ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వచ్చే విషయమే.
మెడి క్షనరీ
ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వచ్చే విషయమే. కాకపోతే చాలామందికి ఇది ఒక సాధారణ అంశమనీ, దానికి వైద్యపరిభాషలో ఒక పేరుందనీ తెలియకపోవచ్చు. దాని పేరే ‘డెజా...వూ’ (ఛ్ఛ్జ్చీఠిఠ)! ఈ ఫ్రెంచ్ మాటకు ‘అప్పటికే కనిపించిన దృశ్యం’ అని అర్థం. ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు... ‘అరె... ఇది గతంలో మనకు అనుభవంలోకి వచ్చిన విషయమే కదా’ అనిపిస్తుంటుంది.
మెదడులో జరిగే కొన్ని తప్పుడు ప్రక్రియల వల్ల మనకు ఇలా ముందే జరిగిన సంఘటనే పునరావృతమైనట్లుగా తోస్తుంది. ఆ సమయంలో జరిగే సంభాషణలూ ముందే తెలిసినట్లుగా మనకు అనిపిస్తుంటాయి.