Pratapgarh
-
బీజేపీ నేత కొడుక్కి బీఎస్పీ టికెట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత కుమారుడికి టికెట్ ఇచ్చింది. ప్రతాప్‌గఢ్ పార్లమెంట్ స్థానం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది ప్రథమేష్ మిశ్రాను పోటీకి దింపాలని నిర్ణయించింది.ప్రథమేష్ పొరుగున ఉన్న కౌశాంబి పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జి అయిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని కుమారుడు. పల్టాన్ బజార్‌కు చెందిన శివ ప్రకాష్ మిశ్రా సేనాని గతంలో బీఎస్పీలో ఉన్నారు. 1999, 2007, 2012లో కుందా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2004లో ప్రతాప్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య సింధూజా మిశ్రా సేనాని కూడా 2012లో విశ్వనాథ్‌గంజ్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా, 2022లో కుందా నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.ఇక ప్రథమేష్ విషయానికి వస్తే సుప్రీంకోర్టులో న్యాయవాది అయిన ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. ప్రతాప్‌గఢ్‌లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సంగం లాల్ గుప్తా, సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ‘ఇండియా’ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ ఎస్పీ సింగ్ పటేల్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తన కుమారుడి నిర్ణయమని, తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని ప్రథమేష్ తండ్రి శివప్రకాశ్ మిశ్రా సేనాని స్పష్టం చేశారు. -
రాజస్థాన్‌లో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి
రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య(21) పట్ల భర్త దుర్మార్గంగా ప్రవర్తించాడు. భార్యపై దాడి చేసి, ఆమె బట్టలు విప్పి గ్రామంలో నగ్నంగా ఊరేగించాడు. ఈ దారుణం ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం. 21 ఏళ్ల గిరిజన యువతికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది. అయితే ఆమె పక్కింటి యువకుడితో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడితో వివాహిత పరారయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అత్తమామలు ఆగ్రహించి..మహిళను కిడ్నాప్ చేసి వాళ్ల గ్రామానికి తీసుకొచ్చి ఆమెపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తొలగించి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. అంతేగాక మహిళ సాయం కోసం అర్తించినా అక్కడ ఉన్న వాళ్లు ఆమెకు హెల్ప్ చేసేందుకు ముందుకు రాకపోగా.. ఈ తతంగాన్ని మొత్తం సెల్ఫోన్లో రికార్డు చేశారు..దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిలో అందరిముందే మహిళను ఆమె భర్త దుస్తులు విప్పిందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. బాధితురాలు సాయం కోసం వేడుకోవడం, అక్కడున్న వారంతా విడ్డూరం చూసినట్లు చూస్తుండటం కూడా కనిపిస్తోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మొత్తం 10 మందిపై పోలసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఆరు బృందాలుగా వీడి దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్‌గఢ్ ఎస్పీ అమిత్ కుమార్ గ్రామంలోనే ఉండి విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొంతమందిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: జేడీఎస్ నేత యువతులతో రాసలీలలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్ प्रतापगढ़ जिले में पीहर और ससुराल पक्ष के आपसी पारिवारिक विवाद में ससुराल पक्ष के लोगों द्वारा एक महिला को निर्वस्त्र करने का एक वीडियो सामने आया है। पुलिस महानिदेशक को एडीजी क्राइम को मौके पर भेजने एवं इस मामले में कड़ी से कड़ी कार्रवाई के निर्देश दिए हैं। सभ्य समाज में इस… — Ashok Gehlot (@ashokgehlot51) September 1, 2023 కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్రంగా స్పందించారు. దీనిని ఖండిస్తూ గురువారం అర్థరాత్రి ట్వీట్ చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసిన వీడియో కలవరానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ఏడీజీపీని సంఘటనా స్థలానికి పంపి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నీచమైన చర్యకు పాల్పడిన ఇలాంటి నేరగాళ్లకు సమాజంలో చోటు లేదని, వీరిని వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి విచారణ చేపడతామని చెప్పారు. राजस्थान में अब महिलाओं पर अमानवीयता की सारी सीमाएं पार हो चुकी हैं। धरियावद में एक नारी को निर्वस्त्र कर पीटा गया है, जिसका वीडियो वायरल है, लेकिन महिला सुरक्षा पर बड़े-बड़े दावे करने वाले गहलोत जी जाने किस राज्य के मुख्यमंत्री और गृहमंत्री हैं? दो दिन बीत गए पुलिस ने रिपोर्ट… pic.twitter.com/iQUt0PIdNQ — Gajendra Singh Shekhawat (@gssjodhpur) September 1, 2023 బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. ఈ సంఘటన కాంగ్రెస్ వంచనను బయటపెట్టిందని విమర్శించారు. అశోక్ గహ్లోత్‌ను రాజీనామా చేయాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. అలాగే రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సైతం కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళలపై జరిగే నేరాల్లో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
వైరల్ వీడియో: పెళ్లిలో ట్విస్ట్ ఇచ్చిన వరుడు.. చెట్టుకు కట్టేసి..
ప్రతాప్‌గఢ్: కాసేపట్లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యేవారు. ఇంతలో వరుడి మదిలో మెదిలిన ఓ ఆలోచనే అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో, వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులందరూ బందీలు మారారు. వరుడిని చెట్టుకి కాట్టేశారు వధువు తరఫు బంధువులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఇద్దరికి వివాహం నిశ్చయించారు ఇరు కుటుంబా సభ్యులు. దీంతో, పెళ్లి వేడుక ప్రారంభమైంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వేడుకకు బంధువులంతా తరలివచ్చారు. కొద్ది క్షణాల్లో వధువు మెడలో జయమాల వేసే సమయం ఆసన్నమైంది. అంతలోనే పెళ్లి కొడుకు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. దీంతో, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం, అదనపు కట్నం విషయంలో ఎంతసేపు వరుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నాడు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడివైపు మొగ్గుచూపారు. దీంతో, విసుగెత్తిన వధువు కుటుంబ సభ్యులు.. ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేశారు. అనంతరం, వరుడిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరుడు మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని వధువు తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. इस लइका का जयमाल हो गया था .. उसके बाद परिजन दहेज की डिमांड करने लगे। जिसके बाद लड़की के परिजन ने दूल्हे साहेब को पेड़ से बांध दिया। वीडियो यूपी के प्रतापगढ़ से है ।। pic.twitter.com/obOG9BpLMB — हम लोग We The People (@ajaychauhan41) June 15, 2023 ఇది కూడా చదవండి: చిన్న వర్షానికే వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. వీడియో వైరల్ -
కాంగ్రెస్ Vs బీజేపీ: ఎంపీపై దాడి.. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేపై కేసు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ దాడి జరిగిందని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర వివాదం ఏర్పడింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని సంగీపూర్ బ్లాక్‌లో శనివారం నిర్వహించిన గరీబ్ కల్యాణ్ మేళాలో బీజేపీ ఎంపీ, బీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సంగమ్‌లాల్ గుప్తాపై దాడి జరిగింది. ఆయన కుర్తాను చించేశారు. చదవండి: కేటీఆర్ మెచ్చిన ‘పేపర్ బాయ్’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా? ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ఈ ఘటనపై ఏకంగా 27 మందిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీతో పాటు ఆయన కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రాతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి.. जनपद प्रतापगढ के सांगीपुर ब्लॉक में आयोजित गरीब कल्याण मेले में भाजपा सांसद एवं भाजपा पिछड़ा वर्ग मोर्चा के राष्ट्रीय महासचिव श्री संगमलाल गुप्ता जी पर हमला करने वाले गुंडों के ख़िलाफ़ कठोर कारवाई जल्द से जल्द किए जाने के निर्देश दिए गए हैं !! एक भी दोषी को बक्शा नहीं जायेगा — Keshav Prasad Maurya (@kpmaurya1) September 25, 2021 -
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు దారుణ హత్య!
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్‌చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. సులభ శ్రీవాస్తవ మరణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. జర్నలిస్టు మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సులభ్ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ఇటీవలే లిక్కర్ మాఫియాపై కీలక సమాచారం సేకరించాడు. దీని ఆధారంగా ఏబీపీ న్యూస్ చానల్‌పై పరిశోధనాత్మక కథనం ప్రసారమయ్యింది. తమ జోలికి రావొద్దంటూ లిక్కర్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సులభ్ శ్రీవాస్తవ పోలీసులకు లేఖ రాశాడు. ఆదివారం లాల్గంజ్లో వార్తల సేకరణ కోసం సులభ్ శ్రీవాస్తవ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చాడు. తర్వాత సుఖ్‌పాల్ నగర్ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి ద్విచక్ర వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు అక్కడి దృశ్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, లిక్కర్ మాఫియానే సులభ్‌ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
కత్తులతో డాల్ఫిన్‌పై దాడి, ముగ్గురు అరెస్టు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు యువకులు ఒక డాల్ఫిన్‌ను కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగజీవి అనే కనికరం లేకుండా డాల్ఫిన్ పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ కత్తులు, కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ జుగుప్సాకర సన్నివేశం డిసెంబర్ 31న యూపీలోని ప్రతాప్‌ఘర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని కొతారియా గ్రామం సమీపంలో ఉన్న శారద కెనాల్‌కు కొంతమంది యువకులు చేపల వేటకు వచ్చారు. వలలో పెద్ద చేప చిక్కిందన్న సంతోషంలో ఉన్న యువకులు అదే ధోరణిలో దానిపై దాడి చేశారు. ఇదే సమయంలో మరో గుంపు కూడా అక్కడికి చేరుకొని వారికి జత కలిశారు. అయితే వారికి దొరికింది ఒక డాల్ఫిన్ అన్న విషయాన్ని గుర్తించి కూడా దానిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కత్తులతో డాల్ఫిన్ శరీరాన్ని రెండు బాగాలు చేసి తమ పైశాచిక ఆనందాన్ని పొందారు. అనంతరం దానిని చంపి కెనాల్‌లోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.(చదవండి: ప్రెగ్నెన్సీ కోసం లడఖ్‌కు విదేశీ యువతుల క్యూ) దీనిని ఒక యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 9/51 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ యువకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. On New Year's eve, a #dolphin was brutally murdered by people in Sharda canal of Uttar Pradesh's Pratapgarh area. These are rare dolphins of the Ganges who are on the verge of extinction. Shame 😡 #SaveThePlanet #Nature #Ganga #AnimalCruelty pic.twitter.com/w3zNQbEHu5 — Karan Bhardwaj (@BornOfWeb) January 8, 2021 -
అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తల్లి
ఉదయ్‌పూర్: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అల్లుడితో కలిసి కన్నా కొడుకునే చంపించింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌ఘడ్ జిల్లా చోటిసాద్రి గ్రామానికి చెందిన మోహిత్(21) తన తల్లి ప్రేమ్‌లత సుతార్‌తో తరచూ గొడవ పడేవాడు. తండ్రి చనిపోయాక ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో విసుగు చెందిన ప్రేమ్‌లత కూతురి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటుంది. కాగా నెల రోజుల క్రితం ఆమె తన ఊళ్లో ఉన్న భూమిని అమ్మడానికి ప్రయత్నించింది. దీనికి మోహిత్ అడ్డుపడ్డాడు. దీంతో ఎలాగైనా కొడుకు అడ్డుతొలగించుకోవాలని అల్లుడితో కలిసి కుట్రపన్నింది. మోహిత్‌ను అంతమొందించడం కోసం అదే ప్రాంతానికి చెందిన రౌడీ గణపత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆశ్రయించారు. హత్య కోసం అతనితో లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యాభైవేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ నెల 6న మోహిత్ గ్రామానికి దగ్గరలో ఉన్న దాబాకి వెళ్లాడు. అక్కడే ఉన్న గణపత్, అనిల్‌లు ప్లాన్ ప్రకారం మోహిత్‌కి మద్యం తాగించారు. మోహిత్ మత్తులోకి వెళ్లాక ఇద్దరు కలిసి గొంతు పిసికి చంపేశారు. సీసీ పుటేజీ సాయంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
అనుప్రియపై దాడి, 158 మందిపై కేసు
ప్రతాప్‌గఢ్: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 158 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాణిగంజ్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. స్థానిక నాయకుడు వినోద్ దూబే సహా 157 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అనుప్రియ పటేల్, అప్నా దళ్ కార్యకర్తల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అనుప్రియ పటేల్ ఆదివారం ప్రతాప్‌గఢ్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్‌పై దాడిచేశారని అనుప్రియ ఆరోపించారు. తమ రోడ్ షోను అడ్డుకోవాలన్న కుట్రతో తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రినైన తనకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. -
15 ఏళ్ల చెర తప్పింది
న్యూఢిల్లీ: గజరాజుకు 15 ఏళ్ల చెర తప్పింది. ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి రక్షణ కార్యకర్తలు, పోలీసులు, అటవీ అధికారుల చొరవతో 55 ఏళ్ల ఏనుగు 'మోహన్'కు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాలతో కఠినాత్ముడైన యజమాని నుంచి మోహన్ ను రక్షించామని జంతుప్రేమికులు, అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రతాప్‌గఢ్ కు చెందిన ఓ వ్యక్తి 2001లో బిహార్ లోని సోనెపూర్ పశువుల సంతలో ఈ ఏనుగును కొన్నాడు. దానికి సరిగా తిండి పెట్టకుండా హింసించేవాడు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ అధికారుల దృష్టికి రావడంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టులోనూ ఏడాదిపైగా వాదనలు నడిచారు. చివరకు డిస్ట్రిక్ కోర్టు ఆదేశాలతో 'మోహన్'కు స్వేచ్ఛ లభించింది. మూడు రోజుల్లో యజమాని నుంచి మోహన్'ను విడిపించాలని జూలై 12న డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. కోర్టు ఆదేశాలతో చెర నుంచి 'మోహన్'ను విడిపించారు. -
అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం
లక్నో : అలహాబాద్ ప్రతాప్‌గఢ్‌లోని బాబాగంజ్ ప్రాంతంలోని గోయెల్ హోటల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవదహనమైయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ బలికరణ్ యాదవ్ వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్య చికిత్స కోసం అలహాబాద్ తరలించాలని వైద్యులు సూచించారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని అలహాబాద్ తరలించినట్లు పేర్కొన్నారు. గోయెల్ హోటల్లో ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయని... దీంతో హోటల్లో నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే సజీవ దహనమైయ్యారని వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మోడీ లక్ష్యంగా రాహుల్...
ప్రతాప్‌గఢ్(యుపి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతాప్‌గఢ్ నియోజకవర్గంలో జరిగిన సభతో రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగంతో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనే లక్ష్యంగా చేసుకున్నారు. గుజరాత్లో అభివద్ధి మోడీ వల్ల సాధ్యమైందని కాదన్నారు. అది అక్కడి ప్రజల కష్టార్జితమన్నారు. బీజేపీ ఘర్షణతో కూడిన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికారమే పరమావధి అంటూ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లోని మారుమూల గ్రామాలమహిళల కష్టమే అమూల్ వంటి విజయగాథలకు కారణమని మరచిపోకూడదన్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు గోతులు తీసే రాజకీయాలను, ఘర్షణతో కూడిన రాజకీయలను తాము విశ్వసించబోమన్నారు. అన్ని మతాలు, కులాల ప్రజల మధ్య శాంతి, ప్రేమను పెంపొందిస్తామన్నారు. యూపీలో శాంతి, సామరస్యం నెలకొంటే మహారాష్ట్ర, గుజరాత్‌తోపాటు, ఇంగ్లండ్ వంటి దేశాల నుంచి కూడా ప్రజలు తమ ఆర్థిక ఉన్నతి కోసం వస్తారని చెప్పారు. ప్రచారం విషయంలో బీజేపీని వెనక్కి నెట్టేస్తామన్నారు. ప్రజలకు హామీల విషయంలో ఆ పార్టీ తమకంటే అడుగు వెనకే ఉంటుందన్నారు. అదే అవినీతి విషయానికొస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుంటుందని చెప్పారు. సమాచార హక్కుచట్టం, లోక్‌పాల్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. వారు వీటిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని రాహుల్ గాంధీ చెప్పారు. -
అఖిలేష్ మంత్రివర్గంలో రాజాభయ్యా
వివాదస్పద ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బీ ఎల్ జోషి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమాజవాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్, సీనియర్ మంత్రులు మహ్మమద్ అజాం ఖాన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది మొదట్లో ప్రతాప్‌గఢ్ డీఎస్పీ జి-ఉల్-హక్ హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసులో ఆహార, పౌర సరఫరాల మంత్రి రాజా భయ్యాకు ప్రమేయం ఉందని అతడి భార్య పర్వింద్ ఆజాద్ ఆరోపించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజాభయ్యా మార్చిలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. డీఎస్పీ హత్య కేసును సీబీఐకు అప్పగించింది. డీఎస్పీ హత్య కేసులో రాజాభయ్యాకు ఎటువంటి ప్రమేయం లేదని సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది. దాంతో రాజాభయ్యా తిరిగి అఖిలేష్ మంత్రి వర్గంలో మరోసారి చోటు దక్కింది.