ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : అదనపు కట్నం తేలేదన్న కారణంతో భర్త తనతో వ్యభిచారం చేయిస్తున్నాడని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజస్తాన్‌లోని ధోల్‌పూర్‌లో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. రాజస్తాన్‌లోని ధోల్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన కొద్దిరోజుల తర్వాతినుంచి భర్త, ఇతర కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం ఆమెను వేధించసాగారు. మరుదులు చిత్రహింసలు పెట్టేవారు. అయినప్పటికి బాధితురాలు అదనపు కట్నం తేలేకపోవటంతో భర్త దారుణానికి దిగాడు.
ఇతర మగాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఆమెపై అత్యాచారం చేయించేవాడు. వారి వేధింపులు మరింత పెరగటంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో షాక్‌కు గురైన వారు కూతుర్ని ఇంటికి తెచ్చేసుకున్నారు. అనంతరం కూతురితో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ విషయం తెలిసిన భర్త, అతని కుటుంబసభ్యులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment