Pramod Tiwari
-
ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు: ఎంపీ తివారి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 79 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. కానీ అందులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ పేరు లేకపోవడం ఆయనకు ఘోర అవమానమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అక్కడ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి కేంద్ర నాయకత్వానికి పెద్దపీట వేస్తోంది. తలపండిన రాజకీయ ఉద్దండులను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 79 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజీపీ అధిష్టానం. మొత్తం రెండు విడతల్లో ప్రకటించిన జాబితాల్లో సీఎం పేరు లేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇది ఆయనకు ఘోర అవమానానికి పరాకాష్ట అని అన్నారు. బీజేపీ సరికొత్త ప్రణాళికలో భాగంగా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్న సీనియర్ నాయకులకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించింది. రెండో జాబితాలో ఇండోర్-1 నుంచి స్థానం దక్కించుకున్న కైలాష్ విజయవర్గీయ తనకు పోటీచేసే ఉద్దేశ్యం లేదన్నారు. తివారీ దీనిపై స్పందిస్తూ.. కైలాష్ విజయవర్గీయకు తన మానసిక ఆరోగ్యం సహకరించడం లేదని చెబుతున్నా సరే వినకుండా పోటీచేయాల్సిందేనని అధిష్టానం ఆయనపై ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుతం కైలాష్ పరిస్థితి నీళ్లలోంచి బయటపడ్డ చేపలా తయారైందన్నారు. 39 మంది అభ్యర్థులతో బీజేపీ ప్రకటించిన ఈ రెండో జాబితాలో విజయవర్గీయ తోపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు. వీరిలో నరేంద్ర సింగ్ తొమార్, ఫగ్గాన్ సింగ్ కులాస్తే, ప్రహ్లాద్ సింగ్ పటేల్ కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించిన ప్రభుత్వం -
కాంగ్రెస్ Vs బీజేపీ: ఎంపీపై దాడి.. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేపై కేసు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ దాడి జరిగిందని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర వివాదం ఏర్పడింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని సంగీపూర్ బ్లాక్‌లో శనివారం నిర్వహించిన గరీబ్ కల్యాణ్ మేళాలో బీజేపీ ఎంపీ, బీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సంగమ్‌లాల్ గుప్తాపై దాడి జరిగింది. ఆయన కుర్తాను చించేశారు. చదవండి: కేటీఆర్ మెచ్చిన ‘పేపర్ బాయ్’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా? ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ఈ ఘటనపై ఏకంగా 27 మందిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీతో పాటు ఆయన కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రాతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి.. जनपद प्रतापगढ के सांगीपुर ब्लॉक में आयोजित गरीब कल्याण मेले में भाजपा सांसद एवं भाजपा पिछड़ा वर्ग मोर्चा के राष्ट्रीय महासचिव श्री संगमलाल गुप्ता जी पर हमला करने वाले गुंडों के ख़िलाफ़ कठोर कारवाई जल्द से जल्द किए जाने के निर्देश दिए गए हैं !! एक भी दोषी को बक्शा नहीं जायेगा — Keshav Prasad Maurya (@kpmaurya1) September 25, 2021 -
ఆయన రాజీనామా చేయలేదు
సాక్షి, మాంద్య (కర్ణాటక) : ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి రాజ్‌బబ్బార్ తప్పుకోలేదని, రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు. 'నేను మీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజ్ బబ్బార్ రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవి' అని తివారీ అన్నారు. అంతకుముందు ఓ వార్తా సంస్థలో వచ్చిన వార్తల ప్రకారం రాజ్ బబ్బార్ ఇలా చెప్పారు . 'కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు నాకు ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. వాటిని నిర్వర్తిస్తూ 2019 ఎన్నికలకు అనుగుణంగా పనిచేస్తాను. నేను ఏం చెప్పాలో అది మా పార్టీ అధ్యక్షుడికి చెబుతాను. కాంగ్రెస్ పార్టీ గత కొద్దికాలంగా ఓడిపోతూ వస్తోంది.. ఓడిపోతుంది' అంటూ ఆయన చెప్పారు. గోరఖ్‌పూర్, పుల్పూర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపేలవమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. -
'ఓట్లు కోసమే అలా అంటున్నారు'
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారి విమర్శించారు. 'దళిత సోదరులపై కాదు.. నన్ను కాల్చండి' అంటూ దళిత ఓట్లకు మోదీ గాలం వేస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, రాంచీలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఇదే విధమైన ఆందోళన ఎందుకు వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు. నకిలీ గోవు రక్షకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రమోద్ తివారి స్పందించారు. నిజమైన గో హంతకులు ఎక్కడనున్నారో తాను చెబుతానని అన్నారు. 500 ఆవుల మరణానికి కారణమైన రాజస్థాన్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. కాగా, కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని, దాడి చేయాలనుకుంటే తనపై చేయాలని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో నరేంద్ర మోదీ అన్నారు. -
'ఫ్రీడం 251 మొబైల్స్ పథకం మోసం'
న్యూఢిల్లీ: ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ పథకం మోసమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారీ ఆరోపించారు. బీజేపీ పాలనలో ఈ పథకం పేరిట పెద్ద కుంభకోణం జరగబోతుందని శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మేకిన్ ఇండియా పేరిట మేకిన్ ఫ్రాడ్‌కు పాల్పడుతుందని జీరో అవర్ లో ప్రమోద్ తివారీ ధ్వజమెత్తారు. ఫ్రీడం ఫోన్ ఆవిష్కరణలో బీజేపీ నేతలు పాల్గొనడాన్ని తప్పుబట్టారు. 'ఇప్పటికే ఆరు కోట్ల బుకింగ్స్ జరిగాయి. వీటి ద్వారా కొన్ని కోట్ల రూపాయాలు సేకరించారు. ఈ మొబైల్ తయారికీ రూ.1400 లు వ్యయం అవుతుందని స్వయాన కంపెనీ డైరక్టరే చెబుతున్నారు. ఇవే ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్లను బహిరంగ మార్కెట్లో రూ.20 వేలు నుంచి 30 వేలకు విక్రయిస్తుంటే స్మార్ట్‌ఫోన్ ను రూ.251 లకే ఎలా ఇస్తారు' అని సర్కార్‌ను ప్రశ్నించారు. ధరల విషయంలో రింగింగ్ బెల్స్ సంస్థ లేదా మిగిలిన సంస్థలు మోసం చేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని తివారీ డిమాండ్ చేశారు.