
న్యూఢిల్లీ: ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ప్రాజెక్టుకు సంబంధించి రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించి ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్.. తాజాగా రష్యాతో చేతులు కలపనుందని సమాచారం. వచ్చే నెలలో రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒప్పందం జరగవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. రష్యా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థ గ్లోనాస్, భారత్ జీపీఎస్ వ్యవస్థ నావిక్‌లకు సంబంధించి గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంపై కూడా చర్చలు జరగవచ్చు.