సాక్షి,న్యూఢిల్లీ: తరచూ బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉండే వాళ్లకు తాజా అథ్యయనం ఆలోచనలో పడవేస్తుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ప్రజలు భిన్నంగా ప్రవరిస్తారని ఓ సర్వేలో వెల్లడైంది.విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు కోపం, అసహనం, ఏకాగ్రత కొరవడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఈ సర్వే పేర్కొంది. చెన్నై, కొచ్చి, న్యూఢిల్లీలో వారం పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. తమకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు తమ ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, విచిత్రంగా ప్రవరిస్తున్నామని సర్వేలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తమ మెదడు నుంచి పలు సంకేతాలు అందుతాయని దీంతో తాము గందరగోళానికి గురై పనుల పట్ల నిరాసక్తతో ఉంటున్నామని వారు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment