Viral Video: 'Hungry' South Korean Student Eats Rs 98 Lakh Banana Artwork - Sakshi
Sakshi News home page

Viral Video: ఆకలితో ఉన్న ఓ విద్యార్థి ఏం చేశాడంటే..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..

Published Tue, May 2 2023 12:36 PM | Last Updated on Tue, May 2 2023 2:52 PM

Viral Video: South Korean Student Eats Rs 98 Lakh Banana Artwork - Sakshi

ఓ విద్యార్థి ఆకలితో ఉండటంతో చేసిని తమషా పని చూస్తే ఆశ్చర్యం తోపాటు కోపం కూడా వస్తుంది. ఆకలిగా ఉందని ఏకంగా ఓ కళాకృతి లాగించేస్తాడు. ఈ విచిత్ర ఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ మ్యూజియం సందర్శించడానికి వచ్చిన విద్యార్థికి మంచి ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ మ్యూజియంలో కమెడియన్‌ అనే గోడపై ఉన్న బనానా ఆర్ట్‌గా పిలిచే అరపండు కళాకృతిని లాగించేశాడు.

అసలు ఏంటి ఇది అంటే.. ఒక గొడకు అరటిపండును టాప్‌ చేసే పెట్టే ఒక రకమైన ఆర్ట్‌ వర్క్‌ ఇది. ఆ విద్యార్థి ఆకలివేయడంతో ఆ అరటిపండుని కామ్‌గా తినేసి, తొక్కను గోడకు టాప్‌ చేసి రకరకాలుగా ఫోజులిచ్చి వెళ్లిపోయాడు. ఐతే ఆ కళాకృతి ధర ఏకంగా రూ. 98 లక్షలట. ఇలా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన బనానా కళాకృతిని లాగించేయడం మొదటిసారి కాదట.

ఇంతకు మునుపు 2019లో కూడా ఈ కళాకృతి సుమారు రూ. 98 లక్షలకు విక్రయించబడ్డక తినేశారట. ఈ కళాకృతిని కళాకరుడు మారిజియో కాటెలన్‌ రూపొందించాడు. ఆయన ప్రతి ఏడాది మ్యూజియంలో ఈ కళాకృతిని ప్రదర్శిస్తాడని, అరటిపండును మార్చడం జరగుతుంటుందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

(చదవండి: అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్‌ కార్డు బహుమానం)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement