ఇదేదో మాయ కాదు.. మంత్రం కాదు. ఆకలి తీర్చుకునే పోరాటంలో బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేస్తున్న సజీవ ‘సాక్ష్యం’.
వీక్షకుల వొళ్లు జలదరింపజేసేలా పదేళ్ల వయసు గల చిన్నారి గొంతుపై ఇతడు చేస్తున్న ఈ విన్యాసం గురువారం ఖైరతాబాద్ ప్రాంతంలో సాక్షి కెమేరాకు చిక్కింది.
కన్నవారి కడుపు నింపేందుకు ఆ బాలిక అనంతమైన బాధను గొంతులోనే అణచుకుంటున్న దృశ్యాన్ని చూసిన వారెవరైనా చలించిపోవాల్సిందే.
ఆ చిన్నారికి ఎందుకంత కష్టమనే ప్రశ్న కూడా వస్తుంది. పాలకుల నిర్లక్ష్యం కొనసాగున్నంత కాలం ఇలాంటి వారి ఆకలి కష్టాలు తీరవనడానికి ఇదే ప్రబల సాక్ష్యం.
-ఫొటో: ఆర్.లావణ్యకుమార్, హైదరాబాద్
జీవన విషాదం
Published Fri, Sep 27 2013 2:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement