిలో ఉన్న ఓటర్లను వయసుల వారీగా లెక్కగడుతూ.. ఎవరెవరికి ఏం కావాలో అందిస్తున్నారు. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు.. వారి ఓట్లు రాబట్టుకునేందుకు పలువురు అభ్యర్థులు కాలనీల్లో గుట్టుచప్పుడు కాకుండా చీరలను పంపిణీ చేస్తున్నారు. మరికొందరు ముక్కుపుడకలు, కుంకుమ భరిణెలు, వెండి ఉంగరాలు పంచిపెడుతూ ఓట్లు అడుగుతున్నారు. యువ ఓటర్ల కోసం తిన్నంత చికెన్, మటన్ బిర్యానీలు, తాగేవాళ్లకు తాగినంత మద్యం ఆఫర్లు ఇస్తున్నారు. మిగిలిన మధ్యవయస్కులైన ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లు అందించేస్తున్నారు. పలుచోట్ల మహిళా సంఘాలకు రూ. మూడు నుంచి రూ. ఐదు వేల మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు సమాచారం. సంఘాలూ తక్కువేం కాదు! పలుచోట్ల కుల సంఘాలు, యువజన సంఘాల సభ్యులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ వార్డు నుంచి పోటీకి నిలిచే అన్ని పార్టీల అభ్యర్థులను తమ వద్దకే పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. ఁమా కులం ఓట్లు గిన్ని ఉన్నయి.. మా సంఘ సభ్యులు గిందరున్నరు.. ఎంత ఇస్తవో చెప్పు..* అంటూ వారి నుంచి అందినంతా పుచ్చుకుంటున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏదో ఓక విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కీలకమైన ఈ రెండు రోజుల పాటు వారిని తనవైపే తిప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆర్మూర్‌లోని ఐదో వార్డులో ఒక అభ్యర్థి ఇప్పటికే తనను గెలిపిస్తే ఏడాది పాటు డిష్ కనెక్షన్ ఫ్రీ అని ప్రకటించాడు. యువజన సంఘాల సభ్యులు సైతం అభ్యర్థుల వద్ద అందినకాడికి పుచ్చుకుంటున్నారు. అందినకాడికి లాగుదాం.. కౌన్సిలర్ అభ్యర్థులు ఐదేళ్లకు ఒకసారి మన వద్దకు వస్తారు. వారి వద్ద నుంచి అందినకాడికి గుంజడానికి ఇదే మంచి అవకాశం. అనుకుంటూ పలువురు ఓటర్లు అన్ని పార్టీల నాయకుల వద్ద ఎంతో కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఎవరు ఎంత ఇచ్చినా అందరి వద్దా తీసుకొని మనకు నచ్చిన వ్యక్తులకే ఓటు వేసుకుందామనే తీరులో చాలామంది ఓటర్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును అమ్ముకోవద్దు. విలువైన ఓటు కోసం ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం లేకుండా పోతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రజారంజకంగా పాలించాల్సిన అభ్యర్థులు నిబంధనలకు నీళ్లు వదిలి.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరోవైపు చాలామంది ఓటర్లు సైతం అభ్యర్థులను పిలిపించుకొని మరీ తమకు కావాల్సిన మొత్తాన్ని తీసుకుంటూ ఓటును అమ్ముకుంటున్నారు. -
లెక్కా లేదు.. పత్రం లేదు...
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో పోటీపడుతున్న అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఖర్చులు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న అభ్యర్థి తన ప్రచారానికి లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు అందించే ప్రచార సామగ్రికి మినహాయింపు ఉంటుంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థి చేసిన ఖర్చులను రెండు రోజులకు ఒకసారి అదనపు ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈనెల 30న పోలింగ్ ఉన్నందున, 29వ తేదీ వరకు అభ్యర్థులు ప్రచారపు ఖర్చుల వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. పట్టణంలోని 23 వార్డులలో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 142 మంది పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీలో ఉండే అభ్యర్థులు ముందుగానే జీరో బ్యాల్సెన్తో బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రచారం ఖర్చులను ఈ ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 60 శాతం మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు ఖాతాలను మున్సిపల్ ఎన్నికల అధికారులకు సమర్పించారు. ప్రచారంతో పాటు ఇతర ఖర్చుల వివరాలను అభ్యర్థులు ఎన్నికల అధికారులు తెలియజేయడం లేదు. ప్రచార ఖర్చులు సమర్పించింది ఇద్దరే.. మున్సిపల్ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచార ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం వరకు ఆర్మూరులో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ప్రచార ఖర్చును సమర్పించారు. 18వ వార్డుకు చెందిన చిట్ల పుష్ప, 23వ వార్డుకు చెందిన అంజుమ్ ముజాహత్ మాత్రమే తమ ఎన్నికల ఖర్చును సమర్పించారు. మిగిలిన అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ఫోన్లు చేస్తూ ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సిందిగా సూచిస్తున్నారు. స్పందించని అభ్యర్థులకు నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
ఇంటర్ పరీక్షల్లో ‘గూగుల్’ నిఘా
ఆర్మూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 76 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గూగుల్ ద్వారా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)కు కనెక్ట్ చేశామని ఆర్ఐఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ విధానంతో ఇంటర్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఆయా సెంటర్ల నుంచి సెల్ఫోన్లు ఉపయోగిం చినా, ఫోన్లు, మెసేజ్‌లు చేసినా వెంటనే తమకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా హైటెక్ మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించవచ్చన్నారు. శనివా రం ఆర్మూర్‌లోని క్షత్రియ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన సముపార్జనకే ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళిక బద్ధంగా చదవాలని, విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గురుచర ణం, క్షత్రియ కళాశాల డెరైక్టర్ అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.