రాజస్థాన్‌లో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి | Tribal Woman Stripped Paraded Naked In Rajasthan By Husband; Video Viral- Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో అమానుషం.. యువకుడితో భార్య పరార్‌.. వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగింపు

Published Sat, Sep 2 2023 9:37 AM | Last Updated on Sat, Sep 2 2023 10:28 AM

Tribal Woman Stripped Paraded Naked In Rajasthan By Husband - Sakshi

రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య(21) పట్ల భర్త దుర్మార్గంగా ప్రవర్తించాడు. భార్యపై దాడి చేసి, ఆమె బట్టలు విప్పి గ్రామంలో నగ్నంగా ఊరేగించాడు. ఈ దారుణం ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. 

పోలీసుల వివరాల ప్రకారం. 21 ఏళ్ల గిరిజన యువతికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది. అయితే ఆమె పక్కింటి యువకుడితో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడితో వివాహిత పరారయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అత్తమామలు ఆగ్రహించి..మహిళను కిడ్నాప్‌ చేసి వాళ్ల గ్రామానికి తీసుకొచ్చి ఆమెపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు.

అంతేగాక మహిళ సాయం కోసం అర్తించినా అక్కడ ఉన్న వాళ్లు ఆమెకు హెల్ప్‌ చేసేందుకు ముందుకు రాకపోగా.. ఈ తతంగాన్ని మొత్తం సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు..దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిలో అందరిముందే మహిళను ఆమె భర్త దుస్తులు విప్పిందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. బాధితురాలు సాయం కోసం వేడుకోవడం, అక్కడున్న వారంతా విడ్డూరం చూసినట్లు చూస్తుండటం కూడా కనిపిస్తోంది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మొత్తం 10 మందిపై పోలసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఆరు బృందాలుగా వీడి దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్‌గఢ్‌ ఎస్పీ అమిత్‌ కుమార్‌ గ్రామంలోనే ఉండి విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొంతమందిని అరెస్ట్‌ చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: జేడీఎస్‌ నేత యువతులతో రాసలీలలు .. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ తీవ్రంగా స్పందించారు. దీనిని ఖండిస్తూ గురువారం అర్థరాత్రి ట్వీట్‌ చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసిన వీడియో కలవరానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ఏడీజీపీని సంఘటనా స్థలానికి పంపి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నీచమైన చర్యకు పాల్పడిన ఇలాంటి నేరగాళ్లకు సమాజంలో చోటు లేదని, వీరిని వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి విచారణ చేపడతామని చెప్పారు. 

బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందిస్తూ.. ఈ సంఘటన కాంగ్రెస్ వంచనను బయటపెట్టిందని విమర్శించారు.  అశోక్‌ గహ్లోత్‌ను రాజీనామా చేయాలని రాహుల్‌ గాంధీని డిమాండ్‌ చేశారు. అలాగే రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సైతం కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళలపై జరిగే నేరాల్లో రాష్ట్రం నెంబర్‌ 1 స్థానంలో ఉందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement