బతికుండగా కన్నెత్తి చూడక...
శవం వద్ద ఆస్తి కోసం మృతుడి సోదరుడి కుమారుల తగాదా
ఆస్తి పంపకం అయ్యాకే దహన సంస్కారాలు నిర్వహించిన వైనం
భీమదేవరపల్లి (కరీంనగర్ జిల్లా) : ఓ వైపు ఎండ వేడిమి మరోవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఆకలితో అలమటించిన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన చిదురాల మచ్చఅరులయ్య(80) ఆదివారం మృతిచెందాడు. బతికుండగా కన్నెత్తి చూడని అతడి సోదరుడి కుమారులు అరుులయ్య శవం వద్ద ఆస్తి కోసం తగాదా పడ్డారు. పంపకాలు తేలాకే దహన సంస్కారాలు కానిచ్చారు. అరుులయ్యకు భార్య వీరమల్లమ్మ ఉంది. వీరికి ఓ కూతురు ఉండగా చిన్నప్పుడే చనిపోరుుంది.
ఇంటి వద్ద రెండు గుంటల స్థలం, అందులో పూరి గుడిసె మినహా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించారు. నాలుగేళ్ల క్రితం వీరమల్లమ్మ అనారోగ్యంతో కనుమూసింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ అతడే వంట చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పూరిగుడిసె సైతం దెబ్బతిన్నది. వృద్ధాప్య పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు. 15 రోజులుగా విపరీతమైన ఎండలతో అనారోగ్యం బారిన పడితన అతడికి కనీసం అన్నం పెట్టేవారే కరువయ్యూరు. ఆరోగ్యం సహకరించక అన్నం వండుకునే పరిస్థితి లేకపోవడంతో నాలుగు రోజులుగా మంచానికే పరిమితమయ్యూడు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆదివారం వేకువజామున కన్నుమూశాడు.
విషయం తెలుసుకున్న అతడి సోదరుడి కుమారులు కుమారస్వామి, రాజేంద్రం, వీరమల్లు, శ్రీనివాస్ అక్కడి వచ్చారు. అరుులయ్య పేరిట ఉన్న రెండు గుంటల భూమి(రూ.3 లక్షలు విలువ) తమకే చెందాలని పట్టుబట్టారు. ముందుగా దహన సంస్కారాలు నిర్వహించాలని గ్రామపెద్దలు సూచించినా ఫలితం లేకపోరుుంది. ఆస్తి పంపకాలు తేలాలని పట్టుబట్టారు. ఆస్తిని సమానంగా పంచుకోవాలని పెద్ద మనుషులు సూచించడంతో ఒప్పుకుని అంత్యక్రియలు నిర్వహించారు. బతికుండగా ఏనాడూ పట్టించుకోనివారు చనిపోయూక ఆస్తి కావాలంటూ రావడంపై గ్రామస్తులు శాపనార్థాలు పెట్టారు.
ముల్కనూర్‌లో ఆకలి చావు
Published Sun, May 24 2015 8:21 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement