coal transport
-
బొగ్గు రవాణా మరింత పెంచాలి
శ్రీరాంపూర్: బొగ్గు రవాణా మరింత పెంచాలని సింగరేణి(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో నూతనంగా నిర్మించిన రెస్ట్హాల్ను ప్రారంభించారు. అనంతరం సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణా మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం బీ.సంజీవరెడ్డి, ఏరియా ఇంజనీర్ రమేశ్‌బాబు, సీహెచ్‌పీ డీజీఎం వెంకటేశ్వరరావు డీజీఎం సివిల్ శివరావు, డీజీఎం ఐఈడీ చిరంజీవులు, ఆర్కే 5 గని మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, గుర్తింపు సంఘం నాయకులు లక్ష్మణ్, వెంగల కుమారస్వామి, ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజ్, ఐఎన్టీయూసీ బ్రాంచిఉపాధ్యక్షుడు శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
‘గరుడ’ భారీ గూడ్స్ రైలు
సాక్షి, హైదరాబాద్: ‘గరుడ’... పేరుకు తగ్గట్టుగానే సూపర్ స్పీడ్, రెండు కిలోమీటర్ల పొడవైన భారీ రైలు. దక్షిణ మధ్య రైల్వే తొలి భారీ సరుకు రవాణా రైలు. జాప్యాన్ని నివారించడం, భారీ సరుకు రవాణా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పని... లక్ష్యంగా రైళ్లను నడపాలన్న సంస్థ ప్రయత్నాలు ఫలించాయి. ప్రయోగాత్మకంగా 8–10 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి బొగ్గు రవాణాకు ఈ రైలును వినియోగించారు. రాయచూరు నుంచి మణుగూరుకు వచ్చి బొగ్గు లోడ్ చేసుకుని పరుగులు పెట్టిందీ రైలు. త్రిశూల్ పేరుతో మరోరైలును అంతకుముందు రోజే విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి – ఈస్ట్‌కోస్ట్ జోన్‌లోని ఖుద్ర డివిజన్‌కు నడిపారు. సరుకు రవాణాలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే... సరుకు రవాణాను మరింత వేగవంతం చేసే ప్రయత్నంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మామూలు సరుకు రవాణా రైళ్లు మూడింటిని జోడించటం ద్వారా రెండు కిలోమీటర్ల పొడవుండే ఈ భారీ రైలును రూపొందించి నడుపుతున్నారు. ఒకేసారి మూడు రైళ్ల లోడు తరలిపోతుంది. దీంతో రైలుకు రైలు మధ్య సిగ్నళ్లు, ఇతర సమస్యలతో ఏర్పడే విరామం తగ్గి సరుకు వేగంగా తరలటం, ఖాళీ వ్యాగన్లు వేగంగా మళ్లీ గమ్యం చేరుకోవటం వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
బొగ్గులో ‘రివర్స్’
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ మరోసారి విజయవంతమైంది. ఈ విధానంలో ఏపీ జెన్కో మునుపెన్నడూ లేని విధంగా తక్కువ ధరకు బొగ్గు రవాణా కాంట్రాక్టులను ఖరారు చేసింది. రివర్స్ టెండరింగ్ చేపట్టి ఎల్–1 ధర కన్నా తక్కువ రేటుకు వచ్చేలా చేసింది. దీనివల్ల రూ.164.647 కోట్ల ప్రజాధనం ఆదా కానుంది. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇది నిదర్శనమని విద్యుత్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతిక అర్హత సాధించినవి 7 కంపెనీలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం) కోసం ఏటా 3.675 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణాకు సంబంధించి ఏపీ విద్యుత్ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్) సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. ఒడిశాలోని తాల్చేరు బొగ్గు క్షేత్రం నుంచి సమీపంలోని శుద్ధి చేసే ప్రాంతాలకు బొగ్గును చేరుస్తారు. అక్కడ శుద్ధి చేసిన (వాష్డ్ కోల్) బొగ్గును జల రవాణా ద్వారా కృష్ణపట్నం పోర్టుకు చేరవేస్తారు. ఈ టెండర్ దక్కించుకునేందుకు ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. ఇందులో ముంబైకి చెందిన ఎంబీజీ కమొడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ టన్నుకు రూ.1,370.01 ధర కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. అధికారులు ఈ ధరను కోట్ చేస్తూ రివర్స్ టెండరింగ్ చేపట్టగా చెన్నైకి చెందిన చిట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతి తక్కువగా మెట్రిక్ టన్నుకు రూ.1,146 ధర కోట్ చేసి బొగ్గు రవాణా కాంట్రాక్టును దక్కించుకుంది. గతంలో ఆరోపణలు.. గత ఐదేళ్లుగా బొగ్గు రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో పలు ఆరోపణలు వచ్చాయి. బొగ్గు కుంభకోణాలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధారాలతో సహా అనేక కథనాలు ప్రచురించింది. సీఎం వైఎస్ జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో టెండర్ డాక్యుమెంట్లు రూపొందించిన వైనం విద్యుత్ వర్గాలనే కలవర పెట్టింది. ముడుపులు ఇచ్చిన వారికే కాంట్రాక్టులు దక్కేలా, అతి తక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ఏపీజెన్కోతో టెండర్ నిబంధనలు రూపొందించేలా చేశారు. నేడు పారదర్శకతే ప్రామాణికం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన రివర్స్ టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచారు. ఒకరికన్నా ఎక్కువ మంది కలిసి బొగ్గు రవాణా కాంట్రాక్టు చేపట్టవచ్చనే వెసులుబాటూ ఇచ్చారు. ఫలితంగా కాంట్రాక్టుల కోసం పలువురు పోటీ పడ్డారు. గత నెల 30వ తేదీన బిడ్స్ ఓపెన్ చేశారు. అదాని ఎంటర్ప్రైజెస్ (గుర్గామ్), ఆనంద్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (చెన్నై), శరత్ చటర్జీ అండ్ కో (విశాఖ), చిట్టినాడ్ లాజిస్టిక్స్ (చెన్నై), గ్లోబల్ కోల్ మైనింగ్ (న్యూఢిల్లీ), కరమ్ చంద్ తప్పర్, ట్రైడెంట్ (కన్సార్టియం–హైదరాబాద్), ఎంబీజీ కమొడిటీస్ (హైదరాబాద్)తో కలిసి ఎలిగెంట్ లాజిస్టిక్స్ కన్సార్టియంగా ఫైనాన్షియల్ అర్హత పొందాయి. ఎల్–1 ధరతో ఈ నెల 10వ తేదీన రివర్స్ బిడ్డింగ్ నిర్వహించారు. చిట్టినాడ్ మెట్రిక్ టన్ను రూ.1,146 ధరకు ప్లాంట్‌కు బొగ్గు చేరవేసేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. ప్రజాధనం ఆదా అమోఘం గత ప్రభుత్వ హయాంలో బొగ్గు రవాణా కాంట్రాక్టు టన్నుకు రూ.1,240 చొప్పున ఇవ్వగా ప్రస్తుతం ఇచ్చిన కాంట్రాక్టు టన్నుకు రూ.1,146 మాత్రమే కావడం గమనార్హం. అంటే గతంలో కంటే ఈసారి టన్నుకు రూ.100 చొప్పున తక్కువ ధరకు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఏటా 36,75,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి రవాణా అవుతుంది. ఈ కాంట్రాక్టులో ఎల్–1 ధర టన్నుకు రూ.1,370.01 కాగా రివర్స్ టెండరింగ్ వల్ల ఇది రూ.1,146కి వచ్చింది. అంటే మెట్రిక్ టన్నుకు రూ.224.01 చొప్పున తగ్గింది. ఈ క్రమంలో ఏటా రవాణా చేసే 36,75,000 మెట్రిక్ టన్నుల బొగ్గులో రూ.82.32 కోట్లు ఆదా కానుంది. తద్వారా రెండేళ్ల కాంట్రాక్టు గడువులో రివర్స్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ.164.647 కోట్లు ఆదా అవుతుంది. జెన్కో చరిత్రలో ప్రథమం వివాదాలకు తావులేకుండా, పారదర్శకంగా బొగ్గు రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జెన్కో చరిత్రలో ఇదే ప్ర«థమం. ఎక్కువ మంది పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకున్నాం. రివర్స్ టెండరింగ్ విధానం జెన్కో వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ప్రజాధనం వృధా కాకుండా కాపాడామన్న సంతృప్తి కలుగుతోంది. ఇక ముందు కూడా ప్రతి టెండర్లను ఇదే విధంగా నిర్వహిస్తాం. కాంట్రాక్టర్ల మధ్య పోటీతో నాణ్యమైన సేవలు అందుతాయి. – శ్రీధర్ (జెన్కో ఎండీ) -
రవాణాలోనూ రికార్డే..
సింగరేణి : కొత్తగూడెం ఏరియా బొగ్గు రవాణాలోనూ రికార్డు సృష్టించింది. సింగరేణివ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో అధికంగా రవాణా చేసింది. 2018–19లో 112.17 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 124.17 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఇదే క్రమంలో కొత్తగూడెంలోని ఆర్‌సీహెచ్‌పీ ద్వారా 10.11 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. 2,725 రేకుల ద్వారా 92,07,426 టన్నులు బొగ్గును రవాణా చేసింది. రోడ్డు మార్గం ద్వారా 9,10,550 టన్నులు రవాణా చేసింది. గడచిన కొన్నేళ్లలో.. కొత్తగూడెం ఏరియాలో 2013–14లో 1,938 రేకుల ద్వారా 71,54,953 టన్నుల బొగ్గును రవాణా చేశారు. 2014–15లో 1,958 రేకుల ద్వారా 71,17,818 టన్నులు, 2015–16లో 1943 రేకుల ద్వారా 69,64,967 టన్నులు, 2016–17లో 2,093 రేకుల ద్వారా 75,17,453 టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. 2017–18లో 2,265 రేకుల ద్వారా 78,75,227 టన్నుల బొగ్గు రవాణా చేయగా, 2018–19లో 2,725 రేకుల ద్వారా 92,07,426 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు సింగరేణి గణాంకాలు తెలుపుతున్నాయి. ముందస్తు ప్రణాళికతోనే.. సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఏరియా జీఎం సూచనలు, సలహాలతో ముందస్తు ప్రణాళికల వల్ల 10మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధ్యమైంది. సెకండరీ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల సహకారంతో రోజూ, నెలవారీ, వార్షిక లక్ష్యాలు సాధించాం. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత వార్షిక లక్ష్యాలను కూడా సాధిస్తాం. – శ్రీకాంత్, ఆర్‌సీహెచ్‌పీ ఎస్ఈ -
ప్రగతిలో సింగరేణి పరుగులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అన్ని విభాగాల్లో రికార్డు స్థాయిల్లో వృద్ధిని నమోదు చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం (2009–14) సాధించిన బొగ్గు రవాణా, ఓబీ తొలగింపు, అమ్మకాలు, నిఖర లాభాలతో పోలిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత (2014–2019) సింగరేణి సాధించిన వృద్ధి రికార్డుస్థాయిలో ఉంది. దేశంలోనే ఎనిమిది సబ్సిడరీ కంపెనీలు గల కోలిండియా సైతం గత ఐదేళ్లలో ఇంత వృద్ధిని నమోదు చేయలేదని శుక్రవారం సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. 2009–2014 బొగ్గు రవాణాలో కేవలం 90 లక్షల టన్నుల వృద్ధిని సాధించిన సింగరేణి, ఆవిర్భావం తర్వాత 200 లక్షల టన్నుల వృద్ధిని సాధించింది. అంటే 122 శాతం వృద్ధి అన్నమాట. అలాగే ఓవర్ బర్డెన్ తొలగింపులో 250 మిలియన్ క్యూబిక్ మీటర్లు నమోదు చేసి 257 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణ రాకముందు ఐదేళ్ల అమ్మకాల్లో రూ.5,600 కోట్ల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ, ఆవిర్భావం తర్వాతి ఐదేళ్లలో రూ.13,000 కోట్లతో 132 శాతం వృద్ధిని సాధించడం విశేషం. అలాగే ట్యాక్సులు చెల్లించిన తర్వాత నికరలాభం కూడా భారీగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఐదేళ్లలో నికర లాభం 290 కోట్ల రూపాయలు ఉండగా గడిచిన ఐదేళ్లలో రూ.1,200 కోట్లుగా నమోదు చేసింది. నెలనెలా సమీక్షలు, తక్షణ పరిష్కారాలు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తన నేతృత్వంలో సింగరేణిని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుపుతూ నాలుగేళ్లలో అనూహ్య ప్రగతిని సాధిస్తూ వస్తున్నారు. గతంలో ఏడాదికి, ఆరు నెలలకోసారి జరిగే ఏరియా జనరల్ మేనేజర్ల సమీక్ష సమావేశాలను ఆయన ప్రతీనెలా నిర్వహించడం మొదలు పెట్టారు. సమావేశాల్లో ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న సమస్యలను జీఎంలు వివరించినప్పుడు వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం, సంబంధిత శాఖ తక్షణ చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేసేవారు. దీంతో 2015–16లో ఏకంగా 15% వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే ఆదర్శప్రాయంగా నిలిపారు. పాత యంత్రాల స్థానంలో సుమారు రూ.350 కోట్లతో కొత్త యంత్రాలు కొనుగోలు చేశారు. విద్యుదుత్పత్తిలోనూ ముందే.. సింగరేణి సంస్థ తమ 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకూ 19,036 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందించింది. అనతికాలంలోనే అత్యధిక పీఎల్ఎఫ్ సాధించిన ప్లాంటుగా జాతీయస్థాయిలో 4వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి సన్నాహాలు కూడా చేస్తోంది. ఇదే కాక 12 ఏరియాల్లో మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికీ పూనుకుంది. తొలి దశలో 130 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును 2018–19లో పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించనుంది. -
32 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
సాక్షి, కొత్తగూడెం: వచ్చే ఏడాది రూ.32 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రూ.18 వేల కోట్లు, ఈ ఏడాది రూ.23 వేల కోట్ల టర్నోవర్ సాధించి నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం 52 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసిన సంస్థ.. ఈ ఏడాది 66 మిలియన్ టన్నుల రవాణాకు ప్రణాళికలు రూపొందించుకుందని, ఈ విషయంలో గత మూడేళ్లలో వరుసగా 11.5శాతం, 4శాతం, 10శాతం వృద్ధి సాధించిందని వివరించారు. 2015లో రూ.1,050 కోట్లు, 2016లో రూ.800 కోట్ల లాభాలు గడించామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 12 కొత్త గనులు ప్రారంభిస్తున్నామని, ఇందులో 6 ఓసీలు, 6 భూగర్భగనులు ఉన్నాయని తెలిపారు. సింగ రేణి ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోందన్నారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌ను తీసుకున్నామని, రెండు, మూడేళ్లలో నైనీ బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టామని, 11 ఏరియాల్లో ఒక్కొక్కటి 500 మెగావాట్ల చొప్పున సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని చెప్పారు. జైపూర్‌లో ఏర్పాటుచేసిన థర్మల్ ప్లాంట్‌తో పాటు సోలార్ ప్లాంట్ల ద్వారా 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగలకు వేతనంతో కూడి న సెలవులు ఇస్తూ సర్క్యులర్ జారీ చేశామన్నారు. -
గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం
వేలూరు: తమిళనాడులోని కాట్పాడి సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై తురై ముగం నుంచి సేలం మోటూరులోని థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గును సరఫరా చేసేందుకు ఈ గూడ్స్ రైలు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాట్పాడి సమీపంలోని సేవూరు వద్ద రైలు నుంచి మంటలు చెలరేగాయి. మొత్తం 13 బోగీలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందజేశాడు. విషయం తెలుసుకున్న కాట్పాడి రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. మంటలు వ్యాపించటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సాయంత్రం 5 గంటల సమయానికి కూడా మంటలు అదుపులోకి రాలేదు. గూడ్స్ రైలులో మంటలకు కారణమేమిటనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
ఇక.. గనుల్లో జీపీఎస్
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవడంలో కోల్‌ఇండియాలోనే ముందువరసలో ఉన్న సింగరేణి సంస్థ మరో అడుగు ముం దుకు వేసేందుకు సిద్ధమవుతోంది. భూగర్భగనుల్లో ఉన్న కార్మికులు ఎక్కడున్నారు.. ఎన్ని గంటలకు వెళ్లారు.. అనే విషయాలను స్పష్టం గా తెలుసుకునేందుకు అత్యాధునిక జీపీఎస్(గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూగర్భంలో కిలోమీటర్ల దూరంవెళ్లిన కార్మికులు ఎక్కడ ఉన్నారనే విషయం ప్రస్తుతం తెలియడం లేదు. జీపీఎస్‌ను విని యోగించుకోవడం ద్వారా కార్మికులు గనిలో ఎక్కడ ఉన్నారో నేరుగా సర్ఫేస్(ఉపరితలం)పై ఉన్నవారికి ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. సింగరేణి సంస్థలో గతంలో కోల్ ఫిల్లింగ్ ఉండేది. కార్మికులు సుమారు పదిమంది వరకు ఒక జట్టుగా వెళ్లి విధులు నిర్వహించి తిరిగి ఉపరితలానికి వచ్చేవారు. ఇటీవల కాలంలో సంస్థలో అత్యాధునికమైన లాంగ్వాల్, కంటిన్యూయస్ మైనర్, ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను వినియోగించి బొగ్గును వెలికితీ స్తున్నారు. ప్రస్తుతం భూగర్భగనుల్లో రూఫ్ బోల్టింగ్, యంత్రాలు పనిచేసిన తర్వాత చెల్లాచెదురుగా పడిన బొగ్గును ఒకదగ్గర చేర్చేందుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కలిసి అండర్‌గ్రౌండ్‌లోని పని స్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఈ నేపథ్యంలో పనిస్థలంలో ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ ఉన్నారనే విషయాన్ని జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. సత్తుపల్లి కోల్ ట్రాన్స్‌పోర్టులో సక్సెస్ గతంలో సింగరేణి సంస్థ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లిన బొగ్గు నిర్ధేశిత స్థలాలకు వెళ్లేది కాదు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు వెళ్లిన తర్వాత అది అక్కడకు వెళ్లకుండానే మా యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు ఒక గ్రేడ్‌కు బదులు మరో గ్రేడ్ బొగ్గు సరఫరా అయిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు యాజమాన్యం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీలో ఇటీవల జీపీఎస్ టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తోంది. కంపెనీ నుంచి సరఫరా అయిన బొగ్గు సక్రమంగా గమ్యం చేరేందుకు బొగ్గు లోడ్ చేసిన లారీలకు జీపీఎస్ కనెక్షన్ ఇచ్చి వాటి వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేసి పరిశీలిస్తోంది. ఈ విధానం విజయవం తమైంది. దీనిని భూగర్భగనుల్లో కార్మికుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగించవచ్చనే విషయాన్ని సింగరేణి రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలలో ఏదైనా ఒక భూగర్భగనిలో జీపీఎస్ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. సత్ఫలి తాలిస్తే మిగిలిన గనుల్లో సైతం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
టెన్షన్.. టెన్షన్
సత్తుపల్లి/సత్తుపలి ్లరూరల్, న్యూస్‌లైన్: ఓపెన్‌కాస్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాలకు చెందిన సింగరేణి భూ నిర్వాసితులు అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ఓసీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజాము నుం చే పోలీసులు ఓపెన్‌కాస్టు పరిసర ప్రాంతాలలో భారీగా మోహరించటంతో టెన్షన్ వాతావర ణం నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే అరెస్ట్‌ల పర్వం కొనసాగడంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి రాగానే అరెస్ట్ చేస్తుండడంతో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగా రు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం 22 రోజు లుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఇప్పుడు ముట్టడి కార్యక్ర మం చేపడితే వారికి తొత్తులుగా మారిన పోలీసు లు తమను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు. పోలీసులకు, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో పోలీసులు జీపు కదల నీయకుండా ఆందోళనకారులు చుట్టుముట్టారు. వ్యూహాత్మకంగా ముట్టడి.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తుంటే.. ఆందోళన కారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కొమ్మేపల్లి, కిష్టారం నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలు సింగరేణి వై జంక్షన్ కు చేరుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన పోలీ సులు భారీగా వైజంక్షన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు జంక్షన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కాగా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వై జంక్షన్ వద్దకు ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ముట్టడిని భగ్నం చేసేందుకు సత్తుపల్లి డీఎస్పీ బి.అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అశ్వారావుపేట, సత్తుపల్లి టౌన్, రూరల్ సీఐలు, పలువురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఓసీ వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు. నిలిచిన బొగ్గు రవాణా.. ఓపెన్‌కాస్టు ముట్టడితో బొగ్గు రవాణాకు ఆటం కం ఏర్పడింది. ఉదయం నుంచే లోడింగ్‌ను నిలిపివేశారు. సుమారు 5వేల టన్నుల బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి పీఓ ఎస్.సూర్యనారాయణ తెలిపారు. అయితే ఉత్పత్తికి మా త్రం ఎలాంటి అంతరాయం ఏర్పడలేదన్నారు. అర్ధరాత్రి అరెస్ట్‌లు.. అశ్వారావుపేట/ దమ్మపేట, న్యూస్‌లైన్: వారు ప్రజల సొమ్మును లూటీ చేయలేదు.. పేదల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేవారూ కాదు.. నిర్వాసితుల కోసం ప్రభుత్వంతో శాంతి యుత పోరాటం చేస్తున్న రాజకీయ నాయకులు.. అలాంటి వారిని తీవ్రవాదులను నిర్బంధించినట్లుగా సత్తుపల్లి పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి దమ్మపేట స్టేషన్‌కు తరలించారు. ఇదేమంటే అవాంఛనీయ ఘటన లు జరగకుండా స్టేషన్ మార్చామంటూ సమర్థించుకుంటున్నారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీ విస్తరణలో భాగంగా కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాధపురం గ్రామాల రైతుల భూములు, గ్రామాలను సింగరేణి యాజమాన్యం స్వాధీనపరుచుకోనుంది. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకా రం నష్టపరిహారం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓసీని ముట్టడికి నిర్ణయించారు. వారికి అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. సొంతపూచీకత్తుపై విడుదల.. నిర్వాసితులకు మద్దతుగా పోరాడుతున్న వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కోటగిరి మురళీకృష్ణారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, సీపీఐ డివిజన్, మండల కార్యదర్శులు దండు ఆదినారాయణ, తడికమళ్ల యోబు, న్యూడెమోక్రసీ నేత ఎ.రాములును మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తామేం చేశామని ప్రశ్నిస్తే ‘మా సార్ చెప్పారు.. మిమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నాం..’ అనే సమాధానం మినహా పోలీసులు ఇంకేమీ చెప్పడం లేదు. చివరకు బుధవారం మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పిరికిపంద చర్యే..: ఇది ముమ్మాటికీ పోలీసుల పిరికిపంద చర్యే.. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతిచ్చిన మమ్మల్ని అత్యంత దిగజారుడు తనంగా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. మమ్మల్ని సత్తుపల్లిలో ఉంచే ధైర్యం పోలీసులకు ఎందుకు లేదో చెప్పాలి. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదు. -డాక్టర్ దయానంద్ విజయ్‌కుమార్, వైఎస్ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త రజాకార్లలా వ్యవహరించారు..: పోలీసులు వ్యవహరించిన తీరు రజాకార్లను గుర్తుచేస్తోంది. రైతుల సమస్యలపై న్యాయబద్ధంగా పోరాడుతున్న మమ్మల్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురావడం పద్ధతికాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా.. తుపాకీ పాలననా.. అర్థం కావడం లేదు. - ఉడతనేని అప్పారావు కాంగ్రెస్ నాయకులు