
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ దాడి జరిగిందని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర వివాదం ఏర్పడింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని సంగీపూర్ బ్లాక్‌లో శనివారం నిర్వహించిన గరీబ్ కల్యాణ్ మేళాలో బీజేపీ ఎంపీ, బీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సంగమ్‌లాల్ గుప్తాపై దాడి జరిగింది. ఆయన కుర్తాను చించేశారు.
చదవండి: కేటీఆర్ మెచ్చిన ‘పేపర్ బాయ్’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా?
ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ఈ ఘటనపై ఏకంగా 27 మందిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీతో పాటు ఆయన కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రాతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి..
जनपद प्रतापगढ के सांगीपुर ब्लॉक में आयोजित गरीब कल्याण मेले में भाजपा सांसद एवं भाजपा पिछड़ा वर्ग मोर्चा के राष्ट्रीय महासचिव श्री संगमलाल गुप्ता जी पर हमला करने वाले गुंडों के ख़िलाफ़ कठोर कारवाई जल्द से जल्द किए जाने के निर्देश दिए गए हैं !!
— Keshav Prasad Maurya (@kpmaurya1) September 25, 2021
एक भी दोषी को बक्शा नहीं जायेगा