తినడం అనేది దృష్టి, వాసన, రుచి, వినికిడి స్పర్శతో కూడిన బహుళ-ఇంద్రియ అనుభవం. భూమిపై అద్భుతమైన రుచి కలిగిన ఆహారం కక్ష్యలోకి వెళ్లగానే టేస్ట్ మారిపోతుంది. వ్యోమగాములు తినేందుకు చాలా కష్టపడతారు. అక్కడ భోజనం బోరింగ్‌గా, టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుందట. అంతేగాదు తరుచుగా చాలామంది వ్యోమగాములు అంతరిక్షంలో తినే ఆనందం పోతుందని చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక వ్యక్తి వాసన,ఆహార అనుభవాన్ని అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావితం చేస్తుందని అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన ఫలితాలు భవిష్యత్తులో స్పేస్ మెనూలను రూపొందించడంలో సహాయపడతాయట. ఇక్కడ శాస్త్రవేత్తలు అంతరిక్ష యాత్రికులు రుచిని భిన్నంగా ఎందుకు అనుభవిస్తారు అనేదానిపై అధ్యయనం చేయగా.. అందుకు కారణం గురత్వాకర్షణ లేకపోవడమని గుర్తించారు. ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోవడంతో స్పేస్‌లో ఉండే వ్యోమగాములు శరీరంలోని ద్రవాలు పాదాల వైపుకి గాకుండా రివర్స్‌లో తల వైపుకి ఒత్తడిని చూపిస్తాయి.
ఫలితంగా ముక్కు మూసుకపోయిన ఫీలింగ్ వస్తుంది. అచ్చం జలుబు చేసినప్పుడు మనం ఎలా అయితే వాసనను కోల్పోతామో అలా ఉంటుంది మన పరిస్థితి. అందులోనూ అంతరిక్షం మన భూమ్మీద ఉండే పర్యావరణం మాదిరిగా ఉండదు, ఆహారం పట్ల అవగాహనను ఇవ్వగలిగేది కూడా కాదు. పైగా స్పేస్‌క్రాఫ్ట్ పరిమిత పరికరాలతో చుట్టుముట్టబడిన గాలి చొరబడిన కంటైనర్‌లో తినడం తదితర కారణాల వల్ల రుచిగా ఉండదని అంటున్నారు పరిశోధకులు. చెప్పాలంటే మనం ఇంటి వద్ద ప్రశాంతంగా అమ్మ వడ్డిస్తే హాయిగా తింటున్న దానికి..ఆఫీస్‌లో డెస్క్ వద్ద హడావిడిగా తిన్న దానికి చాలా తేడా ఉంటుంది.
అలానే ఇది కూడా అని వివరించారు పరిశోధకులు. అందుకోసం అని దాదాపు 54 మందికి భూమ్మీదే వీఆర్ సెటప్ ద్వారా అంతరిక్ష అనుభవాన్ని ఇచ్చారు. ఆ స్పేస్ వాతారణంలో వివిధ సువాసనలను ఎలా గుర్తిస్తున్నారనేది గమనించారు. అంతరిక్షం లాంటి వాతావరణంలో నిర్దిష్ట సుగంధ సమ్మేళనాలు మాత్రమే విభిన్నంగా గుర్తించబడతాయని అధ్యయనంలో తేలింది. ప్రతిఒక్కరి అభి రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి వారందరి అనుభవాల ద్వారా రుచికరంగా భోజనాన్ని ఎలా అందించాలి, వారిని ఇష్టంగా ఎలా తినమని ప్రొత్సహించచ్చో తెలుస్తుందన్నారు. ఈ అధ్యయన ఫలితాలు భూమిపై నివశించే వ్యక్తులకు, నర్సింగ్ హోమ్‌లో ఉండేవాళ్లకు, ఆర్మీలో ఉండేవాళ్లకు, జలాంతర్గామి సిబ్బందికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమయ్యింది.
(చదవండి: అనంత్ రాధికల పెళ్లిలో సందడి చేసిన లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..)
Comments
Please login to add a commentAdd a comment