
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,నిర్మల్‌చైన్‌గేట్(అదిలాబాద్): తనకు పెళ్లి చేయడం లేదని తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడో ఓ కొడుకు. జిల్లాకేంద్రంలోని పింజరిగుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది. డీఎస్పీ జీవన్‌రెడ్డి కథనం ప్రకారం.. పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి.. ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీస్‌లో ఉద్యోగం చేసి విరమణ పొందాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.
చిన్న కొడుకు అన్వేష్ ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయమని తండ్రితో ప్రతి రోజు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య గొడవ జరిగింది. కోపాద్రికుడైన అన్వేష్ తండ్రి గణపతి మెడపై కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment