వివాదస్పద ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ బీ ఎల్ జోషి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమాజవాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్, సీనియర్ మంత్రులు మహ్మమద్ అజాం ఖాన్తోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది మొదట్లో ప్రతాప్గఢ్ డీఎస్పీ జి-ఉల్-హక్ హత్యకు గురయ్యారు.
ఆ హత్య కేసులో ఆహార, పౌర సరఫరాల మంత్రి రాజా భయ్యాకు ప్రమేయం ఉందని అతడి భార్య పర్వింద్ ఆజాద్ ఆరోపించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజాభయ్యా మార్చిలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. డీఎస్పీ హత్య కేసును సీబీఐకు అప్పగించింది. డీఎస్పీ హత్య కేసులో రాజాభయ్యాకు ఎటువంటి ప్రమేయం లేదని సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది. దాంతో రాజాభయ్యా తిరిగి అఖిలేష్ మంత్రి వర్గంలో మరోసారి చోటు దక్కింది.