Surgeon Attempts To Sell Terrorist Victim's X-ray: ఇంతవరకు డాక్టర్లు పేషంట్లను మోసం చేసిన ఘటనలను చూశాం. అంతెందుకు ఎక్కువ మెడికల్ చార్జీలు మోపి రోగుల నడ్డి విరిచేసిన కథనాలను గురించి విన్నాం. కానీ ఇక్కడొక డాక్టర్ అత్యంత అమానుషంగా దాడిలో గాయపడిన బాధితుడి ఎక్స్ రేని అమ్ముకోవడానికి యత్నించాడు.
అసలు విషయంలోకెళ్తే...పారిస్‌లోని బాటాక్లాన్ మ్యూజిక్ హాల్‌పై 2015లో జరిగిన ఉగ్రదాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అయితే పారిస్‌లోని జార్జెస్ పాంపిడౌ పబ్లిక్ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రెంచ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇమ్మాన్యుయేల్ మాస్మేజీన్ ఆ వ్యక్తి ఎక్స్‌రేని డిజిటల్ ఆర్ట్‌వర్క్‌గా అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చిత్రం కలాష్నికోవ్ బుల్లెట్‌ను కలిగి ఉన్న ముంజేయిని చూపిస్తుంది.
అంతేందుకు ఎన్‌ఫ్‌టీ డిజిటల్ ఇమేజ్‌గా పిలవబడే ఆ ఎక్స్‌రే ఓపెన్ వెబ్‌సైట్ సూమరు రూ 2 లక్షలు పలుకుతుంది. అయితే ఆ సర్జన్ మాస్మేజీన్ చేసిన పనికి తగిన చర్యలు తీసుకున్నామని పారిస్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతి మార్టిన్ హిర్ష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఇది సర్జన్ వృత్తికి విరుద్ధమైన పని మాత్రమే కాదు, వైద్య గోప్యతకు భంగం కలిగించే నేరానికి మాస్మేజీన్ పాల్పడ్డాని అన్నారు. అయితే మాస్మేజీన్ తన నేరాన్ని అంగీకరించడమే కాక పేషంట్ అనుమతి లేకుండా చేసిన ఇలాంటి పని చేసినందుకు బాధపడుతున్నానని చెప్పాడు.
(చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment