రాబిన్ హుడ్ సైన్యం ఆకలిపై యుద్ధం! | Did You Know about the Army of 1000 That Fights a Common Enemy of India and Pakistan? | Sakshi
Sakshi News home page

రాబిన్ హుడ్ సైన్యం ఆకలిపై యుద్ధం!

Published Sat, Nov 7 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

రాబిన్ హుడ్ సైన్యం  ఆకలిపై యుద్ధం!

రాబిన్ హుడ్ సైన్యం ఆకలిపై యుద్ధం!

 అది ఢిల్లీలోని ఓ మురికివాడ..
 రాత్రి 9 గంటలు దాటింది. ఇంతలో అక్కడికి ఓ వ్యాను వచ్చి ఆగింది.. అప్పటిదాకా ఆ వ్యాను కోసం ఎదురుచూస్తున్న కళ్లల్లో ఒక్కసారిగా ఆనందం.. వ్యానులో నుంచి ఆకుపచ్చ రంగు చొక్కాల్లో ఉన్న కొందరు యువతీ, యువకులు దిగారు. వారి చేతుల్లో ఉన్న అన్నం పొట్లాలు పిల్లలందరికీ పంచారు. వారు తృప్తిగా భోజనం చేశాక అక్కడ నుంచి కదిలారు.  వారే ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ (ఆర్‌హెచ్‌ఏ)..  అంటే ధనవంతుల ఆస్తులను కొల్లగొట్టి పేదలకు పంచే సైన్యం అనుకుంటున్నారా?  ఎంతమాత్రం కాదు.. పేదల కడుపు నింపేందుకు కంకణం కట్టుకున్న ఆదర్శసైన్యం.
 
ఆకలితో పేగులు మాడుతుంటే.. మంచినీళ్లతో కడుపునింపుకొనే వారు మనదేశంలో కోకొల్లలు. తాము తినకున్నా.. తమ పిల్లలకు తినిపించి.. అర్ధాకలితో నిద్రపోయే తల్లిదండ్రులకు లెక్కేలేదు. వీరి సంగతి ఇలా ఉంటే.. రెస్టారెంట్లలో బిర్యానీలు, భోజనాలు, టిఫిన్లు ఆర్డర్ చేసి సగం తిని వదిలే వారి సంఖ్య కూడా మన దేశంలో తక్కువేం లేదు. ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని పూడ్చగలిగితే ఆకలి సమస్యకు పరిష్కారం దొరికినట్లే! అందుకే, దేశంలో ఆకలిపై కొందరు యువకులు యుద్ధం ప్రకటించారు. మిగులు ఆహారపదార్థాలతో పేదల ఆకలి కడుపులు నింపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తొలుత ఆరుగురితో మొదలైన ఈ సైన్యంలో ప్రస్తుతం 1000 మంది వలంటీర్లు ఉన్నారు. 18 నగరాలకు తమ సేవలను విస్తరించారు. 2.5లక్షల మందికి అన్నం పెడుతున్నారు.

అందరినీ ఒప్పించి..

తన సంస్థ గురించి మిగిలిన మిత్రులకు వివరించారు రాబిన్ హుడ్. వీరిలో ఎక్కువమంది ఉద్యోగులే కావడం విశేషం. వారాంతాల్లో పనిచేయడానికి అందరూ అంగీకరించారు. తర్వాత నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలతో నీల్‌ఘోష్ బృందం మాట్లాడింది. వారు కూడా మిగిలిన ఆహారపదార్థాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలా వారి యజ్ఞం మొదలైంది. 2014లో ప్రారంభించిన కొత్తలో ఆర్‌హెచ్‌ఏ కేవలం 150 మందికి మాత్రమే ఆహారం పెట్టగలిగింది. ప్రస్తుతం 2.5లక్షల మంది ఆకలి తీర్చగలుగుతోంది. తొలుత కేవలం ఆరుగురు సభ్యులతో మొదలైన రాబిన్‌హుడ్ ఆర్మీలో ప్రస్తుతం 1000 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.
 
ఆలోచన ఎలా వచ్చింది?

నీల్‌ఘోష్ పోర్చుగల్‌లో ఉన్నపుడు అక్కడి రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ‘రీఫుడ్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సేకరించడం, దాన్ని పేదలకు సరఫరా చేయడం గమనించారు. ‘రీఫుడ్’ సంస్థ వ్యవస్థాపకులు హంటర్ హల్దర్‌తో నీల్‌ఘోష్ ఈ విషయమై మాట్లాడారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. వృథా అవుతోన్న ఆహార పదార్థాలతో ఇంత మంది కడుపు నింపవచ్చన్న ఆలోచన నీల్‌ని మాతృదేశం ఇండియా గురించి ఆలోచించేలా చేసింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భారత్‌లో తలపెడితే తిండిలేని లక్షలాదిమందికి కనీసం ఒకపూట అయినా కడుపునిండా భోజనం పెట్టగలమన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన మిత్రుడు ఆనంద్ సిన్హాతో కలిసి ఢిల్లీ కేంద్రంగా 2014, ఆగస్టు 26న రాబిన్‌హుడ్ ఆర్మీ (ఆర్‌హెచ్‌ఏ)ని స్థాపించారు.
 
శత్రు దేశం ఆకలి కూడా తీరుస్తున్నారు..
ఢిల్లీతోపాటు 18 నగరాలకు తన సేవలను విస్తరించగలిగింది. ప్రతినగరంలోనూ పనిని బృందాలుగా విభజిస్తారు. ప్రతి బృందానికి ఒకరు టీం లీడర్‌గా వ్యవహరిస్తారు. కేవలం ఆహారం అందించడమే కాదు, ఇళ్లు లేని పేదలకు చలికాలం దుప్పట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సంస్థ చేస్తున్న సేవల గురించి విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలోనూ రాబిన్‌హుడ్ ఆర్మీ తన సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. ఆకలికి, సేవకు భౌగోళిక సరిహద్దుల్లేవని నిరూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement