పూస పూసలో ప్రేమ | Sunny Leone's Gift For Daughter Nisha Is Truly One Of A Kind | Sakshi
Sakshi News home page

పూస పూసలో ప్రేమ

Jun 3 2018 3:59 AM | Updated on Jul 26 2019 5:58 PM

Sunny Leone's Gift For Daughter Nisha Is Truly One Of A Kind - Sakshi

డేనియల్‌ వెబర్, నిషా, సన్నీలియోన్‌

ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఒక్కోలా వ్యక్తపరుస్తారు. బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ మాత్రం పూసల్లో ప్రేమను చూపించారు. విషయం ఏంటంటే... తన దత్తపుత్రిక నిషా కోసం ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వదలుచుకున్నారు సన్నీ లియోన్‌. చిన్న చిన్న పూసలతో ఒక ఆర్ట్‌ని డిజైన్‌ చేయడం మొదలెట్టారు. 2017 అక్టోబర్‌లో మొదలెట్టిన ఈ ఆర్ట్‌ వర్క్‌ని కంప్లీట్‌ చేయడానికి సన్నీకి సుమారు ఏడు నెలలకుపైగా పట్టిందట. ఒక్కో పూసను తన చేత్తోనే బోర్డ్‌పై అంటిస్తూ 12 రామచిలుకలు వరుసగా కూర్చున్న ఫొటోను తయారు చేశారు సన్నీ లియోన్‌.

కంప్లీట్‌ అయిన ఆర్ట్‌వర్క్‌ ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘నిషా కోసం పూసలతో ఓ ఆర్ట్‌ వర్క్‌ చేయాలనుకున్నాను. లాస్ట్‌ అక్టోబర్‌లో స్టార్ట్‌ చేసిన ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను రీసెంట్‌గా కంప్లీట్‌ చేశాను. కొన్ని వేల పూసలని నేనే స్వయంగా అంటించాను’’ అన్నారు. కుమార్తె నిషాని ఉద్దేశించి... ‘ఈ బొమ్మలో ప్రతి పూస అంటిస్తున్నప్పుడు నీ గురించే ఆలోచించాను. నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను’’ అని పేర్కొనారు సన్నీ లియోన్‌.

                                    ఆర్ట్‌ స్టార్టింగ్‌


                                   ఫైనల్‌ ఆర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement