Space travelers
-
ఐఎస్ఎస్లోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి గమ్యస్థానం చేరుకున్నారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు సాహసికులు గురువారం మధ్యాహ్నం 1.34 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్ఎస్) విజయవంతంగా అడుగుపెట్టారు. అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్లో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములుండగా, సునీత, బుచ్ విల్మోర్తో తొమ్మిదికి చేరారు. కొత్తగా తమ వద్దకు చేరిన సునీతా, విల్మోర్కు ఏడుగురు అస్ట్రోనాట్స్ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. సునీత ఆనందంతో నృత్యం చేశారు. వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘ఐఎస్ఎస్ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు వేడుక చేసుకున్నా. ఇదో లిటిల్ డ్యాన్స్ పార్టీ’’ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం తర్వాత స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగి రానున్నారు. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు
వాషింగ్టన్: తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడో హ్యూమన్ ఫ్లైట్ ‘ఎన్–25’ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పైలట్‌గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు. 60 ఏళ్ల తర్వాత.. నెరవేరిన కల అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్ మాజీ కెపె్టన్ ఎడ్‌డ్వైట్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్ ‘ఎన్–25’మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్డ్వైట్ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు. -
భారత ‘సూపర్ ఫోర్’
తిరువనంతపురం: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్‌లో పాల్గొని రోదసిలోకి వెళ్లున్న నలుగురు భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెపె్టన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు నలుగురూ భారత వాయుసేనకు చెందిన ఫైటర్ పైలట్లే. కేరళలోని తుంబలో ఉన్న విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ను మోదీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ‘‘ఈ నలుగురు వ్యోమగాముల పేర్లు భారత విజయగాథలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కలను వారు నిజం చేయనున్నారు’’ అంటూ కొనియాడారు. ‘‘వీళ్లు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు. 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు!’’ అన్నారు. గగన్‌యాన్ మిషన్ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేకిన్ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్ అని చెప్పారు. ‘‘గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్లో రోదసీలోకి వెళ్లొచ్చారు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారత్ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్‌డౌన్, రాకెట్‌తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్‌యాన్ మిషన్‌లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్‌లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంబనకు తార్కాణమిది’’ అన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతరిక్ష శక్తిగా భారత్ భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను ఎంతగానో పెంపొందిస్తోందని, 21వ శతాబ్దిలో మనం ప్రపంచశక్తిగా ఎదిగేందుకు బాటలు పరుస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రో సాధించిన పలు ఘన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహం చేరి అతి కొద్ది దేశాలకే పరిమితమైన అరుదైన ఘనత సాధించాం. ఒకే మిషన్‌లో 100కు పైగా ఉపగ్రహాలనూ రోదసిలోకి పంపాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించాం. ఆదిత్య ఎల్1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇలాంటి విజయాలతో భావి అవకాశాలకు ఇస్రో సైంటిస్టుల బృందం నూతన ద్వారాలు తెరుస్తోంది. ఫలితంగా అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ వాణిజ్య హబ్‌గా మారనుంది. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఐదింతలు పెరిగి 44 బిలియన్ డాలర్లకు చేరనుంది’’ అని చెప్పారు. ఇస్రో అంతరిక్ష మిషన్లలో మహిళా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ అన్నారు. చంద్రయాన్ మొదలు గగన్‌యాన్ దాకా ఏ ప్రాజెక్టునూ మహిళా శక్తి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉందన్నారు. 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటూ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, సీఎం పినరాయి విజయన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు. వారిది మొక్కవోని దీక్ష గగన్‌యాన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో నలుగురు వ్యోమగాములూ అత్యంత కఠోరమైన శ్రమకోర్చారంటూ మోదీ ప్రశంసించారు. ‘‘అత్యంత కఠినమైన శారీరక, మానసిక పరిశ్రమతో పాటు యోగాభ్యాసం కూడా చేశారు. ఆ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను మొక్కవోని పట్టుదలతో అధిగమించారు. రోదసి మిషన్ కోసం తమను తాము పరిపూర్ణంగా సన్నద్ధం చేసుకున్నారు’’ అన్నారు. వారు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు 13 నెలలు రష్యాలోనూ శిక్షణ పొందారు. మానవసహిత గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా 2025లో ముగ్గురు వ్యోమగాములను రోదసిలో ని 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది ఇస్రో లక్ష్యం. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. గగన్‌యాన్ మిషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. హాయ్ వ్యోమమిత్రా గగన్‌యాన్ మిషన్ ప్రగతిని విక్రం సారబాయి స్పేస్ సెంటర్లో మోదీ సమీక్షించారు. మిషన్‌కు సంబంధించిన పలు అంశాలను సోమనాథ్‌తో పాటు ఇస్రో సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. మానవసహిత యాత్రకు ముందు గగన్‌యాన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లనున్న హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రతో సరదాగా సంభాషించారు. మహిళ ఎందుకు లేదంటే... గగనయాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. అంతరిక్ష యాత్రకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిషన్లకు టెస్ట్ పైలట్ల పూల్ నుంచి మాత్రమే వ్యోమగాముల ఎంపిక జరుగుతుంది. అత్యున్నత వైమానిక నైపుణ్యంతో పాటు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా వ్యవహరించగల సామర్థ్యం టెస్ట్ పైలట్ల సొంతం. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపిక జరిపిన సమయంలో భారత టెస్ట్ పైలట్ల పూల్‌లో ఒక్క మహిళ కూడా లేరు. దాంతో గగన్‌యాన్ మిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం లేకుండాపోయింది. భావి మిషన్లలో మహిళా వ్యోమగాములకు స్థానం దక్కుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. 3 ప్రాజెక్టులు జాతికి అంకితం సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను మోదీ తుంబా నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ భవనం, ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్‌లో సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైనోసిక్ విండ్ టన్నెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది -
'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం!
అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. పైగా భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. ఇలా స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం కష్టంగా ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు పలుపరిశోధనలే చేశారు. ఆ సమస్యకు చెక్ పెడుతూ ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా మంచి ఆహారాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఆ ఆహారం ప్రత్యేకత ఏంటీ? తదితర విశేషాలు తెలుసుకుందాం!. స్పేస్ ట్రావెలర్స్ అంతరిక్షంలో అన్ని రోజులు ఉంటే వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు ఉంటాయని విన్నాం. అయితే ఇప్పటి వరకు వారికి సరైన ఆహారం అందించడంలో శాస్త్రవేత్తలు విఫలమవుతూ వస్తున్నారు. ఇంతవరకు వారికి ప్రిజర్వేటడ్ ప్యాక్ చేసిన ఆహారాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి స్పేస్‌లోకి వెళ్లాక చప్పగా అయిపోవడం జరగుతోంది. దీంతో ఈ వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందక పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఆ సమస్యకు చెక్‌పెడుతూ ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ "ఆప్టిమల్ స్పేస్ మీల్" అనే శాఖాహార సలాడ్ని కనిపెట్టింది. ఇది అక్కడ ఉండే వ్యోమగాములకు అన్ని రకాల పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిజానికి స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు భూమిపై ఉండే మానువుల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. జీరో మైక్రోగ్రావిటీలో ఎక్కువ సేపు గడుపుతారు కాబట్టి వారికి కాల్షియం వంటి అదనపు సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. వారికీ ఈ ప్రత్యేకమైన ఫుడ్ ఆ లోటుని భర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్ మిషన్‌లో ఉండేవారికి మంచి ఆహారాన్ని అందించేలా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భోజనాన్ని తయారు చేశారు. దీనిలో తాజా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారికి అందించే శాకాహార పంటలను తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండించాలని అన్నారు. పరిశోధకులు ఈ "స్పేస్ మీల్"ని సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటితో తయారు చేశారు. ఈ శాకాహార భోజనంతో వ్యోమగాములకు గరిష్ట పోషాకాలు అందడమే గాక సమర్థవంతమైన సమతుల్య ఆహారమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ భోజనాన్ని భూమిపై ఉన్న వారికి ఇవ్వగా చక్కటి ఫలితం వచ్చిందని అన్నారు. అందువల్ల స్పేస్‌లో ఉండే వారికి ఇది మంచి మీల్ అని నమ్మకంగా చెప్పొచ్చు అని అన్నారు. (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
వాషింగ్టన్: ‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ వెహికిల్‌లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు. -
చంద్రుడిపై అడుగు పెట్టేద్దామంటున్న టయోటా? మన కోసం వెహికల్ రెడీ చేస్తోంది!
జాబిల్లి పైకి సామాన్యులను తీసుకెళ్లేలా ఓ క్రూయిజర్ వెహికల్ని తయరుచేసే పనిలో ఉంది టయోటా. జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో జాయింట్ వెంచర్‌గా ఈ లూనార్ క్రూయిజర్ వెహికల్ని అభివృద్ధి చేస్తోంది. 2030 చివరినాటికి వాహనం సిద్ధమవుతుందని టయోటా అంటోంది. అంతేకాదు 2040 కల్లా మార్స్ మీదికి కూడా వెళ్లవచ్చని చెబుతోంది. తాము అభివృద్ధి చేసే లూనార్ క్రూయిజర్ వెహికల్ చంద్రుడికి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని హామీ ఇస్తోంది టయోటా. లూనార్ లాండ్ క్రూయిజర్‌లోనే చంద్రుడిపై తిరిగేందుకు , తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వందేళ్లకు ఓ సారి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రస్తుతం తాము అదే తరహా టెక్నాలజీపై పని చేస్తున్నట్టు టయోటా చెబుతోంది. భూమిపై వాహనాల్లో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినట్టుగా చంద్రుడిపైకి ప్రయాణాలు చేయించాలన్నది తమ లక్ష్యమని చెబుతోంది. చదవండి:జాబిలి వైపు భారీ రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి! -
జపాన్ కుబేరుడి రోదసీ యాత్ర
మాస్కో: జపాన్ బిలియనీర్, ఫ్యాషన్ వ్యాపా రాధిపతి యుసాకు మెజావా బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు పయనమయ్యారు. సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన యుసాకుతో పాటు ప్రముఖ నిర్మాత యోజో హిరానో ఉన్నారు. యుసాకు యాత్రను హిరానో డాక్యమెంటరీగా చిత్రీకరించనున్నా రు. రష్యాకు చెందిన సోయుజ్‌స్పేస్‌క్రాఫ్ట్‌లో రష్యా కాస్మొనాట్ అలెగ్జాండర్ మిస్రుకిన్‌తో కలిసి వీరిరువురు రోదసీలోకి వెళ్లారు. కజకిస్తాన్‌లోని బైకనుర్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఈ నౌక బయలుదేరింది. 12 రోజుల పాటు యుసాకు, హిరానో ఐఎస్ఎస్లో గడుపుతారు. 2009 తర్వాత స్వీయ నిధులతో ఒకరు రోదసీలోకి వెళ్లడం ఇదే ప్రథమం. యాత్రకు అయ్యే ఖర్చువివరాలు బహిర్గతం కాలేదు. రోదసీ నుంచి భూమిని వీక్షించడాన్ని ఇష్టపడతానని, భార రహిత స్థితిని అనుభవించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని యాత్రకు ముందు యుసాకు చెప్పారు. జపాన్‌లోని అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ మాల్ జోజోటవున్‌కు యుసాకు అధిపతి. ఆయన ఆస్తుల మొత్తం సుమారు 200 కోట్ల డాలర్లని అంచనా. 2023లో ఎలాన్ మస్క్ నిర్వహించే చంద్రయాత్రలో కూడా యుసాకు పాలుపంచుకోనున్నారు. -
అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్...!
Bill Gates Takes A Dig At Jeff Bezos And Elon Musk: గత కొన్ని రోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపట్టిన విషయం తెలిసిందే..! ఈ సంస్థల అధినేతలు స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలు తదుపరి అంతరిక్షయాత్రల కోసం వడివడిగా పనులను జరుపుతున్నాయి. ప్రపంచంలోని బిలియనీర్స్ రోదసి యాత్రలను చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..! భూమ్మీద ఎన్నో సమస్యలున్నాయి..వాటిపై..! అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదు ’ అని అన్నారు. లేట్ లేట్ షో విత్ జేమ్స్ కోర్డాన్ షోలో పలు అంశాలపై బిల్‌గేట్స్ చర్చించారు . భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇతర గ్రహాలకు వెళ్దామనే తపన మీలో లేదని బిల్‌గేట్స్‌ను ఉద్దేశించి షో వ్యాఖ్యత జేమ్స్ కోర్డాన్ పేర్కొన్నారు. Tonight on our special #ClimateNight episode, Bill Gates shares a very good reason for why you haven’t seen him in a rocket ship 🚀 pic.twitter.com/7C8cKarJl0 — The Late Late Show with James Corden (@latelateshow) September 23, 2021 చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! -
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
-
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
కేప్ కనావెరల్ (అమెరికా): వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూరిజానికి స్పేస్ఎక్స్ రాకెట్‌తో శ్రీకారం చుట్టారు. ఇన్స్పిరేషన్–4 పేరిట మూడు రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్ష యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను అమెరికా కుబేరుడు, ఫిష్ట్4 పేమెంట్స్ సంస్థ అధినేత జేర్డ్ ఐసాక్‌మ్యాన్ తన భుజాలకెత్తుకున్నారు. ముగ్గురు ప్రయాణికులతోపాటు తానూ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో కూర్చుని అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రొఫెషనల్ వ్యోమగాములే లేని ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరిట్ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం.5.32 నిమిషాలకు ధవళవర్ణ స్పేస్సూట్లు ధరించిన క్రిస్ సెమ్‌బ్రోస్కీ, జేర్డ్ ఐసాక్‌మ్యాన్, సియాన్ ప్రోక్టర్, హేలే ఆర్సేనెక్స్లతో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్–9 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. చదవండి: బిడ్డకు భర్త పేరు పెట్టుకున్న యూఎస్ అమర సైనికుని భార్య ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో మొదలైన ఈ ప్రయాణంలో రాకెట్ ఆకాశంలో దాదాపు 160 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించనుంది. మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ రాకెట్ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రిస్తారు. తన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా కేవలం సాధారణ పౌరులనే నింగిలోకి పంపి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అంతరిక్ష టూరిజం రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా ఈ–కామర్స్ దిగ్గజం ఐసాక్‌మ్యాన్ చరిత్రలకెక్కారు. ఈ జూలై నెలలోనే ఇప్పటికే తమ సొంత రాకెట్లలో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్స్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేసి అంతరిక్ష పర్యాటక యాత్రల పరంపరను మొదలుపెట్టడం తెల్సిందే. తర్వాతి ప్రయాణాలకు మార్గదర్శకంగా.. ఈ ప్రయాణం విజయవంతమైతే దీనిని తదుపరి సాధారణ ప్రయాణికుల పర్యాటక యాత్రలకు మార్గదర్శకంగా భావించనున్నారు. మూడు రోజుల యాత్రలో భాగంగా ఈ నలుగురి ఆరోగ్య స్థితిని అంతరిక్షంలో పరీక్షించనున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం, మేథో శక్తి, నిద్ర, రక్త ప్రసరణ తదితర అంశాలనూ పరిశీలించనున్నారు. ప్రయాణాన్ని వారు మరింతగా ఆస్వాదించేందుకు వీలుగా స్పేస్ఎక్స్ రాకెట్ పై భాగంలో తొలిసారిగా అతిపెద్ద డోమ్ విండోను ఏర్పాటుచేశారు. ‘ఇది అద్భుతం’ అని ఐసాక్‌మ్యాన్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ క్యాప్సూల్‌లో ప్రయాణంలో సమస్యలొస్తే ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ వీరందరికీ వాషింగ్టన్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్ ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్ఎక్స్ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! ఇద్దరు విజేతలు, ఒక హెల్త్‌కేర్ వర్కర్, ఒక కుబేరుడు నలుగురితో మొదలైన ఈ ఇన్స్పిరేషన్–4 యాత్రలో హేలే ఆర్సేనెక్స్ అనే 29 ఏళ్ల మహిళా హెల్త్‌కేర్ వర్కర్ ఉన్నారు. ఎముక క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఈమె తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని పరిశోధనా వైద్యశాలలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా ఈమె రికార్డు సృష్టించారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. వాషింగ్టన్లో డాటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న క్రిస్ సెమ్‌బ్రోస్కీ(42) సైతం యాత్రలో పాలుపంచుకున్నారు. ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ మహిళ సియాన్ ప్రోక్టర్(51) సైతం ఈ యాత్రకు ఎంపికయ్యారు. ప్రయాణికుల ఎంపిక కోసం జరిగిన పోటీలో క్రిస్, ప్రోక్టర్లు విజేతలుగా నిలిచారు. నింగిలోక దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
జెఫ్ బెజోస్ కొంపముంచిన అంతరిక్ష యాత్ర...!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ రాకెట్ ద్వారా అంతరిక్షయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. రోదసి యాత్ర విజయవంతమైనందుకు గాను జెఫ్ బెజోస్ అమెజాన్ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్క్షతలను తెలిపారు. కాగా రోదసీయాత్ర పూర్తి చేసుకున్న జెఫ్బెజోస్పై కొంత మంది మండిపడుతున్నారు. జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్రను పన్నులు కట్టకుండా డబ్బులను సంపాదించారని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొంపముంచుతుంది. తాజాగా బెజోస్ అంతరిక్షయాత్రకు వ్యతిరేకంగా పలువురు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ తన అంతరిక్షయాత్ర కోసం అమెజాన్ కస్టమర్ల, ఉద్యోగుల డబ్బులను వాడి వెళ్లి వచ్చారనే అభిప్రాయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్చేస్తున్నారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతోనే స్పేస్ టూర్ చేసి వచ్చారని నెటిజన్లు ఎద్దెవా చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గత నెలలో జూలై 20 న 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ పదకొండు నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం 16 లక్షల డాలర్లు ఖర్చు చేశారని నెటిజన్లు దుయ్యబట్టారు. అంతరిక్షయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజులకే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం నుంచి జెఫ్ బెజోస్ వైదొలిగాడు. బెజోస్ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్వీఎమ్హెచ్) అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 200.5 బిలియన్ డాలర్లతో ముందున్నారు. జెఫ్ బెజోస్ 190.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. Tone deaf doesn’t begin to describe this @JeffBezos quote. I’m sure your workers who get blocked from unionizing at every turn are just giddy with excitement about your neato field trip to outer space that they subsidized. https://t.co/pmgCUIp7kp — Nick Knudsen 🇺🇸 (@NickKnudsenUS) July 21, 2021 I'm about to cancel my Amazon prime membership quite literally just bc bezos said "thanks, you guys are the ones who paid for this" upon return from space. — ɴᴀᴅɪᴀ 💉💉 (@VainArab) July 24, 2021 @JeffBezos how about you give every Amazon prime subscriber a freebie considering we paid for you to go to space! I’d like you to pay me to stay at home and rent some films, not much to ask👍 #amazon #BlueOrigin #space #givemeabreak #amazonprime #freerental — FromTheShadows (@FTShadows) July 23, 2021 -
చెఫ్, వ్యాఖ్యాతకు చెరో రూ. 745 కోట్ల నగదు పురస్కారం
వాషింగ్టన్: రోదసీలోకి విజయవంతంగా తిరిగొచ్చా కా అమెరికా పారిశ్రామికవేత్త, అమెజాన్ వ్యవస్థాప కుడు జెఫ్ బెజోస్ ఒక కొత్త అవార్డును ప్రకటిం చారు. ప్రఖ్యాత చెఫ్ జోస్ ఆండ్రీస్, అమెరికాలో రాజకీయ వార్తల వ్యాఖ్యాత వాన్ జోన్స్‌లకు ఈ అవార్డు దక్కింది. కరేజ్ అండ్ సివిలిటీ పేరిట ఇచ్చే ఈ అవార్డుతోపాటు వీరిద్దరూ దాదాపు చెరో రూ. 745 కోట్ల(10కోట్ల డాలర్లు) నగదు పురస్కారం అందుకోనున్నారు. మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడటంతో అవిశ్రాంత కృషిచేస్తున్నందుకు అవార్డును ప్రకటించినట్లు బెజోస్ చెప్పారు. నగదు పురస్కారంగా పొందే ఈ మొత్తాన్ని గ్రహీతలు తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వవచ్చు. ఆండ్రీస్ ప్రఖ్యాత పాకశాస్త్ర ప్రవీణుడు. 2010లో లాభాపేక్షలేని ‘ వరల్డ్ సెంట్రల్ కిచెన్’ అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల భోజన వసతులు కల్పిస్తున్నారు. -
నవలోకం... మన కోసం..!
‘మానవుడే మహనీయుడు... గగనాంతర రోదసిలో గంధర్వగోళ గతులు దాటిన... మానవుడే మాననీయుడు’ అన్నారు ఆరుద్ర. మానవుడిలోని ఆ శక్తినీ, యుక్తినీ మరోసారి గుర్తుచేస్తూ గత పది రోజులుగా వస్తున్న అంతరిక్ష యాత్రల వార్తలే అందుకు నిదర్శనం. ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, తరువాత సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు. వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా ఆసక్తిగా చెప్పుకుంటోంది. త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో జరిపేది ముచ్చటగా మూడో విహారం. నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు. అయితేనేం, లక్షల డాలర్లు ఖర్చుపెట్టి వారు రూపొందిస్తున్న అంతరిక్ష విమాన నౌకలు, ఈ విహార ప్రయత్నాలు ప్రపంచంలో వస్తున్న మార్పుకు సూచనలు. ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే అనాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తేల్చిన నిరూపణలు. భవిష్యత్తులో రోదసీ పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన కీలక సంఘటనలు. కొద్ది నిమిషాల్లోనే భూవాతావరణాన్ని దాటి రోదసిలోకి ప్రయాణించి, భారరహిత స్థితిలో అంతెత్తు నుంచి భూగోళాన్ని చూసి, ఆ వెంటనే సురక్షితంగా భూమి మీదకు తిరిగొచ్చేయడం ఇక సాధ్యమని ఈ యాత్రలు చాటాయి. అపురూపమైన ఆ అనుభవం కావాలను కొనే సంపన్నులు, సాహసికులు ఇప్పుడిక డబ్బు సంచులు సిద్ధం చేసుకోవడమే తరువాయి! నాలుగు నిమిషాల అపూర్వ అనుభవం కావాలంటే, టికెట్ రెండున్నర లక్షల డాలర్లు. అలా ‘వర్జిన్ గెలాక్టిక్’ ఇప్పటికే 600 టికెట్లు విక్రయించడం గమనార్హం. తాజా రెండు యాత్రల్లోనూ కొన్ని విశేషాలున్నాయి. రిచర్డ్ బ్రాన్సన్ బృందంలో భాగమై, 86 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి, రోదసీ విహారం చేసిన తొలి తెలుగమ్మాయిగా బండ్ల శిరీష చరిత్రకెక్కారు. ఆ వెంటనే బెజోస్ బృందం వంద కిలోమీటర్ల ఎత్తులోని కార్మాన్ రేఖ దాటి, భూమి నుంచి మరింత ఎత్తుకు 106 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి రికార్డు సృష్టించింది. ఈ కొత్త రికార్డు యాత్రలో రోదసీ విహారం చేసిన అతి పిన్నవయస్కుడు (18 ఏళ్ళ ఆలివర్ డేమన్), అతి పెద్ద వయస్కురాలు (82 ఏళ్ళ వ్యోమగామి వ్యాలీ ఫంక్) కూడా భాగం కావడం మరో చరిత్ర. నిజానికి, మానవాళి రోదసీ విజయ చరిత్ర ఎప్పుడో ఆరంభమైంది. అంతరిక్షయానం మనకు మరీ కొత్తేమీ కాదు. ఇప్పటి కుబేరుల పోటీలానే, దశాబ్దాల క్రితం ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధవేళ అంతరిక్ష విజయానికి అగ్రరాజ్యాల మధ్య పోటీ సాగింది. అరవై ఏళ్ళ క్రితం రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ 1961లో రోదసీ యాత్ర చేసిన తొలి మానవుడనే ఖ్యాతి దక్కించుకున్నారు. ఇక, 52 ఏళ్ళక్రితం 1969 జూలై 20న అమెరికన్ నీల్మ్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపాడు. ఇరవై ఏళ్ళ క్రితమే 2001లో రష్యన్లు ధనికుడైన పెట్టుబడిదారు డెన్నిస్ టిటోను రోదసిలోకి తీసుకువెళ్ళారు. ప్రైవేటు రోదసీ విమాన నౌకలో మనుషుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపే వాణిజ్య ప్రయత్నాలు కూడా ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ద్వారా గతంలో అనేకం జరిగాయి. అయితే, ఈ అనేకానేక తొలి అడుగులు, అనేక పరాజయాలు ఇప్పటికి ఓ కీలక రూపం ధరించాయని అనుకోవచ్చు. అలా తాజా రోదసీ విహారాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని భావించవచ్చు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన చారిత్రక ఘట్టానికి సరిగ్గా 52 ఏళ్ళు పూర్తయిన రోజునే ఇప్పుడు బెజోస్ బృందం రోదసీ విహారం చేశారు. పాతికేళ్ళ పైచిలుకు క్రితం ఓ చిన్న గ్యారేజ్‌లో ఇ–కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఆలోచనకు శ్రీకారం చుట్టి, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన 57 ఏళ్ళ అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్‌కు రోదసీ విహారం తన అయిదో ఏట నుంచి ఓ కల. అందుకోసం 2000లో ‘బ్లూ ఆరిజన్’ స్టార్టప్‌ను స్థాపించి, ఇప్పటికి తన కల నిజం చేసుకున్నారు. దశాబ్దాల ముందు కేవలం కల అనుకున్న అనేక విషయాలు ఇప్పుడు నిజం చేసుకోవడం సాంకేతిక పురోగతికి ప్రతీకలే. అయితే, అందుకు శ్రమ, ఖర్చూ కూడా అపరిమితం. రోదసీ విహారానికి జెఫ్ బెజోస్ ఖర్చు పెట్టింది అక్షరాలా 5.5 బిలియన్ డాలర్లని ఓ లెక్క. అయితే, ఇలా ఇన్నేసి లక్షల డాలర్లను మనోవాంఛ తీర్చే విహారానికి ఖర్చు చేసే బదులు మానవాళి నివాసమైన ఈ పుడమిని కాపాడుకొనేందుకు అర్థవంతంగా ఖర్చు చేయవచ్చుగా అనే విమర్శలూ లేకపోలేదు. ఏమైనా, కొన్ని దశాబ్దాలుగా రష్యా, అమెరికా, చైనా, భారత్ సహా అనేక దేశాల మధ్య సాగిన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల పోటీ ఇప్పుడు ధనిక వ్యాపారవేత్తలు, సంస్థల గగనవిహారం దిశగా మళ్ళింది. దీనివల్ల అంతరిక్షమొక సరికొత్త వ్యాపార వేదికగా రూపుదాల్చనుంది. నవలోకానికి దారులు తీసింది. మరోపక్క మన దేశం కూడా అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచి, ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందుకే, అంతరిక్ష పరిశోధన, పర్యాటకం – రెండూ ఇక రెండు కళ్ళు కావడం ఖాయం. చంద్రాది అనేక గ్రహాల మీద శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటు కూడా అచిరకాలంలోనే సాధ్యం కావచ్చు. ఇవాళ్టి కోటీశ్వరుల ప్రేమలు, పెళ్ళిళ్ళు, డెస్టినేషన్ వివాహాల సంస్కృతి... భవిష్యత్తులో రోదసీలో, భారరహిత స్థితిలోకి విస్తరించినా ఆశ్చర్యం లేదు. అంటే... ఒకప్పుడు మానవాళి తలపులకే పరిమితమైన తారాతీరం ఇప్పుడిక అందనంత ఎత్తేమీ కాదు! తలుపులు తెరుచుకున్న రోదసీ నవలోకానికి బాన్ వాయేజ్!! -
అంతరిక్షయాత్ర విజయం: రూ.745 కోట్ల అవార్డు ప్రకటించిన బెజోస్
వాషింగ్టన్: జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. భూమ్మీద ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మామూలే. కానీ భూ ఉపరితలాన్ని దాటి.. మనకు పూర్తిగా పరిచయం లేని మరో లోకంలో విహరించాలంటే ఆసక్తి, అభిమానంతో పాటు ఎంతో ధైర్యం కావాలి. అంతరిక్ష యాత్ర ద్వారా బెజోస్ సాహసం చేశారనే చెప్పవచ్చు. అవును మరి అంతరిక్షంలోకి ప్రయాణించి.. క్షేమంగా భూమ్మిదకు చేరడం అంటే మాటలు కాదు. అందుకే తన అంతరిక్ష యాత్ర విజయానంతరం జెఫ్ బెజోస్ కీలక ప్రకటన చేశారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఓ భారీ అవార్డును ప్రకటించారు. ధైర్యం, పౌరసత్వం(కరేజ్ అండ్ సివిలిటీ) పేరుతో 100 మిలియన్ డాలర్ల (రూ. 7,46,09,40,000) అవార్డు ప్రకటించాడు. మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రజలను సమాయత్తం చేసే నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తొలి అవార్డు విన్నర్ ఎవరంటే.. బెజోస్ ప్రకటించిన కరేజ్ అండ్ సివిలిటీ అవార్డును తొలుత ఇద్దరికి ప్రదానం చేశారు. వీరిలో ఒకరు అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత వాన్ జోన్స్, మన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ఉన్నారు. వీరిద్దరికి 100 మిలియన్ డాలర్లు అందజేస్తారు. అంతరిక్ష యాత్ర విజయం అనంతరం జెఫ్ బెజోస్ మీడియాతో మాట్లాడారు. ‘‘అవార్డు గెలుచుకున్న వాన్ జోన్స్, జోస్ ఆండ్రెస్ ఈ అవార్డు ద్వారా లభించే మొత్తాన్ని ఏదైనా లాభాపేక్షలేని కార్యక్రమం కోసం కానీ.. చాలామందికి పంచడానికి కానీ వినియోగించవచ్చని’’ తెలిపారు. భవిష్యత్తులో చాలామందికి ఈ అవార్డును ప్రదానం చేస్తామన్నారు. ఎవరీ జోస్ ఆండ్రెస్.. స్సానిష్కు చెందిన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ప్రముఖ మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లాభాపేక్ష లేకుండా నిర్వహించే ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు జోన్ ఆండ్రెస్. 2010లో ప్రారంభించిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రపంచవ్యాప్తంగా పలు సహాయ సంస్థలతో కలిసి ప్రకృతి విపత్తుల బాధితులకు ఆహారం అందిస్తుంది. ప్రపంచ ఆకలిని తీర్చేందుకు వినూత్న ఆలోచనలను చేయడమే కాక.. స్థానిక చెఫ్‌లను వాటిలో భాగస్వామ్యం చేసేలా చేస్తుంది. వాన్ జోన్స్ ఎవరంటే.. వాన్ జోన్స్ ప్రముఖ టీవీ హోస్ట్, రచయిత, రాజకీయ విశ్లేషకుడు. అంతేకాక వాన్ జోన్స్ షో, సీఎన్ఎన్ రిడెమ్షన్ ప్రాజెక్ట్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ అథర్గా మూడు సార్లు నిలిచారు. 2009లో బరాక్ ఒబామాకు ప్రత్యేక సలహదారుగా పని చేశారు. క్రిమినల్ జస్టిస్ సంస్కర్తగా ప్రశంసలు పొందిన జోన్స్ అనేక లాభాపేక్షలేని సంస్థలను స్థాపించారు. వాటిలో ముఖ్యమైనది ది డ్రీమ్ కార్ప్స్. డ్రీమ్ కార్ప్స్ అనేది ఇంక్యుబేటర్, ఇది సమాజంలో "అత్యంత హాని కలిగించేవారిని ఉద్ధరించడానికి,శక్తివంతం చేయడానికి" తగిన ఆలోచనలు, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యులతో నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది. వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. -
జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయోగం విజయవంతం
-
జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయోగం విజయవంతం
జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైంది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది.వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. ఆలివర్ డేమెన్ రోదసీలోకి వెళ్లి వచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1961 లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టాక్ 2 మిషన్‌లో 25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవ్ అంతరిక్షానికి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా నిలిచి రికార్డు సృష్టించింది. న్యూ ఫెపర్డ్ నౌక భూమి నుంచి అంతరిక్షంగా భావించే ఖర్మాన్ లైన్‌ను దాటి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. న్యూ షెపర్డ్ నౌకకు ఉపయోగించిన రియూజబుల్ బూస్టర్ సురక్షితంగా లాంచింగ్ స్టేషన్లో చేరుకుంది. వ్యోమనౌక మ్యాడ్యుల్లో ప్రయాణిస్తున్న నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడే జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర
-
నేడే బెజోస్ అంతరిక్ష యాత్ర
వాషింగ్టన్: దిగ్గజ సంస్థ ‘ఆమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర నేడే జరగనుంది. 20 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెపర్డ్’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకువస్తుంది. బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్ అయిన 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏళ్ల యువకుడు ఆలీవర్ డీమన్ ఈ యాత్ర చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే మరో బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తన సొంత స్పేస్ క్రాఫ్ట్‌లో విజయవంతంగా అంతరిక్ష యాత్ర ముగించిన విషయం తెలిసిందే. పశ్చిమ టెక్సాస్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం బెజోస్ సహా నలుగురు తుది దశ సన్నాహాల్లో ఉన్నారు. భద్రత, సిమ్యులేషన్, భూ గురుత్వాకర్షణ పరిధి దాటిన తరువాత కేబిన్‌లో తేలియాడాల్సిన తీరు, రాకెట్ పనితీరు, అస్ట్రోనాట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర బాధ్యతలు.. తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఇది అందరూ సివిలియన్సే వెళ్తున్న పైలట్ రహిత అంతరిక్ష యాత్ర కావడం విశేషం. శిక్షణ పొందిన అస్ట్రోనాట్స్ ఎవరూ ఇందులో లేరు. స్పేస్ క్రాఫ్ట్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి ఎగురుతుంది. స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెఫర్డ్’ ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్ సంస్థ అస్ట్రోనాట్ సేల్స్ డైరెక్టర్ ఆరియన్ కార్నెల్ ప్రకటించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్ అలాన్ షెఫర్డ్ పేరును బ్లూ ఆరిజిన్ సంస్థ తమ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ తరహాలో దీనిని నిర్మించారు. అయితే, పరిసరాలను 360 డిగ్రీల కోణంలో చూసేలా క్య్రూ క్యాప్సూల్‌ను రూపొందించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ నిట్టనిలువగా టేకాఫ్ అవుతుంది. అలాగే, నిట్టనిలువుగానే ల్యాండ్ అవుతుంది. ఈ అంతరిక్ష యాత్రకు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. 82 ఏళ్ల వృద్ధ మహిళ, 18 ఏళ్ల పిన్న వయస్కుడు కలిసి చేస్తున్న యాత్ర ఇది. -
అంతరిక్ష యానం: నాసా వద్దంది.. బ్లూ ఆరిజన్ రమ్మంది!
న్యూయార్క్: ప్రస్తుతం ధనవంతుల అంతరిక్షల యాత్రల సీజన్ కొనసాగుతోంది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్‌తో బ్రాన్సన్ నింగిలోకి పయనించగా, త్వరలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయానానికి రెడీ అవుతున్నారు. ఈ రెండిటిలో భారతీయులు గర్వించే అంశం ఒకటి కామన్‌గా ఉంది. బ్రాన్సన్ ప్రయాణంలో భారత సంతతి వ్యక్తి శిరీష కీలకపాత్ర పోషించినట్లే, బెజోస్ యాత్రలో సైతం మరో భారతీయ యువతి కీలక పాత్ర పోషిస్తోంది. బెజోస్ రాకెట్ నిర్మాణ బృందంలో మరాఠా అమ్మాయి సంజల్ గవాండే(30) ముఖ్య భూమిక వహించింది. గతంలో ఆమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా పౌరసత్వ సమస్యలతో ఎంపిక కాలేదు. అనంతరం బ్లూ ఆరిజన్‌లో సిస్టమ్ ఇంజినీర్‌గా చేరి, ప్రస్తుతం బెజోస్ యాత్రలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని కళ్యాణ్. ఆమె తండ్రి మున్సిపల్ ఉద్యోగి. మహిళ మెకానికల్ ఇంజనీరా? ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మాస్టర్స్ చదివేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిక్ యూనివర్సిటీలో చేరారు. ఒక అమ్మాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంచుకోవడమేంటని గతంలో చాలామంది తనతో అన్నారని, కానీ ఆమె అందరి అనుమానాలు పటాపంచలు చేసి తాము గర్వపడేలా చేసిందని సంజల్ తండ్రి అశోక్ గవాండే ఆనందం వ్యక్తం చేశారు. అంతరిక్ష వ్యవహారాలపై ఆసక్తితో ఏరోస్పేస్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని సంజల్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. ఆ తర్వాత విస్కన్సిస్‌లోని మెర్క్యురీ మెరైన్ సంస్థలో, టయోటా రేసింగ్ డెవలప్మెంట్లో చేరారు. బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూషెపర్డ్ నౌక జూలై 20న అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. -
శిరీష సాహసం గర్వకారణం
సాక్షి, తెనాలి: ‘తాతా...డోంట్ ఫియర్...సక్సెస్‌ఫుల్‌గా తిరిగొస్తాను’ ..అని చెప్పిన మనుమరాలు అంతరిక్ష యానం పూర్తిచేసుకొని విజయవంతంగా తిరిగి రావటం ఎన లేని సంతోషాన్ని కలిగిస్తోందని రోదసీ యాత్ర చేసిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు సృష్టించిన బండ్ల శిరీష తాతయ్య రాపర్ల వెంకట నరసయ్య అన్నారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్టు నుంచి సాగిన అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని తోటి బంధువులతో కలిసి వీక్షించిన దగ్గర్నుంచీ, వెంకటనరసయ్య దంపతుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. మరుసటి రోజంతానూ బంధువులు, మిత్రులు, సన్నిహితుల అభినందనలు అందుకుంటూనే ఉన్నారు. సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ఈనెల ఆరో తేదీన మనుమరాలు శిరీష తనతో ఫోనులో మాట్లాడి, తమకు ధైర్యం చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లవరకు తన దగ్గర పెరిగిన శిరీష 1992లో అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిందన్నారు. తిరిగి తొమ్మిదేళ్ల వయసులో 1997లో తెనాలి వచ్చినపుడు పైలట్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు...‘నేను పైలెట్‌నై మిమ్మల్నిద్దర్నీ అమెరికా తీసుకెళతాను తాతయ్యా’ అని చెప్పిందన్నారు. కంటిచూపు కారణంగా అవకాశం మిస్సయినా, తగిన చదువులు చదివి, ప్రైవేటు రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుని ఈ స్థాయికి చేరుకుందన్నారు. 2016లో తమ 50వ వివాహ వార్షికోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిందనీ, మళ్లీ 2019లో వచ్చినపుడు తనకు కాబోయే భర్తను శిరీష పరిచయం చేసినట్టు వివరించారు. అంతరిక్ష యాత్ర ముగిశాక తన కుమార్తె, అల్లుడుతో మాట్లాడానని చెప్పారు. శిరీషతో మాట్లాడేందుకు వీలుపడలేదన్నారు. ఏదేమైనా స్త్రీలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరనీ తన మనుమరాలు సాహసయాత్రతో చాటటం గర్వకారణంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న తీరు, సాధించిన వైనం యువతకు స్ఫూర్తి కాగలదన్నారు. -
నమ్మశక్యం కాని అనుభవం
హ్యూస్టన్: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల పేర్కొన్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ–22 స్పేస్‌షిప్‌లో రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్పేష్‌షిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బండ్ల శిరీష తాతయ్య ఇంట సంబరాలు
తెనాలి: తెలుగువారి చరిత్రలో తొలిసారి అంతరిక్షయానం చేసి రికార్డు సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలి అమ్మాయి బండ్ల శిరీష విజయాన్ని ఆమె బంధువులు పండుగలా చేసుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఆరుగురు పాల్గొన్న విషయం తెలిసిందే. న్యూ మెక్సికో నుంచి ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమైన అంతరిక్షయాత్ర 90 నిమిషాల తర్వాత విజయవంతంగా తిరిగి అక్కడకే చేరుకుంది. తెనాలికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ బండ్ల పుల్లయ్య మునిమనుమరాలైన శిరీష తాతయ్య రాపర్ల వెంకటనరసయ్య, అమ్మమ్మ రమాదేవి ఇక్కడి బోసురోడ్డులోని అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. వీరితో పాటు బంధువులు రామకృష్ణబాబు కలిసి వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ చానళ్లలో చూశారు. చిన్ననాటి కలను నెరవేర్చుకుని రోదసీలోకి వెళ్లిన తమ మనుమరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకటనరసయ్య, రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు ఇక్కడికి వచ్చి శిరీష తాతయ్య, అమ్మమ్మలను సత్కరించి, స్వీట్లు తినిపించారు. -
రోదసిలో తెలుగు ఖ్యాతి
హ్యూస్టన్: వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. అంతరిక్ష పర్యాటకానికి బాటలు వేస్తూ సొంత స్పేస్‌షిప్‌లో రోదసిలోకి ప్రయాణించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో 71 ఏళ్ల బ్రాస్నన్‌తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు పాలుపంచుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన స్పేస్‌షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ–22’తో కూడిన ట్విన్ ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది. బ్రాన్సన్ భార్య, కుటుంబ సభ్యులతో సహా 500 మందికిపైగా జనం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్ ఇంజన్ ప్రజ్వరిల్లింది. బ్రాన్సన్తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్ ఆర్బిటాల్ టెస్టుఫ్టైట్ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు. అనంతరం స్పేస్‌షిప్ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. బెజోస్ కంటే ముందే.. రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్సన్ ట్వీట్ చేశారు. స్పేస్ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్ మస్క్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్ఎస్ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిరూపించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్ షిప్లో రోదసి యాత్ర చేపట్టనున్నారు. బెజోస్ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే బ్రాన్సన్ను ఈ యాత్రకు పురికొల్పినట్లు సమాచారం. బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకోవడం గమనార్హం. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్ బుక్ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్సన్ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్ గ్లెన్ రోదసి యాత్ర చేశారు.. శిరీష అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణం ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు సాక్షి, అమరావతి: గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన శిరీష రికార్డు ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్రలో తాను భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె జూలై 6న ట్వీట్ చేశారు. రోదసి యాత్రను ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో పని చేస్తుండడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు. శిరీష హ్యూస్టన్‌లో పెరిగారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గతంలో అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు. -
అంతరిక్షంలోకి పయనమైన తొలి తెలుగు మహిళ
-
శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
హూస్టన్: వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలో చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం 90 నిమిషాల పాటు సాగింది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్ చేశారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్ చేసింది. శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ అంతరిక్ష యాత్రను విజయవంతం చేసుకున్న శిరీషకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం రాష్ట్రానికి గర్వించదగ్గ క్షణమని సీఎం జగన్ పేర్కొన్నారు. Hon'ble CM Sri @ysjagan conveyed his best wishes to Guntur born aeronautical engineer Bandla Sirisha, flying on space flight Virgin Gailactic Unity 22. The CM said that it is a proud moment for the state and wished her good luck for the success of space mission. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 11, 2021 -
అంతరిక్షంలోకి తెలుగు అతివ
-
నేడే అంతరిక్షంలోకి తెలుగు అతివ
హూస్టన్: భారతీయ సంతతికి చెందిన బండ్ల శిరీష ఆదివారం అంతరిక్షయానానికి సిద్ధమైంది. అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన మూడో భారతీయ సంతతి మహిళగా శిరీష నిలుస్తుంది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో మరియు 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనుంది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీషట్వీట్ చేశారు. షిప్లో ఆమె రిసెర్చర్ ఎక్స్పీరియన్స్ బాధ్యతలు చేపట్టనుంది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్ గెలాక్టిక్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు. 2015లో వర్జిన్ గలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. ప్రస్తుతం కంపెనీ గవర్నమెంట్ ఎఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
అ‘పూర్వ’గౌరవం..అంతరిక్షానికి అతిథి
బండ్ల శిరీష అంతరిక్షంలోకి పయనమవగానే ఆ వెనకే మేరీ అనే మహిళ ఈ నెల 20 న స్పేస్ లోకి వెళుతున్నారు. జెఫ్ బెజోస్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ మేరీని గౌరవ అతిథిగా తమ తొలి వ్యోమనౌక లోకి ఎక్కిస్తోంది. 82 ఏళ్ల మేరీ అమెరికన్ పైలట్. ఆమె కెరీర్లో ఎన్నో ‘ఫస్ట్’ లు ఉన్నాయి. ఈ వయసులోనూ ఆమె భూమి మీద నడవడం కంటే ఆకాశంలో విహరించడమే ఎక్కువ! ఫ్లయిట్‌ని ఎలా నడపాలో ప్రైవేటు శిక్షణా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. తాజా స్పేస్ ట్రావెల్‌తో ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కురాలిగా (స్త్రీ పురుషులిద్దరిలో) రికార్డును సాధించినట్లవుతుంది. నేడు – జెఫ్ బెజోస్‌తో మేరీ ఫంక్ ఇరవై రెండేళ్ల వయసులో 1961లో ‘మెర్క్యురీ 13’ అనే ప్రైవేటు స్పేస్ ప్రాజెక్టుకోసం నాసా ఎంపిక చేసిన వ్యోమగామిగా శిక్షణను పూర్తి చేసుకున్నారు మేరీ వాలీ ఫంక్. కానీ ఇంతవరకు ఆమెకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశమే రాలేదు. బహుశా తనొక రికార్డును సృష్టించడం కోసమే ఆ విశ్వాంతరాళం ఆమెను ఇన్నేళ్లపాటు వేచి ఉండేలా చేసిందేమో! తన 82 వ యేట ఈ నెల ఇరవైన ఆమె ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్, ప్రస్తుతం ఈ భూమండలం మీదే అత్యంత సంపన్నుడు అయిన జెఫ్ బెజోస్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ గౌరవ అతిథిగా అంతరిక్షానికి రెక్కలు కట్టుకుంటున్నారు! ఆనాడు ‘మెర్క్యురీ 13’ పేరిట వ్యోమయానానికి శిక్షణ పొందిన పదమూడు మంది మహిళ ల్లో మేరీ ఒకరు. అయితే శిక్షణ పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయింది. ఆ గ్రూపులో ఒక్కరు కూడా అంతరిక్షంలోకి వెళ్లలేకపోవడమే కాదు.. ఒక బృందంగా కూడా ఏనాడూ వారు కలుసుకోలేదు. అప్పటి మెర్క్యురీ 13 ని గుర్తు చేస్తూ జెఫ్ బెజాస్.. ‘‘మళ్లీ ఇప్పుడు మేరీ వాలీ ఫంక్కి ఆ అవకాశం వచ్చింది. మా గౌరవ అతిథిగా మేము ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాం’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మేరీ ఫంక్ ఆమెరికన్ విమానయానానికి గుడ్‌విల్ అంబాసిడర్. అక్కడి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులో తొలి మహిళా ఎయిర్ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్. తొలి మహిళా ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ కూడా. అలాగే అమెరికా ‘ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ’ తొలి మహిళా ఇన్స్పెక్టర్. మేరీ ఫంక్ పైలట్‌గా ఇంతవరకు 19,600 గంటలు విమానాలను నడిపించారు. ఈ నెల అంతరిక్షంలోకి బయల్దేరుతున్న ‘బ్లూ ఆరిజన్’ వ్యోమ నౌక ‘న్యూ షెప్పర్డ్ క్యాప్సూల్’ లో మేరీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చినట్లయితే 72 ఏళ్ల వయసులో వ్యోమయానం చేసిన దివంగత వ్యోమగామి జాన్ గ్లెన్ రికార్డును ఆమె బ్రేక్ చేసినట్లు అవుతుంది. న్యూ షెప్పర లో మేరీతో పాటు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు కూడా ఉంటారు. -
అంతరిక్షంలో తెలుగు ధీర
అంతరిక్షం అచ్చ తెలుగులో ‘నమస్కారం’ అనే పలకరింపు విననుంది. కోట్లాదిమంది తెలుగువారి చారిత్రక, జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు అది విస్మయపు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపు గుచ్చి ఉంటారు. ఇవాళ పై నుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్ చెప్పనుంది. అవును. చరిత్రలో తొలిసారిగా తెలుగు ధీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది. అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సామాన్యుల ఊహకు అందేది కాదు. శ్రీమంతులు అందుకోగల ఆలోచనా కాదు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ జాబితాలో ‘కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్’ ద్వారా ఇటీవల అత్యంత సంపన్నులు చేరుతున్నారు. టెస్లా సి.ఇ.ఓ ఎలాన్ మస్క్ నుంచి అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరకూ అంతరిక్షం అంచులు తాకాలనువారు ఈ రేస్‌లో ఉన్నారు. అటువంటిది– ఈ అద్భుత ప్రయాణం చేసే అవకాశం మన తెలుగింటి అమ్మాయి బండ్ల శిరీషకు దక్కింది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశం. తెలుగువారి చరిత్రలో తొలి అంతరిక్ష యానం చేసిన వ్యక్తిగా/మహిళగా బండ్ల శిరీష ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి మరో తొమ్మిదిరోజుల్లో శిరీష రోదసిలో అడుగుపెట్టబోతోంది. చీరాలలో పుట్టింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాపర్ల వెంకట నరసయ్య, రమాదేవిల కుమార్తె అనూరాధ సంతానం శిరీష. అనురాధ భర్త డాక్టర్ బండ్ల మురళీధర్ ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ప్లాంట్ వైరాలజీలో పీహెచ్డీ చేసి అమెరికాలో స్థిరపడడంతో చీరాలలో పుట్టిన శిరీష నాలుగేళ్ల వయసులో తన అక్క ప్రత్యూషతో అమెరికా వెళ్లింది. శిరీష విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి స్పేస్సైన్స్ను అమితంగా ఇష్టపడే శిరీష పర్డ్యూ యూనివర్సిటిలో ఏరోనాటికల్ అండ్ అస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యాక కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ ఫెడరేషన్ (సీఎస్ఎఫ్)లో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది. మరోపక్క జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.‡ఈ క్రమంలోనే 2015లో రిచర్డ్ బాన్సన్ ‘స్పేస్‌ఫ్లైట్’ సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరిన అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్‌ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తో్తన్న వర్జిన్ ఆర్బిట్ వ్యహారాలను చూస్తూ, మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉంది. ఫలితంగా ఆమెకు అంతరిక్షయానం అవకాశం దక్కింది. బ్రాన్సన్తో కలిసి వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించనున్న నాలుగో స్పేస్ ట్రిప్పులో వర్జిన్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తనతో కలిపి మొత్తం ఆరుగురు టీమ్‌తో పాల్గొననున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. శిరీష ఈ స్పేస్ స్పెషలిస్టుల్లో ఉంది. ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వీరి స్పేస్‌క్రాఫ్ట్ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్, స్పేస్‌లో అడుగుపెట్టిన తొట్టతొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్‌లో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగానూ, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో వ్యోమగామిగా శిరీష నిలవడమే గాక ఈ మిషన్‌లో వెన్నెముకగా పనిచేయనుంది. ఈ క్రూ టీమ్‌లో శిరీషతోపాటు బెత్ మోసెస్ అనే మరో మహిళ కూడా ఉన్నారు. నా మనసంతా అంతరిక్షమే ‘‘నేను చిన్నప్పటి నుంచి వ్యోమగామి అయి అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకునేదాన్ని. ఎప్పుడూ అందుకు సంబంధించిన ఆలోచనలతో నా మనసు నిండిపోయి ఉండేది. హ్యూస్టన్‌లో మా ఇంటికి దగ్గర్లో జాన్సన్ స్పేస్ సెంటర్ ఉండేది. ఆ సెంటర్‌ను సందర్శించినప్పుడల్లా నా కోరిక మరింత బలపడేది. ముందు పైలట్ అవ్వాలి ఆ తర్వాత నాసాలో వ్యోమగామి అవ్వాలి అనుకుని ఆ దిశగా అడుగులు వేద్దామనుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడే నా కంటి చూపు సరిగా ఉండేది కాదు. దీంతో పైలట్టే కాదు ... ఆస్ట్రోనాట్ కూడా కాలేను అనుకున్నాను. అయితే 2004లో తొలి ప్రైవేటు వాహనం అంతరిక్షంలోకి వెళ్లిందని తెలిసి నాసా ద్వారానే కాదు వ్యోమగామి అయ్యేందుకు మరో మార్గం ఉందనిపించింది. దీంతో అప్పుడు ఏరో స్పేస్ ఇంజినీర్ అయ్యి వాణిజ్య స్పేస్ సెక్టార్లో పని చేయవచ్చని అనుకున్నాను. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు మైక్రో గ్రావిటీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నేను సీఎస్‌ఎఫ్‌లో చేసిన ఉద్యోగానుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చిన్ననాటి కల ఈరోజు తీరనున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ శిరీష గతంల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాతయ్య మాట ‘శిరీషకు ఊహ తెలిసినప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేది. వయసుతోపాటు, ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. నాలుగేళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో కరెంటు పోతే ఒంటరిగా భయపడుతోన్న అమ్మమ్మకు ధైర్యం చెప్పింది’ అని తాతయ్య నరసయ్య సాక్షితో చెప్పారు. ‘2016లో మా వివాహ స్వర్ణోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి శిరీష ఇక్కడకు వచ్చింది. చదువు, ఉద్యోగంతో ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోనులో మా యోగక్షేమాలు తెలుసుకునేది. చిన్నపిల్లగానే మాకు తెలిసిన శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లనుందని చెబుతుంటే ఆశ్చర్యంగా, అంతకుమించిన సంతోషంగా ఉంది’ అన్నారు. – పి.విజయ, సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి -
జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం..! ఏకంగా తన సోదరుడితో కలిసి..
వాషింగ్టన్: మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి కంపెనీలు ప్రయత్నాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. అంతేకాకుండా అంగారక గ్రహంపైకి మానవులను పంపాలనే దృఢ సంకల్పంతో ఎలన్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఇప్పటికే అంతరిక్షనౌక ప్రయోగాల దృష్టిసారించింది. కాగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ సంస్థ కీలక ఘట్టానికి చేరుకుంది. బ్లూ ఆరిజిన్ తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సిద్థమైంది. బ్లూ ఆరిజిన్ ప్రయోగించే మానవ సహిత అంతరిక్ష ప్రయోగంలో ఆస్ట్రోనాట్స్‌తో పాటుగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రయాణించనున్నాడు. జెఫ్ బెజోస్ అతని సోదరుడు మార్క్ బెజోస్‌తో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ జెఫ్ బెజోస్ భావోద్వేగానికి గురైయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ అంతరిక్షంలో ప్రయాణించాలనే నా కల ఈ జూలై 20 న నెరవెరబోతుంది. ఈ ప్రయాణాన్ని నా సోదరుడుతో కలిసి పాలుపంచుకుంటున్నాను. అంతేకాకుండా అంతరిక్షం నుంచి భూమిని చూస్తే మనం మారిపోతాము. భూ గ్రహంతో ఉన్నఅనుబంధం కూడా మారిపోతుంద’ని వీడియోలో తెలిపాడు. బ్లూ ఆరిజిన్ తొలి అంతరిక్ష యాత్ర అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎరోస్పేస్ సంస్థను 2000 సంవత్సరంలో నెలకొల్పాడు. బ్లూ ఆరిజిన్ తొలి అంతరిక్ష నౌకకు ‘న్యూ షెపార్డ్ ’గా నామకరణం చేశారు. ఈ అంతరిక్ష యాత్రను జూలై 20 న ప్రయోగించనున్నారు. ప్రస్తుతం ఈ అంతరిక్ష యాత్రలో నౌక సిబ్బంది, బెజోస్ బ్రదర్స్‌తో పాటుగా.. ఈ ప్రయాణం కోసం అత్యధికంగా బిడ్ చేసిన వారు ప్రయాణిస్తారు. కాగా అందుకు సంబంధించిన వేలాన్ని మే 5 నుంచి ఆన్లైన్లో బ్లూ ఆరిజిన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ వేలం జూన్ 10 వరకు లైవ్‌లో ఉండనుంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ ప్రయాణం కోసం సుమారు 21 కోట్ల అత్యధిక బిడ్‌ను వేశారు. కాగా ఈ ప్రయోగం కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) -
అంతరిక్ష ప్రయాణం
రిస్క్ తీసుకోవడం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కి మహా సరదా. తన సినిమాలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తారు. అవసరమైతే ప్రయాణిస్తున్న విమానం మీద నిల్చుంటారు. ఎల్తైన కట్టడం బూర్జ్ ఖలీఫా మీద ఫైటింగ్స్ చేస్తారు. తాజాగా ఓ సినిమా చిత్రీకరణను ఏకంగా అంతరిక్షంలోనే చేయాలనుకుంటున్నారు. దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్‌తో యూనివర్శల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందుకోసం అక్టోబర్ 2021లో అంతరిక్ష యానం చేయనున్నారు టామ్ క్రూజ్. ఈ చిత్రదర్శకుడు డౌగ్ లిమన్తో కలసి ఈ ప్రయాణం చేయనున్నారు టామ్. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
అంతరిక్షానికి ప్రయాణం
అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాబోతున్నారు ఫర్హాన్ అక్తర్. వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని చుట్టేయాలనుకుంటున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కెమెరామేన్ మహేష్ మతై ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. త్వరలోనే రష్యాలో ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించనున్నారని సమాచారం. ఈ బయోపిక్ లో రాకేష్ శర్మ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే వార్తల్లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సుశాంత్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు గతంలో తెర మీదకు వచ్చాయి. చివరికి ఫర్హాన్ అక్తర్ ఈ పాత్రలో నటించనున్నారు. -
రష్యాతో భారత్ ‘గగన్‌యాన్’ ఒప్పందం!
న్యూఢిల్లీ: ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ప్రాజెక్టుకు సంబంధించి రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించి ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్.. తాజాగా రష్యాతో చేతులు కలపనుందని సమాచారం. వచ్చే నెలలో రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒప్పందం జరగవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. రష్యా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థ గ్లోనాస్, భారత్ జీపీఎస్ వ్యవస్థ నావిక్లకు సంబంధించి గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంపై కూడా చర్చలు జరగవచ్చు. -
2021 డిసెంబర్లో గగన్‌యాన్
సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్ సిస్టమ్స్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్ పేర్కొన్నారు. 2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్‌ప్యాడ్ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్ సమాధానమిచ్చారు. -
ముగ్గురితో ‘గగన్‌యాన్’
న్యూఢిల్లీ: భారత్ చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్ష యాత్రలో ముగ్గురు వ్యోమగాములను నింగిలోకి పంపిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. వారు 5–7 రోజుల పాటు అంతరిక్షయానం చేసిన తరువాత భూమి మీద తిరిగి అడుగుపెడతారని తెలిపారు. భారతీయుడిని అంతరిక్షంలోకి మోసుకెళ్లే ‘గగన్‌యాన్’ మిషన్‌ను 2022 నాటికి చేపడతామని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. గగన్‌యాన్ సన్నద్ధత, ప్రయోగానికి సంబంధించిన ఇతర వివరాలను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో కలసి ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం మీడియాకు వివరించారు. 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి సుమారు 6 నెలల ముందే ఈ మిషన్ చేపడతామని తెలిపారు. లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుందని వెల్లడించారు. అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమికి తిరుగుపయనమైన వ్యోమగాములు గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో లేదా బంగాళాఖాతంలో లేదా నేరుగా నేల మీదనైనా దిగుతారని చెప్పారు. వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ భూ ఉపరితలానికి 120 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు 36 నిమిషాల్లోనే నేలకు చేరుకుంటుం దన్నారు. ఇది సఫలమైతే మానవ సహిత వాహకనౌకలను అంతరిక్షంలోకి పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నాలుగో దేశంగా నిలుస్తుంది. మోసుకెళ్లేది జీఎస్ఎల్వీ మార్క్–3 గగన్‌యాన్‌కు జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌకను సిద్ధం చేస్తున్నట్లు శివన్ తెలిపారు. భూమి నుంచి సుమారు 300–400 కి.మీ. ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ఈ వాహకనౌకను చేరుస్తామని చెప్పారు. ఈ ప్రయోగానికి మొత్తం వ్యయం రూ.10 వేల కోట్ల కన్నా తక్కువే అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌లో సుమారు 7 టన్నుల బరువైన క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్‌లు ఉంటాయని, అందులో క్రూ మాడ్యూల్ పరిమాణం 3.7్ఠ7 మీటర్లు అని చెప్పారు. వ్యోమగాములు అంతరిక్షంలో ‘మైక్రో గ్రావిటీ’పై ప్రయో గాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఇస్రో, వైమానిక దళం సంయుక్తంగా ఎంపికచేసి, రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ నుంచి ఇస్రో సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఆయన 1984లో రష్యా ప్రయోగించిన సోయుజ్ టి–11 వాహకనౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించారు. జనవరిలో చంద్రయాన్–2 చంద్రయాన్–2 ప్రయోగాన్ని వచ్చే జనవరిలో చేపడతామని శివన్ చెప్పారు. ఈ ప్రాజెక్టును సమీక్షించిన నిపుణులు.. రోవర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, తిరిగి భూమి మీదికి తీసుకురావడంపై కొన్ని సూచనలు చేశారన్నారు. ఇస్రో చేసిన ప్రయోగాల్లో చంద్రయాన్–2 అత్యంత క్లిష్టమైందని, దీన్ని విజయవంతం చేయడానికే నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలా చేసిన మార్పుల వల్ల మిషన్ బరువు పెరిగిందని తెలిపారు. -
తొలి ‘వాణిజ్య యాత్ర’లో సునీతా
హూస్టన్: అమెరికా 2019లో చేపట్టనున్న తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాముల బృందంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు. మరో 8 మంది వ్యోమగాములతో కలసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘బోయింగ్’ సంస్థ తయారుచేసిన బోయింగ్ సీఎస్టీ–100, స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా ఈ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా పంపనుంది. 2011లో స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిపోవడంతో అమెరికా భూభాగం నుంచి ఇప్పటివరకూ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపలేదు. తమ సహకారంతో బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆధునిక అంతరిక్ష నౌకల సహాయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని నాసా తెలిపింది. సునీతా, మరో వ్యోమగామి జోష్ కస్సాడాతో కలసి స్టార్ లైనర్ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రంపై అడుగుపెడతారని పేర్కొంది. గతంలో అంతరిక్షంలో 321 రోజులపాటు గడిపిన సునీతా తిరిగి 2012లో భూమిపై అడుగుపెట్టారు. ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్‌క్యాప్సూల్ మిషన్‌లో వ్యోమగాములు రాబర్ట్ బెహ్న్‌కెన్, డగ్లస్ హర్లీ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. అయితే, వీరి ప్రయాణం కంటే ముందుగా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రెండు సంస్థలు తమ నౌకల్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. -
వివరం: 2050లో... ఆకాశమే హైవే!
క్రీస్తుశకం 2050. న్యూయార్క్‌లో ఓ రహదారి. విలాసవంతమైన కార్లు వరుసగా దూసుకెళుతున్నాయి. ఒక్కరూ స్టీరింగ్ పట్టుకుని తిప్పడం లేదు. అయినా కార్లు చక్కగా పరుగులు పెడుతున్నాయి! లండన్‌లో ఓ కేబుల్ కార్ స్టేషన్. ఓ అంధుడు వచ్చి ‘జేమ్స్ స్ట్రీట్’ అన్నాడు. కారు అతడిని ఎక్కించుకుని చిటికెలో అక్కడికి చేర్చేసింది! ఢిల్లీలో ఓ బహుళ అంతస్తుల భవనం. గాలిలోంచి ఎగురుకుంటూ వచ్చి ఓ ఫ్లాట్ ముందు ద్రోన్ వాలింది. పిజ్జా డెలివరీ చేసి వెళ్లిపోయింది! ఈసారి ముంబై. ఆకాశంలో డజన్ల కొద్దీ ఫ్లయింగ్ కార్లు. ఓ పద్ధతి పకారం అటూఇటూ ఎగురుతున్నాయి. యాక్సిడెంట్లు, శబ్దాలు లేకుండానే రివ్వున గమ్యస్థానాలకు చేరిపోయాయి! ప్రస్తుతానికి ఇవన్నీ ఊహలే. కానీ 2050 నాటికి నిజం కాబోతున్నాయి. అవును. ఇవి మాత్రమే కాదు.. ‘చుక్కల మధ్య నిద్రించండి’ అంటూ కంపెనీలు పర్యాటక ప్యాకేజీలు ప్రకటిస్తాయి. అంతరిక్ష యాత్రికుల కోసం రోదసిలో హోటళ్లు వెలుస్తాయి. ఏటా లక్షలాది మంది చంద్రుడిని పలకరించి వస్తారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికాకు వెళ్లాలి, అమరనాథ్ యాత్రకు వెళ్లాలి, అక్కడికి వెళ్లాలి, ఇక్కడికి వెళ్లాలి అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్లే.. భవిష్యత్తులో ఒక్కసారైనా చంద్రుడిని సందర్శించాలి, రోదసిలో చక్కర్లు కొట్టి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు! ముందుంది.. కొత్త సాంకేతిక లోకం మోటారు వాహనాన్ని మొట్టమొదట చూసి కేరింతలు కొట్టిన మనిషి.. గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి విస్తుపోయాడు. తెరపై కదిలే బొమ్మల్ని చూసి ఔరా! అని ముక్కున వేలేస్కున్నాడు. అసలు దూరంగా ఉన్న మనుషులతో తీగల ద్వారా మాట్లాడవచ్చన్న ఊహే ఉండేది కాదు. చందమామపై కాలుమోపుతారనీ అనుకోలేదు. కానీ అన్నీ సాధ్యమయ్యాయి. సాధారణ సంగతులు అయిపోయాయి. శాస్త్ర, సాంకేతిక రంగంలో శతాబ్దాల కృషి వల్లే ఇదంతా సాకారం అయింది. అయితే ఈ సాంకేతిక విప్లవం మరింత వేగం పుంజుకుంది. రోజుకో ప్రతిపాదన. వారానికో ఆవిష్కరణ. మనిషి జీవితం మరింత సుఖప్రదం చేసుకునేందుకు, మానవ కల్యాణం కోసం విశ్వ రహస్యాల అన్వేషణకు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక యజ్ఞాలు ఊపందుకున్నాయి. వీటిలో కొన్ని సఫలమవ్వొచ్చు. మరికొన్ని విఫలమవ్వొచ్చు. కానీ.. గతంలోంచి వర్తమానం మీదుగా భవిష్యత్తులోకి చూస్తే మాత్రం.. మనిషి భవిత దేదీప్యమానం అవుతుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. మరో మూడు దశాబ్దాల్లోనే ఈ లోకం అడుగడుగునా సాంకేతిక మాయతో నిండిపోతుందని అంటున్నారు. స్టీరింగ్ పట్టాల్సిన పనే లేదు! మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా నడిచే కార్లను మరో దశాబ్దంలోపే మార్కెట్లోకి విడుదల చేసేందుకు కార్ల తయారీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. స్టీరింగ్ పట్టుకోవాల్సిన పని లేకపోవడమే కాదు.. పార్కింగ్, గేర్లు మార్చడం, బ్రేకులు వేయడం వంటివీ కార్లే ఆటోమేటిక్‌గా చేసుకుంటాయని మిల్కెన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అంటున్నారు. 2035 నాటికే ఈ కార్ల్లు మార్కెట్లోకి వస్తాయని చెబుతున్నారు. మనిషి పరధ్యానం, తొందరపాటుతో చేసే తప్పులను డ్రైవర్‌లెస్ కార్లు చేయవనీ, అందువల్ల 90 శాతం కారు ప్రమాదాలు తగ్గిపోతాయనీ వారు అంటున్నారు. వైర్లెస్ కరెంటు! ఇంట్లో పైకప్పుకు ఓ బాక్స్‌ను అమర్చుకుంటే చాలు.. గదిలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ వైర్లెస్ కరెంట్ సరఫరా అవుతుంది. చిన్నపెట్టెలో అమర్చే అయస్కాంతపు చుట్టకు మెయిన్ నుంచి విద్యుత్ అందుతుంది. అక్కడి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమై ల్యాప్‌టాప్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే అయస్కాంత చుట్టలను చేరతాయి. అంటే.. మనుషులకు షాక్ కొట్టకుండానే కరెంటు అందుతుందన్నమాట. 2020 నాటికే ఈ టెక్నాలజీ వాడకంలోకి వస్తుందట. వైర్లెస్ విద్యుత్ వల్ల ఆఫీసుల్లో కేబుల్స్, ఇతర పరికరాల అవసరమూ తగ్గిపోతుంది. ఫ్లయింగ్ కార్లు, ద్రోన్లదే హవా ఆకాశంలో పక్షుల్లా, రకరకాల రూపాల్లో విహరిస్తూ వాలిపోయే ద్రోన్ల వాడకం ఇప్పటికే మొదలైంది. ఒకప్పుడు అమెరికా సేనలు అఫ్తాన్‌లో తాలిబన్లపై బాంబులు కురిపించేందుకు, నిఘాకు ఉపయోగపడిన మానవరహిత గగన వాహనాలు (యూఏవీలు).. క్రమంగా సైజు కుదించుకుని సాధారణ ప్రజలకూ ఉపయోగపడే ద్రోన్లుగా సిద్ధమయ్యాయి. పెళ్లిళ్లు, బహిరంగ సభల్లో వీడియోల చిత్రీకరణకు ద్రోన్లను ఉపయోగించడం ఇప్పుడిప్పుడే మొదలైంది. కొరియర్లు, మందుల పార్శిళ్లు, పిజ్జాలు అందించేందుకు ప్రయోగాలూ జరిగాయి. ప్రస్తుత ద్రోన్ టెక్నాలజీయే సమీప భవిష్యత్తులో ఫ్లయింగ్ కార్ల శకానికీ నాంది పలకనుంది. రోడ్డుపై కారులా నడుపుకుంటూ వెళ్లి, అవసరమైనప్పుడు విమానంలా గాలిలో ఎగురుకుంటూ వెళ్లే రోజు త్వరలోనే వస్తుంది. భవిష్యత్తులో మహానగరాలపై ఆకాశంలో ఎటుచూసినా ఫ్లయింగ్ కార్లే కనిపించడం సాధారణమే కావొచ్చు. రోబోలూ జీవిత భాగస్వాములే! భవిష్యత్తు రోబోలు మేధోపరంగానూ మనుషులకు దీటుగా పనిచేస్తాయని అంటున్నారు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు. నిత్యజీవితంలోకి రోబోల రాకతో మనుషుల జీవనశైలి కూడా మారిపోతుందని, దినచర్యలు, సామాజిక, వినోద కార్యక్రమాలు కూడా ప్రత్యేక దారిపడతాయని అంటున్నారు. అలాగే రోబోలు మనుషులకు కొత్త నేస్తాలుగా మారతాయి. మాట్లాడతాయి. చమత్కారాలు చేస్తాయి. ఆడతాయి. పాడతాయి. ఫ్యాక్టరీల్లో కార్మికులవుతాయి. ఇంట్లో పనిమనుషులవుతాయి. రోబో పిల్లులు, రోబో కుక్కలూ వస్తాయి. యుద్ధాల్లో సైతం కిల్లర్ రోబోల రూపంలో విరుచుకుపడతాయి. అంతరిక్షంలో పరిశోధనలకు సాయం చేస్తాయి. చంద్రుడు, మార్స్‌పై కాలనీల నిర్మాణాలకు కూలీలూ అవుతాయి. చివరికి జీవిత భాగస్వాములు కూడా అవుతాయి. అంటే ‘అన్ని’రకాలుగా భార్య లేదా భర్తలా మసలుకుంటాయి! ఆలోచిస్తే.. పనైపోద్ది! 1970లలో ల్యాండ్లైన్లు రాజ్యమేలాయి. 20 ఏళ్లు తిరిగేసరికి మొబైల్ఫోన్ల రాజ్యం వచ్చేసింది. సెల్ఫోన్లు రోజుకో రూపంలోకి మారిపోతున్నాయి. సైజును కుదించుకుంటూ నాజూగ్గా తయారవుతున్నాయి. సమీప భవిష్యత్తులో గ్రాఫీన్ ఫోన్లు వస్తాయి. కిందపడితే పగలవు. నీటిలో పడితే నానవు. కాగితంలా ఎలాపడితే అలా మడతపెట్టుకోవచ్చు కూడా. కానీ.. సెల్ఫోన్ల పరిణామం అంతటితో ఆగుతుందా? ఆ తర్వాత ఎలా మారతాయి? అంటే.. 2020 నాటికి అందుబాటులోకి వచ్చే 5జీ సేవలతో సెల్ఫోన్ల రూపురేఖలు వేగంగా మారిపోతాయి. మెదడులో అమర్చే ఎలక్ట్రోడ్లు, సెన్సర్లు, తలపై పెట్టుకునే చిన్న హెడ్సెట్ లేదా గూగుల్ గ్లాస్ వంటివే సెల్ఫోన్లు చేసే పనులు చేస్తాయి. మరో 40 ఏళ్లలో ప్రారంభమయ్యే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ.. తర్వాత ఎన్నెన్నో వింతలు చేస్తుంది. ఎవరికైనా సందేశం లేదా ఈ-మెయిల్ చేయాలంటే ఆలోచిస్తే చాలు.. కళ్లముందు అద్దంపై అక్షరాలు ప్రత్యక్షమైపోతాయి. ఫోన్‌కాల్స్ చేయాలన్నా.. అనుకున్నదే తడవుగా అవతలివారితో కనెక్షన్ ఏర్పడిపోతుంది. పసిమొగ్గలు వికసిస్తాయి యూనిసెఫ్ గణాంకాల ప్రకారం... 1990-2012 మధ్య కాలంలో పుడమిపై జన్మించిన ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కనీసం 90 మంది చనిపోయారు. కానీ 2013 నాటికి పరిస్థితి మారింది. ప్రతి వెయ్యిమందిలోనూ మృత్యువాత పడుతున్న శిశువుల సంఖ్య 48కి తగ్గింది. అయితే నిపుణుల అంచనా ప్రకారం.. 2050 నాటికి ప్రతి వెయ్యిమందిలో 31 మంది మాత్రమే మరణిస్తారు. అంటే శిశుమరణాలు గణనీయంగా తగ్గిపోతాయి. హెచ్ఐవీని తల్లి నుంచి బిడ్డకు సోకకుండా చేయడం, ఇంకా అనేక వ్యాధులకు టీకాలు అందుబాటులోకి రావడం, సూక్ష్మపోషకాలను అందించి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడటం వంటి చర్యల వల్ల ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు బాగా తగ్గిపోతాయి. ఎయిడ్స్, మలేరియా పారిపోతాయి ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందిని బలితీసుకుంటున్న హెచ్ఐవీ మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునే టీకాను మరో 20 ఏళ్లలోగా ఆవిష్కరిస్తామని పరిశోధకులు ధీమాగా చెబుతున్నారు. అలాగే మెనింజైటిస్ వంటి వ్యాధులకు టీకాలు, కేన్సర్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, ల్యుకేమియాలకు సమర్థమైన మందులూ అందుబాటులోకొస్తాయి. వీటితోపాటు దోమలను జన్యుమార్పిడి చేయడం ద్వారా మలేరియాను ఈ భూగోళం నుంచే తరిమేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. శరీరంలో ప్రయాణిస్తూ కేన్సర్‌ను హతమార్చే నానోపార్టికల్స్‌ను తయారు చేయడం, రోగనిరోధక వ్యవస్థే నేరుగా కేన్సర్ కణాల భరతం పట్టేలా శిక్షణనిచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిటికెలో ఎమ్మారై స్కానింగ్! ఇప్పుడు ఎమ్మారై తీయాలంటే పెద్ద యంత్రంలో గంటపాటు కదలకుండా పడుకోవాల్సిందే. పైగా టుక్టుక్టుక్ అంటూ భీకరంగా శబ్దాలు. భయస్తులైతే వణికిపోవాల్సిందే. కానీ 2050 నాటికి కెమెరాతో ఫొటో తీసినంత సులభంగా పనైపోతుందట. చేతితో ఆపరేట్ చేసేంత చిన్నసైజుకు ఎమ్మారై స్కానర్లు కుంచించుకుపోతాయట. చిన్నచిన్న అయస్కాంత క్షేత్రాలను సైతం పసిగట్టగలిగేలా సూపర్సెన్సిటివ్ అటామిక్ మ్యాగ్నెటోమీటర్లతో ఇవి పనిచేస్తాయట. భవిష్యత్తు మైలురాళ్లు! 2020: చీకటిలో మెరిసే హైవేలు సాధారణం అవుతాయి. 2020: ‘5జీ టెక్నాలజీ’ సేవలు ప్రారంభమవుతాయి. 2020: అమెరికా గగనతలంపై 30 వేల ద్రోన్లు గస్తీ కాస్తాయి. 2020: వీడియోగేమ్‌లు, గ్రాఫిక్స్ స్పష్టంగా రియలిస్టిక్ ఫొటోల్లా ఉంటాయి 2030: ఫ్లయింగ్ కార్లు మార్కెట్లోకి వస్తాయి. 2032: భారత్ జనాభా చైనాను దాటి 150 కోట్లకు చేరుతుంది 2033: మానవ సహిత అంగారక యాత్ర ప్రారంభమవుతుంది. 2035: చంద్రుడిపై స్థావరాల ఏర్పాటు, అంతరిక్ష పర్యాటకానికి నాంది. 2050: అంతరిక్షం నుంచి భూమికి విద్యుత్ సరఫరా అవుతుంది. 2050: భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుంది 2050: ప్రపంచ జనాభా 930 కోట్లకు చేరుతుంది. 2030: ప్రపంచంలో దాదాపు అందరూ అక్షరాస్యులు అవుతారు. 2050: 800 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వాడతారు 2050: మనుషుల ఆయుర్దాయం 150 ఏళ్లకు పెరుగుతుంది 2059: కొన్ని వారాల ప్రయాణంతోనే అరుణగ్రహంపై వాలిపోవచ్చు. భవిష్యత్తు ఉద్యోగాలు ఇలా... అల్టర్నేటివ్ వెహికల్ డెవలపర్ (పర్యావరణ హిత వాహనాలు తయారుచేస్తారు) బాడీ పార్ట్ మేకర్ (శరీర అవయవాలను ఉత్పత్తి చేస్తారు) కై ్లమేట్ చేంజ్ రివ ర్సల్ స్పెషలిస్ట్ (వాతావరణ మార్పు ప్రభావాలు తగ్గిస్తారు) మెమరీ ఆగ్మెంటేషన్ సర్జన్ (జ్ఞాపకశక్తి పెంచే శస్త్రచికిత్సలు చేస్తారు) న్యూ సైన్స్ ఎథిసిస్ట్ (శాస్త్రీయ పరిశోధనలు, నైతిక విలువలపై సలహాలిస్తారు) స్పేస్ పైలట్/ఆర్బిటల్ టూర్ గైడ్ (అంతరిక్ష విమానాలు నడుపుతారు) వర్చువల్ లాయర్ (ఆన్లైన్లో న్యాయ సేవలు అందిస్తారు) వర్చువల్ టీచర్ (ఆన్లైన్లో బోధిస్తారు) వేస్ట్ డాటా హ్యాండ్లర్ (పేరుకుపోయిన కంప్యూటర్ డాటాను భద్రం చేస్తారు) ఏ దేశం వెళ్లినా.. ఒకే భాష స్టార్‌ట్రెక్ సినిమాలో మాదిరిగా.. ప్రపంచంలో ఏ భాషనైనా మనకు తెలియకుండానే మాట్లాడొచ్చు. జస్ట్ మనకు తెలిసిన భాషలో మాట్లాడితే చాలు.. అవతలివారికి వారి భాషలో మన మాటలను చెప్పడం, వారి మాటలను మన భాషలోకి అనువదించి చెప్పడం చేసే యూనివర్సల్ ట్రాన్స్‌లేటర్ తయారు కానుంది. ఈ పరికరంతోపాటు ఓ కళ్లజోడు లేదా మొబైల్ యాప్‌ను వాడటం ద్వారానే.. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భాషను అనర్ఘళంగా మాట్లాడేయొచ్చు. పురుషులకూ గర్భనిరోధక మాత్రలు! ఇప్పటిదాకా స్త్రీలకే గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి. 2021 నాటికి పురుషులకూ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వస్తాయట. తక్కువ శుక్రకణాలు, సరిగ్గా ఈదలేని శుక్రకణాలుండే వీర్యం ఉత్పత్తి అయ్యేలా చేసే మందులతో ఈ మాత్రలు తయారు చేస్తారు. అవసరమైనప్పుడు వాటిని ఆపేస్తే.. తిరిగి యథావిథిగా సంతానం పొందొచ్చు. పురుషులకు గర్భనిరోధక మాత్రలుగా హర్మోన్ మందులు ఇదివరకే వచ్చినా.. వాటివల్ల హానికర ఫలితాలు రావడంతో నిషేధించారు. స్వలింగ సంపర్కులకూ సంతానభాగ్యం! 1978లో మొదలైన కత్రిమ గర్భధారణ పద్ధతి(ఐవీఎఫ్) వచ్చే 35 ఏళ్లలో కొత్త పుంతలు తొక్కనుందనీ, అండాలు, వీర్యకణాలను సైతం మూలకణాలతో తయారు చేసేందుకు వీలుకానుందనీ ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్విట్రో గామిటోజెనిసిస్ (ఐవీజీ) అనే ఈ కొత్త సాంకేతికత వల్ల గేలు, లెస్బియన్లు సైతం త మ మూలకణాలతో అండాలు, శుక్రకణాలను తయారు చేయించుకుని, అద్దెగర్భం(సరోగేట్) పద్ధతిలో సొంత బిడ్డలను కనేందుకూ వీలు కానుందట. అవయవాలను ముద్రించుకోవచ్చు! రోగుల మూలకణాలతోనే వారికి కావలిసిన అవయవాలను ప్రయోగశాలలో తయారు చే స్తారు. మూలకణాలతో కణజాలం, ఎముకలు, కండరాలను తయారు చేయడం ఇదివరకే సాధ్యమైంది. భవిష్యత్తులో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలు, ముక్కు, చెవులు, గుండె వంటి అవయవాలను తయారు చేసి అమర్చడం కూడా సాధారణం అవుతుంది. డబ్బుంటే చాలు.. అవయవదాతల కోసం ఎదురుచూస్తూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన అవసరమే 2050 నాటికి ఉండకపోవచ్చు. పుట్టబోయే బిడ్డలను డిజైన్ చేసుకోవచ్చు! వాట్సన్, క్రిక్‌లు 1953లోనే డీఎన్ఏను కనుగొన్నా.. దానిని అవగాహన చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాలేదు. అయితే 2050 నాటికి మనకు నచ్చినట్లుగా పిల్లలను డిజైన్ చేసుకునేలా జెనిటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. పుట్టబోయే బిడ్డ లింగం, ఎత్తు, చర్మం రంగు, వెంట్రుకలు, కంటి రంగును సైతం నిర్ణయించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. శిశువుల మెదడును ప్రభావితం చేసి వారి ఐక్యూను సైతం 10 పాయింట్లు ఎక్కువగా పెంచుకోవచ్చట. జన్యువులను నియంత్రించడం లేదా తొలగించడం ద్వారా జన్యుపరమైన వ్యాధులకూ చెక్ పెట్టవచ్చట. అలాగే ‘పీ21’ అనే జన్యువును స్విచ్ఆఫ్ చేస్తే చాలు.. పెద్దవారిలో కూడా ఆయా భాగాల కణాలు పెరిగేలా చేసి అయవాలను పునరుత్పత్తి చేసే అవకాశం ఉందట. ఉదాహరణకు.. చేతివేళ్లు కోల్పోయినవారిలో వేళ్లను తిరిగి మొలిపించవచ్చన్నమాట! పోయిన జ్ఞాపకాలు తిరిగొస్తాయ్! అల్జీమర్స్, పక్షవాతం వల్ల దెబ్బతిన్న మెదడును తిరిగి బాగుచేసే న్యూరల్ ప్రోస్థెసిస్ పరికరాలు 2030ల నాటికి అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం అవుతుంది. మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగం నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరహా సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా ఇవి మెదడు, నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కృత్రిమ మాంసానికి భలే గిరాకీ..! కేవలం ఒకే ఒక్క జంతు కణంతో ప్రయోగశాలలో కొద్దిమొత్తంలో కృత్రిమ కణజాలం తయారీ ఇప్పటికే సాధ్యమైంది. 2020 నాటికే కృత్రిమ మాంసం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2036 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద పరిశ్రమగా ఎదగనుంది. ఈ పద్ధతిలో జంతువులను హింసించకుండానే మాంసం ఉత్పత్తి చేసుకోవచ్చు. రంగు, రుచిలో సహజంగా ఉండటమే కాదు.. చాలా పరిశుభ్రం, ఆరరోగ్యకరంగా కూడా ఉంటుందట. జంతువుల పోషణకు కావలిసిన ఖర్చుతో పోలిస్తే.. ఇది చాలా చవకగా తయారవుతుందట. అంతరిక్షం నుంచి విద్యుత్తు! 1970ల నుంచీ ప్రతిపాదనల్లో, పరిశోధనల్లో ఉన్న రోదసి విద్యుత్తు 2041 నాటికి అందుబాటులోకి వస్తుంది. భూస్థిర కక్ష్యలో భారీ ఉపగ్రహాలను మోహరించి, వాటిపై 1-3 కిలోమీటర్ల వెడలై ్పన సౌరవిద్యుత్ పలకలను అమరుస్తారు. వాటి నుంచి సౌరవిద్యుత్‌ను సూక్ష్మతరంగాలు లేదా లేజర్ల రూపంలో భూమికి ప్రసారం చేస్తారు. ఆ విద్యుత్‌ను భూమిపై ఉండే భారీ డిష్‌లు స్వీక రిస్తాయి. అంతరిక్షం నుంచి లేజర్ ద్వారా సమాచార ప్రసారం అనేది ఇదివరకే సాధ్యం అయింది కూడా. రోదసిలో సౌరవిద్యుత్‌ను భూమి మీదకన్నా 144% ఎక్కువగా తయారు చేయొచ్చట. అవసరమైతే 24 గంటలూ విద్యుత్ తయారుచేయొచ్చు. వాతావరణ కాలుష్యం అసలే ఉండదు. యుద్ధాలంటే హడల్! ప్రజలు కాదు, దేశాలు యుద్ధాలంటే వణికిపోతాయి. ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్న శత్రుదేశాలు కూడా 2050 నాటికి యుద్ధానికి దిగే పరిస్థితే వస్తే.. ఎందుకొచ్చిన గొడవలే అని తప్పుకుంటాయి. ఎందుకంటే.. అప్పటికి యుద్ధం అనేది అంత మితిమీరిన ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోతుంది. ఫలితంగా చాలా దేశాల మధ్య సమస్యలు సమసిపోతాయి. ఇంటర్నేషనల్ స్టడీస్ క్వార్టర్లీ ప్రకారం.. మరో 40 ఏళ్ల నాటికి యుద్ధానికి దిగి శత్రుదేశాల జనాలను చంపడమనేది తలకుమించిన భారం అయిపోతుంది. భారత్.. అగ్రదేశం! ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు హెచ్ఎస్బీసీ అంచనా ప్రకారం.. 2050 నాటికి 24.62 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థతో చైనా అగ్రదేశంగా వె లుగొందుతుంది. 22.27 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో ఉంటుంది. ఇక అప్పటికి మూడో స్థానంలోకి వచ్చే దేశం మనదే! 8.17 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది. అప్పటికి మనదేశంలో పనిచేసేవారు ఎక్కువగా, రిటైర్ అయ్యేవారు తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పరిపుష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం అభివృద్ధి చెందిన, చెందుతున్న, పేద దేశాలున్నాయి. కానీ 2035 నాటికి దాదాపుగా అన్ని దేశాలూ సంపన్నం అయిపోతాయి. మార్స్‌పై మన జెండా! సౌరకుటుంబంలో భూమి తర్వాత కాస్త అనుకూలంగా ఉన్న గ్రహం ఒక్క అంగారకుడే. అందుకే అగ్రదేశాలు, ప్రై వేటు కంపెనీల కన్ను ఇప్పుడు అరుణగ్రహంపై పడింది. అన్నీ సవ్యంగా సాగితే 2050 నాటికి అంగారకుడిపై మనిషి దాదాపుగా స్థిరపడతాడట. అప్పటికి భారత్ కూడా ఆర్థికంగా, సాంకేతికంగా సంపన్నదేశం అవుతుంది కాబట్టి.. మార్స్‌పై భారత కాలనీ ఏర్పాటుకు ప్రయత్నాలూ జరుగుతాయేమో! - హన్మిరెడ్డి యెద్దుల