ఆర్మూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 76 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గూగుల్ ద్వారా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)కు కనెక్ట్ చేశామని ఆర్‌ఐఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ విధానంతో ఇంటర్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఆయా సెంటర్ల నుంచి సెల్‌ఫోన్‌లు ఉపయోగిం చినా, ఫోన్లు, మెసేజ్‌లు చేసినా వెంటనే తమకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా హైటెక్ మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించవచ్చన్నారు.
శనివా రం ఆర్మూర్‌లోని క్షత్రియ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన సముపార్జనకే ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళిక బద్ధంగా చదవాలని, విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గురుచర ణం, క్షత్రియ కళాశాల డెరైక్టర్ అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో ‘గూగుల్’ నిఘా
Published Sun, Jan 26 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement