సింగరేణి : కొత్తగూడెం ఏరియా బొగ్గు రవాణాలోనూ రికార్డు సృష్టించింది. సింగరేణివ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో అధికంగా రవాణా చేసింది. 2018–19లో 112.17 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 124.17 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఇదే క్రమంలో కొత్తగూడెంలోని ఆర్‌సీహెచ్‌పీ ద్వారా 10.11 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. 2,725 రేకుల ద్వారా 92,07,426 టన్నులు బొగ్గును రవాణా చేసింది. రోడ్డు మార్గం ద్వారా 9,10,550 టన్నులు రవాణా చేసింది.
గడచిన కొన్నేళ్లలో..
కొత్తగూడెం ఏరియాలో 2013–14లో 1,938 రేకుల ద్వారా 71,54,953 టన్నుల బొగ్గును రవాణా చేశారు. 2014–15లో 1,958 రేకుల ద్వారా 71,17,818 టన్నులు, 2015–16లో 1943 రేకుల ద్వారా 69,64,967 టన్నులు, 2016–17లో 2,093 రేకుల ద్వారా 75,17,453 టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేశారు. 2017–18లో 2,265 రేకుల ద్వారా 78,75,227 టన్నుల బొగ్గు రవాణా చేయగా, 2018–19లో 2,725 రేకుల ద్వారా 92,07,426 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు సింగరేణి గణాంకాలు తెలుపుతున్నాయి.
ముందస్తు ప్రణాళికతోనే..
సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఏరియా జీఎం సూచనలు, సలహాలతో ముందస్తు ప్రణాళికల వల్ల 10మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధ్యమైంది. సెకండరీ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల సహకారంతో రోజూ, నెలవారీ, వార్షిక లక్ష్యాలు సాధించాం. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత వార్షిక లక్ష్యాలను కూడా సాధిస్తాం.
– శ్రీకాంత్, ఆర్‌సీహెచ్‌పీ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment