అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. పైగా భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. ఇలా స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం కష్టంగా ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు పలుపరిశోధనలే చేశారు. ఆ సమస్యకు చెక్ పెడుతూ ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా మంచి ఆహారాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఆ ఆహారం ప్రత్యేకత ఏంటీ? తదితర విశేషాలు తెలుసుకుందాం!.
స్పేస్ ట్రావెలర్స్ అంతరిక్షంలో అన్ని రోజులు ఉంటే వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు ఉంటాయని విన్నాం. అయితే ఇప్పటి వరకు వారికి సరైన ఆహారం అందించడంలో శాస్త్రవేత్తలు విఫలమవుతూ వస్తున్నారు. ఇంతవరకు వారికి ప్రిజర్వేటడ్ ప్యాక్ చేసిన ఆహారాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి స్పేస్‌లోకి వెళ్లాక చప్పగా అయిపోవడం జరగుతోంది. దీంతో ఈ వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందక పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
అయితే ఆ సమస్యకు చెక్‌పెడుతూ ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ "ఆప్టిమల్ స్పేస్ మీల్" అనే శాఖాహార సలాడ్‌ని కనిపెట్టింది. ఇది అక్కడ ఉండే వ్యోమగాములకు అన్ని రకాల పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిజానికి స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు భూమిపై ఉండే మానువుల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. జీరో మైక్రోగ్రావిటీలో ఎక్కువ సేపు గడుపుతారు కాబట్టి వారికి కాల్షియం వంటి అదనపు సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి.
వారికీ ఈ ప్రత్యేకమైన ఫుడ్ ఆ లోటుని భర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్ మిషన్‌లో ఉండేవారికి మంచి ఆహారాన్ని అందించేలా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భోజనాన్ని తయారు చేశారు. దీనిలో తాజా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారికి అందించే శాకాహార పంటలను తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండించాలని అన్నారు.
పరిశోధకులు ఈ "స్పేస్ మీల్"ని సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటితో తయారు చేశారు. ఈ శాకాహార భోజనంతో వ్యోమగాములకు గరిష్ట పోషాకాలు అందడమే గాక సమర్థవంతమైన సమతుల్య ఆహారమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ భోజనాన్ని భూమిపై ఉన్న వారికి ఇవ్వగా చక్కటి ఫలితం వచ్చిందని అన్నారు. అందువల్ల స్పేస్‌లో ఉండే వారికి ఇది మంచి మీల్ అని నమ్మకంగా చెప్పొచ్చు అని అన్నారు.
(చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment