అమ్మ దూరమైంది.. నాన్న జైలు పాలయ్యాడు.. అలాన లేదు.. పాలనలేదు.. ఆకలికి అన్నం లేదు.. పస్తులు ఉంటున్నారు.. కాలే కడుపుతో తల్లడిల్లుతున్నారు.. ఆకలి తీర్చుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. నాన్న చేసిన తప్పుకు పిల్లలేందుకు శిక్ష అనుభవిస్తున్నారు.. అకలితో అలమటిస్తున్నా ముగ్గురు పిల్లలపై స్పెషల్ రిపోర్టు..
సాక్షి, ఆదిలాబాద్: కన్నకూతుళ్లను అమ్మిన కేసులో ఆదిలాబాద్ జిల్లా బంగారి గూడలో నివసించే గంగాధర్ అరెస్టై జైలుపాలయ్యారు.. గంగాధర్, ఆయన భార్య రాధ బంగారి గూడలో కూలీ పనులు చేసుకోని జీవనం సాగించేవారు. వీరికి ఆడపిల్లలు ఉన్నారు. మగబాబు కావాలని భావించారు. ఈ క్రమంలో గతేడాది రాధ మరోసారి గర్భం దాల్చింది. కానీ ఈసారి కూడా ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె మరణించింది.
అయితే అప్పటికే గంగాధర్ ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఇద్దరు కవలలు జన్మించడంతో అయిదుగురి పిల్లల పెంపకం భారమైంది. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక భార్య చనిపోయిన తర్వాత ఎనిమిది నెలల క్రితం ఇద్దరు ఆడ పిల్లలను అమ్మేశాడు తండ్రి గంగాధర్. కర్ణాటకకు చెందివారికి మూడు లక్షలకు కూతుర్లను అప్పగించాడు. అయితే అమ్మకం దందా బయట పడటంతో పోలీసులు గంగాధర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
గంగాధర్ జైలు పాలుకావడంతో ముగ్గురు అడ పిల్లలు దిక్కులేని పక్షులయ్యారు. ఇంటి వద్ద అమ్మ లేదు. నాన్న లేడు. తల్లిని కోల్పోయిన పిల్లలను గంగాధర్ ఇన్ని రోజులు కూలీ పనులు చేసి పోషించేవాడు. కానీ ఇప్పుడు అతడు కూడా జైలుగోడల మధ్య మగ్గుతున్నాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కనీసం తినడానికి తిండలేక. ఇబ్బందులు పడుతున్నారు. ఆకలికి అన్నం దొరక్క పస్తులు ఉంటున్నారు.
కడుపు నిండా తిండిలేక.. కంటి నిండా నిద్రలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.. ఆకలికి తీర్చుకోవడానికి వాళ్ల తాతతో కలిసి బిక్షాటన చేస్తున్నారు. బిక్షాటనలో అన్నం దొరికితే తింటున్నారు. లేదంటే పస్తులు ఉంటున్నారని పిల్లల తాత అవేదన వ్యక్తం చేశారు. పిల్లలను, తమను చూసే వాళ్లు ఎవరు లేరని వాపోయారు. కనీసం పిల్లల ఆకలిని తీర్చడానికి దాతలు, ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment