సన్నీ లియోన్, నిషా కౌర్, డానియల్
‘‘సరిగ్గా ఏడాది క్రితం మా లైఫ్‌లోకి మరింత ఆనందాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ ఆనందం పేరే నిషా’’ అంటున్నారు సన్నీ లియోన్. ఆనందాన్ని అడాప్ట్ చేసుకోవడమేంటీ అనుకుంటున్నారా? గతేడాది జూలైలో సన్నీ లియోన్, ఆమె భర్త డానియల్ కలసి నిషా కౌర్‌ను దత్తత తీసుకున్నారు. నిషాని మా ఫ్యామిలీలో భాగం చేసుకొని ఏడాది అయిపోతోందంటూ ట్వీటర్‌లో తమ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు సన్నీ లియోన్.
‘‘ఒక సంవత్సరం క్రితం నిన్ను (నిషా) మాతో తీసుకురావడంతో మా లైఫ్‌ని మార్చేసుకున్నాం. ఈరోజు నీ ఫస్ట్ యానివర్శరీ. గడిచింది కేవలం ఒక్క సంవత్సరమే అయిందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అప్పుడే నీతో జీవితకాల పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తోంది. నా హార్ట్, సోల్‌లో నువ్వు భాగం అయిపోయావు. ప్రపంచంలోనే బ్యూటిఫుల్ గర్ల్ నువ్వు’’ అని నిషాని ఉద్దేశించి పేర్కొన్నారు సన్నీ లియోన్.
Comments
Please login to add a commentAdd a comment