దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా? | Cambodian Pchum Ben Festival Is A Time To Feed Hungry Ghosts With Merit, Know Interesting Facts Inside - Sakshi
Sakshi News home page

Cambodian Pchum Ben Festival: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?

Published Mon, Dec 4 2023 4:32 PM | Last Updated on Mon, Dec 4 2023 6:05 PM

Cambodian Pchum Ben Festival Feed Hungry Ghosts - Sakshi

ప్రతీ దేశానికి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆ సంప్రదాయాలను చూస్తే అవాక్కవ్వల్సిందే. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. పైగా ఆ పండుగ చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుందట. 

కంబోడియాలో జరుపకునే విచిత్రమైన పండుగ దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్‌. ఇది అక్కడ చాలా ఫేమస్‌ పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్‌ పండుగ' అని కూడా పిలుస్తారు. ఇది 15 రోజులు పాటు జరుపుకునే ఉత్సవం. సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య కాలంలో జరుపుకుంటారు. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ టైంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసల వద్ద సంచరిస్తాయిని విశ్వసిస్తారు కంబోడియా వాసులు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు.

ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి మరీ పెడతారు. అయితే ఇలా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్లం ఉండదు. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు వాటిల్లకుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు.

ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్‌ బెన్‌"గా వ్యవహారిస్తారు. ఈ పండుగు 19వ శతాబ్దం కింగ్‌ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేగాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది కూడా. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడకు వివిధ ఆత్మలు వచ్చి ఆహారపదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు. ఏదీఏమైనా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ పండుగ. 

(చదవండి: మిస్టీరియస్‌ 'భాన్‌గఢ్‌కోట‘!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement