
ప్రతాప్‌గఢ్: కాసేపట్లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యేవారు. ఇంతలో వరుడి మదిలో మెదిలిన ఓ ఆలోచనే అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో, వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులందరూ బందీలు మారారు. వరుడిని చెట్టుకి కాట్టేశారు వధువు తరఫు బంధువులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఇద్దరికి వివాహం నిశ్చయించారు ఇరు కుటుంబా సభ్యులు. దీంతో, పెళ్లి వేడుక ప్రారంభమైంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వేడుకకు బంధువులంతా తరలివచ్చారు. కొద్ది క్షణాల్లో వధువు మెడలో జయమాల వేసే సమయం ఆసన్నమైంది. అంతలోనే పెళ్లి కొడుకు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. దీంతో, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.
అనంతరం, అదనపు కట్నం విషయంలో ఎంతసేపు వరుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నాడు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడివైపు మొగ్గుచూపారు. దీంతో, విసుగెత్తిన వధువు కుటుంబ సభ్యులు.. ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేశారు. అనంతరం, వరుడిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరుడు మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని వధువు తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
इस लइका का जयमाल हो गया था .. उसके बाद परिजन दहेज की डिमांड करने लगे। जिसके बाद लड़की के परिजन ने दूल्हे साहेब को पेड़ से बांध दिया।
— हम लोग We The People (@ajaychauhan41) June 15, 2023
वीडियो यूपी के प्रतापगढ़ से है ।। pic.twitter.com/obOG9BpLMB
ఇది కూడా చదవండి: చిన్న వర్షానికే వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment