గొల్లపూడి : మధ్యాహ్న భోజనం సరఫరా చేసే రెండు ఏజెన్సీల మధ్య వివాదం విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం భోజనం లేకుండా చేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లపూడి మండలంలోని వన్నెపూడి జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్నభోజన పథకం సరఫరా విషయంలో పాత ఏజెన్సీలను రద్దు చేసి, కొత్తగా వేరే ఏజన్సీలను నియమించింది. దీంతో కొంతకాలంగా పాత, కొత్త ఏజెన్సీల మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇదే విషయమై గొడవ పడుతూ భోజనం వండకపోవడంతో పాఠశాలలోని 287 మంది విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే విచారణ చేపట్టారు.