Global Positioning System
-
సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
గౌరవనీయులైన ఛాన్సలర్ శ్రీ గిరిధర్ మాలవ్య, వైస్– ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ తదితరులకు నమ స్కారం. 103వ స్నాతకోత్స వానికి ముఖ్య అతిథిగా పాల్గొ నడం నాకు దక్కిన గౌరవం. ఈ రోజు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జ్ఞాపకాల పుస్త కంలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది. తరగతి గదులనూ, పరీక్షలనూ దాటుకొని వాస్తవ ప్రపంచంలోకి మీ ప్రయాణం ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ తరుణంలో రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం ఎదుర్కొనే సవాళ్లను, లభించే అవకాశాలను పరిశీలిద్దాం. విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్‌స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమ ర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్‌లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట! ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం. అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్‌పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే. భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక సలహా దారు ఆచార్య అజయ్ కుమార్ సూద్ ప్రసంగ సంక్షిప్త రూపం. అనువాదం: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు) - ఆచార్య అజయ్ కుమార్ సూద్ -
రష్యాతో భారత్ ‘గగన్‌యాన్’ ఒప్పందం!
న్యూఢిల్లీ: ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ప్రాజెక్టుకు సంబంధించి రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించి ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్.. తాజాగా రష్యాతో చేతులు కలపనుందని సమాచారం. వచ్చే నెలలో రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒప్పందం జరగవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. రష్యా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థ గ్లోనాస్, భారత్ జీపీఎస్ వ్యవస్థ నావిక్లకు సంబంధించి గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంపై కూడా చర్చలు జరగవచ్చు. -
కార్యరూపం దాల్చని జీపీఎస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతన వాహనాలను కొనుగోలు చేసినా లక్ష్యం నెరవేరడం లేదు. కొత్త పుంతలు తొక్కుతున్న నేరస్తులను ఆటపట్టించేందుకు నూతన సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్‌రావు మొదటగా పోలీసుశాఖపైనే దృష్టి సారించారు. సింగపూర్ తరహాలో పోలీసుశాఖను బలోపేతం చేసి తద్వారా శాంతిభద్రతలను అదుపుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అన్ని పోలీసుస్టేషన్లకు కొత్త వాహనాలు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. దీని కోసం 340 కోట్ల రూపాయలు వెచ్చించి 15 వందల ఇన్నోవాలు, సుమోలు, అదేస్థాయిలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసింది. అయితే, వాహనాలు కొనుగోలు చేసి ఏడాది గడచినా వాటిల్లో ఉపయోగించాల్సిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) టెక్నాలజీని ఇప్పటి వరకు పొందుపరచలేదు. జీపీఎస్ కోసం ప్రయత్నించిన ప్రతీసారి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా అన్ని రాష్ట్రాలను కలుపుతూ నిర్భయ నిధులతో ఒక వ్యవస్థను రూపొందిస్తామంటూ కేంద్రం ప్రకటిం చింది. దీంతో జీపీఎస్ టెండర్ల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. జీపీఎస్ ఉంటే.. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా బాధితులు ‘డయల్ 100’కు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ రూం ద్వారా దగ్గర్లోని పెట్రోలింగ్ వాహనానికి కాల్ కనెక్టు అవుతోంది. పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించేలా రూపకల్పన చేశారు. వాహనంలో ల్యాప్‌టాప్, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను చూసేందుకు సదుపాయం కల్పించారు. సంఘటనాస్థలంలో లభించే వేలిముద్రలు తదితర ఆధారాలను వెంటనే జీపీఎస్ ద్వారా కంట్రోల్‌రూం సహాయంతో పరిశీలించవచ్చు. జీపీఎస్ లేకపోవడంతో ఏడాది కింద కొనుగోలు చేసిన వాహనాలకు స్టిక్కర్లు వేసి, కూతలు పెట్టిస్తూ తిప్పుతున్నారు. నిర్వహణ బాధ్యతపై సందిగ్ధత! జీపీఎస్ టెక్నాలజీ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యత ఎవరు చూడాలన్న ప్రశ్న పోలీసు ఉన్నతాధికారులను పట్టి పీడిస్తోంది. టెక్నాలజీ సమకూర్చినవారికే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మొదట్లో భావించినా, అలాంటి విధానం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. శాంతిభద్రతల విషయంలో బయటి వ్యక్తులకు అవకాశం ఇస్తే సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని భావిస్తున్నారు. పోలీసుశాఖలోని టె క్నికల్ సర్వీసును పర్యవేక్షించే విభాగానికి బాధ్యతలు అప్పగించాలనుకున్నా అది సాధ్యపడేలా లేదు. ఈ వ్యవస్థను నిర్వహించాలంటే పెద్దసంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. టెక్నికల్ సర్వీసు విభాగం వద్ద సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నతాధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. -
అరచేతిలో నీటి వేళలు
సాక్షి, సిటీబ్యూరో : నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక పనులు మాను కొని కూర్చుంటున్నారా? ఇకపై ఇలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర మానుకొని వేచి ఉండాల్సిన పనిలేదు. వినియోగదారుడి మొబైల్‌కే నీటి సరఫరా వేళల సమాచారం వస్తుంది. ఈ దిశగా జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముందుగా కూకట్పల్లి డివిజన్ లోని భాగ్యనగర్ సెక్షన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ఆధారంగా ఒక వీధిలో ఏ వేళకు నీటి సరఫరా జరుగుతుందో వినియోగదారుల మొబైల్ నెంబర్లకు నేరుగా సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) రూపంలో సమాచారం చేరవేయడం ఈ విధానం ప్రత్యేకత. ప్రస్తుతం ప్రధాన నగరంలో రోజువిడిచి రోజు(రెండురోజులకోమారు), శివారు ప్రాంతాల్లో మూడు లేదా నాలుగుర ోజుల కోమారు నీటిసరఫరా జరుగుతోంది. మరికొన్ని చోట్ల వారం రోజులకోమారు మాత్రమే నల్లా నీరు వస్తోంది. పాతనగరంలోని కొన్ని ప్రాంతాలకు అర్థరాత్రి 1 లేదా 2 గంటలు, తెల్లవారుఝామున 3 లేదా 4 గంటలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లకోసం జాగారం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సెమ్మెస్‌తో వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది. ఇలా చేరవేస్తారు... జలమండలి పరిధిలో మొత్తం 16 నిర్వహణ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 150 సెక్షన్లున్నాయి. ఒక్కో సెక్షన్లో 8 నుంచి 10 మంది వరకు నీటిని సరఫరా చేసే వాల్వులను నియంత్రించే లైన్మెన్లు పనిచేస్తున్నారు. భాగ్యనగర్ సెక్షన్లో పనిచేస్తున్న 8 మందికి జీపీఎస్ ఆధారంగా పనిచేసే చేతిలో ఇమిడే స్మార్ట్ పరికరం అందజేస్తారు. ఈ యంత్రంలో సదరు వీధిలో ఉన్న వినియోగదారుల మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఆ వీధికి నీటిని సరఫరా చేసేందుకు వాల్వు తిప్పేందుకు వెళ్లిన ప్రతిసారీ యాప్‌కు గల బటన్‌ను నొక్కితే చాలు. ఆ వీధిలోని వారందరికీ నేరుగా నీటి సరఫరా సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. దీంతో వారు అప్రమత్తమై నీళ్లు పట్టుకునే వీలుంటుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నీటిసరఫరా వేళల సమాచారం చేరవేసే జీపీఎస్ ఆధారిత యంత్రాల కొనుగోలుకు సెక్షన్‌కు రూ.5 లక్షల చొప్పున మొత్తం 150 సెక్షన్లకు రూ.7.50 కోట్లు వ్యయం అవుతుందని జలమండలి అంచనా. ఈ నిధులను ఎలా సమకూర్చుకోవాలన్నది సవాల్‌గా మారడం గమనార్హం. -
ఎక్కడికి తరలిపోతోందో?
ఇసుక వాహనాలకు కనిపించని ‘జీపీఎస్’ సీసీ కెమెరాల నిఘా కరువు అడ్డూఅదుపు లేని అక్రమరవాణా పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం : జిల్లాలోని రీచ్‌లనుంచి ఇసుక ఎక్కడకెక్కడకు వెళుతోందీ. ఏ వాహనం ఎలా తీరుగుతోందీ తెలుసుకునేందుకు రూపొం దించిన జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఎక్కడా అమలు కావడంలేదు. అక్రమ రవాణా అరికట్టేందుకు రీచ్‌ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు కాలేదు. నిర్వాహకుల అలక్ష్యానికి అధికారుల పర్యవేక్షణ లోపం తోడవడంతో అక్రమ వ్యాపారం మూడులారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. అమలు కాని ఆదేశాలు జిల్లాలో 33చోట్ల ఇసుక రీచ్‌లకు జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. ప్రస్తుతం 9చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించినా, కోట్లాదిరూపాయలు ప్రభుత్వానికి జమ చేసినా ఆయా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ లేకుండానే ఇసుక తరలిపోయింది. అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు రీచ్‌ల్లో తవ్వకాలను నిలిపివేశారు. లారీలు, ట్రాక్టర్లకు జీపీఎస్ అమర్చాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసినా అమలు కాలేదు. పొరుగున ఉన్న విజయనగరం జిల్లాలో జీపీఎస్ వ్యవస్థ శతశాతం అమలైనట్టు అక్కడి అధికారులు చెబుతున్నా, ఈ జిల్లాలో ఆ చర్యలు కానరావడంలేదు. డీఆర్డీఏ, మెప్మా విభాగాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక ర్యాంప్‌ల్లో మహిళా సంఘాల మాటున టీడీపీ కార్యకర్తలే బినామీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం ఇటీవల శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డన ఏర్పాటైన హయాతినగరం ఇసుక రీచ్‌లో బయటపడింది. వైఎస్సార్సీపీ నేతలు పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించి ర్యాంప్ వద్ద ఆందోళన నిర్వహించడంతో బెంబేలెత్తిపోయిన అధికారులు ప్రస్తుతం ర్యాంప్ లావాదేవీలు నిలిపివేశారు. అక్రమ వ్యాపారానికి అండ జిల్లాలో జీపీఎస్ వ్యవస్థ అన్ని వాహనాలకూ గత జూన్ 17లోగా అమర్చాలని అధికారులు నిర్ణయించారు. రెండు నెలలవుతున్నా దానినెవరూ పట్టించుకోలేదు. రాత్రి పూట జరిగే అక్రమ లావేదేవీలకు, రీచ్‌పాయింట్ నుంచి ఏ వాహనం ఎక్కడకు చేరుతుందో తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ అనివార్యం. కానీ అక్రమవ్యాపారులకు ఇబ్బంది కలగకూడదనే దీనిపై నిఘా పెట్టడానికి అధికారులు సాహసించడంలేదు. సీసీ కెమెరాలు కూడా మూడంటే మూడే రీచ్‌ల్లో ఏర్పాటు చేశారు. వాటి పనితీరు పసిగట్టేందుకు అధికారులకు సమయం లేదు. ఒక్కో వాహనానికి రూ.4600చెల్లిస్తే(సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రైవేట్ సంస్థలకు) ప్రత్యేక సిమ్‌కార్డు యాక్టివేషన్ ద్వారా, వాహనానికి స్టిక్కర్ అంటించడం ద్వారా జీపీఎస్ వ్యవస్థ అమల్లోకి తేవచ్చు. కానీ టీడీపీ బినామీలే నడిపిస్తున్న రీచ్‌ల్లో ఇంత సొమ్ము పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిసారించాల్సి ఉంది. -
పౌరసరఫరాలపై నిఘా
సాక్షి, కడప : పౌర సరఫరాల శాఖలో నూతన శకానికి నాంది పలకనున్నారు. అవినీతిని ఏరివేసి అక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమలు చేసేందుకు కసరత్తుచేస్తున్నారు. తద్వారా రవాణాకు సంబంధించి సరుకుతో బయలుదేరిన వాహనాలు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. మార్చినుంచి జీపీఎస్ సిస్టమ్‌ను అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే పౌరసరఫరాలశాఖకు సంబంధించిన కంప్యూటర్లు కూడా జిల్లాకు వచ్చి చాలారోజులైంది. జిల్లాలోని సుమారు 19 గోడౌన్లలో కంప్యూటర్లు ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇంతవరకు పట్టించుకోవడంలేదు. రేషన్‌షాపుల్లో బయో మెట్రిక్ జిల్లాలో 7.26 లక్షల పైచిలుకు రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే యూఐడీ నెంబరు లేకుండా ఉన్న 8726 యూనిట్లను ఆధార్ అనుసంధానం నేపధ్యంలో తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 1725 రేషన్‌షాపులకు సంబంధించి త్వరలోనే బయో మెట్రిక్ విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే బయో మెట్రిక్ సిస్టమ్‌లో భాగంగా అన్ని రేషన్ షాపుల్లో బయో మెట్రిక్ మిషన్లను బిగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎఫ్పీ షాపులకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్లను ఇప్పటికే అధికారులు సేకరించి బయో మెట్రిక్కు సంబంధించిన కాంట్రాక్టర్‌కు అందజేశారు. ఫిబ్రవరి నుంచి అమలుకు కసరత్తు రేషన్‌షాపుల ద్వారా బయో మెట్రిక్ విధానాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల జనవరి నుంచి ప్రారంభం కానుండగా, మరికొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ-పాస్ విధానంతో దాదాపు బోగస్‌కు చెక్పడినట్లేనని అధికారులు భావిస్తున్నారు. నిరుపయోగంగా కంప్యూటర్లు జిల్లాకు సంబంధించి పౌరసరఫరాల గోడౌన్లలో బిగించాలని కడపకు కంప్యూటర్లు వచ్చినా దాదాపు నెలన్నర కాలంగా ఉన్నాయి. వాటిని గోడౌన్లలో బిగించాల్సి ఉన్నా కరెంటు సౌకర్యంలేని నేపధ్యంలో కంప్యూటర్లను నిరుపయోగంగా ఉంచారు. కంప్యూటర్లకు జీపీఎఫ్ సిస్టమ్‌కు అనుసంధానం చేసి ఆన్లైన్ చేయడం ద్వారా వాహన రవాణాను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి వీలవుతుంది. పైగా చాలా గోడౌన్లకు కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లను ఎప్పుడు బిగిస్తారో అధికారులకే ఎరుక. బెంగుళూరు నుంచి వస్తున్న యంత్రాలు : ప్రభాకర్‌రావు, డీఎస్ఓ బెంగుళూరు నుంచి బయోమెట్రిక్ మిషన్లు కడపకు త్వరలోనే వస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ప్రభాకరరావు తెలియజేశారు. సుమారు 1726 మిషన్లు బెంగుళూరు నుంచి కాంట్రాక్టర్ తీసుకు వస్తున్నారని, అనంతరం వాటిని రేషన్‌షాపుల్లో ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. వాటితోపాటు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు కూడా వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా షాపుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రవాణాకు రక్షణ ‘బంధం’!
సాక్షి, ముంబై: నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోడ్లపై నడుస్తున్న అన్ని వాహనాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు వాహనాలలో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రతి బస్సు, ట్యాక్సీ, ఆటోల కదలికలపై అధికారులు నిఘా ఉంచనున్నారు. 2012 డిసెంబర్లో ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు గాను మరిన్ని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని వాహనాలకు జీపీఎస్‌ను అమర్చనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర సమాచార సాంకేతిక విభాగం... పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో మరింత భద్రతను మెరుగు పరిచేందుకు అవసరమున్న పలు సూచనలతో తయారు చేసిన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనను తాము పాటిస్తున్నామని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సమాచార సాంకేతిక విభాగం తయారు చేసిన నివేదికను రవాణా శాఖకు సమర్పించనున్నామన్నారు. బెస్ట్, ఎమ్మెస్సార్టీసీ బస్సులు, బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీలు, ఆటోలలో ఈ జీపీఎస్‌ను అమర్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి (రవాణా) శైలేష్ శర్మ మాట్లాడుతూ.. ప్రతి కొత్త ట్యాక్సీలు, ఆటోల యజమానులు జీపీఎస్/ జీపీఆర్ఎస్ వ్యవస్థలను అమర్చుకునే విధానానికి అంగీకరించాలని, లేదంటే కొత్త పర్మిట్ పొందే సమయంలో ఆర్ఎఫ్ఐడీ ఛిప్‌లను అందజేస్తామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్యాక్సీలు, ఆటోలు తమ తమ వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ, జీపీఎస్‌లను అమర్చుకుంటేనే వార్షిక ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఈ విధానంతోనైనా ఆటో,ట్యాక్సీ యజమానులు జీపీఎస్‌లను అమర్చుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ జీపీఎస్‌తో అధికారులు ప్రతి వాహనంపై నిఘా ఉంచేందుకు సులువుగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. అన్ని ప్రజా వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం ద్వారా వాహనం ఎక్కడ ఉంది. వాహన వేగం, ఇతర వివరాలను కూడా పూర్తిగా తెసులుకునే వీలుంటుంది. అయితే ప్రభుత్వ ఆమోదం తర్వాతే ఈ వ్యవస్థ అమలుకు అవకాశముందని శైలేష్ శర్మ తెలిపారు. ఆరు నెలల్లోగా పూర్తి నివేదిక తయారవుతుందని ఆయన తెలిపారు. కాగా, వివిధ రవాణాదారులు, యూనియన్లు కూడా ఈ అంశంపై ఆసక్తిగా ఉన్నారన్నారు. వాహన డ్రైవర్ పేరు, ఫొటో, అతడు డ్రైవరా లేదా పర్మిట్ హోల్డరా తదితర వివరాలను వాహన బ్యాడ్జ్‌పై ముద్రించనున్నారు. అదేవిధంగా ఆర్టీవో హెల్ప్‌లైన్ నంబర్, ట్రాఫిక్ పోలీస్, మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా దీనిపై ముద్రించనున్నారు. అత్యవస సమయంలో ప్రయాణికులు ఈ నంబర్లను ఆశ్రయించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. దీంతో జీపీఎస్ వ్యవస్థతో వాహనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందో ఇట్టే పసిగట్టవచ్చు. ప్రస్తుతం ప్రజా రవాణాపై నిఘా ఉంచేందుకు 700 బెస్ట్ బస్సులు, మోనో, మెట్రో రైళ్లలో సీసీటీవీ కెమరాలను అమర్చిన విషయం తెలిసిందే. -
ఇదెక్కడి చోద్యం సగం పరికరాలు మాయం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన బస్సులకు అమర్చిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరికరాల్లో సగం ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో మొత్తం 3,700 బస్సులకు వీటిని అమర్చారు. డీటీసీ అధికారి ఒకరు అందించిన వివరాల ప్రకారం 2010లో వీటిని అమర్చారు. అందులో 1,800 లకు పైగా పరికరాలు కనిపించడం లేదు. కాగా ఇప్పుడివికాస్తా గల్లంతవడంతో బస్సులను సమర్థంగా నిర్వహించడంతోపాటు ఏ బస్సు ఏ సమయంలో ఎక్కడుందనే విషయం ప్రయాణికులకు తెలిసేవిధంగా చేయాలనే డీటీసీ లక్ష్యం కాస్తా దెబ్బతింది. బస్సు సేవలను మెరుగుపరచాలనే లక్ష్యంతో 3,700 జీపీఎస్ పరికరాలను శీతల, శీత లేతర బస్సులకు అప్పట్లో బిగించారు. బస్సులు ఎక్కడ ఉన్నాయనే విషయం ప్రయాణికులకు తెలిసేందుకు వీలుగా అప్పట్లో నగరంలోని అనేక బస్టాండ్లలో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలాఉంచితే జీపీఎస్ పరికరాల గల్లంతుపై డీటీసీ పోలీసులకు ఫిర్యాదుచేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు డీటీసీ బస్సుల్లో ఇప్పటికేఉన్న జీపీఎస్ పరికరాలు పనిచేయడం లేదు. ఇటువంటివన్నీ జరగడానికి డ్రైవర్లే కారణమై ఉండొచ్చని ఓ అధికారి ఆరోపించారు. జీపీఎస్‌లు సరిగా పనిచేస్తే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుందని, ఇందుకోసం మిలీనియం డిపోలో కంట్రోల్ రూంనుకూడా ఏర్పాటు చేశామన్నారు. భారీ సంఖ్యలో జీపీఎస్ పరికరాలు మాయమవడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. -
ఇక.. గనుల్లో జీపీఎస్
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవడంలో కోల్‌ఇండియాలోనే ముందువరసలో ఉన్న సింగరేణి సంస్థ మరో అడుగు ముం దుకు వేసేందుకు సిద్ధమవుతోంది. భూగర్భగనుల్లో ఉన్న కార్మికులు ఎక్కడున్నారు.. ఎన్ని గంటలకు వెళ్లారు.. అనే విషయాలను స్పష్టం గా తెలుసుకునేందుకు అత్యాధునిక జీపీఎస్(గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూగర్భంలో కిలోమీటర్ల దూరంవెళ్లిన కార్మికులు ఎక్కడ ఉన్నారనే విషయం ప్రస్తుతం తెలియడం లేదు. జీపీఎస్‌ను విని యోగించుకోవడం ద్వారా కార్మికులు గనిలో ఎక్కడ ఉన్నారో నేరుగా సర్ఫేస్(ఉపరితలం)పై ఉన్నవారికి ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. సింగరేణి సంస్థలో గతంలో కోల్ ఫిల్లింగ్ ఉండేది. కార్మికులు సుమారు పదిమంది వరకు ఒక జట్టుగా వెళ్లి విధులు నిర్వహించి తిరిగి ఉపరితలానికి వచ్చేవారు. ఇటీవల కాలంలో సంస్థలో అత్యాధునికమైన లాంగ్వాల్, కంటిన్యూయస్ మైనర్, ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను వినియోగించి బొగ్గును వెలికితీ స్తున్నారు. ప్రస్తుతం భూగర్భగనుల్లో రూఫ్ బోల్టింగ్, యంత్రాలు పనిచేసిన తర్వాత చెల్లాచెదురుగా పడిన బొగ్గును ఒకదగ్గర చేర్చేందుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కలిసి అండర్‌గ్రౌండ్‌లోని పని స్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఈ నేపథ్యంలో పనిస్థలంలో ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ ఉన్నారనే విషయాన్ని జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. సత్తుపల్లి కోల్ ట్రాన్స్‌పోర్టులో సక్సెస్ గతంలో సింగరేణి సంస్థ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లిన బొగ్గు నిర్ధేశిత స్థలాలకు వెళ్లేది కాదు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు వెళ్లిన తర్వాత అది అక్కడకు వెళ్లకుండానే మా యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు ఒక గ్రేడ్‌కు బదులు మరో గ్రేడ్ బొగ్గు సరఫరా అయిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు యాజమాన్యం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీలో ఇటీవల జీపీఎస్ టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తోంది. కంపెనీ నుంచి సరఫరా అయిన బొగ్గు సక్రమంగా గమ్యం చేరేందుకు బొగ్గు లోడ్ చేసిన లారీలకు జీపీఎస్ కనెక్షన్ ఇచ్చి వాటి వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేసి పరిశీలిస్తోంది. ఈ విధానం విజయవం తమైంది. దీనిని భూగర్భగనుల్లో కార్మికుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగించవచ్చనే విషయాన్ని సింగరేణి రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలలో ఏదైనా ఒక భూగర్భగనిలో జీపీఎస్ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. సత్ఫలి తాలిస్తే మిగిలిన గనుల్లో సైతం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఇక.. గనుల్లో జీపీఎస్
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవడంలో కోల్‌ఇండియాలోనే ముందువరసలో ఉన్న సింగరేణి సంస్థ మరో అడుగు ముం దుకు వేసేందుకు సిద్ధమవుతోంది. భూగర్భగనుల్లో ఉన్న కార్మికులు ఎక్కడున్నారు.. ఎన్ని గంటలకు వెళ్లారు.. అనే విషయాలను స్పష్టం గా తెలుసుకునేందుకు అత్యాధునిక జీపీఎస్(గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూగర్భంలో కిలోమీటర్ల దూరంవెళ్లిన కార్మికులు ఎక్కడ ఉన్నారనే విషయం ప్రస్తుతం తెలియడం లేదు. జీపీఎస్‌ను విని యోగించుకోవడం ద్వారా కార్మికులు గనిలో ఎక్కడ ఉన్నారో నేరుగా సర్ఫేస్(ఉపరితలం)పై ఉన్నవారికి ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. సింగరేణి సంస్థలో గతంలో కోల్ ఫిల్లింగ్ ఉండేది. కార్మికులు సుమారు పదిమంది వరకు ఒక జట్టుగా వెళ్లి విధులు నిర్వహించి తిరిగి ఉపరితలానికి వచ్చేవారు. ఇటీవల కాలంలో సంస్థలో అత్యాధునికమైన లాంగ్వాల్, కంటిన్యూయస్ మైనర్, ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను వినియోగించి బొగ్గును వెలికితీ స్తున్నారు. ప్రస్తుతం భూగర్భగనుల్లో రూఫ్ బోల్టింగ్, యంత్రాలు పనిచేసిన తర్వాత చెల్లాచెదురుగా పడిన బొగ్గును ఒకదగ్గర చేర్చేందుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కలిసి అండర్‌గ్రౌండ్‌లోని పని స్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఈ నేపథ్యంలో పనిస్థలంలో ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ ఉన్నారనే విషయాన్ని జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. సత్తుపల్లి కోల్ ట్రాన్స్‌పోర్టులో సక్సెస్ గతంలో సింగరేణి సంస్థ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లిన బొగ్గు నిర్ధేశిత స్థలాలకు వెళ్లేది కాదు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు వెళ్లిన తర్వాత అది అక్కడకు వెళ్లకుండానే మా యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు ఒక గ్రేడ్‌కు బదులు మరో గ్రేడ్ బొగ్గు సరఫరా అయిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు యాజమాన్యం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీలో ఇటీవల జీపీఎస్ టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తోంది. కంపెనీ నుంచి సరఫరా అయిన బొగ్గు సక్రమంగా గమ్యం చేరేందుకు బొగ్గు లోడ్ చేసిన లారీలకు జీపీఎస్ కనెక్షన్ ఇచ్చి వాటి వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేసి పరిశీలిస్తోంది. ఈ విధానం విజయవం తమైంది. దీనిని భూగర్భగనుల్లో కార్మికుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగించవచ్చనే విషయాన్ని సింగరేణి రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలలో ఏదైనా ఒక భూగర్భగనిలో జీపీఎస్ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. సత్ఫలి తాలిస్తే మిగిలిన గనుల్లో సైతం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఇంటర్ పరీక్షల్లో ‘గూగుల్’ నిఘా
ఆర్మూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 76 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గూగుల్ ద్వారా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)కు కనెక్ట్ చేశామని ఆర్ఐఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ విధానంతో ఇంటర్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఆయా సెంటర్ల నుంచి సెల్ఫోన్లు ఉపయోగిం చినా, ఫోన్లు, మెసేజ్‌లు చేసినా వెంటనే తమకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా హైటెక్ మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించవచ్చన్నారు. శనివా రం ఆర్మూర్‌లోని క్షత్రియ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన సముపార్జనకే ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళిక బద్ధంగా చదవాలని, విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గురుచర ణం, క్షత్రియ కళాశాల డెరైక్టర్ అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో పర్మిట్ల మంజూరుకు కొత్త నియమాలు
సాక్షి, ముంబై: కొత్త ఆటో పర్మిట్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను రూపొందించింది. ఇక మీదట ఆటో పర్మిట్లను పొందాలనుకున్నవారు తమ వాహనాలకు తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ (జీపీఆర్ఎస్) పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం రూఫ్ టాప్ ఇండికేటర్లు, ఐడెంటిటీ కార్డులు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌లను కూడా అమర్చుకోవడం తప్పనిసరి. అయితే ఆర్ఎఫ్ఐడీ పరికరాన్ని అమర్చితే టోల్‌నాకాల వద్ద వాహనం సమాచారాన్ని సులువుగా నమోదు చేయవచ్చు. టోల్‌ను కూడా ఆన్లైన్ పద్ధతిలో వసూలు చేయవచ్చు. ఆటో పర్మిట్లను జారీకి రూపొందించిన నిబంధనల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. జీపీఎస్, జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్, రూఫ్ టాప్ ఇండికేటర్లు, డిస్ప్లే కార్డులు (ఈ కార్డుల్లో డ్రైవర్లకు చెందిన పూర్తి సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది) తదితర పరికరాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నియమాల ప్రకారం ప్రతి డ్రైవర్‌కు లెసైన్సులు, ఆటోరిక్షా బ్యాడ్జీలు, మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్లుగా రుజువు చేసే పత్రాలు కలిగి ఉంటే సరిపోతుంది. ఇక నుంచి మరిన్ని కొత్త నియమాలను కూడా డ్రైవర్లు పాటించాల్సి ఉంటుంది. కొత్త పర్మిట్ల కేటాయింపునకు లాటరీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీనియర్ రవాణా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొత్త నియమాల గురించి ఇంతకు ముందే సమాచారాన్ని డ్రైవర్లకు అందజేశామన్నారు. ఇక ముంబైవ్యాప్తంగా 18 వేల కొత్త పర్మిట్లను జారీ చేస్తారు. ఇందులో 9,350 పర్మిట్లను అంధేరీ ఆర్టీఓ, 8,750 పర్మిట్లను వడాలా ఆర్టీఓ జారీ చేస్తుంది. నిద్రాణస్థితిలో (డోర్మంట్) ఉన్న వాటిలో 50 శాతం పర్మిట్లను కూడా పునరుద్ధరిస్తారు. అయితే పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి చెల్లుబాటు గల ఆటో లెసైన్సును కలిగి ఉండాలి. ప్రజారవాణా బ్యాడ్‌జ కూడా తప్పనిసరి. స్థానిక భాష, స్థానిక పర్యాటక ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. మహారాష్టల్రో 15 ఏళ్లుగా నివాసముంటున్నట్టు నిరూపించే ధ్రువపత్రం సమర్పించాలి. గత ఏడాదిలో తనపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదంటూ పోలీసులు మంజూరు చేసిన ధ్రువపత్రాన్ని కూడా ఇవ్వాలి.