
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెల్లంపల్లి (ఆదిలాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో కలత చెందిన ప్రియురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం బెల్లంపల్లి మండలంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి రూరల్ సీఐ కె. జగదీష్, బాధితురాలి కథనం ప్రకారం మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన పిల్లల ప్రియాంక అనే యువతి హైదరాబాద్‌లో నర్సింగ్ చదువుతోంది.
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి రడగంబాల బస్తీకి చెందిన కందుల ప్రేమ్‌కుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ప్రియాంకతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. చివరికి ప్రేమ్‌కుమార్ మోసం చేయడంతో ప్రియాంక ఇంటి వద్ద నిద్ర మాత్రలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రియుడు ప్రేమ్‌కుమార్‌పై తాళ్లగురిజాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment