ఇక.. గనుల్లో జీపీఎస్ | Global Positioning System providing in mines | Sakshi
Sakshi News home page

ఇక.. గనుల్లో జీపీఎస్

Published Thu, Feb 20 2014 1:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Global Positioning System  providing in mines

కొత్తగూడెం, న్యూస్‌లైన్ :  అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవడంలో కోల్‌ఇండియాలోనే ముందువరసలో ఉన్న సింగరేణి సంస్థ మరో అడుగు ముం దుకు వేసేందుకు సిద్ధమవుతోంది. భూగర్భగనుల్లో ఉన్న కార్మికులు ఎక్కడున్నారు.. ఎన్ని గంటలకు వెళ్లారు.. అనే విషయాలను స్పష్టం గా తెలుసుకునేందుకు అత్యాధునిక జీపీఎస్(గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూగర్భంలో కిలోమీటర్ల దూరంవెళ్లిన కార్మికులు ఎక్కడ ఉన్నారనే విషయం ప్రస్తుతం తెలియడం లేదు. జీపీఎస్‌ను విని యోగించుకోవడం ద్వారా కార్మికులు గనిలో ఎక్కడ ఉన్నారో నేరుగా సర్ఫేస్(ఉపరితలం)పై ఉన్నవారికి ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది.

 సింగరేణి సంస్థలో గతంలో కోల్ ఫిల్లింగ్ ఉండేది. కార్మికులు సుమారు పదిమంది వరకు ఒక జట్టుగా వెళ్లి విధులు నిర్వహించి తిరిగి ఉపరితలానికి వచ్చేవారు. ఇటీవల కాలంలో సంస్థలో అత్యాధునికమైన లాంగ్‌వాల్, కంటిన్యూయస్ మైనర్, ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను వినియోగించి బొగ్గును వెలికితీ స్తున్నారు. ప్రస్తుతం భూగర్భగనుల్లో రూఫ్ బోల్టింగ్, యంత్రాలు పనిచేసిన తర్వాత చెల్లాచెదురుగా పడిన బొగ్గును ఒకదగ్గర చేర్చేందుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కలిసి అండర్‌గ్రౌండ్‌లోని పని స్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఈ నేపథ్యంలో పనిస్థలంలో ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ ఉన్నారనే విషయాన్ని జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.

 సత్తుపల్లి కోల్ ట్రాన్స్‌పోర్టులో సక్సెస్
 గతంలో సింగరేణి సంస్థ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లిన బొగ్గు నిర్ధేశిత స్థలాలకు వెళ్లేది కాదు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు వెళ్లిన తర్వాత అది అక్కడకు వెళ్లకుండానే మా యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు ఒక గ్రేడ్‌కు బదులు మరో గ్రేడ్ బొగ్గు సరఫరా అయిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు యాజమాన్యం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీలో ఇటీవల జీపీఎస్ టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తోంది.

కంపెనీ నుంచి సరఫరా అయిన బొగ్గు సక్రమంగా గమ్యం చేరేందుకు బొగ్గు లోడ్ చేసిన లారీలకు జీపీఎస్ కనెక్షన్ ఇచ్చి వాటి వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేసి పరిశీలిస్తోంది. ఈ విధానం విజయవం తమైంది. దీనిని భూగర్భగనుల్లో కార్మికుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగించవచ్చనే విషయాన్ని సింగరేణి రీసెర్చ్ అండ్ డెవల ప్‌మెంట్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలలో ఏదైనా ఒక భూగర్భగనిలో జీపీఎస్ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. సత్ఫలి తాలిస్తే మిగిలిన గనుల్లో సైతం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement