hungry
-
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?
ప్రతీ దేశానికి విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని దేశాల్లో పండుగలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఆ సంప్రదాయాలను చూస్తే అవాక్కవ్వల్సిందే. అలాంటి విచిత్రమైన సంప్రదాయమే కంబోడియాలో ఉంది. పైగా ఆ పండుగ చేసుకోవడం కోసం ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవు ప్రకటిస్తుందట. కంబోడియాలో జరుపకునే విచిత్రమైన పండుగ దెయ్యాలకు ఆహారం పెట్టే ఫెస్టివల్. ఇది అక్కడ చాలా ఫేమస్ పండుగ. దీన్ని అక్కడ ప్రజలు 'ఖైమర్ పండుగ' అని కూడా పిలుస్తారు. ఇది 15 రోజులు పాటు జరుపుకునే ఉత్సవం. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో జరుపుకుంటారు. ఆకలితో ఉన్న దెయ్యాలు ఆ టైంలో నరక ద్వారం నుంచి బయటకు వచ్చి తమ నివాసల వద్ద సంచరిస్తాయిని విశ్వసిస్తారు కంబోడియా వాసులు. ఆ సమయంలోనే నరక ద్వారాలు తెరచుకుంటాయని, అందువల్లే వివిధ రకాల ఆత్మలు తమ నివాసాల వద్దకు వస్తాయని చెబుతున్నారు. ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల కోసం వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి మరీ పెడతారు. అయితే ఇలా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ఎందుకంటే దెయ్యాలకు వెలుతురు ఇష్లం ఉండదు. అవి చీకటిలోనే ఉంటాయి. అందుకని ఉదయం లేచి సూర్యోదయం కాకమునుపే తమ కుటుంబంలో చనిపోయిన బంధువులను తలుచుకంటూ ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే రాక్షసులు సంతోషిస్తారట. అందువల్ల తమకు ఎలాంటి కీడు వాటిల్లకుండా ఉండటమే గాక సంతోషంగా జీవించగలుగుతామని చెబుతున్నారు. ఈ పండుగ రోజును తమ చనిపోయిన ఏడు తరాల బంధువులను తలుచుకుని భోజనం పెడతారు. దెయ్యాలు ఇలా తమ బంధువుల పేరు మీద పెట్టిన భోజనాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని తింటాయని అంటున్నారు. దీన్ని "ఫచమ్ బెన్"గా వ్యవహారిస్తారు. ఈ పండుగు 19వ శతాబ్దం కింగ్ ఆంగ్ డుయోంగ్ కాలం నుంచి ప్రజలు ఆచరిస్తున్నారు. అంతేగాదు ఈ పండుగ చివరి రోజున జరుపుకునే ఉత్సవానికి అక్కడి ప్రభుత్వం సెలవు ఇస్తుంది కూడా. పండుగ చివరి రోజున దెయ్యాల కోసం ఓ పడవలో నిండుగా వివిధ రకాల పిండి పదార్థాలన్ని పెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడకు వివిధ ఆత్మలు వచ్చి ఆహారపదార్థాలతో ఆకలి తీర్చుకుని తిరిగి నరకానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు కంబోడియా ప్రజలు. ఏదీఏమైనా చాలా విచిత్రంగా ఉంది కదూ ఈ పండుగ. (చదవండి: మిస్టీరియస్ 'భాన్గఢ్కోట‘!..ఆ సమయంలో గానీ కోటలోకి అడుగుపెట్టారో అంతే..!) -
దయనీయ స్థితిలో ముగ్గురు అమ్మాయిల కథ
అమ్మ దూరమైంది.. నాన్న జైలు పాలయ్యాడు.. అలాన లేదు.. పాలనలేదు.. ఆకలికి అన్నం లేదు.. పస్తులు ఉంటున్నారు.. కాలే కడుపుతో తల్లడిల్లుతున్నారు.. ఆకలి తీర్చుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. నాన్న చేసిన తప్పుకు పిల్లలేందుకు శిక్ష అనుభవిస్తున్నారు.. అకలితో అలమటిస్తున్నా ముగ్గురు పిల్లలపై స్పెషల్ రిపోర్టు.. సాక్షి, ఆదిలాబాద్: కన్నకూతుళ్లను అమ్మిన కేసులో ఆదిలాబాద్ జిల్లా బంగారి గూడలో నివసించే గంగాధర్ అరెస్టై జైలుపాలయ్యారు.. గంగాధర్, ఆయన భార్య రాధ బంగారి గూడలో కూలీ పనులు చేసుకోని జీవనం సాగించేవారు. వీరికి ఆడపిల్లలు ఉన్నారు. మగబాబు కావాలని భావించారు. ఈ క్రమంలో గతేడాది రాధ మరోసారి గర్భం దాల్చింది. కానీ ఈసారి కూడా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె మరణించింది. అయితే అప్పటికే గంగాధర్ ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఇద్దరు కవలలు జన్మించడంతో అయిదుగురి పిల్లల పెంపకం భారమైంది. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక భార్య చనిపోయిన తర్వాత ఎనిమిది నెలల క్రితం ఇద్దరు ఆడ పిల్లలను అమ్మేశాడు తండ్రి గంగాధర్. కర్ణాటకకు చెందివారికి మూడు లక్షలకు కూతుర్లను అప్పగించాడు. అయితే అమ్మకం దందా బయట పడటంతో పోలీసులు గంగాధర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. గంగాధర్ జైలు పాలుకావడంతో ముగ్గురు అడ పిల్లలు దిక్కులేని పక్షులయ్యారు. ఇంటి వద్ద అమ్మ లేదు. నాన్న లేడు. తల్లిని కోల్పోయిన పిల్లలను గంగాధర్ ఇన్ని రోజులు కూలీ పనులు చేసి పోషించేవాడు. కానీ ఇప్పుడు అతడు కూడా జైలుగోడల మధ్య మగ్గుతున్నాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కనీసం తినడానికి తిండలేక. ఇబ్బందులు పడుతున్నారు. ఆకలికి అన్నం దొరక్క పస్తులు ఉంటున్నారు. కడుపు నిండా తిండిలేక.. కంటి నిండా నిద్రలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. ఆకలికి తీర్చుకోవడానికి వాళ్ల తాతతో కలిసి బిక్షాటన చేస్తున్నారు. బిక్షాటనలో అన్నం దొరికితే తింటున్నారు. లేదంటే పస్తులు ఉంటున్నారని పిల్లల తాత అవేదన వ్యక్తం చేశారు. పిల్లలను, తమను చూసే వాళ్లు ఎవరు లేరని వాపోయారు. కనీసం పిల్లల ఆకలిని తీర్చడానికి దాతలు, ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. -
ఓ విద్యార్థి ఆకలితో..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..
ఓ విద్యార్థి ఆకలితో ఉండటంతో చేసిని తమషా పని చూస్తే ఆశ్చర్యం తోపాటు కోపం కూడా వస్తుంది. ఆకలిగా ఉందని ఏకంగా ఓ కళాకృతి లాగించేస్తాడు. ఈ విచిత్ర ఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ మ్యూజియం సందర్శించడానికి వచ్చిన విద్యార్థికి మంచి ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ మ్యూజియంలో కమెడియన్ అనే గోడపై ఉన్న బనానా ఆర్ట్‌గా పిలిచే అరపండు కళాకృతిని లాగించేశాడు. అసలు ఏంటి ఇది అంటే.. ఒక గొడకు అరటిపండును టాప్ చేసే పెట్టే ఒక రకమైన ఆర్ట్ వర్క్ ఇది. ఆ విద్యార్థి ఆకలివేయడంతో ఆ అరటిపండుని కామ్‌గా తినేసి, తొక్కను గోడకు టాప్ చేసి రకరకాలుగా ఫోజులిచ్చి వెళ్లిపోయాడు. ఐతే ఆ కళాకృతి ధర ఏకంగా రూ. 98 లక్షలట. ఇలా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన బనానా కళాకృతిని లాగించేయడం మొదటిసారి కాదట. ఇంతకు మునుపు 2019లో కూడా ఈ కళాకృతి సుమారు రూ. 98 లక్షలకు విక్రయించబడ్డక తినేశారట. ఈ కళాకృతిని కళాకరుడు మారిజియో కాటెలన్ రూపొందించాడు. ఆయన ప్రతి ఏడాది మ్యూజియంలో ఈ కళాకృతిని ప్రదర్శిస్తాడని, అరటిపండును మార్చడం జరగుతుంటుందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం) -
షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది
- కంచర్ల యాదగిరిరెడ్డి తిండి కలిగితే కండగలదోయ్... కండ కలవాడేను మనిషోయ్.. అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు. 2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. శక్తి అవసరాలను తీర్చగలగాలి ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్‌లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్ఏఓ చెపుతోంది. ఆఫ్రికాలోనే సగం దేశాలు సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది. ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్బైజాన్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్ నేషన్స్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగం హెడ్ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్‌కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు. ‘ఆహార వృథాను తగ్గించాలి’ ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు. పరిస్థితిని దిగజార్చిన కోవిడ్ ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ విషయం చెపుతోంది. ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. ► కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది. ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ. డిమాండ్‌కు తగ్గ ఆహారం కోసం.. ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 1.నేషనల్ న్యూట్రిషన్ మిషన్: పోషణ్ అభియాన్ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం 2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్‌కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది. 3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. -
స్ఫూర్తిదాయకం: పూట గడవని స్థితి నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా..
ముంబై: కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు మహారాష్ట్రకు చెందిన భాస్కర్ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి, తినేందుకు సరైన తిండి లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్‌లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ హలామి.. ప్రస్తుతం అమెరికాలోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్ఎన్ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్, పీహెచ్డీ కూడా పూర్తిచేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. తన చిన్న తనంలో తన కుటుంబం పడిన కష్టాలు, తినడానికి తిండి లేని రోజులను గుర్తు చేసుకున్నారు హలామి. ‘ ఒక్క పూట భోజనం కోసం చాలా ఇబ్బందులు పడ్డా. సరైన తిండి, పని దొరకని ఆనాటి రోజుల్లో ఎలా బతికామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురవుతుంది. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లం. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లం. మా ఊరిలో 90 శాతం ప్రజల పరిస్థితి ఇదే’ అని తెలిపారు భాస్కర్ హలామి. భాస్కర్ హలామీ తండ్రి ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకి చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ గుర్తు చేసుకున్నారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు.కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు. భాస్కర్ 4వ తరగతి వరకు కసనూర్‌లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్‌షిప్‌పై యవత్మల్లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్‌లో 10వ తరగతి వరకు పూర్తి చేశారు. గడ్చిరోలిలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్‌పూర్‌లో కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయినప్పటికీ.. భాస్కర్‌కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో పరిశోధనలు చేశారు. ‘మిషిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ’ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్‌లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. ఇదీ చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్ -
వైరల్ వీడియో.. 5 నిమిషాల్లో 3 కేజీల సమోసా తినేశాడు..
న్యూఢిల్లీ: ఆహార పోటీల గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు సైతం ఇస్తుంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ బహుమతులు ఇస్తున్నారు. అలాంటి.. సంఘటనే తాజాగా వైరల్‌గా మారింది. రాజ్నీశ్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారాడు. ఆ ఛాలేంజ్ పూర్తి చేయటం ద్వారా బులెట్ బైక్ గెలుచుకున్నాడు. అయితే, ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో 12 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో.. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్ ఓనర్ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1-2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్. అందుకు గానూ రెస్టారెంట్ ఓనర్ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఇదీ చదవండి: Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు! -
అయ్యో గజరాజా! పాపం ఆకలికి తట్టుకోలేక..
వైరల్: ఆకలి.. ఏ కడుపుకైనా ఒక్కటే!. గుప్పెడు పొట్ట ఉండే మనిషికే అంత ఆకలి ఉంటే.. భారీ కాయం ఉన్న ఆ జీవి మాత్రం తట్టుకోగలదా?. ఇక్కడ ఓ ఏనుగుకు వెన్ను ఎముకలు బాధాకరంగా పొడుచుకు వచ్చాయి. బక్కచిక్కిపోయి.. బలహీనంగా మారిపోయి ఆహారం కోసం అటు ఇటు తిరుగాడింది. దీనికితోడు జనాలు చేసే ఆ గోల దానిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పాపం.. ఈ విశాల ప్రపంచంలో ఆకలి తీర్చుకోలేక బాధతో అలమటించింది ఆ గజరాజు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా.. మూగజీవాలు జనవాసాల్లోకి రావడం పెద్ద విశేషం ఏం కాదు. కానీ, ఇక్కడ ఈ గజరాజు మాత్రం ఆకలికి తట్టుకోలేక వచ్చింది. అది అలా ఇలా కాదు. అందుకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఆకలిగొన్న ఆ అడవి ఏనుగు.. అస్సాం కజిరంగ నేషనల్ పార్క్ నుంచి బ్రహ్మపుత్ర నది గుండా ఈదుకుంటూ ముందుకు సాగింది. చివరకు తేజ్పూజ్ నగరానికి ఆదివారం సాయంత్రం చేరుకుంది. ఏనుగు రాకతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రావడం రావడంతోనే నగరంలో అలజడి సృష్టించింది ఆ గజం. near govt. boys, tezpur pic.twitter.com/k5LQ2IW02n — vishal junak das (@junaaaak) August 27, 2022 వీధుల్లో తిరుగుతూ.. తిండి కోసం చాలా చోట్లకు వెళ్లింది. లాభం లేదు. చన్మరీ ప్రాంతంలో ఓ ఇంటి వంట గదిలోకి వెళ్లింది కూడా. అక్కడ ఏం దొరకలేదు. దీంతో తేజ్‌పూర్ షిప్ పోర్ట్ గుండా చిత్రలేఖ పార్క్‌లోకి వెళ్లింది. అక్కడ వందల మంది దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఆపై అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్టాండ్‌కు చేరుకుని.. జనాల గోల నడుమ చిరాకుతో రెండు బైకులను నాశనం చేసేంది. జిల్లా రవాణా విభాగపు కార్యాలయం గుండా నిర్జన ప్రాంతంలోకి ప్రవేశించింది. Dear mama, I am from tezpur & this elephant passes away just in front of my house last night. I just want you to interfere in this matter and make a close watch to the animals, just see the health condition of a wild animal. Shame on every human being. Save our nature pic.twitter.com/9hZoqvK9MX — Bikash Adhikari (@BikashA03668793) August 28, 2022 తిండి కోసం అది పడే తాపత్రయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సరికదా దానిని భయపెడుతూ మరింత అలజడికి కారణం అయ్యారు. చివరికి.. ఫారెస్ట్ సిబ్బంది దానిని బలవంతంగా అర్ధరాత్రి సమయంలో తిరిగి బ్రహ్మపుత్ర తీరం వైపే తరలించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. 🐘wild elephant enters tezpur. scene from chandmari-railgate area. pic.twitter.com/N5Gnt8HioK — vishal junak das (@junaaaak) August 27, 2022 అయితే.. ఏనుగు సృష్టించిన అలజడి.. విధ్వంసం వెనుక హృదయవిదారకమైన, కఠోర వాస్తవాలు ఉన్నాయి. వాటినే పలువురు నెటిజన్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. పాపం.. ప్రకృతిని నాశనం చేస్తూ.. అడవులనే వాటి ఆవాసాలను దెబ్బ తీస్తూ.. ఆకలికి దూరం చేస్తున్న మనిషి.. ఇప్పుడు దాని ఆకలి తీర్చలేకపోవడం దుర్మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సోషల్ మీడియాలో!. ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ దగ్గర బైక్ స్టంట్.. వాడికలా అవ్వాల్సిందే! -
ఆకలి పోరాటం వర్సెస్ మందుకై ఆరాటం
హైదరాబాద్ : కరోనా కల్లోల సమయంలో విభిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. పనులు దొరక్క పస్తులుండే ప్రజలు ఓవైపు ఆకలి కేకలు వేస్తుంటే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించి మత్తు కోసం ఆరాటపడుతున్నవారు మరో వైపు ఉంటున్నారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గించేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి పట్టెడన్నం కోసం క్యూలైన్లలో అవస్థలు పడే వారు ఓ వైపు ఉంటే... కరోనాను లెక్క చేయక, భౌతిక దూరం పాటించకుండా వైన్స్ షాపుల ముందు మందలా పేరుకుపోయేవారు మరికొందరు. తిండి కోసం లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతో మంది దుర్గా ఘాట్ సమీపంలో ఫ్లైఓవర్ కింద ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహారం అందించేందుకు ఎవరు వచ్చినా వందల మంది లైన్లలో నిల్చుంటున్నారు. కిక్కు కావాల్సిందే మరోవైపు చైతన్యపేట సమీపంలో మద్యం షాపు ముందు భౌతిక దూరం పాటించకుండా మందలా పోటీలు పడుతున్నారు మందు బాబులు. ఆదివారం కావడంతో కిక్కు కోసం కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టారు. చిత్రాలు: చక్రపాణి -
ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం
మనుషుల మాదిరి జంతువులకు దాదాపు అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఉంటాయి. తాజాగా ఓ శునకానికి యమ కోపం వచ్చేసింది. ఆకలవుతుందని భౌ భౌ అని అరుస్తుంటే ఎంతకీ యజమాని పట్టించుకోవడం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆ శునకం తిన్నె గిన్నెను నోటితో కరచుకుని విసిరి కొట్టేసింది. దానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్ఎస్) ప్రవీణ్ అంగుసామి తన పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు. తనకు ఆకలి అయ్యిందని ఆ కుక్క అరుస్తుంటుంది. కొద్దిసేపటికి కోపమొచ్చి వెంటనే గదిలోకి వెళ్లి తాను తినే గిన్నెను నోటితో పట్టుకొచ్చి ఎత్తేసింది. ‘0.5 సెకండ్ల తర్వాత నాకు ఆకలి అవుతుంది’ అని దానికి సంబంధించిన వీడియోను ప్రవీణ్ పంచుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి. ఎంత కోపం? ఆకలైతే అంతే.! తదితర కామెంట్లు చేస్తున్నారు. మీరు చూసేయండి ఆ వీడియో.. -
ఇటు ఆకలి, అటు ఆహార ధాన్యాల వృధా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో గత జనవరి ఒకటవ తేదీ నాటికి పాడైన ఆహార ధాన్యాలు 7.2 లక్షల టన్నులు ఉండగా, మే ఒకటవ తేదీ నాటికి, అంటే నాలుగు నెలల కాలంలో అవి 71.8 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే దాదాపు 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. లాక్డౌన్ సందర్భంగా ‘పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ఏప్రిల్, మే నెలల్లో పేద ప్రజలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలకన్నా ఇవి ఎక్కువ. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు, ఆహార కొరత ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం భారత ఆహార సంస్థ ఈ ఆహార ధాన్యాలను ఏటా సేకరిస్తోంది. అయితే ఆహార ధాన్యాలను నిల్వచేసే గిడ్డంగుల సామర్థ్యం కన్నా ఎక్కువ ధాన్యాలను సేకరించడం, ఉన్న గిడ్డంగులు ఎప్పటికప్పుడు మరమ్మతులు నోచుకోక పోవడం వల్ల దేశంలో ఏటా ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. 2018, అక్టోబర్ నెల నుంచి దేశంలో ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువైంది. 2020, మే ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్థ గరిష్టంగా 668 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉండగా, 878 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సేకరించింది. ఆహార ధాన్యాల కొనుగోలుకే కాకుండా వాటి రవాణాకు, నిల్వకు భారత ఆహార సంస్థకు ఎంతో ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిల్వల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వాలు ఆహార ధాన్యాల కొనుగోలుతో పాటు, వాటి రవాణా, నిల్వకు అయ్యే ఖర్చును కూడా భరించేవి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ధాన్యం ధరనే చెల్లించి సరకును తీసుకుంటోంది. అదనపు నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సిందిగా భారత ఆహార సంస్థను కేంద్రం ఆదేశించింది. చాలా సందర్భాల్లో బహిరంగ మార్కెట్ రేటుకన్నా ఎక్కువ మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి సేకరించడం వల్ల, తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తంలో డబ్బు రాకపోవడం ఒకటైతే, మార్కెట్లో అదనపు నిల్వలను తక్కువ ధరకు అమ్మాల్సి రావడం, అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ధాన్యాలు పాడవడం వల్ల భారత ఆహార సంస్థ భారీగా నష్టపోతోంది. దాన్ని పూడ్చుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. 2019, డిసెంబర్ 31వ తేదీ వరకు ఆ సంస్థకు 2.36 లక్షల కోట్ల అప్పు పేరకు పోయింది. భారత ఆహార సంస్థ నిల్వల్లో ఎక్కువగా బియ్యం, గోధుమలే ఉంటాయన్న విషయం తెల్సిందే. అదనంగా సేకరించిన దాదాపు 200 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఏం చేయాలో భారత ఆహార సంస్థకు అర్థం కావడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేవలం 36 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే ఆ సంస్థ బహిరంగ మార్కెట్లో విక్రయించగలిగింది. కరోన లాక్డౌన్ సందర్భంగా రైళ్లు, బస్సుల్లోనే కాకుండా కాలి నడకన స్వగ్రామాలకు బయల్దేరిన లక్షలాది మంది వలస కార్మికులు ఆకలి కోసం అల్లాడుతుంటే, ఏటా ఎంతో మంది పేదలు ఆకలితో అలమటించి చనిపోతుంటే మరోపక్క టన్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అవడం గమనిస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. -
ఆకలి కేకలు: కుక్క కళేబరమే ఆహారం
జైపూర్: ఆకలి.. ఆకలి.. ఆకలి.. ఎన్నిసార్లు రోదించాడో, ఎందరిని వేడుకున్నాడో. కనికరం లేని విధి, జాలి చూపని సమాజం అతని పాలిట శాపంగా మారాయి. ఆకలి తీర్చే నాథుడు లేక, క్షణక్షణానికి కడుపులో పేగులు మాడిపోతుంటే కళ్ల ముందు కనిపించిన కుక్కే ఆహారంగా తోచింది. చచ్చి, పేగులు ఊడి, కళేబరం మిగిలి ఉన్న కుక్క శవాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో విందుగా ఆరగించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాజస్థాన్‌లో జరిగింది. వలస కార్మికులు రోడ్ల వెంబడి మండుటెండలో పిల్లాజెల్లాను ఓవైపు, సామానో వైపు మోస్తూ స్వస్థలాలకు చేరేందుకు బహుదూరపు బాటసారులుగా మారుతున్నారు. (ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు..!) ఈ క్రమంలో గమ్యం చేరేలోపు తనువు చాలించిన వాళ్లు కొందరు. దహిస్తున్న ఆకలితో మధ్యలోనే ప్రాణాలు వదిలిన వాళ్లు మరికొందరు. తాజాగా ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై ఓ వలస కార్మికుడు ఆకలితో అలమటించిపోయాడు. గుప్పెడు మెతుకులు తినక ఎన్నాళ్లయ్యిందో.., కళ్లెదురుగా రోడ్డు మీద పడి ఉన్న కుక్క శవాన్ని భుజించాడు. దీన్ని అటుగా వెళ్తున్న ప్రధుమన్ సింగ్ నరుక అనే ప్రయాణికుడు వీడియో తీశాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రధుమన్ అతడికి కాసింత భోజనం అందించడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. (వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం) Person witnesses a man purportedly eating dead dog's meat he found on road. Helps him by offering food.#Hunger #MigrantWorkers #MigrantsOnTheRoad #migrants pic.twitter.com/51LpXQ7qUj — The Rational Daily (@RationalDaily) May 19, 2020 -
అమానవీయం : ఆకలితో రోడ్డుపైనే మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరెంటు షాకు తగిలి ఒక కాకి కిందపడితే వందలాది కాకులు చుట్టుముడుతాయి. ఒక వానరం గాయపడితే లెక్కలేనన్ని కోతులు వచ్చి అది కోలుకునేదాకా సపర్యలు చేస్తుంటాయి. పశుపక్ష్యాదుల్లో ఉన్న జాలి, దయా గుణం సాటి మానవుల్లో కనిపించడంలేదు. చెన్నైలో ఒక వ్యక్తి అకారణంగా ప్రాణాలు కోల్పోయాడు. స్వయానా సోదరి సైతం కరోనా వ్యాధిగ్రస్తునిగా ముద్రవేసి రోడ్డు పాలుచేయగా అతడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక రూము తీసుకుని రవి (53) కూలీపనులు చేసేవాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రూమును ఖాళీచేసి చెన్నై కుమరన్ నగర్ సమీపం జాఫర్ఖాన్లోని తన సోదరి ఇంట్లో ఉండేవాడు. ఇటీవల అతడికి తీవ్రమైన దగ్గు రావడంతో వైరస్ లక్షణాలుగా అనుమానించి వైద్యపరీక్షలకు వెళ్లివచ్చాడు. సోదరి, పరిసరాల్లోని ప్రజలు అతడిని అనుమతించలేదు. ప్రజలు తీవ్రంగా అడ్డుకోవడంతో అదే ప్రాంతంలో సోదరి ఇంటికి వంద అడుగుల దూరంలో రోడ్డు వారగా ఉండిపోయాడు. కనీసం ఆకలి, దప్పులు తీర్చేందుకు సైతం ఎవ్వరూ అతడి వద్దకు రాలేదు. గమనించుకునేవారు లేక ఆకలితో అలమటించిపోయాడు. ఆరోగ్య కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ శుక్రవారం ఉదయం జాఫర్‌ఖాన్‌పేటకు వచ్చారు. రోడ్డు వారగా ఉన్న రవి వద్దకు వెళ్లి పరిశీలించగా ప్రాణాలు కోల్పోయి ఉండడంతో గగుర్పాటుకు గురయ్యారు. వెంటనే కార్పొషన్ అధికారలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ వచ్చింది. రోగి మరణించడంతో ఎక్కించుకోనని అంబులెన్స్ డ్రైవర్ నిరాకరించాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు రవి చనిపోగా సాయంత్రం 4.30 గంటల వరకు శవం రోడ్డుపైనే ఉండిపోయింది. ఆ తరువాత చెన్నై కార్పొరేషన్ కోడంబాక్కం మండలాధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తిచేసి రవి భౌతికకాయాన్ని అప్పగించేందుకు సిద్ధం కాగా అతడి సోదరి నిరాకరించారు. అంతేగాక సోదరి ఇంటి యజమాని కూడా అంత్యక్రియలు జరిపేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టం రిపోర్టు రాగా రవికి కరోనా వైరసే కాదు ఎలాంటి అనారోగ్యం లేదని తేలింది. కరోనా అనుమానంతో ఒక వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయేందుకు పరోక్షంగా కారకులైన స్థానికులను కొందరు దుయ్యబడుతున్నారు. -
అయ్యో పెద్దపులి
మైసూరు: ఆకలితో అలమటించిన పెద్దపులి చివరకు ప్రాణాలు వదిలిన ఘటన శుక్రవారం మైసూరు జిల్లా బండీపుర అభయారణ్యం పరిధిలోని కాళయ్యనకట్టె వద్ద జరిగింది. రెండురోజుల క్రితం బండీపురలోని సోమనాథపుర అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు పులి కనిపించింది. దీంతో పులిని బంధించడానికి ముమ్మరంగా యత్నించారు. చివరకు పులి విగతజీవిగా కనిపించింది. పులి కళేబరానికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు అది ఆకలి బాధతోనే చనిపోయినట్లు తెలిపారు. -
భూగోళంపై ఆకలి కేకలు
వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పులతో ప్రపంచ ప్రజల ఆకలి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆహార కొరత కొద్దిగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం జనాభాలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. తీవ్రమైన వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని కూడా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 2018 పౌష్టికాహారం, ఆహారభద్రతా రిపోర్టు ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హెచ్చరికలు జారీచేసింది. 2015 నుంచి గత మూడేళ్ళుగా వరసగా ప్రపంచ ప్రజలు ఆకలితీవ్రత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని అధ్యయనం తేల్చిచెప్పింది. గత ఒక్క యేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 8.21 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలు తీవ్రమైన ఆహార కొరతతోనూ, పౌష్టికాహారలోపాన్నీ ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు కరువు కాటకాలు తాండవిస్తోంటే, మరోవైపు నదులు, సముద్రాలు పొంగిపొర్లి వరదలు ముంచెత్తుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ రెండు భిన్నమైన పరిస్థితులే 2017లో ఆర్థిక కుంగుబాటుకీ, ఆకలికీ కారణమౌతున్నాయని గుర్తించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రజలు ఆకలి నుంచి విముక్తికోసం అర్థిస్తున్నట్టు వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదౌతోన్న అధిక ఉష్టోగ్రతలు చివరకు ఆకలి ప్రపంచాన్ని సృష్టించాయని ఆక్స్‌ఫామ్ జిబిలో ఆహారమూ, వాతావరణ విధానాల శాఖాధిపతి రాబిన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 2018లో సైతం తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని చూసామన్నారు. గత కొద్ది నెలలుగా పరిస్థితి మరింత భయానకంగా తయారైందన్నారు. ఐక్యరాజ్య సమితి రిపోర్టు ప్రకారం ప్రపంచంలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం ఉన్నప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వర్షపాతంలో మార్పుల వల్ల గత ఐదేళ్ళలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనీ, దీనివల్ల గోధుమ, వరి లాంటి కీలక పంటలు దెబ్బతింటున్నాయనీ రిపోర్టు వెల్లడించింది. కరువు కాటకాలను తట్టుకునేందుకు తక్కువ నీళ్ళు అవసరమైన పంటలను వేయడం వర్షపాతానికి అనుగుణంగా పంటమార్పిడీ పద్ధతులను అవలంభించక తప్పని పరిస్థితి రైతులకు ఎదురయ్యింది. యూనిసెఫ్, వ్యవసాయాభివృద్ధి సహాయక సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పౌష్టికాహారం 2018 నివేదికని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ జయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తక్షణమే తీవ్ర వాతావరణ మార్పులపై స్పందించాలని ఈ రిపోర్టు ముందు మాటలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6.72 కోట్ల మంది ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్తూలకాయంతో అవస్త పడుతున్నవారే. పౌష్టికాహారలోపమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల మంది ఐదేళ్ళలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలు ఉండాల్సిన ఎత్తుకంటే చాలా పొట్టిగా ఉండడానికి సైతం పౌష్టికాహారలోపమే కారణం. అయితే 2012లో ప్రపంచవ్యాప్తంగా 1.65 కోట్ల మంది చిన్నారులు ఎదుగుదలా లోపంతో ఉన్నారు. 2012 కంటే ఇప్పుడు కొంత మెరుగైనా మొత్తం ఆసియాలోనే 55 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను ఎదుగుదల లోపం బాధపెడుతోంది. ప్రతి ముగ్గురు గర్భిణీల్లో ఒకరు రక్తహీనతతో అనారోగ్యంపాలవుతున్నారు. ఇది వారి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 శాతం పిల్లలకే ఆరునెలల పాటు తప్పనిసరిగా యివ్వాల్సిన తల్లిపాలు లభ్యం అవుతున్నట్టు ఈ నివేదిక తేల్చింది. -
అమ్మా.. ఆకలి!
ఈ విద్యార్థి పేరు లోక్‌నాథ్. గద్వాల మండలం గుర్రంగడ్డ దివి గ్రామం. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజు పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాడు. ఇంటి నుంచి ఉదయం 6గంటలకు పాఠశాలకు బయల్దేరుతాడు. పుట్టిలో కృష్ణానదిని దాటి బీరెల్లి గ్రామం నుంచి బస్సు ద్వారా గద్వాలకు ఉదయం 8.30 గంటల వరకు చేరుకుంటాడు. సాయంత్రం తిరిగి ప్రత్యేక తరగతులు పూర్తయిన వెంటనే 5.45 గంటలకు పాఠశాల నుంచి గ్రామానికి బయల్దేరుతాడు. ఇంటికి చేరుకునే వరకు రాత్రి 7 నుంచి 8 గంటలవుతుంది. పొద్దస్తమానం మధ్యాహ్నం పాఠశాలలో పెడుతున్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆకలిని తట్టుకోలేక ఖాళీ కడుపుతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నాడు. గద్వాల : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలే దిక్కు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మళ్లీ సాయంత్రం గంటన్నరపాటు తరగతులు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దానికి తోడు ఉదయం ఇంట్లో అల్పాహారం అందక పాఠశాలలో ఎవరూ పెట్టక విద్యార్థులు కడుపులు మాడ్చుకొని చదువుకోవాల్సి వస్తోంది. అల్పాహారం అందక అవస్థలు పదో తరగతి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం ఫలితాలు, ఉత్తీర్ణతపై దృష్టిసారించిన విద్యాశాఖ విద్యార్థుల ఆకలిని పట్టించుకోవడంలేదు. విద్యార్థులు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలలోనే గడపాల్సి వస్తుంది. అందరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థులే కావడంతో అంత ఉదయం వంట చేయడం సాధ్యం కాదు. పరిగడుపుతో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్నం వరకు కడుపు మాడ్చుకుంటున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆకలి పెరగడంతో నీరసించి తరగతిలో విన్న పాఠాలు అర్థంకాని పరిస్థితి ఉంది. గత విద్యా సంవత్సరం ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల వడ్డీ డబ్బుల నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆ అవకాశం లేకపోవడంతో బిస్కెట్లతో సరిపెట్టారు. ప్రస్తుతం ఆ విధానంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పిల్లలు ఆకలితో అవస్థలు పడుతున్నారు. దాతలు సహకరించాలి ఆయా గ్రామాల్లోని దాతలు ముందుకొచ్చి నిరుపేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సహకరిస్తే చదువుపై దృష్టి సారించి ప్రతిభ కనబరిచే అవకాశముంది. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం విద్యార్థులను పట్టించుకుని అల్పాహారం అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంకా నెలరోజుల సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ఎవరైనా దాతలు వస్తే విద్యార్థుల ఆకలి బాధలు తీరుతాయి. ఆకలి తట్టుకోలేక పోతున్నాం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాం. మాకు ఎవరూ ఎలాంటి అల్పాహారం ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క మధ్యాహ్న భోజనం తప్ప కడుపులో ఏమీ ఉండడం లేదు. 8 గంటల పాటు పాఠాలు వినడం వల్ల ఆలసిపోతున్నాం. సాయంత్రం వేళ బాగా ఆకలి వేస్తోంది. తట్టుకోలేకపోతున్నాం. – జ్యోతి, విద్యార్థిని, మెలచేర్వు గ్రామం నిధులు లేవు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కోసం నిధులు రాలేదు. కొన్ని చోట్ల దాతల సహాయంతో అల్పాహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. ఆయా గ్రామాల్లో దాతలు ముందుకువచ్చి విద్యార్థులకు సహకరించాలి. ఒకవేళ ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అల్పాహారం సమకూరుస్తాం. – వేణుగోపాల్, డీఈఓ -
అడవి వరి.. తీరుస్తుందా ప్రపంచం ఆకలి?
ఆస్ట్రేలియాలో ఇటీవల గుర్తించిన పురాతన వరి వంగడాలకు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని, పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయని అంటున్నారు క్వీన్స్‌ల్యాండ్ అలయన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్‌కు చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ హెన్రీ. వాతావరణ మార్పుల ప్రభావంతో పంట దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళనలు వినిపిస్తున్న తరుణంలో... కరువు కాటకాలను తట్టుకోవడమే కాకుండా.. ఎక్కువ దిగుబడులు ఇవ్వగల లక్షణాలున్న వరి వంగడాలు ఎంతో ఉపయోగపడతాయన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో హెన్రీ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతంలోని కొన్ని అడవి వరి మొక్కలను పరిశీలించింది. వీటిల్లో కనీసం రెండింటికి మంచి లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. ఇవి సంప్రదాయ వరి వంగడాలతో సంకరం చేసేందుకు అనువుగా ఉన్నాయని, అగ్గితెగులుతోపాటు, బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ తెగులును కూడా తట్టుకోగలవని హెన్రీ తెలిపారు. అడవి వంగడాలు మంచి పోషక గుణాలు కలిగి ఉన్నాయని, అమైలోజ్ ఎక్కువగా ఉండటం వల్ల తేలికగా జీర్ణం కావడంతోపాటు కడుపు/పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుందని వివరించారు. -
రేషన్ ఇవ్వలేదు. ఆకలితో అలమటించి..
బరేలీ (ఉత్తరప్రదేశ్): చూడటానికి బక్కపలుచగా, బొక్కలు కనిపించేలా ఉండే 50 ఏళ్ల షకీనా అష్ఫక్ మంగళవారం తన ఇంట్లో ప్రాణాలు విడించింది. ఐదురోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఇంటిపెద్ద కావడంతో షకీనా పేరిట రేషన్ కార్డు ఉంది. కానీ, పక్షవాతంతో మంచం పట్టిన షకీనా వేలిముద్రలు ఇవ్వడానికి ఈ నెల రేషన్ షాప్‌కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ నెల కోటా చౌకబియ్యం ఆమె కుటుంబానికి ఇవ్వడానికి రేషన్ దుకాణం నిరాకరించింది. దీంతో అన్నం లేక.. ఆకలితో అలమటించి షకీనా ప్రాణాలు విడించిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. బరేలీలో జరిగిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆకలితో కాదు అనారోగ్యంతోనే షకీనా చనిపోయిందని యోగి సర్కారు ఇంతకుముందు వాదించింది. ఆమె కుటుంబసభ్యులు మాత్రం నవంబర్ నెలకు తమకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ఇవ్వలేదని, షకీనా ఇంటిపెద్ద కావడంతో ఆమె పేరిట రేషన్ కార్డు ఉందని, అనారోగ్యంతో ఉన్న ఆమెను రిక్షాలో సైతం రేషన్ దుకాణం తీసుకెళ్లడానికి కుదరలేదని, ఈ విషయాన్ని రేషన్ దుకాణంలో వివరించి ఈ నెల చౌకబియ్యం ఇవ్వాల్సిందిగా వేడుకున్నామని, అయినా, బయోమెట్రిక్ లేనిదే చౌకబియ్యం ఇవ్వడం కుదరదని రేషన్ డీలర్ తెలిపాడని షకీనా భర్త మహమ్మద్ ఇషాక్ తెలిపారు. షకీనా అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, కానీ, ఆహారం లేక ఆమె ఆకలితోనే ప్రాణాలు విడిచిందని ఆయన తెలిపారు. అయితే, ప్రభుత్వ అధికారులు మాత్రం ఆధార్ లేకపోతే.. రేషన్ ఇవ్వకూడదన్న ఆదేశాలు ఏమీ లేవని, ఈ షకీనా కుటుంబానికి రేషన్ అందకపోవడం, ఆమె మరణంపై విచారణ జరుపుతున్నామని తెలుపుతున్నారు. -
ఖాళీ కడుపుతో ఏం చేస్తారంటే..
సాక్షి,న్యూఢిల్లీ: తరచూ బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉండే వాళ్లకు తాజా అథ్యయనం ఆలోచనలో పడవేస్తుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ప్రజలు భిన్నంగా ప్రవరిస్తారని ఓ సర్వేలో వెల్లడైంది.విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు కోపం, అసహనం, ఏకాగ్రత కొరవడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఈ సర్వే పేర్కొంది. చెన్నై, కొచ్చి, న్యూఢిల్లీలో వారం పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. తమకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు తమ ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, విచిత్రంగా ప్రవరిస్తున్నామని సర్వేలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తమ మెదడు నుంచి పలు సంకేతాలు అందుతాయని దీంతో తాము గందరగోళానికి గురై పనుల పట్ల నిరాసక్తతో ఉంటున్నామని వారు చెప్పడం గమనార్హం. -
'ట్రైలర్ చూశాక.. బాహుబలి చూడాలనిపించలేదు'
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాపై బాలీవుడ్ తారలు ఇంకా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. హిందీ సినిమాలను మించి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరోలెవరూ స్పందించకపోవటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆలస్యంగా స్పందించిన షారూఖ్, సల్మాన్, ఆమిర్ లు సినిమా చూడలేదుగానీ.. బాహుబలి విజయం గర్వకారణం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా మరో బాలీవుడ్ నటి బాహుబలి సినిమాపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి ట్రైలర్ చూశాక ఈ సినిమా చూడాలన్న ఆసక్తి కలగలేదని తెలిపారు సయానీ గుప్తా. అంతేకాదు బాహుబలి లాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినా తాను అంగీకరించనన్నారు. బాహుబలిని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేమని, అది కేవలం భారీ చిత్రం మాత్రమేనని తెలిపారు. సయానీ ప్రస్తుతం నవాజుద్ధీన్ సిద్ధికీకి జోడి హంగ్రీ సినిమాలో నటిస్తున్నారు. -
ఉప్పు ఎక్కువగా తింటున్నారా..
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలి పెరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఉప్పుతో కూడిన ఆహారం వల్ల దాహం వేయకపోగా ఆకలిని కూడా పెంచుతున్నట్లు కాస్మోనాట్స్‌పై జరిగిన పరిశోధనలలో గుర్తించారు. జర్మనీలోని జర్మన్ ఏరో స్సేస్ సెంటర్(డిఎల్ఆర్) నుంచి అంగారకుడు మీదకు వెళ్లే పది మందిని రెండు గ్రూపులు విభజించి పరిశీలించారు. మొదటి గ్రూపును 105 రోజులు, రెండో గ్రూపును 205 రోజులు పరిశీలించారు. ఈ రెండు గ్రూపులకు కొన్ని వారాలపాటు ఒకే రకమైన ఆహారాన్ని ఇచ్చి, తరువాత ఉప్పును వేర్వేరు స్థాయిలలో అందించారు. ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారి మూత్రంలో ఉప్పు ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఇది ఎక్కువ నీరు తాగడం వల్ల జరగలేదని, ఉప్పు మూత్రపిండాలలోని నీటిని ఆదా చేయడం వల్ల జరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఉప్పులోని సోడియం, క్లోరైడ్ అయానులు నీటిఅణువులను లాక్కుని మూత్రం రూపంలో విడుదల చేశాయని చెప్పారు. మూత్రంలో ఉప్పు ఉంటే నీరు మూత్ర పిండాలనుంచి వెనక్కు అంటే శరీరానికి చేరుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇవే పరిశోధనలు చిట్టెలుకల మీద జరిపినప్పుడు యూరియా స్థాయిలు పెరగడాన్ని గమనించారు. యూరియా మూత్రపిండాల్లోని సోడియం క్లోరైడ్‌ని బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఎక్కువ ఉప్పు తీసుకున్న ఎలుకలలో యూరియాను సంకలనం చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దాంతో ఆకలి పెరుగుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా మనుషులలో కూడ ఇలానే జరుగుతుందనే విషయం కాస్మోనాట్స్‌పై జరిపిన పరిశోధనలో తేలింది. ఎందుకంటే వారు తమకు దాహం లేదుగాని బాగా ఆకలేస్తుందని చెప్పారు. -
ఆస్పత్రిలో ఆకలి కేకలు
– రోగులకు పట్టెడన్నం కరువు – ప్రత్యామ్నయ చర్యలు శూన్యం ధర్మాసుపత్రిలో రోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. కడుపు నింపుకోవడానికి పట్టెడన్నం కూడా కరువై.... అన్నమో..! రామచంద్రా అంటూ హోటళ్ల వద్దకు పరుగు తీస్తున్నారు. పట్టణానికి దూరంగా ఆస్పత్రి ఉండడంతో ఆటోలో వెళ్లి మరీ భోజనం తెచ్చుకుంటున్నారు. రాత్రిళ్లు అయితే రోగుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. పుంగనూరు ధర్మాసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రోగుల ఆకలి కేకలు శుక్రవారం ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమయ్యాయి. పుంగనూరు: కాంట్రాక్టర్ల ధన దాహం.. అధికారుల నిర్లక్ష్యంతో పుంగనూరు ధర్మాస్పత్రికి వస్తున్న పేద రోగులు ఆకలితో అలమటిస్తున్నారు. పుంగనూరు పట్టణానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే ధర్మాసుపత్రికి రోజుకు దాదాపు 100 నుంచి 150 మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఇదిలా ఉండగా ఇక్కడి రోగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందడంలేదు. ఇందుకు గాను సంబంధిత కాంట్రాక్టర్లకు ఒకొక్కరోగికి రూ.40 లు ఇస్తారు. ఇందులో ఉదయం అల్పహారంతో పాటు పగలు, రాత్రి భోజనం రోగులకు అందించాలి. బాలింతలకు బ్రెడ్డు, అరటిపండ్లు కచ్చితంగా పంపిణీ చేయాలి. ఏడాదిగా ప్రత్యామ్నాయం కరవు ఆస్పత్రిలో లాభదాయకంగా లేదని కాంట్రాక్టర్ ఏడాది క్రితమే పని మానేశాడు. దీనిపై ఆస్పత్రి అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యామ్నయ చర్యలు చేపట్టకపోవడంతో రోగులు , బాలింతల బాధలు వర్ణణాతీతం. ఆస్పత్రిలో క్యాంటీన్ లేకపోవడం, పట్టణానికి దూరంగా ఆస్పత్రి ఉండడంతో రూ.40ల భోజనం కోసం రూ.100లు ఖర్చు చే యాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. . ఆకలి కేకలు నిజమే ఈ విషయమై ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మూర్తి నాయక్‌ను సాక్షి వివరణ కోరింది. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు భోజనం పంపిణీ చేయకపోవడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాలేదంటున్నారని, దీని కోసం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన సమాధానమిచ్చారు. -
రాబిన్ హుడ్ సైన్యం ఆకలిపై యుద్ధం!
అది ఢిల్లీలోని ఓ మురికివాడ.. రాత్రి 9 గంటలు దాటింది. ఇంతలో అక్కడికి ఓ వ్యాను వచ్చి ఆగింది.. అప్పటిదాకా ఆ వ్యాను కోసం ఎదురుచూస్తున్న కళ్లల్లో ఒక్కసారిగా ఆనందం.. వ్యానులో నుంచి ఆకుపచ్చ రంగు చొక్కాల్లో ఉన్న కొందరు యువతీ, యువకులు దిగారు. వారి చేతుల్లో ఉన్న అన్నం పొట్లాలు పిల్లలందరికీ పంచారు. వారు తృప్తిగా భోజనం చేశాక అక్కడ నుంచి కదిలారు. వారే ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ (ఆర్‌హెచ్‌ఏ).. అంటే ధనవంతుల ఆస్తులను కొల్లగొట్టి పేదలకు పంచే సైన్యం అనుకుంటున్నారా? ఎంతమాత్రం కాదు.. పేదల కడుపు నింపేందుకు కంకణం కట్టుకున్న ఆదర్శసైన్యం. ఆకలితో పేగులు మాడుతుంటే.. మంచినీళ్లతో కడుపునింపుకొనే వారు మనదేశంలో కోకొల్లలు. తాము తినకున్నా.. తమ పిల్లలకు తినిపించి.. అర్ధాకలితో నిద్రపోయే తల్లిదండ్రులకు లెక్కేలేదు. వీరి సంగతి ఇలా ఉంటే.. రెస్టారెంట్లలో బిర్యానీలు, భోజనాలు, టిఫిన్లు ఆర్డర్ చేసి సగం తిని వదిలే వారి సంఖ్య కూడా మన దేశంలో తక్కువేం లేదు. ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని పూడ్చగలిగితే ఆకలి సమస్యకు పరిష్కారం దొరికినట్లే! అందుకే, దేశంలో ఆకలిపై కొందరు యువకులు యుద్ధం ప్రకటించారు. మిగులు ఆహారపదార్థాలతో పేదల ఆకలి కడుపులు నింపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తొలుత ఆరుగురితో మొదలైన ఈ సైన్యంలో ప్రస్తుతం 1000 మంది వలంటీర్లు ఉన్నారు. 18 నగరాలకు తమ సేవలను విస్తరించారు. 2.5లక్షల మందికి అన్నం పెడుతున్నారు. అందరినీ ఒప్పించి.. తన సంస్థ గురించి మిగిలిన మిత్రులకు వివరించారు రాబిన్ హుడ్. వీరిలో ఎక్కువమంది ఉద్యోగులే కావడం విశేషం. వారాంతాల్లో పనిచేయడానికి అందరూ అంగీకరించారు. తర్వాత నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలతో నీల్‌ఘోష్ బృందం మాట్లాడింది. వారు కూడా మిగిలిన ఆహారపదార్థాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలా వారి యజ్ఞం మొదలైంది. 2014లో ప్రారంభించిన కొత్తలో ఆర్‌హెచ్‌ఏ కేవలం 150 మందికి మాత్రమే ఆహారం పెట్టగలిగింది. ప్రస్తుతం 2.5లక్షల మంది ఆకలి తీర్చగలుగుతోంది. తొలుత కేవలం ఆరుగురు సభ్యులతో మొదలైన రాబిన్‌హుడ్ ఆర్మీలో ప్రస్తుతం 1000 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఆలోచన ఎలా వచ్చింది? నీల్‌ఘోష్ పోర్చుగల్‌లో ఉన్నపుడు అక్కడి రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ‘రీఫుడ్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సేకరించడం, దాన్ని పేదలకు సరఫరా చేయడం గమనించారు. ‘రీఫుడ్’ సంస్థ వ్యవస్థాపకులు హంటర్ హల్దర్‌తో నీల్‌ఘోష్ ఈ విషయమై మాట్లాడారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. వృథా అవుతోన్న ఆహార పదార్థాలతో ఇంత మంది కడుపు నింపవచ్చన్న ఆలోచన నీల్ని మాతృదేశం ఇండియా గురించి ఆలోచించేలా చేసింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భారత్‌లో తలపెడితే తిండిలేని లక్షలాదిమందికి కనీసం ఒకపూట అయినా కడుపునిండా భోజనం పెట్టగలమన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన మిత్రుడు ఆనంద్ సిన్హాతో కలిసి ఢిల్లీ కేంద్రంగా 2014, ఆగస్టు 26న రాబిన్‌హుడ్ ఆర్మీ (ఆర్‌హెచ్‌ఏ)ని స్థాపించారు. శత్రు దేశం ఆకలి కూడా తీరుస్తున్నారు.. ఢిల్లీతోపాటు 18 నగరాలకు తన సేవలను విస్తరించగలిగింది. ప్రతినగరంలోనూ పనిని బృందాలుగా విభజిస్తారు. ప్రతి బృందానికి ఒకరు టీం లీడర్‌గా వ్యవహరిస్తారు. కేవలం ఆహారం అందించడమే కాదు, ఇళ్లు లేని పేదలకు చలికాలం దుప్పట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సంస్థ చేస్తున్న సేవల గురించి విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలోనూ రాబిన్‌హుడ్ ఆర్మీ తన సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. ఆకలికి, సేవకు భౌగోళిక సరిహద్దుల్లేవని నిరూపించారు. -
ముల్కనూర్‌లో ఆకలి చావు
బతికుండగా కన్నెత్తి చూడక... శవం వద్ద ఆస్తి కోసం మృతుడి సోదరుడి కుమారుల తగాదా ఆస్తి పంపకం అయ్యాకే దహన సంస్కారాలు నిర్వహించిన వైనం భీమదేవరపల్లి (కరీంనగర్ జిల్లా) : ఓ వైపు ఎండ వేడిమి మరోవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఆకలితో అలమటించిన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన చిదురాల మచ్చఅరులయ్య(80) ఆదివారం మృతిచెందాడు. బతికుండగా కన్నెత్తి చూడని అతడి సోదరుడి కుమారులు అరుులయ్య శవం వద్ద ఆస్తి కోసం తగాదా పడ్డారు. పంపకాలు తేలాకే దహన సంస్కారాలు కానిచ్చారు. అరుులయ్యకు భార్య వీరమల్లమ్మ ఉంది. వీరికి ఓ కూతురు ఉండగా చిన్నప్పుడే చనిపోరుుంది. ఇంటి వద్ద రెండు గుంటల స్థలం, అందులో పూరి గుడిసె మినహా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించారు. నాలుగేళ్ల క్రితం వీరమల్లమ్మ అనారోగ్యంతో కనుమూసింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ అతడే వంట చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పూరిగుడిసె సైతం దెబ్బతిన్నది. వృద్ధాప్య పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు. 15 రోజులుగా విపరీతమైన ఎండలతో అనారోగ్యం బారిన పడితన అతడికి కనీసం అన్నం పెట్టేవారే కరువయ్యూరు. ఆరోగ్యం సహకరించక అన్నం వండుకునే పరిస్థితి లేకపోవడంతో నాలుగు రోజులుగా మంచానికే పరిమితమయ్యూడు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆదివారం వేకువజామున కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడి కుమారులు కుమారస్వామి, రాజేంద్రం, వీరమల్లు, శ్రీనివాస్ అక్కడి వచ్చారు. అరుులయ్య పేరిట ఉన్న రెండు గుంటల భూమి(రూ.3 లక్షలు విలువ) తమకే చెందాలని పట్టుబట్టారు. ముందుగా దహన సంస్కారాలు నిర్వహించాలని గ్రామపెద్దలు సూచించినా ఫలితం లేకపోరుుంది. ఆస్తి పంపకాలు తేలాలని పట్టుబట్టారు. ఆస్తిని సమానంగా పంచుకోవాలని పెద్ద మనుషులు సూచించడంతో ఒప్పుకుని అంత్యక్రియలు నిర్వహించారు. బతికుండగా ఏనాడూ పట్టించుకోనివారు చనిపోయూక ఆస్తి కావాలంటూ రావడంపై గ్రామస్తులు శాపనార్థాలు పెట్టారు. -
ఆకలితో మహిళ మృతి
కృష్ణా: ఆకలిబాధ తట్టుకోలేక ఓ మహిళ ఆదివారం ప్రాణం విడిచింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం అకపాలెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మీనుగు రుక్మిణమ్మ(50) వితంతువు. భర్త చనిపోవటంతో ఒంటరిగా ఉంటోంది. ఆమెను పిల్లలు వదిలేశారు. "నా" అన్నవారు ఎవరూ చూడకపోయినా వితంతువు ఫించన్‌తోనే జీవనం సాగిస్తోంది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక జన్మభూమి కమిటీ వారు 4 నెలల క్రితం రుక్మిణమ్మకు ఫించన్ తొలగించారు. దీంతో ఆ ఇంటా ఈ ఇంటా అడుక్కుని కాలం గడుపుతోంది. ఇలాంటి దుర్భర జీవితం గడుపుగున్న రుక్మిణమ్మకు ఆదివారం ఆకలిబాధ ఎక్కువై మంచం మీదే తుదిశ్వాస విడిచింది.(తిరువూరు)