రాజస్తాన్: ఇంతవరకు మనం చాలా రకాల హత్యా నేరాలు గురించి విన్నాం. అయితే వాటిలో చాలా మటుకు క్షణికావేశంలోనో లేక కక్ష్యతోనో చేసినవి. పైగా చాలా మటుకు హత్యా నేరాల్లో చంపేందుకు గూండాలకు లేక చిన్న చిన్న రౌడిలకో డబ్బులిచ్చి హత్యలు చేయడం గురించి విని ఉన్నాం. కానీ ఇక్కడోక వ్యక్తి తన భార్యను చంపమని డాక్టర్‌కి డబ్బులు ఇచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే...రాజస్తాన్‌లో ఎస్‌ఆర్‌జి హాస్పిటల్‌లోని సర్జన్ అఖిలేష్ మీనా ఒక వ్యక్తి తన భార్యను చంపాలంటూ తన వద్దకు వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా డబ్బులు కూడా ఇచ్చాడని తెలిపారు. ఈ మేరకు గర్భవతి అయిన అతని భార్య చికిత్స నిమిత్తం తన వద్దకు వచ్చాడని డాక్టర్ చెప్పారు.
పైగా తన భార్యను తన రెసిడెన్షియల్ ప్రాక్టీస్‌లోనే చంపాలంటూ అభ్యర్థించాడని పోలీసులకు తెలిపారు. అంతేగాక గత నాలుగైదు రోజుల నుంచి ఆ వ్యక్తి నుంచి తరుచుగా కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఝలావర్ సిటీ పోలీసులు మాట్లాడుతూ.."ఆ వ్యక్తిని పెదవా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మంగళ్ సింగ్‌గా గుర్తించాం. అతని పై కేసు నమోదు చేశాం". అని తెలిపారు.
(చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..)
Comments
Please login to add a commentAdd a comment