ప్రామిస్‌ చేస్తున్నా.. కదిలిస్తున్న సన్నీ సందేశం | Sunny Leone Tweet on Kathua Rape Case | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 14 2018 1:09 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

Sunny Leone Tweet on Kathua Rape Case - Sakshi

కథువా బాధిత బాలిక.. పక్కనే సన్నీ పోస్ట్‌ చేసిన ఫోటో

దేశంలో అఘాయిత్యాల పర్వాలపై చర్చ కొనసాగుతున్న వేళ.. కథువా ఘటన మాత్రం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తోంది. ప్రముఖులంతా తమకు తోచిన రీతిలో ఘటనపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సన్నీ లియోన్‌ చేసిన ఓ ట్వీట్‌ కదిలించి వేస్తోంది. తన కూతురు(దత్త పుత్రిక) నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశంతో ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘తల్లీ.. నేను నీకు ప్రామిస్‌ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీ కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటా. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా. ప్రస్తుతం చిన్నారులకు సైతం రక్షణ అనేదే లేకుండా పోయింది. కాబట్టి వారిని జాగ్రత్తగా సంరక్షికోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ ఓ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సానుకూలంగా స్పందన వస్తోంది.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement