Feed
-
'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం!
అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. పైగా భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. ఇలా స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం కష్టంగా ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు పలుపరిశోధనలే చేశారు. ఆ సమస్యకు చెక్ పెడుతూ ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా మంచి ఆహారాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఆ ఆహారం ప్రత్యేకత ఏంటీ? తదితర విశేషాలు తెలుసుకుందాం!. స్పేస్ ట్రావెలర్స్ అంతరిక్షంలో అన్ని రోజులు ఉంటే వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు ఉంటాయని విన్నాం. అయితే ఇప్పటి వరకు వారికి సరైన ఆహారం అందించడంలో శాస్త్రవేత్తలు విఫలమవుతూ వస్తున్నారు. ఇంతవరకు వారికి ప్రిజర్వేటడ్ ప్యాక్ చేసిన ఆహారాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి స్పేస్‌లోకి వెళ్లాక చప్పగా అయిపోవడం జరగుతోంది. దీంతో ఈ వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందక పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఆ సమస్యకు చెక్‌పెడుతూ ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ "ఆప్టిమల్ స్పేస్ మీల్" అనే శాఖాహార సలాడ్ని కనిపెట్టింది. ఇది అక్కడ ఉండే వ్యోమగాములకు అన్ని రకాల పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిజానికి స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు భూమిపై ఉండే మానువుల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. జీరో మైక్రోగ్రావిటీలో ఎక్కువ సేపు గడుపుతారు కాబట్టి వారికి కాల్షియం వంటి అదనపు సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. వారికీ ఈ ప్రత్యేకమైన ఫుడ్ ఆ లోటుని భర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్ మిషన్‌లో ఉండేవారికి మంచి ఆహారాన్ని అందించేలా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భోజనాన్ని తయారు చేశారు. దీనిలో తాజా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారికి అందించే శాకాహార పంటలను తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండించాలని అన్నారు. పరిశోధకులు ఈ "స్పేస్ మీల్"ని సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటితో తయారు చేశారు. ఈ శాకాహార భోజనంతో వ్యోమగాములకు గరిష్ట పోషాకాలు అందడమే గాక సమర్థవంతమైన సమతుల్య ఆహారమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ భోజనాన్ని భూమిపై ఉన్న వారికి ఇవ్వగా చక్కటి ఫలితం వచ్చిందని అన్నారు. అందువల్ల స్పేస్‌లో ఉండే వారికి ఇది మంచి మీల్ అని నమ్మకంగా చెప్పొచ్చు అని అన్నారు. (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?
ప్రతీ దేశానికి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆ సంప్రదాయాలను చూస్తే అవాక్కవ్వల్సిందే. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. పైగా ఆ పండుగ చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుందట. కంబోడియాలో జరుపకునే విచిత్రమైన పండుగ దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్. ఇది అక్కడ చాలా ఫేమస్ పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్ పండుగ' అని కూడా పిలుస్తారు. ఇది 15 రోజులు పాటు జరుపుకునే ఉత్సవం. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో జరుపుకుంటారు. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ టైంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసల వద్ద సంచరిస్తాయిని విశ్వసిస్తారు కంబోడియా వాసులు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు. ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి మరీ పెడతారు. అయితే ఇలా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్లం ఉండదు. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు వాటిల్లకుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు. ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్ బెన్"గా వ్యవహారిస్తారు. ఈ పండుగు 19వ శతాబ్దం కింగ్ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేగాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది కూడా. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడకు వివిధ ఆత్మలు వచ్చి ఆహారపదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు. ఏదీఏమైనా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ పండుగ. (చదవండి: మిస్టీరియస్ 'భాన్గఢ్కోట‘!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!) -
ప్యారెట్స్..పేరెంట్స్.. 650 చిలుకలు,100 పిచ్చుకల ఆకలి తీరుస్తూ..
సాక్షి, ఏలూరు: ఉదయం, సాయంత్రం వేళల్లో రామచిలుకలు, పిచ్చుకల కిలకిలరావాలతో ఆ వీధి ఆహ్లాదకరంగా మారుతుంది. వందల సంఖ్యలో అక్కడి విద్యుత్ తీగలపై వాలి ఆహారం కోసం నిరీక్షిస్తుంటాయి. ఉదయం 7.30, సాయంత్రం 4 గంటలకు ఠంచనుగా ఈశ్వరరావు, పార్వతి దంపతులు అందించే మేతను ఆరగిస్తాయి. ఐదేళ్లుగా రామచిలుకలు, పిచ్చుకల ఆకలి తీరుస్తూ పక్షులపై తమ ప్రేమను చాటుతున్నారు కైకలూరుకు చెందిన ఈశ్వరరావు, పార్వతి దంపతులు. ప్రతి రోజూ సుమారు 650 రామచిలుకలు, 100 బంగారు రంగు పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తున్నారు. కైకలూరులోని వైఎస్సార్ నగర్లో ఉంటున్న ఈశ్వరరావు ఇంటి సమీపంలో ఉండే విద్యుత్ తీగలపై వాలి పచ్చటి తోరణాలను తలపిస్తాయి. పూటకు పది కేజీల చొప్పున బియ్యాన్ని కడిగి డాబాపై నాలుగు వరుసల్లో చిన్న చిన్న ముద్దలుగా ఉంచుతారు. పిచ్చుకలు తిన్న తరువాత ఒక్కసారిగా రామచిలుకలు గుంపుగా వచ్చి మేతను ఆరగిస్తాయి. గతంలో ముఠా పనిచేసి కొంతకాలంగా టీమాస్టర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు ఇటీవల వైఎస్సార్ నగర్లో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, వీరి సాయంతో రోజూ రూ.200 ఖర్చుతో చిలుకలకు ఆహారంగా ఒక్కో రోజు బియ్యంతో పాటు కొర్రలు, జామకాయలు అందిస్తున్నారు. చిలుక జాతులలో మూడింట ఒక వంతు అంతరించే ప్రమాదంలో ఉందని ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రెడ్‌లిస్టులో వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామచిలుకలకు ప్రతిరోజూ మేతను అందిస్తున్న ఈశ్వరరావు, పార్వతి దంపతుల సేవను పలువురు అభినందిస్తున్నారు. చిలుకలను దేవతలుగా భావిస్తాం అరుణాచలం దేవాలయానికి వెళ్లినప్పుడు రెండు చిలుకలు మా తలలపై తిరిగాయి. మా మామ మరణించే చివరి ఘడియల్లో గోడపై చిలుక బొమ్మ ముద్రించారు. ఈ ఘటనలతో చిలుకలను దేవతలుగా భావిస్తూ రోజూ మేతను అందిస్తున్నాం. వాటి సవ్వడులు మాకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని సమకూర్చడం కష్టతరమవుతోంది. దాతలు బియ్యం అందించి సహకరించాలి. బియ్యం, మేత సాయం చేసే దాతలు 63048 72868, 93818 93450 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – కొల్లి ఈశ్వరరావు, పార్వతి దంపతులు చదవండి: లేటు వయసులోనూ నీట్ రాశారు.. పేదలకు వైద్య సేవలు అందించాలని 69 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ సంకల్పం.. -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
మొసళ్లకు సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. అవి ఎంత క్రూరంగా దాడి చేస్తాయో కూడా చూశాం. అంతెందుకు సరదాగా చూడటానికి వచ్చిన ఒక పర్యాటకుడిపై మొసలి ఎలా దాడి చేసి గాయపరిచిందో వంటి పలు ఘటనలు చూశాం. అయినా సరే కొంతమంది నిర్లక్ష్యంగానే ఉంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట ఎంత నిర్లక్ష్యంగా అంటే.. ఆ మొసళ్లు ఉన్న నదిలోకే వెళ్లి వాటిని పిలిచి మరీ ఆహారం పెడుతున్నారు. ఏదో పెంపుడు కుక్కకు పెట్టినట్లుగా పెట్టాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బుచ్, పెగ్గి అనే ఒక జంట నదిలో కూర్చొని దూరం నుంచి వస్తున్న మొసళ్లును పిలుస్తూ చేతులూ ఊపాడు. ఆ తర్వాత వాటికి పంది మాంసంతో తయారు చేసిన శాండ్విచ్లు నేరుగా చేతితో తినిపిస్తున్నాడు. ఒకవేళ దాడి చేసి ఉంటే పరిస్థితి ఇక అంతే. పైగా వారు నీళ్లలోనే ఉన్నారు తప్పించుకునే అవకాశం కూడా లేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు.. ఏం భయ్యా మరి ఇంత బలుపేంటి అంటూ ఫైర్ అయ్యారు. అయినా ఫ్లోరిడాలో ఇలాంటివి నేరం దుష్ప్రవర్తన కింది పరిగణించి చర్యలు తీసుకుంటుందని తెలిసి కూడా ఇలా చేస్తారా మీరు అంటూ తిట్టిపోశారు. View this post on Instagram A post shared by Only In Florida (@onlyinfloridaa) (చదవండి: పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్) -
AP: తగ్గిన రొయ్య మేత ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జోక్యంతో రొయ్య మేత తయారీదారులు దిగివచ్చారు. పెంచిన ధరలను తగ్గించారు. శనివారం నుంచి పాత ధరలతోనే రొయ్య మేత అందుబాటులో ఉంటుంది. ముడిసరుకు ధరలను సాకుగా చూపి ఇటీవల కిలోకి రూ.2.60 చొప్పున టన్నుకు రూ.2,600 మేర మేత ధరలు పెంచారు. ధరల పెంపుపై నియంత్రణ ఉండాలని, లేకుంటే సాగు చేయలేమంటూ రొయ్య రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రొయ్య రైతులు, మేత తయారీదారులతో మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సచివాలయంలో సమావేశమయ్యారు. చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు మేత ధరలపై సమీక్షించారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు కరెంట్ కోతల వల్ల జనరేటర్లపై ప్లాంట్లు నిర్వహించాల్సి వచి్చందని అందువల్లే మేత ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు చెప్పారు. ఇలా ప్రతి మూడు నెలలకు పెంచడం తమకు భారంగా మారుతోందని రొయ్య రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్సడా చట్టం ప్రకారం మేత ధరలు ఇష్టానుసారం పెంచడానికి వీల్లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలను ప్రభుత్వం ఎత్తివేసిందని మంత్రి చెప్పారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇందుకు తయారీదారులు అంగీకరించారు. టన్నుకు రూ.2,600 చొప్పున తగ్గించి శనివారం నుంచి పాత ధరలకే అమ్ముతామని చెప్పారు. ఇక నుంచి నాలుగు నెలలకోసారి సమీక్షించాలని, అప్పటి ముడిసరుకుల ధరలను పరిగణనలోకి తీసుకొని మేత ధర నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించారు. తయారీదారుల సూచన మేరకు రొయ్యల మేతలో ఉపయోగించే సోయా దిగుమతులను అనుమతించి, ఎగుమతులపై నిషేధం కొనసాగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మేత ఉత్పత్తిదారులు, ఆక్వా రైతులు ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించారు. రొయ్యల పెంపకంలో యాంటిబయాటిక్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మంత్రి చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ కో వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఆల్ ఇండియా చేపల మేత ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడుæ బీద మస్తాన్‌రావు, ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోహన్‌రాజు పాల్గొన్నారు. -
పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోండి: నెక్
హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఫీడ్ ధరలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ (నెక్) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు మానవ వినియోగానికి పనికిరాని 2 మిలియన్ టన్నుల మొక్క జొన్న, గోధుమ, సొయా వంటి కోళ్ల దాణాను పరిశ్రమకు కేటాయించాలని అభ్యర్ధించింది. -
చుక్కల్లో ధరలు.. కిలో స్కిన్లెస్ చికెన్ రేటెంతో తెలుసా?
సాక్షి, కాకినాడ(మండపేట): రెండు నెలలుగా చికెన్ ధర దిగి రానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300 నుంచి రూ.320తో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలు కావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 వరకూ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిల్లో 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకూ పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోళ్ల మేత ధరలు గణనీయంగా పెరగడం వీటి పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. చదవండి: (అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే..) మొక్కజొన్న కిలో రూ.14 నుంచి రూ.25కు పెరగగా, సోయా రూ.40 నుంచి రూ.90కి పెరిగిపోయింది. అన్ని మేతలూ మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ.35కు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకూ వ్యయమవుతోందని రైతులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధిక శాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడి పిల్లలను పెంచి, పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫారాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200 వరకూ ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300కు, లైవ్ కిలో రూ.100లనుంచి రూ.150కి చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350 వరకూ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడూ లేనంతగా కోళ్ల మేత ధరలు, కోడి పిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడంతో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
అమ్మతనమంటే ఇదే.. మేక పిల్లలకు పాలిస్తున్న కుక్క !
భువనేశ్వర్: సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ. పేగు తెంచుకుని కన్న బిడ్డలకు ఆదరించి లాలించడం పరిపాటే. తల్లి లేని లోటు ఏ జీవికైన భర్తీ చేయలేనిది. కూనలు కన్ను తెరిచేలోగా ప్రసవించిన తల్లి మేక కన్ను మూసింది. పోషణకు ఆధారమైన తల్లి పాలు లేక అల్లాడుతున్న మేక పిల్లల్ని వీధి కుక్క అక్కున చేర్చుకుంది. నిత్యం క్రమం తప్పకుండా తన పాలుని పంచిపెడుతోంది. మయూర్భంజ్ జిల్లా జమదా మండలం మధుపూర్ గ్రామంలో ఈ విభిన్న మాతృత్వం శుక్రవారం తారసపడింది. రాగా అంకుర్ బాగే పోషించిన మేక 2 పిల్లల్ని ఈనింది. మరుక్షణమే తల్లి మేక కన్ను మూసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గంజితో జీవుల ఆకలి తీర్చేందుకు యజమాని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. వీధుల్లో తిరుగాడుతున్న కుక్కకి తల్లిని కోల్పోయిన మేక పిల్లలు చేరువయ్యాయి. కడుపునిండా పాలు పంచి మేక పిల్లల్ని కుక్క అక్కున తీసుకుని ఆదరించడం స్థానికులను ఆలోచింపజేసింది. -
కొండెక్కిన కోడి..శ్రావణంలోనూ తగ్గని చికెన్ ధర
మండపేట: శ్రావణంలోనూ చికెన్ ధర దిగిరావడం లేదు. రూ.300లకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన మేత ధరలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ, చత్తీస్గడ్ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు విశ్లేషిన్నారు. కోడిగుడ్డు ధర మాత్రం కొంతమేర వినియోగదారులకు ఊరటనిస్తోంది. పండగరోజుల్లో.. తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2.5 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 ఫామ్‌లలో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతుంది. 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి సిద్దమవుతుంటాయి. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. కారణమేంటంటే.. - కోవిడ్ ఆంక్షలు సడలించినా మేత ధరలు అదుపులోకి రావడం లేదు. - ఆంక్షలు కారణంగా జూలైలో మేత రవాణా నిలిచిపోయింది. ధరలు పెరగడం మొదలైంది. - బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబిన్ కిలో రూ.35 నుంచి రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.106కు పెరిగిపోయింది. - మొక్కజొన్న రూ.12నుంచి రూ. 23కు పెరిగినట్టు కోళ్ల రైతులు చెబుతున్నారు. - కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారంగా చికెన్ వినియోగం అధికం కావడంతో గత నెలలో కిలో చికెన్ రూ. 320వరకూ చేరింది. తర్వాత రూ.230ల నుంచి రూ.250లకు తగ్గింది. - వారం రోజులగా మళ్లీ ధరకు రెక్కలొస్తున్నాయి. ఆన్ సీజన్, మేత ధరలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో యిలర్ పెంపకం సగానికి పైగా తగ్గిపోయింది. దిగుమతిపై ఆధారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్ ధరలకు మరలా రెక్కలొస్తున్నాయి. బుధవారం కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.135లు వరకు పెరిగింది. వినియోగం సాధారణంగానే ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాల అంచనా. అయితేగుడ్డు ధర క్రమంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. రైతు ధర తగ్గిపోవడంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.5కి చేరుకుంది. మేత తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు - బొబ్బా వెంకన్న బ్రాయిలర్ కోళ్ల రైతు శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆన్‌సీజన్ మొదలు కావడం, మేత ధరలకు జడిసి ఎవరూ కొత్త బ్యాచ్‌లను వేయడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. కీ పాయింట్స్ - తూర్పు గోదావరి జిల్లాలో చికెన్ వినియోగం రోజుకి 2.50 లక్షల కిలోలు - బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ సంఖ్య 400 - రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ రూ. 300 - కోళ్ల మేత సోయబిన్ ధరల్లో పెరుగుదల రూ. 35 నుంచి రూ.100 చదవండి: సాగుకు ‘టెక్’ సాయం..! -
మిడతల దాణా మంచిదేనా?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్‌లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్‌లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది. మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్‌లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్‌కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు. వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్‌లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు') మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్‌థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్‌డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’) -
ధాన్యపు రకం పచ్చి మేతల సాగు ఇలా..
వాణిజ్య స్థాయిలో పాడి పశువుల పెంపకం చేపట్టే రైతులు ఏడాది పొడవునా పచ్చిమేత అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. నీటి వసతి గల ఒక ఎకరం భూమిలో 5–6 పశువులకు, వర్షాధార భూముల్లో ఒక ఎకరం భూమిలో రెండు పశువులకు సరిపడా పచ్చిమేతను పెంచుకోవచ్చు. ధాన్యపు జాతి పచ్చిమేత మూడు పాళ్లు, పప్పుజాతి పచ్చిమేతను ఒక పాలు కలిపి పశువు శరీర బరువుననుసరించి 25–30 కిలోల వరకు మేపితే తగిన లాభదాయకంగా పాల ఉత్పత్తిని పొందవచ్చు. కొత్తగా డెయిరీ ప్రారంభించే రైతులు రెండు నెలలు ముందునుంచే పచ్చి మేతలను సాగు చేయడం అవసరం. పచ్చి మేతలను సాగు చేసే పద్ధతులను తెలుసుకుందాం... ధాన్యపు రకం ఏక వార్షిక పచ్చిమేతలు ధాన్యపు రకం ఏక వార్షిక పచ్చిమేతల్లో ముఖ్యమైనవి హైబ్రిడ్ జొన్న, మొక్కజొన్న, సజ్జ రకాలు. హైబ్రిడ్ జొన్న హైబ్రిడ్ జొన్నలో పి.సి.–6, పి.సి.–23, యం.పి. చారి, ఎస్.ఎస్.జి. 59–3 రకాలు మేలైనవి. వీటిని వర్షాధారంగా (జూన్–ఆగస్టు), నీటి పారుదల కింద (జనవరి–మే) నాటుకోవాలి. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 4–5 అంగుళాల దూరంలో విత్తుకోవాలి. హెక్టారుకు 80 కిలోల నత్రజని, 30 కిలోల పొటాష్ వేసుకోవాలి. ప్రకృతి/సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే రైతులు తగిన మోతాదులో ఘనజీవామృతం, ద్రవజీవామృతం, వర్మీకంపోస్టు, చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. 10–15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 50–55 రోజుల (50 శాతం పూత దశ)లో మొదటి కోత కోసుకోవచ్చు. ప్రతి 35–40 రోజులకు ఒక కోత కోసుకోవచ్చు. హెక్టారుకు 70–80 టన్నుల పచ్చి జొన్న గడ్డి దిగుబడి వస్తుంది. మొక్కజొన్న పచ్చిమేతగా పెంచుకునేందుకు మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, గంగ, హైబ్రిడ్ ఎఫ్, విజయ కిసాన్ రకాలు ఉంటాయి. వర్షాధారంగా జూన్–ఆగస్టు, నీటిపారుదల కింద జనవరి – మే మధ్యలో నాటుకోవాలి. హెక్టారుకు 40–50 కిలోల విత్తనం కావాలి. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 10 అంగుళాల దూరం ఉండాలి. హెక్టారుకు 120 కిలోల నత్రజని, 120 కిలోల పొటాష్ వేసుకోవాలి. 7–10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 60–70 రోజులకు కంకి వేసే సమయంలో మొదటి కోత కోయాలి. 2–3 కోతలు వస్తాయి. హెక్టారుకు 50–60 టన్నుల పచ్చి మేత దిగుబడి వస్తుంది. సజ్జ సజ్జలో జైంట్ బాజ్రా, జైంట్ రాజ్కో, ఎ.పి.ఎఫ్.బి. రకాలు పచ్చిమేతగా సాగు చేయడానికి అనువుగా ఉంటాయి. వర్షాధారంగా జూన్–ఆగస్టు మధ్య, నీటిపారుదల కింద జనవరి–మే మధ్య విత్తుకోవాలి. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 5 అంగుళాల దూరం ఉండాలి. హెక్టారుకు 80 కిలోల నత్రజని, 30 కిలో పొటాష్ వేయాలి. 15–20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 60–70 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత 1–2 కోతలు వస్తాయి. 30–35 రోజులకు ఒక కోత వస్తుంది. హెక్టారుకు 25–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. బహువార్షిక పచ్చి మేతలు నేపియర్: ఒకసారి నాటితే 3–4 ఏళ్లపాటు అనేక కోతల్లో పశుగ్రాసాన్ని అందించే బహువార్షిక పచ్చి మేతలు పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. నేపియర్ పచ్చిమేతల్లో ఎన్.బి.21, ఎ.పి.బి.ఎన్., కో–1, కో–2 రకాలు ముఖ్యమైనవి. వీటిని చలికాలంలో తప్ప ఫిబ్రవరి–ఆగస్టు నెలల మధ్యలో రెండు కణుపుల కాండపు ముక్కలు నాటుకోవచ్చు. హెక్టారుకు 30 వేల ముక్కలు కావాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య 2 అడుగులు(60 సెం.మీ.) దూరం పాటించాలి. హెక్టారుకు 110 కిలోల యూరియా, భాస్వరం 50 కిలోలు, పొటాష్ 40 కిలోలు వేయాలి. ఎండాకాలంలో 8–10 రోజులకు ఒకసారి, చలికాలంలో 15–20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. నాటిన తర్వాత 60–75 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 40–45 రోజులకు ఒకసారి.. ఏడాదికి 6–8 కోతలు వస్తాయి. హెక్టారుకు 250–300 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. పారాగడ్డి : పారాగడ్డి కాండపు మొక్కలను జూన్–జూలై నెలల్లో నాటుకోవాలి. హెక్టారుకు 40 వేల కాండపు మొక్కలు కావాలి. వరుసల మధ్య, మొక్కల మధ్య అడుగు దూరం పాటించాలి. హెక్టారుకు 150 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎండాకాలంలో 8–10 రోజులకు, చలి కాలంలో 15–20 రోజులకు ఒక సారి నీటి తడులు ఇవ్వాలి. నాటిన తర్వాత 75–80 రోజులకు మొదటిసారి గడ్డి కోతకు వస్తుంది. తర్వాత ప్రతి 40–45 రోజులకు ఒకసారి, 6–9 కోతలు వస్తాయి. హెక్టారుకు 200–240 టన్నులు సంవత్సరానికి పచ్చిమేత దిగుబడి వస్తుంది. -
ఏ నగరంలో ఎంత స్టాంప్ డ్యూటీ?
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు చేసిన స్థిరాస్తి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్థానిక ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్‌లు స్థిరాస్తి విలువలో 90 శాతం వరకు గృహ రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. మిగిలిన మొత్తంతో పాటూ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా కొనుగోలుదారులే వెచ్చించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ అంటే? ప్రాపర్టీ లావాదేవీలకు చెల్లించే రుసుము. ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదుకు ప్రాపర్టీని తర్జుమా చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి చెల్లించే పన్ను. ఇది ప్రాపర్టీ విలువ మీద ఆధారడి ఉంటుంది. ఇండియన్ స్టాంప్ డ్యూటీ యాక్ట్, 1899 ప్రకారం స్టాంప్ డ్యూటీ 4–10 శాతం వరకుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్టాంప్ డ్యూటీలుంటాయి. రిజిస్ట్రేషన్ చార్జీలనేవి ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీ లావాదేవీల నమోదుకు ఒకసారి చెల్లించే రుసుము ఇది. ప్రాపర్టీ విలువలో 1 శాతం. ఏ నగరాల్లో ఎంత స్టాంప్ డ్యూటీ? (శాతాల్లో) హైదరాబాద్ – 7.5; అహ్మదాబాద్–4.90; బెంగళూరు–5; చెన్నై–7; ఢిల్లీ–6; గుర్గావ్ : 6–8; కోల్కత్తా: 5–7; ముంబై–6; నోయిడా–5; పుణె–5. -
ప్రేమికుల రోజువినూత్న ప్రయత్నం
గచ్చిబౌలి: గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు చేపట్టిన ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నారు. నగరంలోని పలు హోటల్ యజమానులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఆకలితో ఉన్నవారందరికీఆహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో నగరంలో బృహత్తరకార్యక్రమాన్ని లాంఛనంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆహారాన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు,ఆటో స్టాండ్, నైట్ షెల్టర్లు, స్లమ్‌లు, మేజర్ ఆసుపత్రులు ఇతర రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించనున్నట్టు అడిషనల్ కమిషనర్ హరిచందన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని అందించాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంస్థలు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రజనీకాంత్ 95421 88884, విశాల్ 96668 63435, పవన్ 98499 99018 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ప్రేమికుల రోజన లక్ష మందికి భోజనం... ప్రేమికుల రోజు అంటే అందరికీ ప్రేమ జంటలు గుర్తుకు వస్తాయి. కానీ ప్రేమికుల రోజున అన్నార్తుల ఆకలి తీర్చి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు అధికారులు. ఫీడ్ ద నీడ్‌లో భాగంగా వాటెంటైన్స్ డే స్పెషల్‌గా గురువారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష మంది పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని సర్కిళ్ల పరిధిలో అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థలు ఇందులో పాలుపంచుకుంటాయి. మిగిలిన ఆహరాన్ని పేదలకు అందించే దిశగా ప్రజలు కూడా ఆలోచిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 40 వేల భోజనాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. హోటళ్ల యాజమాన్యాలు కూడా సహకరిస్తున్నాయి. త్వరలో యాప్.... ఫీడ్ ద నీడ్‌కు సంబంధించిన యాప్‌ను త్వరలో రూపొందిస్తామని శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరి చందన దాసరి తెలిపారు. దీని ద్వారా మరింత మంది స్పందిస్తారన్నారు. -
‘ఫీడ్ ద నీడ్’కు ఆహారం అందించాలనుకుంటే..
సాక్షి, సిటీబ్యూరో: ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రారంభించిన ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమానికి విశేషస్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి చేయూత నందించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ కళ్యాణ్చక్రవర్తిలు హోటళ్ల యజమానులు, స్వచ్చందసంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి విజ్ఞప్తి చేయడంతో 40 వేల ఫుడ్‌ప్యాకెట్లు అందించేందుకు ఒక్కరోజులోనే వివిధ సంస్థలు, హోటళ్లు ముందుకొచ్చాయి. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్‌డే సందర్భంగా ఈ ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇందులో భాగంగా 14వ తేదీన ఫుడ్ ప్యాకెట్లు అందించేందుకు కన్ఫిగరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), హోటల్స్ అసోసియేషన్, పిస్తా హౌస్, డీవీ మనోహర్ హోటళ్లతో పాటు పలు హోటళ్లు, వ్యక్తులు ముందుకొచ్చినట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని అందించాలనుకునేవారు దిగువ ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చునని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 95421 88884(రజనీకాంత్), 96668 63435(విశాల్), 98499 99018 (పవన్). -
ఫీడ్ ద నీడ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదల ఆకలి తీర్చడానికి జీహెచ్ఎంసీ వినూత్న ప్రణాళికను రూపొందించింది. సిటీలో ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ‘ఫీడ్ ద నీడ్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల14వ తేదీన ప్రారంభించనున్నట్టు దానకిశోర్ తెలిపారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమంపై నగరంలోని హోటల్ యజమానులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ 14 ఫిబ్రవరి అనగానే లవర్స్ డేగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచే రోజుగా భావిస్తారని, అయితే ఇదే రోజున నగరంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండవద్దనే భావనతో ‘నీడ్ ద ఫీడ్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టామని పేర్కొన్నారు. ఆకలితో బాధపడుతున్న పేదప్రజల పట్ల నగర ప్రజలు ప్రేమ చూపించాలని, ఎవరైన తిండిలేక అలమటిస్తుంటే.. వారికి ఆహారం అందించి ఆదుకోవాలని హోటల్ యజమానులు, స్వచ్ఛంద సంస్థలకు కమిషనర్ పిలుపునిచ్చారు. పట్టణాలు, నగరాల్లో ఆహార పదార్థాల వృథా చాలా ఎక్కువగా ఉం టుందని, ఆకలికి మించిన ఆహారం కొందరికి అందుబాటులో ఉంటే.. ఆకలి తీర్చుకోవడానికి కొందరికి అవకాశం ఉండదన్నారు. తాము తినగా మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తలో పడవేస్తుంటారు చాలామంది. దాంతో గ్రేటర్ పరిధిలో ఉత్ప త్తి అవుతున్న చెత్తలో 15 శాతం వరకు ఆహార పదార్థాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నా రు. ఇంత భారీ స్థాయిలో ఆహారం వృథా కాకుం డా దానిని ఇతరులకు అందించడం ద్వారా ఆహారాన్ని సద్వినియోగం చేయడంతో పాటు ఆకలితో పస్తులుండే వారి కడుపు నింపవచ్చనే ఆలోచనల్లోంచి ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు కమిషనర్ దానకిశోర్ వివరించారు. నగరవాసుల సంక్షేమానికి బల్దియా పెద్దపీఠ: మేయర్ జీహెచ్ఎంసీ చేపడుతున్న ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమానికి హోటల్స్ యజమానులు సహాకరించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 40 వేల మందికిపైగా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున చర్యలు చేపడుతూనే సంక్షేమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ♦ ప్రతి ఒక్కహోటల్ యజమాని ఫుడ్ వేస్ట్‌గా పడేయకుండా.. ఫీడ్ ద నీడ్‌కు అందించాలన్నారు. ఇప్పటికే నగరంలో శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్ సర్కిల్ వద్ద ఆహార పదార్థాలను నిల్వవుంచడానికి రిఫ్రిజిరేటర్స్‌ను ఏర్పాటు చేశామని, ఎన్జీవోల సహకారంతో రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా నీడ్ ద ఫీడ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇ.పి.టి.ఆర్.ఐ ఎండీ కల్యాణ్ చక్రవర్తి, జోనల్ కమిషనర్లు హరిచందన, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్యలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
గౌరీనాథుడి వాకిట.. గోరాజసం
– ప్రత్యేక వైద్యుడి నియామకం – అదనంగా ఆరు షెడ్లు ఏర్పాటు – త్వరలో విభూది తయారీ కేంద్రాలు ఏర్పాటు శ్రీకాళహస్తి: అక్కడ ఆవులన్నీ గుంపులు, గుంపులుగా తిరిగేవి. ఆ పశువులు మేత కరువు.. రోగాల దరువుతో విలవిలాడుతుండేవి. కొన్ని మృత్యువాత పడేవి. వీటి దుస్థితి చూసి ఆ ముక్కంటీశునికే జాలి కలిగిందేమో మరీ. గోవులను రక్షించమని దేవస్థానం అధికారులను పురమాయించినట్లుంది. ఉన్నట్టుండి శ్రీకాళహస్తీశ్వరాలయాధికారులు ఆవులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. గోమాతలకు కూడు, గూడు, వైద్య సదుపాయం కల్పించారు. ఫలితంగా ముక్కంటి చెంత గో రాజసం తొణికిసలాడుతోంది. శ్రీకాళహస్తి దేవస్థానంలోని గోశాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నిన్నటి వరకు ఆవులు, ఎద్దులు, పాలిచ్చే ఆవులు, దూడలు అన్నింటినీ కలిపి గుంపులు, గుంపులుగా తోలేవారు. దీంతో అవి కుమ్ముకుని తీవ్రంగా గాయాల పాలయ్యేవి. దీనికితోడు ఆవులకు వ్యాధులు సోకితే పట్టించుకునే వారు కరువవడంతో అవి మృత్యువాత పడేవి. ఈ నేపథ్యంలోనే గత ఏడాదిలో 30 గోవులు మృతి చెందాయి. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే ఆవులను ఆశ్రమాలకో, మఠాలకో ఇచ్చేస్తామని పాలకులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. దీంతో పాలకుల తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. గోశాలపై దృష్టి సారించారు. దేవస్థానం గోశాలలో గోవుల కోసం ఆరు షెడ్లు ఉన్నాయి. కాగా వారం రోజులుగా వురో ఆరు షెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్లు పూర్తి చేశారు. వురో రెండు షెడ్లు నిర్మాణంలో ఉన్నాయి. దూడలు, పాలిచ్చే ఆవులు, సూడి ఆవులు, వుుసలి ఆవులు, ఎద్దులను వేరు చేసి, ఒక్కొక్క విభాగానికి ఒక షెడ్డు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా రూ.10లక్షలు ఖర్చు చేయించి గోశాల షెడ్ల చుట్టు ప్రహరీగోడను ఏర్పాటు చేశారు. ఇక పచ్చిగడ్డితోపాటు ఎండుగడ్డి అవసరమైన మేరకు సిద్ధం చేశారు. మినరల్ మిక్చర్, ఐపీఎల్ ఫీడ్, తరకల తవుడు ఇలా అనేక పలు రకాల దాణాలను గోవుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అంతేకాదు ప్రత్యేకంగా నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ అనే వెటర్నరీ డాక్టర్‌కు నెలకు రూ.20 వేలు జీతం చెల్లించి గోశాలలో వైద్యునిగా నియమించారు. గతంలో గోశాలకు డాక్టర్ లేని విషయం తెలిసిందే. ఇక గోశాలలో చేయడానికి 15 వుంది సిబ్బందిని నియమించారు.ఆ ప్రాంతంలోనే ఆలయ భూవుుల్లో నర్సరీని ఏర్పాటు చేయనున్నారు. ఇక విభూది తయారు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సావుగ్రిని కర్నూలు నుంచి తెప్పించారు. మెుత్తం మీద రూ.లక్షలు ఖర్చు చేసి...గోశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గోవులు రోగాల బారి నుంచి బయటపడ్డాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు అభిషేకాలు, అన్నదానానికి అవసరమైన పాలు గోశాల నుంచే వస్తున్నాయి. గతంలో గోశాల నుంచి కేవలం 20 లీటర్లు పాలు వూత్రమే వచ్చేవి.ప్రస్తుతం 126 లీటర్ల పాలు సవుకూరుతున్నాయి. -
తల్లిపాలు అమృతం వంటివి
నకిరేకల్ః తల్లిపాలు అమృతం వంటివని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తల్లిపాలలో ఉన్న శక్తి ఎందులోనూ లభించదని, పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలన్నారు. నకిరేకల్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అందజేస్తున్న పౌష్టికాహార పదార్థాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లీశ్వరి వెంకన్న, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పూజర్ల శంభయ్య, ఉప సర్పంచ్ మంగినపల్లి రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణశ్రీ, హెల్త్ సూపర్వైజర్ కాంతమ్మ, అనసూయమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైర్లు వెంకటరమణమ్మ, సాయిగీత, మంజులత, వినోద, సిబ్బంది పర్వేజ్ వసీం, జ్యోతి, నీలమ్మ పాల్గొన్నారు. -
పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి
కోదాడరూరల్): పుట్టిన బిడ్డకు గంట లోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలని డాక్టర్ మధుసూదన్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా కొమరబండలో కూడ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ సంపెట రవిగౌడ్, ఎంపీటీసీ సభ్యులు బత్తుల వెంకటేశ్వర్లు, కె.ఆదిలక్ష్మి, కె.పద్మజ, కె.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల సొంతడబ్బుతో మిడ్ డే మీల్స్...
తిరువనంతపురం: కేరళ ఉపాధ్యాయులు విద్యార్థుల ఆహారంపై శ్రద్ధ వహిస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఇస్తున్ననిధులు సరిపోకపోవడంతో టీచర్లు వారి సొంత డబ్బు ఖర్చు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు రోజుకు ఒక్కో విద్యార్థి భోజనానికి ఐదు రూపాయలు చొప్పున వెచ్చిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల ఎనిమిది రూపాయలకు పెంచింది. అయితే పౌష్టికాహారం అందించేందుకు ఎనిమిది రూపాయలు సైతం చాలకపోవడంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే మిగిలిన డబ్బును వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు కనీస పౌష్టికాహారం అందించాలంటే రోజుకు ఒక్కొక్కరికి 12నుంచి 15 రూపాయలదాకా ఖర్చవుతుంది. అయితే కేరళ ప్రభుత్వం 8 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. ఇదికాకుండా వంటచెరకు, వంటగ్యాస్ కు అధికంగా ఖర్చవుతుంది. ఇదంతా తాము స్వయంగా చెల్లిస్తున్నామని అక్కడి ఉపాధ్యాయులు చెప్తున్నారు. ముఖ్యంగా స్కూల్లో ఇచ్చే పాలు, గుడ్డు వంటి ప్రొటీన్ ఫుడ్ ఆశించే బీద కుటుంబాల్లోని పిల్లలు పాఠశాలకు వస్తుంటారని, లేదంటే వారు డ్రాపవుట్స్ గా మారతారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీంతో చాలాశాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులే సొంత డబ్బును వెచ్చించడం, లేదా పూర్వ విద్యార్థులనుంచి విరాళాలు సేకరించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని పెద్ద బడుల్లో పేరెంట్, టీచర్స్ అసోసియేషన్ల సహకారంతో ముందుకు తీసుకెడుతుండగా.. చిన్న స్కూళ్ళలో మాత్రం టీచర్లే సొంతడబ్బుతో నిధులు సమకూర్చుకొని పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం పది రూపాయలైనా వెచ్చించకపోతే విజయవంతంగా పథకం కొనసాగించడం కష్టం అని వారు చెప్తున్నారు. స్థానిక మార్కెట్లలో ఒక్కో గుడ్డు 4 నుంచి 5 రూపాయల ఖరీదు ఉంటుంటే కొద్దిపాటి నిధులతో పథకం నిర్వహణ కష్టసాధ్యంగా మారుతోందంటున్నారు. ప్రతినెలా తన సొంత డబ్బునుంచి రూ. 3,500 ల వరకు స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఖర్చుచేస్తున్నట్లు ఓ అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రిన్సిపాల్ చెప్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు కూడ నెలకు మూడునుంచి నాలుగు వేల రూపాయలు తమ సొంత డబ్బు ఖర్చు చేస్తున్నామని, అయితే పిల్లల భోజనానికి ఖర్చుచేసేందుకు తాము బాధపడటం లేదని చెప్తున్నారు. ట్రావెన్కోర్ రాజవంశీయుల కాలంలో స్థాపించిన శతాబ్దాలనాటి తమ పాఠశాలలో చదివే విద్యార్థులు అంతా పేద కుటుంబాలవారు, నిరాశ్రయులేనని, వారికి భోజనం అందించడంలో ఎటువంటి రాజీ లేదని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ఒక్కోసారి పాఠశాలను సందర్శించే పూర్వ విద్యార్థుల వినయపూర్వక సహకారాన్ని కూడ తీసుకుంటున్నామని ఆమె చెప్తున్నారు. ప్రతి గురువారం విద్యార్థులకు అందించే పాలకు తనతోపాటు సహ ఉపాధ్యాయులు కూడ డబ్బు వెచ్చిస్తారని, ఆరోజు ఏదైనా సెలవు వస్తే మాత్రం తాము వెచ్చించాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. -
ఇతడికి ఆకలి బాధ తెలుసు!
‘‘నాకు తెలుసు ఆకలి బాధ ఎలా ఉంటుందో’’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చుతారు హేమంత్ పటేల్. మొదటిసారిగా ఆయనకు ఆకలి దెబ్బ తన కూతురు ఆసుపత్రిలో ఉన్నప్పుడు తగిలింది. జేబులో చిల్లిగవ్వలేదు. హాస్పిటల్ బెడ్ మీదున్న కుమార్తె పరిస్థితి దయనీయంగా ఉంది. ఎప్పుడు కళ్లు తెరచిందో తెలీదు. ‘నాన్నా.. ఆకలిగా ఉంది. బయటకెళ్లి ఏదైనా కొనుక్కురా’ అంటూ దీనంగా పలికింది. వెంటనే ఆసుపత్రి గది నుంచి బయటకు వచ్చాడు. కళ్లలో నీరు సుడులు తిరుగుతుండగా జేబులు తడుముకున్నాడు. పది రూపాయలు కూడా అతనికి దొరకలేదు. ‘దేవుడా.. ఎంతటి పరీక్ష పెట్టావురా. కన్నకూతురు పొట్ట నింపలేకపోతున్నాను కదా’ అనుకుంటూ కుమిలిపోయాడు. ఆసుపత్రి వరండాలో కనిపించిన వారందరినీ అడిగాడు. కానీ, ఎవ్వరూ హేమంత్‌కి సాయం చేయలేదు. అప్పుడే అర్థమైంది ఆయనకు.. తనలాగే అక్కడ చాలామంది దగ్గర తిండికి సైతం డబ్బుల్లేవని! ఎలాగో ఆ పూట గడిచిపోయింది. హేమంత్ కుమార్తె ఆరోగ్యంగా ఇంటికి చేరిపోయింది. రోజులు, నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. అయినా, ఆయన మదిలో ఆసుపత్రి సంఘటన మెదులుతూనే ఉంది. అది ఆయన్ను నిద్రపోనీయడం లేదు. మెల్లగా క్యాటరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. నెమ్మదిగా వృద్ధిలోకి వచ్చాడు. ఇంతలో ఆయన జీవితంలో మరో మలుపు. 2002 గుజరాత్ అల్లర్లలో హేమంత్ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మరోసారి ఆయన ఆసుపత్రి మెట్లెక్కాల్సివచ్చింది. బయట వేలాది మంది అభాగ్యులు తమ బంధువుల కోసం ఆకలితో ఆలమటిస్తూ కూర్చున్నారు. వారి దగ్గర పైసా కూడా లేకపోవడం హేమంత్ గమనించాడు. మళ్లీ పాత చేదు జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. లోపలి నుంచి తన్నుకువస్తోన్న దుఃఖాన్ని నియంత్రించుకోవడం అతని వల్లకాలేదు. ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు. ఆసుపత్రుల్లో ఆకలితో వేచి ఉండేవారికోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు. తన క్యాటరింగ్ సంస్థ నుంచే ఆహారాన్ని ఉచితంగా సరఫరా చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే 200 మందికి ఆహారాన్ని తయారు చేసి ఆసుపత్రికి వెళ్లి అందించాడు. అన్నం, పప్పు, రోటీ.. ఇలా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోగులకు, బంధువులకు అందించడాన్ని దినచర్యగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన రోజూ 300 మంది ఆకలి తీర్చగలుగుతున్నాడు. ఇందుకుగానూ నెలకు రూ.60 వేలకుపైగా వెచ్చిస్తున్నాడు. దశాబ్దకాలంగా రోగుల సేవలో మునిగిపోయిన 58 ఏళ్ల హేమంత్‌కు రోజురోజుకీ పెరుగుతోన్న వయసు కూడా అడ్డంకులు సృష్టిస్తోంది. దాతలు, వలంటీర్లు ముందుకు వస్తే ఈ సేవను నిరంతరాయంగా కొనసాగించొచ్చని హేమంత్ పటేల్ చెబుతున్నాడు. -
మీరెక్కడున్నారో చెప్పే గ్లిమ్ప్స్..
ఆఫీసు నుంచి ఇంటికెళ్లడం కొంచెం ఆలస్యమైనా సరే.. వెంటవెంటనే ఆప్తుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయా? ఎక్కడున్నావు? ఎంతసేపు పడుతుంది? అన్న ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఇకపై వారి స్మార్ట్‌ఫోన్స్‌లో గ్లిమ్ప్స్ అప్లికేషన్ ఉండేలా చూసుకోండి. అంతా సరిపోతుంది. ఎలాగంటారా? ఏ నిమిషానికి మీరు ఎక్కడున్నదీ దీనిద్వారా ఇతరులకు తెలియజేయవచ్చు మరి. ఆఫీసు నుంచి బయలుదేరిన వెంటనే ఒకసారి ఆన్ చేస్తే చాలు. మీరు ముందుగా ఫీడ్ చేసిన నెంబర్లకు మీరున్న ప్రాంతపు సమాచారం తెలిసిపోతుంది.