
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ మండలంలోని మునిమడుగు గ్రామంలో అమానుష ఘటన జరిగింది. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడి పైశాచికంగా ప్రవర్తించారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment