Artwork
-
ఇవి.. సహజసిద్ధ'మండి'!
బంజారాహిల్స్: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ భవన్లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్ ఝాన్సీ ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్ఫ్యూమ్లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్ జ్యువెలరీ, జూట్ బ్యాగులు, కేరళ మురల్ ఆర్ట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, రస్టిక్ సెరమిక్ పీసెస్, పామ్ లీఫ్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్లైన్లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్పర్సన్ అనురాధ బిష్ణోయ్ కూడా పాల్గొన్నారు.ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్‌హెచ్‌డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
ఉత్తమ చిత్ర పురుషోత్తమన్
న్యూయార్క్‌లోని టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించిన ఆ ఆర్ట్‌వర్క్ ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకొంటూ ‘వావ్’ అన్నారు. ప్రేక్షకులే కాదు కళావిమర్శకులు కూడా ‘బ్రహ్మాండం’ అన్నారు. ఆ ఆర్ట్‌వర్క్‌ను సృష్టించింది బెంగళూరుకు చెందిన అజయ్ పురుషోత్తమన్... బెంగళూరులోని ఒక ఎడ్వర్టైజింగ్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ పురుషోత్తమన్‌కు చిన్నప్పుడు చాలామంది పిల్లలలాగే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. కార్టూన్ క్యారెక్టర్లు అంటే బోలెడు ఇష్టం. తన అభిమాన క్యారెక్టర్లను గీయడంలో ప్రాక్టిస్ చేస్తుండేవాడు. ఈ ఆసక్తి స్కూల్ రోజుల నుంచి కాలేజి రోజుల వరకు వచ్చింది. 2డీ ఆర్ట్, త్రీడి ఆర్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండేవాడు. తనకు తెలిసిన కథలను యానిమేషన్ మరియు త్రీడి మోడలింగ్‌లోకి తీసుకువచ్చాడు. ఎన్నో సొంత ప్రాజెక్ట్‌లు చేసేవాడు. న్యూయార్క్‌లో జరిగే ‘ఎన్ఎఫ్టీ ఎన్వైసీ’ ప్రదర్శన ‘ఎన్ఎఫ్టీ’పై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే వేదిక. ఈ ఉత్సవానికి అజయ్ హాజరు కానప్పటికీ అతడి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ప్రశంసలు అందుకున్నాయి. ‘మన ఆర్ట్‌ను ప్రపంచ వేదిక మీదికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటాడు అజయ్. న్యూయార్క్ టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై తన ఆర్ట్‌వర్క్ ప్రదర్శించడం అజయ్ పురుషోత్తమన్‌ని ఎంతో సంతోషానికి గురిచేసింది. మొదట దీని గురించి విన్నప్పుడు ‘కలా నిజమా!’ అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలనుకున్నాడు. సన్నిహితుల సహాయంతో న్యూయార్క్‌కు వెళ్లి ‘ఇంతకు మించిన ఆనందం ఏమున్నది!’ అనుకున్నాడు. గత సంవత్సరం అజయ్ మొదలుపెట్టిన ‘టాయ్ స్టోరీస్ ప్రొఫైల్’ చాలామందిని ఆకట్టుకుంది. ఈ యానిమేషన్ సిరీస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక హిప్–హప్ పాటకు డ్యాన్స్ చేస్తాడు. ‘షోలే’ సినిమాలోని క్యారెక్టర్లు అన్నీ కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తాయి! నిజజీవితంలోని ప్రముఖ వ్యక్తులు ఈ సిరీస్‌లోని క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే వెబ్3, ఎన్ఎఫ్టీకి సంబంధించి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ కోసం అర్జెంటీనా ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ‘ఇది సవాళ్లతో కూడిన ప్రయాణం’ అంటున్నాడు అజయ్. సాధారణ ఆర్టిస్ట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అజయ్ పురుషోత్తమన్ ఆ సవాళ్లను అధిగమించి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. మోస్ట్ పాపులర్ నాన్–ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లు చిత్రకళ, సంగీతం, క్రీడా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని, ట్రెండ్‌ను అందిపుచ్చుకొని మన దేశంలోని ‘మోస్ట్ పాపులర్ ఎన్ఎఫ్టీ క్రియేటర్’లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ పురుషోత్తమన్. తనకు వచ్చే కంటెంట్ ఐడియాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ మొదలుపెట్టాడు. తనలోని సృజనకు సంబంధించి అవతలి కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. తాను రూపొందించిన ఎన్ఎఫ్టీలను రకరకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకం మొదలు పెట్టాడు. తన ఆర్ట్ మన దేశానికి మాత్రమే పరిమితం కావాలని అజయ్ అనుకోలేదు. ‘అక్కడ ఏం జరుగుతుంది’ అంటూ అంతర్జాతీయ ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. ట్రెండ్ ఏమిటో తెలుసుకున్నాడు. హాలివుడ్ కలెక్షన్స్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన గాయకుల త్రీడీ బాటిల్ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రయాణాలు అంటే అజయ్‌కు ఇష్టం. ఎందుకంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నది తన కళలోకి వచ్చి చేరుతుంది. బలాన్ని ఇస్తుంది. -
ఓ విద్యార్థి ఆకలితో..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..
ఓ విద్యార్థి ఆకలితో ఉండటంతో చేసిని తమషా పని చూస్తే ఆశ్చర్యం తోపాటు కోపం కూడా వస్తుంది. ఆకలిగా ఉందని ఏకంగా ఓ కళాకృతి లాగించేస్తాడు. ఈ విచిత్ర ఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ మ్యూజియం సందర్శించడానికి వచ్చిన విద్యార్థికి మంచి ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ మ్యూజియంలో కమెడియన్ అనే గోడపై ఉన్న బనానా ఆర్ట్‌గా పిలిచే అరపండు కళాకృతిని లాగించేశాడు. అసలు ఏంటి ఇది అంటే.. ఒక గొడకు అరటిపండును టాప్ చేసే పెట్టే ఒక రకమైన ఆర్ట్ వర్క్ ఇది. ఆ విద్యార్థి ఆకలివేయడంతో ఆ అరటిపండుని కామ్‌గా తినేసి, తొక్కను గోడకు టాప్ చేసి రకరకాలుగా ఫోజులిచ్చి వెళ్లిపోయాడు. ఐతే ఆ కళాకృతి ధర ఏకంగా రూ. 98 లక్షలట. ఇలా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన బనానా కళాకృతిని లాగించేయడం మొదటిసారి కాదట. ఇంతకు మునుపు 2019లో కూడా ఈ కళాకృతి సుమారు రూ. 98 లక్షలకు విక్రయించబడ్డక తినేశారట. ఈ కళాకృతిని కళాకరుడు మారిజియో కాటెలన్ రూపొందించాడు. ఆయన ప్రతి ఏడాది మ్యూజియంలో ఈ కళాకృతిని ప్రదర్శిస్తాడని, అరటిపండును మార్చడం జరగుతుంటుందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం) -
గీత రాత మారేనా?
చిత్రకళ అనాది కళ. చరిత్రకు పూర్వయుగంలోనే మానవాళికి పట్టుబడిన ఆదిమ కళ. మాటలెరుగని తొలి మానవులు ఎరిగిన ఏకైక భావప్రకటన సాధనం చిత్రకళ. గీతల నుంచి పరిణామం చెందిన తర్వాతే రాతలు రాయడం మొదలైంది. గీతలతో చుట్టూ కనిపించే జంతుజాలాన్ని, పరిసరాలను చిత్రించే దశ నుంచి చిత్రలిపి ‘క్యూనిఫామ్’ దశకు చేరుకోవడానికి దశాబ్దాలో శతాబ్దాలో కాదు, ఏకంగా సహస్రాబ్దాల కాలం పట్టింది. ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 30 వేల ఏళ్ల నాడే మొదలైతే, క్రీస్తుపూర్వం 3,400 ఏళ్ల నాటికి గాని తొలినాటి లిపి రూపుదిద్దుకోలేదు. దాదాపు అప్పటి నుంచే భాషల పుట్టుక మొదలైంది. నానా భాషలూ, వాటికి రకరకాల లిపులూ వచ్చాయి. మనిషి మాటలూ రాతలూ నేర్చిన నాటి నుంచి నాగరికత పరిణామ క్రమంలో వేగం పెరిగింది. ముందొచ్చిన గీతల కంటే వెనకొచ్చిన రాతలే వాడి అనేంతగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నాగరికతల వికాసం మొదలైన నాటి నుంచి పారిశ్రామిక విప్లవ కాలం వరకు, ఆ తర్వాత నేటి అత్యాధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో అనేకానేక మార్పులు వచ్చాయి. మన దేశంలో ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 5,500 ఏళ్ల నాడే మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా గుహల్లోని చిత్రాలే ఇందుకు నిదర్శనం. సింధులోయ నాగరికత నాటి శిథిలాల్లో నైరూప్య చిత్రకళ ఆనవాళ్లూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఒకటో శతాబ్ది కాలానికి చెందిన అజంతా గుహల్లోని చిత్రకళ ఆనాటి బౌద్ధ ప్రాభవానికి అద్దంపడుతుంది. మొఘల్ పరిపాలన కాలం వరకు దేశం నలు చెరగులా మధ్యయుగాల చిత్రకళ వివిధ రీతుల్లో అభివృద్ధి చెందింది. మొఘల్ పాలన అంతమయ్యాక డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టాక మన దేశంలో ఆధునిక చిత్రకళ మొదలైంది. బ్రిటిష్ హయాంలోనే మన దేశంలో చిత్రకళా అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో శాస్త్ర సాంకేతిక అధ్యయన కేంద్రాల అభివృద్ధితో పోల్చుకుంటే, కళా అధ్యయన కేంద్రాల అభివృద్ధి నామమాత్రమే! ఇక చిత్రకళపై తెలుగులో వచ్చిన పుస్తకాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు ‘చిత్రలేఖనము’ పేరిట 1918లో రాసిన పుస్తకమే బహుశ తెలుగులో వచ్చిన తొలి ఆధునిక చిత్రకళా గ్రంథం. స్వాతంత్య్రా నికి ముందు కళాభిరుచి గల కొందరు బ్రిటిష్ దొరలు ఎందరో భారతీయ చిత్రకారులను ప్రోత్సహించారు. ఆనాటి సంస్థానాలు సైతం చిత్రకళకు ఊతమిచ్చాయి. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన రాజా రవివర్మ ట్రావెన్కోర్ సంస్థానాధీశుని ప్రోత్సాహంతో రాణించాడు. ఇద్దరు తెలుగు గురువుల వద్ద, బ్రిటిష్ చిత్రకారుడు థియోడార్ జెన్సన్ వద్ద రవివర్మ తైలవర్ణ చిత్రకళను నేర్చుకున్నాడు. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో రవివర్మ అగ్రగణ్యుడే గానీ, ఆద్యుడు కాదు. ఇప్పటి వరకు దొరుకుతున్న ఆధారాల ప్రకారం తెలుగువాడైన బ్రహ్మస్వామిని తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన బ్రహ్మయ్య గీసిన చిత్రాలు ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆధునిక కాలానికి చెందిన మన తెలుగు చిత్రకారుల గురించి చెప్పుకుంటే కూల్డ్రే దొర ప్రోత్సాహంతోనే తొలితరం ఆధునిక చిత్రకారుల్లో ఒకరైన దామెర్ల రామారావు రాణించారు. దామెర్ల మిత్రుడు వరదా వెంకటరత్నం కూడా కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకళలో రాణించారు. మశూచి బారినపడి దామెర్ల పిన్నవయసులోనే మరణించ డంతో రాజమండ్రిలో ‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’ని ఏర్పాటు చేసినది వరదా వెంకటరత్నమే! గడచిన శతాబ్దిలో పలువురు తెలుగు చిత్రకారులు భారతీయ చిత్రకళను సుసంపన్నం చేశారు. అప్పట్లో ‘భారతి’ వంటి పత్రికలు చిత్రకళకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చేవి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్రకళాకారులు తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నా, వారి నైపుణ్యాన్ని, ప్రత్యేకతను బేరీజువేసి పాఠకులకు విశదీకరించగల కళావిమర్శకులే మనకు అరుదైపోయారు. తెలుగునాట వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ కోర్సులు నిర్వహి స్తున్నా, ఏటా ఈ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చేవారిలో కనీసం ఒకరిద్దరయినా చిత్రకళా విమర్శ కులుగా తయారు కాలేకపోవడం విచారకరం. ప్రపంచంలోని ఉత్తమ చిత్రకళా విద్యాల యాల్లో తొలి ముప్పయి స్థానాల్లోనైనా మన దేశానికి చెందిన ఏ చిత్రకళా విద్యాలయానికీ చోటులేక పోవడం మరో విషాదం. చిత్రకళపై మనదేశంలో ఇంగ్లిష్ మ్యాగజైన్లు కొద్ది సంఖ్యలో వస్తున్నాయి. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పూర్తిగా చిత్రకళకు పత్రికలేవీ లేవు. ఒకవేళ వచ్చినా, అవి మనుగడ సాగించగల పరిస్థితులూ లేవు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటా ‘చిత్రసంతె’ జరుగుతుంది. ‘కరోనా’ వల్ల దీనికి రెండేళ్లు అంతరాయం కలిగినా, ఈసారి యథావిధిగా జరిగింది. వారం కిందట జరిగిన ‘చిత్రసంతె’లో దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు పాల్గొన్నారు. కర్ణాటక చిత్రకళా పరిషత్ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ నిర్వహిస్తే బాగుంటుంది. ఏటా దేశంలోని వివిధ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లే, ‘చిత్రసంతె’ వంటి కార్యక్రమాన్ని కనీసం దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించేటట్లయితే వర్ధమాన చిత్రకారులకు కొంతైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గీత రాత మారుతుంది. -
ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా?
Surgeon Attempts To Sell Terrorist Victim's X-ray: ఇంతవరకు డాక్టర్లు పేషంట్లను మోసం చేసిన ఘటనలను చూశాం. అంతెందుకు ఎక్కువ మెడికల్ చార్జీలు మోపి రోగుల నడ్డి విరిచేసిన కథనాలను గురించి విన్నాం. కానీ ఇక్కడొక డాక్టర్ అత్యంత అమానుషంగా దాడిలో గాయపడిన బాధితుడి ఎక్స్ రేని అమ్ముకోవడానికి యత్నించాడు. అసలు విషయంలోకెళ్తే...పారిస్‌లోని బాటాక్లాన్ మ్యూజిక్ హాల్‌పై 2015లో జరిగిన ఉగ్రదాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అయితే పారిస్‌లోని జార్జెస్ పాంపిడౌ పబ్లిక్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రెంచ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇమ్మాన్యుయేల్ మాస్మేజీన్ ఆ వ్యక్తి ఎక్స్‌రేని డిజిటల్ ఆర్ట్వర్క్గా అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చిత్రం కలాష్నికోవ్ బుల్లెట్‌ను కలిగి ఉన్న ముంజేయిని చూపిస్తుంది. అంతేందుకు ఎన్ఫ్టీ డిజిటల్ ఇమేజ్‌గా పిలవబడే ఆ ఎక్స్‌రే ఓపెన్ వెబ్సైట్ సూమరు రూ 2 లక్షలు పలుకుతుంది. అయితే ఆ సర్జన్ మాస్మేజీన్ చేసిన పనికి తగిన చర్యలు తీసుకున్నామని పారిస్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతి మార్టిన్ హిర్ష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు ఇది సర్జన్ వృత్తికి విరుద్ధమైన పని మాత్రమే కాదు, వైద్య గోప్యతకు భంగం కలిగించే నేరానికి మాస్మేజీన్ పాల్పడ్డాని అన్నారు. అయితే మాస్మేజీన్ తన నేరాన్ని అంగీకరించడమే కాక పేషంట్ అనుమతి లేకుండా చేసిన ఇలాంటి పని చేసినందుకు బాధపడుతున్నానని చెప్పాడు. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
Animal Art: ‘పిగ్'కాసో పెయింటింగ్స్.. ఒక్క చిత్రం ధర ఏకంగా రూ. 14 లక్షలు!
Pig Painter Pigcasso’s Artwork Story In Telugu రవివర్మ, లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, ఆర్టెమిసియా జెంటిలేస్చి... వంటి ప్రసిద్ధ పెయింటర్స్ చేతుల్లో జీవం పోసుకున్న రకరకాల పెయింటింగ్‌లను మీరిప్పటివరకూ చూసి ఉంటారు. అఫ్కోర్స్! వాటి ధర కూడా కోట్ల రూపాయలు పలుకుతాయి. ఐతే మీమ్మల్ని అమితాశ్చర్యాలకు గురచేసే ఈ సరి కొత్త పెయింటర్ గురించి ఇప్పటివరకూ తెలిసుండదు. ఆ పెయింటర్ మనిషికాదు ఓ జంతువు. అది వేసే రంగుల చిత్రాలకు జనాల్లో యమ క్రేజీ ఉంది. ఒక పెయింట్ ధర లక్షల రూపాయలు పలుకుతోంది మరి! ఆ జంతువు మరేదోకాదు అక్షరాలా ఓ పంది. ఇక ఈ సునక పెయింటర్ కుంచెతో పట్టి గీసిన చిత్రాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ పంది పేరు పిగ్కాసో. పిగ్కాసో తాజాగా వేసిన పెయింటింగ్ 72 గంటల్లోనే డిసెంబర్ 13న జర్మనీకి చెందిన వ్యక్తి 20 వేల డాలర్లు (రూ. 14, 97, 000) కు కొన్నట్లు అక్కడి స్థానిక మీడియా తెల్పింది. గతంలో ఓ చింపాజీ వేసిన పెటింటింగ్ 14 వేల డాలర్లు పలకగా, తాజాగా ఆ రికార్డును పిగ్కాసో బద్ధలుకొట్టింది. నిజానికి దక్షిణాఫ్రికాలోని ఫ్రెంచ్వ్యాలీకి చెందిన జోన్ లెఫ్సన్, 2016లో కేప్ టౌన్‌లోని పదిమాంసం విక్రయించే దుకాణం నుంచి ఈ పందిని కాపాడింది. ఆతర్వాత ఆమె తనతో పాటు పందిని తీసుకువచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. ఐతే ఒక రోజు అనుకోకుండా కొన్ని పెయింట్ బ్రష్‌లను పిగ్కాసో ఉంటున్న ఎన్‌క్లోజర్‌లో జోన్ వదిలేసింది. బ్రష్‌లతో ఆడుతున్న పందిని చూసిన జోన్‌కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంకేముంది అప్పటినుంచి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం ప్రారంభించింది పిగ్కాసో. 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 400కుపైగా పెయింటింగ్స్ వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పంది వేసిన పెయింటింగ్స్ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారట. హాట్ కేకుల్లా వేసీవేయంగానే లక్షల్లో అమ్ముడుపోతున్నాయని, ఈ విధంగా పెయింటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఇతర జంతువుల పెంపకానికి వినియోగిస్తున్నట్లు జోన్ లెఫ్సన్ మీడియాకు తెల్పింది. యానిమల్ ఆర్ట్‌కు జనాల్లో బాగానే పాపులార్టీ ఉంది కదా! చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
డబ్బే డబ్బు!: జంతువు వేసిన పెయింటింగ్‌కు రికార్డు ధర
మాస్టారి టాలెంట్ ఏమిటో ఫొటో చూడగానే మీరో అంచనాకు వచ్చేసుంటారు.. ఇది ఉత్త పిగ్ కాదు.. దీని పేరు పిగ్కాసో.. అంటే.. పందుల్లో పికాసో టైపు అన్నమాట. నిజానికి బిర్యానీలో లెగ్పీసు కింద మారాల్సిన ఈ వరాహం.. జువానే లెఫ్సన్ అనే ఆవిడ పుణ్యాన రోజుకో ఆర్టు పీసును సృష్టించేస్తోంది.. ఇంతకీ ఏమైందంటే.. చిన్నప్పుడు దీన్ని ఓ మటన్ షాపుకు అమ్మేశారట.. కీమా కొట్టేయడానికి.. అయితే జువానే రక్షించి.. పెంచుకున్నారు.. అదే సమయంలో తన షాపులోపడి ఉన్న పెయింట్ బ్రష్షు పట్టుకుని.. విన్యాసాలు చేస్తుంటే చూసి.. ఆ దిశగా ప్రోత్సహించారు.. అంతే... అప్పట్నుంచి పిగ్ కాసో తనదైన రంగుల ప్రపంచాన్ని సృష్టించేసుకుంది.. తాజాగా వారాల తరబడి కష్టపడి.. ఇదిగో ఈ పెయింటింగ్‌ను వేసే సింది. తన కష్టం వృథా పోలేదు.. ఈ వరాహం వేసిన పెయింటింగ్‌కు అచ్చంగా వరహాల మూటే దక్కింది. జర్మనీకి చెందిన పీటర్ ఎసర్ అనే వ్యక్తి రూ.20 లక్షలకు పైగా చెల్లించి.. వేలంలో ఈ పెయింటింగ్‌ను దక్కించు కున్నారు. దాంతో పిగ్కాసో యజమాని జువానే ఆనందానికి అంతులేదనుకోండి.. మరో విషయం.. ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి.. గతంలో కాంగో అనే చింపాజీ వేసిన చిత్రానికి రూ.14 లక్షల ధర పలికింది. -
జన్మాష్టమి రోజు వచ్చే ‘రాక్షసుడి’ కథ!!
కట్పడి రవి ... ఓ దినసరి కూలి.. అయితేనేం సాయం చేయాలనే గుణం మాత్రం మెండు.. అందుకే ఏడాదికోసారి భిన్న రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలా 15 లక్షల రూపాయలు సంపాదించాడు. మెక్సికన్ డ్రామా ‘పాన్స్ లేబిరింత్’ సినిమాలో.. తన వాళ్ల కష్టాలను తీర్చడానికి వనదేవత ప్రత్యక్షమవుతుంది. దుష్టపాలనను అంతం చేసి.. బానిస బతుకులకు విముక్తి కలిగిస్తుంది. అలాగే ‘ద అమేజింగ్ స్పైడర్’ సినిమాలో ఓ పెద్దబల్లి... అమెరికన్ కామెడీ హర్రర్ ‘క్రాంపస్’ సినిమాలోని మేక ముఖం గల ఓ వింత రాక్షసి ఆకారం... ఇవన్నీ బాగా పాపులర్ అయిన సినిమా పాత్రలు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకని పెదవి విరవకండి. ఎందుకంటే ఇటువంటి వింత ఆకారాలే ఎంతో మంది చిన్నారులకు ప్రాణం పోశాయి... పోస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా.. అయితే మీరు రవి కట్పడి కథ తెలుసుకోవాల్సిందే.. దినసరి కూలీ ఏం చేయగలడు!? కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన 35 ఏళ్ల దినసర కూలీ రవి కట్పడి. రోజంతా శ్రమిస్తే అతడికి దక్కే వేతనం 450 నుంచి 550 రూపాయలు. అయితే చికిత్సకు డబ్బులు అందక మరణించే చిన్నారుల గురించి వింటే అతడి మనస్సు చలించిపోయేది. వారికి సాయం చేయాలని ఎంతగానో ఆరాటపడేవాడు. కానీ ఓ దిసనరి కూలీగా అతడేం చేయగలడు? ఎంతమందిని కాపాడగలడనే ప్రశ్నలతో సతమతమయ్యేవాడు. అప్పుడే అతడికి ఓ ఆలోచన తట్టింది. చిన్నారులను కాపాడటం కోసం.. హాలీవుడ్ సినిమాల్లోని ఆర్ట్‌వర్క్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. సోషియో ఫాంటసీ సినిమాల్లో ఉండే విభిన్న పాత్రలు ధరించడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రతీ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున.. సరికొత్త రూపంలో దర్శనమిస్తూ... ఉడిపిలోని ఇంటింటికీ తిరుగుతూ.. తన ఆహార్యాన్ని ప్రదర్శించి డబ్బు యాచించేవాడు. అలా 2013 నుంచి సుమారు 15 లక్షల రూపాయలు సంపాదించాడు. ఈ విధంగా వినూత్న వేషధారణతో ముందుకు సాగుతున్న రవి... చిన్నారుల క్యాన్సర్ ట్రీట్మెంట్కు, హృద్రోగులకు, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారి చికిత్స కోసం.. ఈ డబ్బునంతా ఖర్చు చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. తనలా ఆలోచించే మరికొందరి సాయంతో.. రవి చదివింది కేవలం తొమ్మిదో తరగతి వరకే. పైగా చేసేది భవన నిర్మాణ కూలీగా.. మోటు పని. మరి ఇలాంటి వ్యక్తి అచ్చంగా హాలీవుడ్ క్యారెక్టర్లను పోలి ఉండేలా వేషం వేయడం, అందరినీ ఆకర్షించడం అంత తేలికైన పని కాదు. అందుకే తనలాంటి ఆలోచనలు గల మరికొంత మంది సాయం కోరాడు. వారి సాయంతో ఆర్ట్‌వర్క్ టీమ్‌ను తయారు చేసుకుని... 2013 నుంచి సుమారు 15 లక్షల రూపాయలు సంపాదించాడు. మరిన్ని నిధులు కావాలి.. ‘ గతేడాది వరకు రవి కేవలం ఉడిపి వరకే పరిమితమయ్యాడు. కానీ తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈసారి జిల్లా వ్యాప్తంగా పర్యటించాలనుకున్నాడు. ప్రస్తుతం తలసేమియా బాధితుల కోసం 27 లక్షల రూపాయల అవసరం ఉంది. అందుకే సోషల్ మీడియాను వినియోగించుకోవాలనుకుంటున్నాం. రవి ఉదారత గురించి వివరిస్తున్నాం. తద్వారా మరికొంత మంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో చిన్నారుల కష్టాలు కాస్తైనా తగ్గుతాయి’ అని రవి ఆర్ట్ టీం మెంబర్ సుచిత్ వ్యాఖ్యానించాడు. -
పూస పూసలో ప్రేమ
ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఒక్కోలా వ్యక్తపరుస్తారు. బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ మాత్రం పూసల్లో ప్రేమను చూపించారు. విషయం ఏంటంటే... తన దత్తపుత్రిక నిషా కోసం ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వదలుచుకున్నారు సన్నీ లియోన్. చిన్న చిన్న పూసలతో ఒక ఆర్ట్‌ని డిజైన్ చేయడం మొదలెట్టారు. 2017 అక్టోబర్‌లో మొదలెట్టిన ఈ ఆర్ట్ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి సన్నీకి సుమారు ఏడు నెలలకుపైగా పట్టిందట. ఒక్కో పూసను తన చేత్తోనే బోర్డ్‌పై అంటిస్తూ 12 రామచిలుకలు వరుసగా కూర్చున్న ఫొటోను తయారు చేశారు సన్నీ లియోన్. కంప్లీట్ అయిన ఆర్ట్‌వర్క్ ఫొటోను షేర్ చేస్తూ ‘‘నిషా కోసం పూసలతో ఓ ఆర్ట్ వర్క్ చేయాలనుకున్నాను. లాస్ట్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసిన ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను రీసెంట్గా కంప్లీట్ చేశాను. కొన్ని వేల పూసలని నేనే స్వయంగా అంటించాను’’ అన్నారు. కుమార్తె నిషాని ఉద్దేశించి... ‘ఈ బొమ్మలో ప్రతి పూస అంటిస్తున్నప్పుడు నీ గురించే ఆలోచించాను. నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను’’ అని పేర్కొనారు సన్నీ లియోన్. ఆర్ట్ స్టార్టింగ్ ఫైనల్ ఆర్ట్ -
కాలి వేళ్లే కదిలే కుంచెలై!
దామినికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితే తన అసౌకర్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోలేదు. చేసే పనిలోనే ఉత్సాహం వెదుక్కుంది. ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.గంట వ్యవధిలో కాలిబొటన వేలుతో 38 బొమ్మలు గీయడం ద్వారా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్’లో చోటు సాధించింది. కాలి బొటనవేలే కుంచెగా చిత్రకళలో రాణిస్తోంది రాయ్‌పూర్ (చత్తీస్‌గఢ్)కు చెందిన దామిని. బీయస్సీ మొదటి సంవత్సరం చేస్తున్న దామిని చదువులో కూడా మంచి ప్రతిభ చూపుతుంది. కాలి బొటనవేలితో ఎలా రాయాలో దామినికి చిన్నప్పుడు నేర్పించింది తల్లి. ఒకరోజు దామిని తన బొటనవేలితో బొమ్మ గీస్తుంటే చూసింది తల్లి. కూతురికి చిత్రకళ మీద ఆసక్తి ఉన్న విషయాన్ని కనిపెట్టి ఆ దిశగా ప్రోత్సహించడం ప్రారంభించారు తల్లిదండ్రులు. తల్లి మాధురిసేన్ అయితే కూతురు కోసం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. తానే ఒక విద్యార్థిగా మారింది.‘‘మా అమ్మ నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించింది. అండగా నిలిచింది’’ అని తల్లి గురించి ప్రశంసగా చెబుతుంది దామిని. దామిని మనసులో ‘నిరాశ’ అనేది ఎప్పుడూ తొంగిచూడకుండా తల్లి మాధురి సేన్ ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యం నింపేది.‘‘బాగా చదవడం ద్వారా సొంతకాళ్ల మీద నిలబడే ధైర్యం వస్తుంది’’ అని ఎప్పటికప్పుడు కూతురికి చదువు విలువ తెలియజెప్పేది.హాబీగా మొదలైన ‘ఆర్ట్’ దామిని దైనందిన జీవితంలో భాగమైంది.‘‘బొమ్మలు సాధన చేస్తున్నప్పుడు నాలో తెలియని ఉత్సాహం వెల్లువెత్తుతుంది’’ అంటున్న దామిని కాళ్ల సహాయంతో బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం, వంట చేయడం... మొదలైన పనులు కూడా సొంతంగా చేస్తుంది. ‘‘అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా...ఏదో కోల్పోయినట్లు నిస్తేజంగా కనిపిస్తారు చాలామంది. ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అనిపిస్తుంది అంటారు ఇరుగు పొరుగు. ‘‘దేవుడు మనకో అందమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని సార్థకం చేసుకోవాలి’’ అని నమ్ముతుంది దామిని. పనిలో పట్టుదల, ఉత్సాహం మాత్రమే కాదు దామిని మాటలో ‘పరిణతి’ కూడా కనిపిస్తుంది. ‘‘నాకు ఈ లోపం ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో...మన మీద మనకే జాలి మొదలవుతుంది. అయితే మనకు కావల్సింది జాలి కాదు...అంతు లేని ఉత్సాహం. నేను చేయగలను. చేస్తాను అనుకుంటే విజయాలు మన వెంటే నడుస్తాయి’’ అంటుంది దామిని. ‘‘మిగిలిన విద్యార్థులతో పోల్చితే దామిని ధారణశక్తి గొప్పగా ఉంటుంది. ఒక్కసారి వింటే మరచిపోదు’’ అంటున్నాడు దామినికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు హరీష్ జోషి. ‘‘బొటనవేలితో ఎలా రాయాలో అమ్మ నేర్పించింది. అయితే బయట నలుగురి ముందు రాయడానికి సంకోచంగా ఉండేది. ఎవరైనా నవ్వుతారేమోనని అనుమానంగా ఉండేది. బయటి వాళ్ల గురించి ఆలోచించడం కాదు నా గురించి నేను ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేశాను’’ అని చెబుతుంది దామిని. బెంగళూరులో జరిగిన ఇండియన్ ఇంక్లూజన్ సమ్మిట్(ఐఐయస్)లో దామిని కూడా ఒక వక్తగా పాల్గొంది. ‘ఐఐఎస్’ అనేది ఎందరిలోనో స్ఫూర్తి, ఆత్మస్థైర్యాన్ని నింపే వేదిక. ఈ వేదిక ద్వారా ఆమె ఇచ్చిన ప్రసంగం మరింత మందికి చేరువై స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.ఐఏఎస్ ఆఫీసరై వికలాంగులకు సేవ చేయాలనేది దామిని కల. ఆమె ముందు ఇలాంటి కలలు ఎన్నో ఉన్నాయి. విజేతలకు కలలు కనడంతో పాటు ఆ కలలను నిజం చేసుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. దామిని తన కలలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం. -
వివక్షపై యుద్ధం
సాక్షి,మాదాపూర్: సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని వ్యంగ చిత్రకళ నిపుణులు పి.శంకర్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.శంకర్, డాక్టర్, చిత్ర కళాకారుడు ఎం.చంద్రమౌళి వేసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శన 31వ తేదీ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీ, డాక్టర్ రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంకెళ్లు తెంచిన కుంచె
అది కారాగారం. అక్కడ గొలుసు తెంచుకుపోయిన వాళ్ల దగ్గర్నుంచి గొంతుకోసిన వాళ్ల దాకా ఎందరో.. చేసిన తప్పుకు వేసిన శిక్షను భరిస్తూనే... అలా చేయకుండా ఉంటే బాగుండేదనే ఆలోచన చేస్తున్నవాళ్లు ఎందరో. వీరంతా అయినవాళ్లకు దూరంగా నాలుగు గోడల మధ్య, తమలాంటి మరికొందరు ‘నేరరూప దానవుల’ మధ్య బతుకీడుస్తూంటారు. ఈ నేపథ్యంలో.. పడిన సంకెళ్లు చేతుల్ని మరింత మొద్దుబారేలా చేసేస్తున్న పరిస్థితుల్లో... ఆ చేతులకు అందిందో కుంచె. అంతే... ఆ చేతులిప్పుడు అద్భుత చిత్రాలను లిఖిస్తున్నాయి. మనసులను కదిలిస్తున్నాయి. - ఎస్.సత్యబాబు ఓ మధ్యవయసు వ్యక్తి. గోడకు చేరబడి కూర్చున్నాడు. ఆ చూపుల్లో అంతులేని నిర్వేదం. ఆ కూర్చున్న శైలిలో అనంతమైన శూన్యం. చిత్రంగా... తానేడుస్తున్న విషయం, చెంపలకు అంటిన తడి కూడా అతనికి తెలిసినట్టు లేదు. చిత్రంగా అతనో చిత్రమే. కారాగారవాసం అనుభవిస్తున్న ఖైదీ భావాలకు ప్రతి రూప చిత్రమది. ఓ ప్రసిద్ధ చిత్రకారుడు వేస్తే ఆ చిత్రం బహుశా చాలా గొప్పగా ఉండేదేమో.. అయితే అచ్చంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఖైదీ గీసింది కాబట్టి అత్యంత సహజంగా ఉంది. ఖైదీలు గీసిన ఇలాంటి ఎన్నో చిత్రాలు బంజారాహిల్స్‌లోని కళాకృతి గ్యాలరీ కేఫ్‌లో కొలువుదీరాయి. జైలులో... ‘కళ’‘కలం’... బహుశా దేశంలోనే ఇలాంటి ప్రయోగం ఎక్కడా జరిగి ఉండదు. నగరానికి చెందిన కృష్నాకృతి ఫౌండేషన్ ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘బియాండ్ ది బార్స్’... గత 7 నెలలుగా నగర చిత్రకళా ప్రపంచంలో సంచలనం. జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు, కత్తులు, కత్తెరలు తప్ప తెలీని ఖైదీల చేతులకు కుంచెనిచ్చి, వారిలోని కళాతృష్ణను వెలికితీసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను అందిస్తోంది. పలువురు ఖైదీలను ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది, వారు గీసిన చిత్రాలను ఇప్పటికే ఒక దఫా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. రెండో దఫా కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో 180 చిత్రాల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభమై, ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది. ‘రంగు’మారింది... కరడుగట్టిన హృదయాలు ‘కళ’కనేలా చేసిందీ ప్రయోగం. మోడువారిన మనసుల్లోని సున్నితత్వాన్ని తట్టి లేపింది. చర్లపల్లి, చంచల్‌గూడ కారాగారాల్లో బందీలుగా ఉన్న ఖైదీలు... 40 మంది వారంలో రెండు రోజుల పాటు చొప్పున చిత్రలేఖనంలో శిక్షణ పొందిన అనంతరం వారు స్వయంగా గీసిన చిత్రాలు ఈ మార్పునకు నిదర్శనంగా నిలిచాయి. పోలీసు కావాలనుకుని నేరస్తుడి గా మారిన ఓ ఖైదీ మానసిక సంఘర్షణ పోలీసుల గొప్ప తనాన్ని చాటి చెప్పేలా గీసిన ఓ చిత్రం ప్రతిఫలిస్తే, మనిషి అంతర్ముఖంలో ఉండే భావాలు ఒకేసారి బయటికి వస్తే ఆ మనిషి ముఖం ఎన్ని ముఖాలుగా మారుతుందో మరో చిత్రం తెలియజేస్తుంది. ఇబ్రహీం, విక్రమ్, రాజ్‌కుమార్, రమేష్, చిన్నా... తదితర ఖైదీల చేతుల్లో ప్రాణం పోసుకున్న దేశనాయకుల పోట్రైట్ల నుంచి ప్రకృతి దృశ్యాల దాకా... ఇక్కడ కనువిందు చేస్తాయి. ‘ఈ చిత్రాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్కాలర్‌షిప్‌ల రూపంలో ఖైదీలకే అందిస్తాం. అయితే ఇది కేవలం ఖైదీలకు ఆదాయం అందించడానికి మాత్రమే కాదు వారిలో సున్నితత్వాన్ని మేల్కొలిపి జీవితం పట్ల వారి దృక్పథాన్ని మార్చేందుకు కూడా’ అని కళాకృతి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశాంత్ లహోటి అన్నారు. మొదట భయపడ్డా... తొలుత ఖైదీలకు ఆర్ట్ వర్క్ అంశంలో శిక్షణ అంటే భయపడ్డాను. అయితే పోలీసు ఉన్నతాధికారులు, కళాకృతి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశాంత్ లహోటిలు అందించిన ప్రోత్సాహంతో దీన్ని అధిగమించాను. తొలి దశలో వారికి చెప్పడం కాస్త కష్టమైంది. అయితే వారిలో ఆసక్తి పెరిగిన తర్వాత నా పని సులభం అయింది. ఇప్పుడు కొందరైతే ప్రసిద్ధ చిత్రకారులకు తీసిపోని రీతిలో చిత్రాలు గీస్తున్నారు. అంతేకాదు ఖైదీ నుంచి కళాకారుడిగా రూపాంతరం చెందిన తర్వాత వారి మాట, మర్యాదల్లో ఎంతో మార్పు వచ్చింది. ఒక ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఇప్పటిదాకా ఎవరికీ రాని అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. - సయ్యద్, ఆర్ట్ టీచర్. -
నేపాల్ భూకంప బాధితుల కళ్ళలో... 'రోహాన్ కళ'
అతడిలో కేవలం కళాత్మక హృదయమే కాదు... చలించిపోయే మనస్తత్వం ఉన్నట్టు కూడ కనిపిస్తుంది. అందుకే వెళ్ళింది విహార యాత్రకైనా అక్కడి అందాలకు ముగ్ధుడయ్యాడు. తనకు కనిపించిన అద్భుత ప్రకృతి దృశ్యాలతో పాటు, అక్కడి కట్టడాల సౌందర్యాన్నీ.. కంటిపాపలో చిత్రాలుగా పొందుపరచుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ రోహాన్ పట్నాకర్... నేపాల్ సౌందర్యాన్ని చూసి సంవత్సరం కూడ కాలేదు. ఇంతలో వచ్చిన భూ కంపం ఆ ప్రాంతాన్ని అక్కడి జనాన్ని కకావికలం చేయడం తట్టుకోలేక పోయాడు. తన గుండెల్లో సాక్షాత్కరించిన సౌందర్యాన్నినేపాల్ లో తిరిగి సృష్టించేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. భూకంపంతో తునాతునకలైన అందమైన నేపాల్ చిత్ర పటాన్ని తిరిగి ఆవిష్కరించాలని రోహాన్ ఆత్రుత పడుతున్నాడు. తన ప్రతిభతో కుంచెకు రంగులద్ది.. నేపాల్ లోని అద్భుత కట్టడాలను చిత్రాలుగా తీర్చి దిద్దాడు. భూకంపానికి ముందున్న స్థితికి నేపాల్ ను తేవాలన్నదే ఆశయంగా వాటర్ కలర్స్ తో నేపాల్ లోని సౌందర్యాన్ని, చారిత్రక కట్టడాలను స్కెచ్ లు గా మలచి వాటితో వచ్చిన డబ్బును నేపాల్ రూరల్ ప్రాంతాన్ని తిరిగి నిర్మించేందుకు పాటు పడుతున్నాడు. ''మా కంపెనీ ప్రాజెక్టు పనిమీద నేను నేపాల్ వెళ్ళాను. ఆ పర్యటన నన్ను నేపాల్ లోని అందాలను తిలకించేందుకు అవకాశాన్నిచ్చింది. అలాగే అక్కడి నా కొలీగ్స్ ను కలిసేందుకు, వారి సంప్రదాయ వంటకాలను రుచి చూసేందుకు మంచి సందర్భమైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నేను నా ప్రతి జ్ఞాపకాన్నీ నోట్ బుక్ లో డ్రాయింగ్స్ గానూ, అక్షరాలుగాను నింపేశాను.'' అంటాడు రోహాన్. ఏప్రిల్ 2015 లో వచ్చిన నేపాల్ భూకంపం రోహాన్ చూసిన ఎన్నో అందాలను తనలో కలిపేసుకుంది. కొందరు సహోద్యోగుల కుటుంబాలు.. ఇళ్ళతో సహా.. బంధువులనూ కోల్పోయారు. ఒకప్పుడు భూలోక సౌందర్యంగా తాను గుర్తించిన ఆ ప్రాంతం భూకంపంతో శిథిలంగా మారిపోయింది. భూకంపం విషయం తెలిసిన వెంటనే రోహాన్ నేపాల్ లోని తన స్నేహితులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికప్పుడు ఎటువంటి సమాచారం తెలియలేదు. ''కొన్నాళ్ళ తర్వాత నా స్నేహితులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. మేమంతా కలసి నేపాల్ లో భూకంప బాధిత ప్రాంత వాసులకు ఏదో ఒక సహాయం అందించాలని అనుకున్నాం. అందుకోసం విరాళాలను సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. కొన్ని వారాల తర్వాత కఠ్మాండు లోని స్నేహితులతో కూడ మాట్లాడాం. అప్పటికే వారు అక్కడి భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో వారికి మరింత సహాయం అందించేందుకు మా ప్రయత్నాలు కొనసాగించాం'' అంటాడు రోహాన్. అయితే ఫండ్స్ ఎలా సేకరించాలన్న ఆలోచన మొదట్లో కాస్త ఆందోళనకు గురిచేసినా... రోహాన్ కు వెంటనే సమాధానం దొరికింది. తనకు ఇష్టమైన కళను విరాళాలు సేకరించేందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. నేపాల్ లోని అద్భుతమైన చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోశాడు. అదే సమయంలో చెన్నై, హైదరాబాద్ లకు చెందిన రోహాన్ స్నేహితులు కూడ పుస్తకాల అట్టలపై డ్రాయింగ్స్ తో రోహాన్ కు సహకారం అందించారు. పోస్ట్ కార్డ్, నోట్ బుక్, ఎ3 సైజుల్లో వేసిన డ్రాయింగ్స్ ఫండ్ కోసం అమ్మకానికి పెట్టారు. 150 నోట్ బుక్స్, 30 ఆర్ట్ ప్రింట్లు, 100 పోస్ట్ కార్డ్ డ్రాయింగ్స్ అమ్మగా వచ్చిన సుమారు లక్ష రూపాయలను నేపాల్ పునర్నిర్మాణానికి అందించారు. రోహాన్ కఠ్మాడు ఆర్కిటెక్ట్ స్నేహితులు ఆ విరాళంతో భూకంపంతో శిథిలమైన పలు సిమెంట్, చెక్క నిర్మాణాల స్థానంలో వెదురుతో ఇళ్ళను నిర్మించి బాధితులకు సహాయ పడ్డారు. నాలుగు రకాల మోడల్ హోమ్స్ కట్టి... బాధితులకు అందించారు. తమలాగే మరెవరైనా నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు తోడ్పడాలని రోహాన్... అతిని మిత్రులు సూచిస్తున్నారు. -
పెషావర్ బాధితులకు హార్ట్ @ తెలంగాణ
ఉగ్రవాదానికి బదులిచ్చే హృదయం తమకుందని తెలంగాణ ఆర్టిస్టులు నిరూపించారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇటీవల టైస్ట్‌ల పాశవిక దాడిలో మృతి చెందిన విద్యార్థులకు, బాధిత కుటుంబాలకు వంద మంది కళాకారులు ఆదివారం శిల్పారామంలో తమ చిత్రకళతో అపూర్వంగా సంఘీభావం (ఆర్ట్ ఫర్ ఎమిటీ) ప్రకటించారు. ఐదు మీటర్ల పొడవైన మూడు కాన్వాసులపై సంతకాలు చేశారు. వర్ణాలు రంగరించారు. చిత్రాలు మలిచారు. ఈ చిత్రాలను యునెస్కోకు అందజేస్తామని ఆర్ట్ ఎట్ తెలంగాణ ట్రస్టీలు బి.నరసింగరావు, పాపారావు, లక్ష్మణ్ ఏలె, ఆనంద్‌లు తెలిపారు. ప్రముఖ చిత్రకారులు వైకుంఠం, సూర్యప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అన్బిలీఫ్బుల్!
కళ రెండు సంవత్సరాల క్రితం మాంచెస్టర్‌లోని ఒక తోటలో భార్య ఎల్హమ్తో కలిసి విహారానికి వెళ్లాడు ఒమిద్ అసాది. ఉన్నట్టుండి గాలి వీచడం మొదలైంది. గాలికి ఆ తోటలో పెద్ద పెద్ద ఆకులు నేలరాలుతున్నాయి. వాటిని చూస్తే ఆసాదికి భలే ముచ్చటేసింది. వాటిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. పుస్తకాలలో దాచాడు. ఇక ఆ విషయం మరిచేపోయాడు. కొన్ని రోజుల తరువాత పేపర్‌తో తయారుచేసిన కళాకృతుల ప్రదర్శనకు వెళ్లినప్పుడు తాను దాచుకున్న పత్రాలు ఆసాదికి గుర్తుకువచ్చాయి. వాటిని కాన్వాస్‌గా చేసుకొని రకరకాల బొమ్మలు వేయాలనే ఆలోచన వచ్చింది. ఒక సూదితో రోజూ రెండు నుంచి మూడు గంటల వరకు ఈ పత్రాల మీద చిత్రాలను లిఖించడానికి ప్రయత్నించేవాడు. మొత్తానికైతే కొన్నిరోజుల తరువాత అసాది ప్రయత్నం గాడిలో పడింది. జంతువులు, పక్షులు, మనుషులు... కోరు కున్న చిత్రమల్లా పత్రంపై ప్రత్యక్షమయ్యేది. ఈ పత్రాలపై చెట్టు జిగురు తప్ప రసాయనాలేవీ వాడేవారు కాదు. ‘‘పత్రాల మీద చిత్రాలను చెక్కుతున్నప్పుడల్లా నా బాల్యం గుర్తుకు వస్తుంది’’ అంటున్నాడు అసాది. ఇరాన్‌కు చెందిన అసాది భార్యతో కలిసి మాంచెస్టర్‌లో స్థిరపడ్డాడు. తాను అభిమానించే వ్యక్తుల పోట్రయిట్లను పత్రాల మీద చెక్కి వారికి కానుకగా ఇస్తుంటాడు. ‘‘ఎంత టైమ్ తీసుకున్నామనే దానికంటే ఎంత అందంగా వచ్చింది అనేది ముఖ్యం’’ అంటాడు అసాది. ఇటీవల మొదటిసారిగా తన కళాకృతులను ప్రదర్శనకు పెడితే అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘చెట్టు మీది నుంచి యాపిల్ పడితేనే కాదు... ఆకు పడినా కొత్త ఆలోచనలు వస్తాయి’’ అని తరచుగా అంటుంటాడు సరదాగా అసాది. పచ్చనాకు సాక్షిగా నిజమే కదా మరి! -
గోటితో కొండంత...
ఫొటో చూడగానే ఈ కుర్రవాడి ప్రతిభ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మైక్రో ఆర్ట్‌లో తన ప్రతిభను చాటుకుంటున్న ఇతడి పేరు చుండూరు పవన్. వయసు 21 ఏళ్లు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం గ్రామంలో పుట్టాడు. ‘‘ఏదైనా విభిన్నంగా చేయాలనిపించింది. అందుకే వ్యర్థాలతో మైక్రో ఆర్ట్ చేయడం ప్రారంభించాను. వ్యర్థాలతో కళాకృతులు తయారుచేయడం ప్రారంభించిన కొత్తలో మా నాన్నగారు నన్ను కేకలేసేవారు. ఆ తరవాత ప్రోత్సహించడం మొదలుపెట్టారు’’ అంటాడు పవన్. ‘‘ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డిగ్రీ చదువుకున్నాను. అక్కడ బస్ స్టాండ్‌లో ఎందరో వికలాంగులను చూసేవాడిని. చాలా బాధ అనిపించేది. వారికి ఏమైనా చేయాలనుకునేవాడిని. అందుకే ఇలా డబ్బులు సేకరించి, ఎంత వస్తే అంత వారికి అందచేస్తుంటాను’’ అని వివరించాడు పవన్. ఇతడు చేసిన కళాకృతులు... వ్యర్థాలతో... టేబుల్ ఫ్యాను అర అంగుళం చెప్పులు పిఎస్ఎల్వి సి 23 నమూనా ఈగ సినిమా ప్రేరణతో ఈగ బొమ్మ... ఇవి మచ్చుకి మాత్రమే కేవలం మైక్రో ఆర్ట్ మాత్రమే కాకుండా, ఒకేసారి ఇద్దరు వినేలా రెండు ఇయర్ ఫోన్లు ఉంచడానికి అనువుగా సాకెట్‌ను కూడా తయారుచేశాడు. ‘‘ఇప్పుడు రేడియేషన్ ప్రొటెక్టర్ ఆప్ చేస్తున్నాను. దీని వల్ల మనం ఉన్న ప్రదేశంలో ఎంత రేడియేషన్ ఉన్నదీ తెలుసుకోవచ్చు. అలాగే కాలుష్యాన్ని నియంత్రించే హెల్మెట్ లాంటిది కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చోరీకి గురైన మోటారు వాహనాల ఆచూకీ కనుక్కోవడానికి వీలుగా, పాడైపోయిన సెల్ఫోన్లను అనుసంధానం చేసే ఉపకరణం తయారు చేయాలనేది నా ఆశ ’’ అంటున్న పవన్, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో తయారుచేసిన కళాకృతులను ఇంతవరకూ ప్రదర్శనకు ఉంచలేదని చెబుతున్నారు. అంతేకాదు, ఎప్పటికైనా యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డెరైక్టర్ కావాలనేది తన జీవితధ్యేయం అంటున్నారు. -
రవి కాంచిన కళ
సౌందర్యాన్ని ఆరాధించడం, అధ్యయనం చేయడం, ఆస్వాదించడం ద్వారా కళలోని అనుభూతి, ఆనందాలను సొంతం చేసుకోగలం. అలా సొంతం చేసుకున్న కళాపిపాసి రవీంద్రనాథ్ ఠాగూర్. చిత్రకళలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ తనదైన శైలిని ప్రతిబింబించారు. పాశ్చాత్య చిత్రకారులు చార్లెస్ పామర్, గిలార్డ్ వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నప్పటికీ తాను గీసిన చిత్రాల్లో భారతీయ ఆత్మను ప్రదర్శించారు. మిగిలిన చిత్రకారుల మాదిరిగా ముదురురంగుల్లో కాకుండా... నీటిరంగుల్లో, లేతరంగుల్లో, వివిధ మాధ్యమాల్లో చిత్రాలు వేశారు ఠాగూర్. సిరా, పేస్టల్స్‌తో కూడా చిత్రాలు రూపొందించారు. రవీంద్రుడికి అమితంగా నచ్చిన అంశం ప్రకృతి. జీవితంలో ఎక్కువగా భాగం ప్రకృతితో సంభాషణ చేయడానికి ఇష్టపడిన తాత్వికుడు ఠాగూర్. ఆయన గీసిన చిత్రాల వలన కలిగే అనుభూతి కాలాతీతమైనది. ఎప్పుడూ గుర్తుండి పోయేది. కృతకమైన అలంకరణలు, ఆడంబరాలు నిజమైన ప్రేమకు అడ్డుగోడగా నిలుస్తాయని ఆయన నమ్మకం. అందుకే అలంకరణను వదిలి భావవ్యక్తీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిరాడంబరమైన చిత్రాలనేకం ఆయన కుంచె నుంచి జాలువారాయి. ఆయనకు సంగీతం కూడా ఇష్టమైనదే కావడంతో చిత్రాల్లో ‘లయ’ కనబడుతుంది. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవీంద్రునికి ముందే అనేక మంది చిత్రరచన చేసినా ‘బెంగాలీ సంప్రదాయం’ ఠాగూర్ నుంచి వచ్చినదే. యూరప్‌లో వచ్చిన సాంస్కృతిక పునర్జీవనం లాంటిది బెంగాలీ చిత్రకళలో తీసుకువచ్చారు. రవీంద్రుని ద్వారా బెంగాల్ చిత్రకళ సరికొత్త ఉత్తేజాన్ని పొందింది. తాత్వికుడైన ఠాగూర్ దృష్టిలో కళాసృష్టి అంటే- ‘‘అంధకారబంధురమైన ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే వారికి అనంత సౌందర్య ప్రపంచంలో సర్వేశ్వరుడు దర్శనమిస్తాడు’’ సౌందర్యపిపాసి అయిన ఠాగూర్ తన ఊహాసుందరి, కళాప్రేయసిని ఊహిస్తూ... ‘‘ఒక శూన్య సంతోషం నాలో నిండనీ నా చేతిని నీ చేతిలో తీసుకో అంతే చాలు చీకటి పరుచుకునే నిశివేళ నా హృదయం నీదిగా చేసుకో’’ అంటారు. రవీంద్రుడు దాదాపు మూడువేల చిత్రాల్ని సృష్టించాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. రవీంద్రుడి చిత్రాలలో ఆధునికతతో పాటు సంప్రదాయం కూడా ఉండడం వలన అవి అందరినీ ఆకట్టుకున్నాయి. మన మనోసీమలో పదిలంగా నిలిచిపోతాయి. ఇంగ్లండ్, డెన్కార్క్, రోమ్, జర్మనీ, స్వీడన్, రష్యాలలో రవీంద్రుని చిత్రప్రదర్శనలు జరిగాయి. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు రవీంద్రుడి చిత్రాలంటే ఇష్టంగా ఉండేది. కవిత్వంలో, చిత్రాల్లో ప్రకృతిని సాక్షాత్కరింప చేసిన ఠాగూర్ మన మధ్య లేకపోయినా ఆయన గీసిన చిత్రాలు మాట్లాడుతూనే ఉంటాయి. రవీంద్రుడిని మన మధ్య నిలుపుతూనే ఉంటాయి. - రామశాస్త్రి (కవి, చిత్రకారుడు)