'ఓట్లు కోసమే అలా అంటున్నారు' | PM is worried about his votes so he says "shoot me": Pramod Tiwari | Sakshi
Sakshi News home page

'ఓట్లు కోసమే అలా అంటున్నారు'

Published Mon, Aug 8 2016 12:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

'ఓట్లు కోసమే అలా అంటున్నారు'

'ఓట్లు కోసమే అలా అంటున్నారు'

న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారి విమర్శించారు. 'దళిత సోదరులపై కాదు.. నన్ను కాల్చండి' అంటూ దళిత ఓట్లకు మోదీ గాలం వేస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, రాంచీలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఇదే విధమైన ఆందోళన ఎందుకు వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు.

నకిలీ గోవు రక్షకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రమోద్ తివారి స్పందించారు. నిజమైన గో హంతకులు ఎక్కడనున్నారో తాను చెబుతానని అన్నారు. 500 ఆవుల మరణానికి కారణమైన రాజస్థాన్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు.

కాగా, కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని, దాడి చేయాలనుకుంటే తనపై చేయాలని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో నరేంద్ర మోదీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement