ఆకలితో మహిళ మృతి | woman dies of hungry | Sakshi
Sakshi News home page

ఆకలితో మహిళ మృతి

Published Sun, Apr 5 2015 11:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

woman dies of hungry

కృష్ణా: ఆకలిబాధ తట్టుకోలేక ఓ మహిళ ఆదివారం ప్రాణం విడిచింది.  ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం అకపాలెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మీనుగు రుక్మిణమ్మ(50) వితంతువు. భర్త చనిపోవటంతో ఒంటరిగా ఉంటోంది. ఆమెను పిల్లలు వదిలేశారు.  "నా" అన్నవారు ఎవరూ చూడకపోయినా వితంతువు ఫించన్తోనే జీవనం సాగిస్తోంది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక జన్మభూమి కమిటీ వారు 4 నెలల క్రితం రుక్మిణమ్మకు ఫించన్ తొలగించారు. దీంతో ఆ ఇంటా ఈ ఇంటా అడుక్కుని కాలం గడుపుతోంది. ఇలాంటి దుర్భర జీవితం గడుపుగున్న రుక్మిణమ్మకు ఆదివారం ఆకలిబాధ ఎక్కువై మంచం మీదే తుదిశ్వాస విడిచింది.(తిరువూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement