సీసీటీలో ఆకట్టుకుంటున్న దుస్తులు
ఎకో ఫ్రెండ్లీ కళాకృతుల కనువిందు
బంజారాహిల్స్: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ భవన్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్ ఝాన్సీ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్‌ఫ్యూమ్‌లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్ జ్యువెలరీ, జూట్ బ్యాగులు, కేరళ మురల్ ఆర్ట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, రస్టిక్ సెరమిక్ పీసెస్, పామ్ లీఫ్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్‌లైన్‌లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.
ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్‌పర్సన్ అనురాధ బిష్ణోయ్ కూడా పాల్గొన్నారు.
ఇవి చదవండి: ఇన్‌ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment