Conversations
-
ష్.. మీ ఫోన్ వింటోందా?
మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేయాలని అనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ మీ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ వినేస్తోంది. మనపై మన ఫోన్ ఉంచుతున్న నిఘా గుట్టును తేల్చేయడానికి నిపుణులు 4 సూచనలు చేస్తున్నారు. మన సంభాషణలను రహస్యంగా వినేస్తున్న స్మార్ట్ ఫోన్లు మనం దేని గురించి మాట్లాడితే.. ఆ అంశంపై యాడ్స్ వెబ్సైట్ల నుంచి సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అవే ప్రకటనల గోల మీరేం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. ఇంట్లో మీ గదిలో కూర్చుని మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో ఇవన్నీ మాట్లాడుకున్నారు. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఒకరు మాత్రం రహస్యంగా అన్నీ వినేస్తున్నారు.. వినడమే కాదు, మీ మాటలన్నీ విశ్లేషించి... మీ అవసరానికి సూటయ్యేలా సూచనలు చేస్తున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఇంతకీ అన్నీ వింటున్న ఆ ఒక్కరు ఎవరు?.. మీ స్మార్ట్ ఫోనే! నిఘా పెట్టేదెలాగో, అది మనకు తెలిసేదెలాగో తెలుసుకుందామా..ఇంటర్నెట్ సెర్చింగ్ నుంచి మైక్రోఫోన్‌తో నిఘా దాకా..మీరు ఏదైనా ప్రదేశం గురించో, మరేదైనా సమాచారం కోసమో ఇంటర్నెట్లో సెర్చింగ్ చేస్తే.. ఆ తర్వాత మీ ఫోన్లో, కంప్యూటర్లో ఆ ప్రదేశం, సమాచారానికి సంబంధించిన ప్రకటనలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఢిల్లీలో మంచి హోటళ్లు ఏమేం ఉన్నాయని సెర్చ్ చేశామనుకోండి. ఆ తర్వాత కొన్నిరోజుల వరకు మనం ఏ వెబ్సైట్లు ఓపెన్ చేసినా.. వాటిలో ఢిల్లీలోని హోటళ్ల సరీ్వసులు, ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ మన ఫోన్ మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నామనేదీ తెలుసుకుంటోంది. ఫోన్లోని మైక్రోఫోన్ ద్వారా నిఘాపెడుతోంది. మరి మన ఫోన్ ఇలా మనపై నిఘా పెట్టిందా లేదా అనేది చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని ‘నార్డ్ వీపీఎన్’ సంస్థ టెక్ నిపుణులు చెబుతున్నారు.మనపై ఫోన్ నిఘా గుట్టు తేల్చేద్దాం ఇలా..1. మీరు ఇప్పటివరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయని, సోషల్ మీడియాలో పెట్టని, ఎప్పుడూ మాట్లాడని ఒక కొత్త టాపిక్‌ను ఎంచుకోండి.2. మీ ఫోన్‌ను మీకు దగ్గరలో పెట్టుకుని ఈ టాపిక్‌పై నాలుగైదు రోజులు తరచూ మాట్లాడండి. ఎవరితోనైనా చర్చించండి. ఉదాహరణకు ఏదైనా దేశం, అక్కడి నగరాలు, టూరిస్టు ప్లేసులు, రెస్టారెంట్లు వంటి అంశాలను మాట్లాడండి.3. అయితే ఈ టాపిక్కు సంబంధించి ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఎక్కడా సెర్చింగ్, పోస్టింగ్ వంటివి చేయకూడదు. కేవలం ఫోన్‌ను మీకు సమీపంలో పెట్టుకుని సదరు టాపిక్‌పై మాట్లాడాలి. మిగతా విషయాల్లో మీ ఫోన్‌ను మామూలుగానే వాడుతూ ఉండాలి.4. 4,5 రోజుల తర్వాతి నుంచి మీ ఫోన్లో, మీ ఈ–మెయిల్‌తో లింక్ అయి ఉన్న స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, కంప్యూ టర్లలో.. మీరు చూసే వెబ్సైట్లు, సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే యాడ్స్‌ను కాస్త గమనిస్తూ ఉండండి.5, ఒకవేళ మీరు మాట్లాడిన అంశానికి సంబంధించి యాడ్స్ తరచూ కనిపిస్తూ ఉంటే.. ఫోన్ మీపై నిఘా పెట్టి, మీ సంభాషణలలోని టాపిక్స్‌ను యాడ్స్ కోసం వాడుతున్నట్టే.ఈ నిఘా నుంచి బయటపడేదెలా? ⇒ ఫోన్లో సోషల్ మీడియా, ఈ–కామర్స్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన యాప్స్ నుంచి.. గేమ్స్, యుటిలిటీస్ యాప్స్ వరకు ఉంటా యి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు స్టోరేజీ, మైక్రోఫోన్, కెమెరా వంటి పరి్మషన్లు ఇస్తుంటాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ⇒ పెద్ద కంపెనీల యాప్‌లతో సమస్య ఉండకపోవచ్చుగానీ.. గేమ్స్, యుటిలిటీస్, ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్స్టాల్ చేసుకునే యాప్‌లు, యాడ్స్‌పై లింకులను క్లిక్‌చేయడం ద్వారా డౌన్లోడ్ అయ్యే యాప్‌లతో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి యాప్‌లకు ఇచ్చే పరి్మషన్లు దుర్వినియోగమై.. మీ ఫోన్‌తోనే మీపై నిఘా మొదలవుతుంది. అందువల్ల ముఖ్యమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ⇒ యాప్స్‌కు అవసరమైన పరి్మషన్లు మాత్రమే ఇవ్వాలి. అప్పుడప్పుడూ ఏయే యాప్స్‌కు ఏ పరి్మషన్లు ఇచ్చినదీ, సెట్టింగ్స్‌లోకి వెళ్లి పరిశీలించాలి. అనవసర యాప్స్‌కు ఇచ్చిన పరి్మషన్లను తొలగించాలి. వీలైతే అవసరం లేని యాప్స్‌ను తొలగించేయడం మంచిది. ⇒ ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ యాప్ సెట్టింగ్స్‌లో ‘ఆలో వెన్ లాక్డ్’ఆప్షన్‌ను డిజేబుల్ చేయాలి. దీనితో ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు మైక్రోఫోన్ వాడకుండా ఉంటుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
యువత కబుర్లు కాస్త సీరియస్ విషయాలుగా మారితే...!
కబుర్లు అంటే... ఏ సినిమా చూశావు? ఓటీటీలో ఆ షో నచ్చిందా? ఆ గాసిప్ గురించి విన్నావా? ఇన్‌స్టాగ్రామ్‌లో నా లేటెస్ట్ ఇమేజ్‌లు చూశావా?... ఇలాంటి కబుర్లేనా? యువతరం తాజా ధోరణి ‘కానే కాదు’ అంటుంది. ‘స్మాల్ టాక్’ కంటే.. ‘బిగ్ టాక్’కు ప్రాధాన్యత ఇస్తోంది. యువతరంలో నలుగురు ఒక దగ్గర కూడితే ఏం జరుగుతుంది? సరదా సరదా మాటలు, జోక్స్, సినిమా కబుర్లు, సోషల్ మీడియా సంగతులూ వినిపిస్తాయి. అయితే యువతరంలో కాలక్షేపం కబుర్లు కాకుండా కాస్త సీరియస్ విషయాల గురించి చర్చించే ధోరణి పెరుగుతోంది. ఈ సరికొత్త ధోరణిని ‘బిగ్ టాక్’ ట్రెండ్ అంటున్నారు. ‘బిగ్ టాక్’ అనేది ‘టాప్ ట్రెండ్స్ ఫర్ 2024’ ఒకటిగా నిలిచించి. ఇది‘స్మాల్ టాక్’కు అపోజిట్ ట్రెండ్. ‘స్మాల్ టాక్’ అంటే కాలక్షేపం కబుర్లలాంటివి. ‘బిగ్ టాక్ ట్రెండ్ గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. డిగ్రీ ఫ్రెండ్స్‌లో కొందరం వారానికి ఒకసారి కలుసుకొని కబుర్లు చెప్పుకుంటాం. ఎప్పుడూ కాలక్షేప కబుర్లేనా? సీరియస్ టాపిక్స్‌పై కూడా మాట్లాడుకుందాం అనే ప్రపోజ్‌కు వెంటనే కాకపోయినా కాస్త లేటుగా అయినా ఫ్రెండ్స్ ఒకే అన్నారు. అయితే బిగ్ టాక్ అనేది అంత తేలిక కాదు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్‌తో ఉన్నట్టుండి పర్యావరణ విషయాలు, రాజకీయ పరిణామాలు... మొదలైన విషయాల గురించి మాట్లాడడం అంతా ఈజీ కాదు. వినే వాళ్లు లెక్చర్ విన్నట్లుగా ఫీలవుతారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మొదలు పెట్టాం. వారం వారం ఒక్కొక్కరు ఒక్కో టాపిక్‌పై మాట్లాడాలనికి నిర్ణయించుకున్నాం’ అంటుంది ముంబైకి చెందిన ప్రణతి. ఇక యువ ఉద్యోగుల విషయానికి వస్తే...‘బిక్ టాక్’లో భాగంగా ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. ‘నా కొలీగ్ చిన్న విషయాలకు భయపడుతుంటాడు. ఏఐ టెక్నాలజి వల్ల మన ఉద్యోగాలు ఉండవేమో అన్నట్లుగా మాట్లాడేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్ టాక్‌లో కూర్చుందాం అన్నాను. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆదివారం కేఫ్ కాఫీ కార్నర్లో బిగ్ టాక్ కోసం కూర్చున్నాం’ అంటున్నాడు నాగ్‌పూర్‌కు చెందిన నిఖిల్ మిత్ర. బిగ్ టాక్‌లో భాగంగా.. జాబ్ మార్కెట్‌పై ఏఐ చూపించే ప్రభావం? ప్రపంచవ్యాప్తంగా ఫుల్–టైమ్ జాబ్స్‌పై ‘చాట్‌జీపీటి’లాంటి జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చూపించే ప్రభావం, మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ ఎలాంటి అడ్జెస్ట్‌మెంట్స్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, సీనియర్లతో పోల్చితే జెన్ జెడ్ ఏఐ గురించి ఎందుకు ఎక్కువగా భయపడుతున్నారు? ఏఐని ఫేస్ చేయడానికి ఎలా సన్నద్ధం కావాలి?... మొదలైన ఎన్నో టాపిక్లపై కొలీగ్‌తో మాట్లాడాడు నిఖిల్ మిత్ర. మిత్రుడిలోని అకారణ భయాలను దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ‘బిగ్ టాక్’ అయినంత మాత్రాన సమావేశం మొత్తం ముఖం సీరియస్‌గా పెట్టుకొని, అత్యంత గంభీరంగా మాట్లాడాలని కాదు. కాలహరణ కబుర్లకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, మనకు ఉపయోగపడే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ‘బిగ్ టాక్’ ట్రెండ్ సారాశం. పారదర్శక సంభాషణ స్నేహానికి సంభాషణే ప్రధాన ద్వారం. యంగ్ ప్రొఫెషనల్స్‌కు కొలీగ్స్‌తో ఉండే స్నేహం ఆఫీస్ టైమింగ్స్ వరకు మాత్రమే పరిమితమా? గత జెనరేషన్ ఉద్యోగులలో చాలామంది పాటించిన సెల్ఫ్–సెన్సర్ విధానం వీరిలోనూ ఉందా? అనే ప్రశ్నలకు ‘లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమైనవి అనుకునే అంశాలపై మాట్లాడడానికి, తమ అభిప్రాయాన్ని వినిపించడానికి యంగ్ ప్రొఫెషనల్స్‌లో ఎలాంటి సంకోచాలు లేవు. ఎడోబ్ సర్వే ప్రకారం సెన్సిటివ్ టాపిక్స్ గురించి కొలీగ్స్‌తో మాట్లాడటాన్ని సౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇవి చదవండి: పర్పుల్ కలర్ ఎందుకు? -
మనుషులు కాదోయ్ మాటలోయ్!
దేశమంటే ఏమిటి? సరిహద్దులతో ఉండేదా? మనసులలో అడ్డుగోడలు లేని మనుషులతో నిండి ఉండేదా? లేక... జాతులు, మతాలు, భాషలు,సంప్రదాయాలు వేర్వేరుగా వేటికవిగా ఉండేదా? కలివిడిగా, కలబోతగా కట్టుబడి ఉండేదా? లేక ఒకే గతం, ఒకే వర్తమానం కలిగి ఉండి ఒకే విధమైన భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉండేదా? దేశానికి ఎన్నో నిర్వచనాలు! భౌగోళికమైనవి, చారిత్రకమైనవి, సాంస్కృతికమైనవి. ఇవేవీ కాని ఒక వినూత్నమైన నిర్వచనాన్ని ‘బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్’ పుస్తక రచయిత రాజీవ్ భార్గవ ఇచ్చారు. ‘‘దేశమంటే, సంభాషణలో ఉన్న మనుషులు’’ అన్నారు భార్గవ ఈ పుస్తకంలో. మరి ఈ నిర్వచనం భారతదేశానికి కూడా వర్తిస్తుందా? తప్పకుండా వర్తిస్తుంది. అది మన దేశాన్ని గురించిన కచ్చితమైన అవగాహన! ఇప్పటికే చదివి ఉండనందుకు చింతిస్తూ నేనొక పుస్తకం చదువుతూ ఉన్నాను. ‘బిట్వీన్ హోప్ అండ్ డెస్పైర్’ అనే పుస్తకం సమకాలీన భారతదేశంపై రాజీవ్ భార్గవ ప్రతిఫలింపజేసిన నైతికతల సమాహారం. వాటిలో కొన్ని నిస్సందేహంగా నిస్తేజమైనవి. అరకొరగా కొన్ని బహుశా అర్థంలేనివి. చాలావరకు మాత్రం లోతైనవీ, ఆలోచన రేకెత్తించేవీ. ముఖ్యంగా ఒకటైతే తన నవ్యత వల్ల నా ధ్యాసను తనపైకి మర ల్చుకున్నది. ఇంకా చెప్పాలంటే, అది మన దేశం గురించి కచ్చితమైన అవగాహన. పుస్తకంలో ‘ఎ నేషన్ ఈజ్ ఎ పీపుల్ ఇన్ కాన్వర్సేషన్’ అనే శీర్షికతో ఉన్న ఒక వ్యాసంలో... ‘‘దేశం అంటే ఏమిటి?’’ అనే ప్రశ్నకు సమాధానంగా, ‘దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు’ అంటారు భార్గవ. మీరసలు ఊహించనే లేని భిన్నమైన జవాబు అది. దేశమంటే ఏమిటి అన్న ప్రశ్నకు స్కూల్లో మనకు నేర్పించిన జవాబు కచ్చితంగా ఇది మాత్రమైతే కాదు. దేశాలను మనం జాతులు, భాషలు, మతాల వారీగా, ఇంకా... చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఏర్పడిన మనుషుల సమూహంగా అవగాహన పరచుకున్నాం. కొన్నిసార్లు ఈ భిన్నత్వాల జోడీకి కూడా దేశం అనే ఏక రూపత స్థిరపడుతుంది. ఇందుకు స్ఫురించే ఉదాహరణలు... ఇజ్రాయిల్, కుర్దిస్తాన్, పాలస్తీనా, లిక్టన్స్టయిన్; జులు, బెర్బెర్ జాతులు, ఎస్కిమోలు, రెడ్ ఇండియన్లు, మావోరీలు. దేశాలన్నీ కూడా వీటిల్లో ఒకటీ లేదా అంతకంటే ఎక్కువగా వైవిధ్యాల కలబోత స్వభావాన్ని కలిగి ఉంటాయి. భార్గవ ఒక దేశాన్ని చాలా భిన్నమైన కోణంలో చూస్తారు. ‘‘అన్నిటì కంటే వారి గతం, వర్తమానం, భవిష్యత్తులను గురించిన సాధారణ, లేదా అతివ్యాప్త ఆందోళనల వల్ల స్వీయ స్పృహతో జట్టు కట్టిన ప్రజాసమూహమే దేశం. ఆ ఏకతలోని చేతన జన్యుపరమైనది కాదు. ఆకాశం నుండి ఊడి పడినదీ కాదు. నోటితో, రాతలతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పింది ఒకరు వినడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల వృద్ధి చెందినది’’ అంటారు. అందుకే భార్గవ, దేశమంటే సంభాషణలో ఉన్న ప్రజలు అన్నారు. అయితే భారతదేశాన్ని అర్థం చేసుకోడానికి అది కచ్చితమైన ఉత్తమ నిర్వచనం అవుతుందా? లొడలొడమని కబుర్లు చెప్పడం, మాట్లాడటం, మాట్లాడేవాళ్లకు అంతరాయం కలిగించడం, కేకలు వేయడం, పెద్దగా అరవడం, విని వదిలేయడం, వినాలని పట్టుపట్టడం... ఇవేగా మనం ఎప్పుడూ చేసేది. ఇవన్నీ చేస్తున్నందుకు ఇంకెవరైనా అయితే మనల్ని ‘టవర్ ఆఫ్ బాబెల్’ అనేవారు. కానీ భార్గవ మన ఎడతెగని ఈ సంభాషణను మన జాతీయతలోని ప్రధానాంశంగా గుర్తించారు. ఈ వినూత్న నిర్వచనాన్ని దాటి చూస్తే, ఆ వెనుక... నేడు మన దేశంలో ఏం జరుగుతోంది అనే విషయమై కలవరం కలిగించే ముఖ్యాంశాలు ఉండటం కనిపిస్తుంది. ‘‘వార్తాపత్రికలు, ఆ తర్వాత టీవీ ఛానళ్లు ప్రేరేపించనిదే ప్రజల మధ్య సంభాషణలు ఉండటం లేదు. సమస్యలపై ఉమ్మడి ఆందోళనలు వృద్ధి చెందడం అన్నది కనిపించడం లేదు. కనుక దేశం అన్నదే లేదు’’ అంటారు భార్గవ. అంటే, మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం లేదు. మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కనుక మన మీడియా ఆరోగ్యం – పారదర్శకత, నిష్పాక్షికత, వాక్స్వేచ్ఛా నిబద్ధత – మన జాతీయతకు ఎంతో కీలకమైనది. భార్గవ అడగని ఒక ప్రశ్న, ఆవేశాన్ని రేకెత్తించే ప్రశ్న... మనం వార్తాపత్రికను చేతిలోకి తీసుకున్న ప్రతి సారీ, లేదంటే వార్తా చానెల్‌ను పెట్టగానే తలెత్తు తుంది... భారతీయ మీడియా భారతదేశాన్ని అణగదొక్కుతోందా అని! ఈ పుస్తకం మరొక ప్రశ్నను కూడా లేవనెత్తింది, బహుశా అది మరింతగా కలవరపెట్టే ప్రశ్న. మళ్లీ కూడా భార్గవ నేరుగా ప్రశ్నించడం లేదు. ప్రశ్న వైపుగా మనల్ని మళ్లిస్తున్నారు. ‘‘ఒక దేశం అన్నది సంభాషించుకునే ప్రజా సమూహం అయినప్పుడు ఆ సంభాషణను ఎవరైనా అడ్డుకుంటే దేశాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది’’ అంటారు. ఈ వేలు ఎటువైపు చూపిస్తోందో నాకు తెలుసు. మీకూ తెలుసు. ఆ వేలు ఎవరి వైపు అయితే తిరిగి ఉందో వారికీ తెలుసు. ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన పని లేదని దీని అర్థం. భార్గవ మరింత ముందుకు వెళ్లారు. సంభా షణను ఆపేయడం మాత్రమే మన దేశానికి ప్రమాదకరం కాదు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల సంభాషణను ప్రభుత్వం లాగేసుకోకూడదు. ప్రజా సంభాషణను నిర్దేశించకూడదు. నియంత్రించ కూడదు. సంభాషణలో ప్రభుత్వం కూడా ఒక భాగమే తప్ప తనే శాశ్వతంగా సంభాషణను నడపాలని చూడకూడదు. వాస్తవానికి సంభాషణకు అంతరాయం కలిగించే వారిని, నిరోధించే వారిని నియంత్రించడం ప్రభుత్వ విధి. దానినే దేశం ఆశిస్తోంది’’ అంటారు భార్గవ. ఈ చివరి వాక్యం నాకు నచ్చింది. మన టెలివిజన్ యాంకర్లు చెప్పేది గుర్తొచ్చింది, వాళ్లు వేరే అర్థంలో చెప్పి నప్పటికీ. భార్గవ వాళ్ల మాటల్ని వాళ్ల నెత్తిపైనే కుమ్మరించారు. దేశం అంటే ఏమిటో భార్గవ ఇచ్చిన నిర్వచనంలోని అందం... వేర్వేరు జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఆహార సంప్రదాయాలు, భౌగోళికతలు, చారిత్రక నేపథ్యాలు కలిగివున్న వాళ్లంతా కలిసి ఉండటంలో ఉన్న ప్పటికీ... ఈ వ్యత్యాసాలు కేవలం వివరణా త్మకమైనవి. అసలైనది ఏమంటే... కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, రాన్ ఆఫ్ కచ్ నుంచి అగర్తల వరకు మనం ఒకరితో ఒకరం సంభాషించుకుంటున్నాం. తగాదాలు ఉంటే ఉండొచ్చు. అంత రాయం కలిగించుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఒక సుదీర్ఘ ప్రసంగానికి, పాండిత్యానికి, అజ్ఞానానికి, వట్టి సమాచారానికి, నీరసం కలిగించే మాటలకు చెవి ఒగ్గుతూ ఉండొచ్చు. ఇవేవీ కాదు, మనమైతే మాటల్లో ఉన్నాం. అదీ ముఖ్యం. ఈ సంభాషణ ఆగిపోతే ఏం జరుగుతుందన్నది ఆలోచించాల్సిన విషయం. భార్గవ చెప్పడం, దేశం ‘విడివడడానికి’ దారి ఏర్పడుతుందని! మన దేశం గురించే ఆయన చెబుతున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Twitter: కొత్త ప్రయోగం.. ట్విటర్ కూల్
సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆ చర్చలు వాడీవేడి పరిణామాలకు.. అటుపై విపరీతాలకూ దారితీస్తుంటాయి. అయితే ఆ హీట్ డిబేట్లను తగ్గించే ప్రయత్నాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు చేయలేవా?.. ఇందుకోసమే ట్విటర్ ఇప్పుడు రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ త్వరలో ఓ కూల్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చర్చ అటుఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్.. సదరు ట్వీపుల్స్(ట్విటర్ పీపుల్స్)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్‌తో ఓ ఫీచర్‌ను డిస్ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్ ఉంటుంది. అయితే సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్ ఇప్పుడే చెప్పట్లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్, ఐవోఎస్.. రెండింటిలోనూ ఈ కూల్ ఫీచర్‌ను అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే ట్విటర్లో ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్ టైం లైన్లో వాటికవే రిఫ్రెష్ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్ ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ ఫీచర్‌ను తెస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ఫేస్‌బుక్‌కి దెబ్బ.. వీళ్లేమో పండగ చేస్కున్నరు -
ఫేస్బుక్ అంతర్గత సంభాషణలు, మెమోలు లీక్
శాన్ఫ్రాన్సిస్కో : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్ల డేటా లీక్‌తో ఇబ్బందులు పడుతున్న ఫేస్బుక్ సంస్థకే స్వయంగా సొంతగూటిలో డేటాలీక్ ముప్పు తప్పలేదు. సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు, ఇతర ముఖ్యమైన అధికారులకు మధ్య జరిగిన అంతర్గత సంభాషణలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా 2012లో వివిధ ప్రైవసీ పాలసీ విధానాలకు సంబంధించిన అతికీలకమైన విషయాలు ఆన్లైన్లో బహిర్గతం కావడం కలకలం రేపింది. ఫేస్బుక్, సిక్స్4ఆర్ మధ్య దావాకు సంబంధించిన 60పేజీల ఈమెయిల్ సమాచారం,ఇతర పత్రాలు గిట్ హబ్‌లో పోస్ట్ అయ్యాయని ది గార్డియన్ శుక్రవారం నివేదించింది. షెడ్యూల్‌కంటే ముందే కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆన్లైన్లో బహిర్గం చేసిందని పేర్కొంది. దీంతోపాటు గోప్యతా రక్షణపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్, అక్కడి నేర విభాగం అధిపతితో చర్చించిన అంశాలు కూడా లీక్ అయ్యాయని నివేదించింది. ఆండ్రాయిడ్ పరికరాల్లో డేటా సేకరణకు సంబంధించి ప్రణాళికలు చర్చలు బహిర్గతం కావడం రెండవ అదిపెద్ద లీక్‌గా పత్రిక రిపోర్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన విధానంపై ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ మార్నే లివైన్కు చెందిన 2012 జులైనాటి 8పేజీల మెమోగా భావిస్తున్నారు. థర్డ్ పార్ట్ యాప్స్ ద్వారానే గోప్యతా ఉల్లంఘన జరిగినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అయితే దావా పత్రాలను కాలిఫోర్నియా కోర్టు సీజ్ చేసిన నేపథ్యంలో తామేమీ వ్యాఖ్యానించలేదమని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. -
టీమ్‌ను నడిపించగలరా?
టీమ్‌వర్క్‌తో మంచి ఫలితాలను సాధించడం గొప్ప నైపుణ్యం. అది కొందరిలోనే ఉంటుంది. అది సానుకూల ధోరణితోనే సాధ్యమవుతుంది. మనలో ఆ నైపుణ్యం ఉందా? ఒకసారి చెక్ చేసుకుందాం. 1. పని అనుకున్నట్లుగా పూర్తికాకపోతే నెపాన్ని ఎవరో ఒకరి మీదకు తోసివేయకుండా రూట్కాజ్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. నిరాశావాదం, ప్రతికూలమైన ఆలోచనల లాగానే సానుకూల దృక్పథం కూడా ఒక వ్యాధి లాంటిదే. మనం దేనిని మనసావాచా స్వాగతిస్తే అదే మన నైజంగా స్థిరపడుతుంది. ఎ. అవును బి. కాదు 3. వర్క్‌ప్లేస్‌లో సంభాషణ, సమావేశాల్లో చర్చించే అంశాలు పాజిటివ్‌గా ఉంటేనే, ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 4. చర్చలు, సంభాషణలు నెగెటివ్ ధోరణిలో సాగితే ఆ ప్రదేశమంతా నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆ ప్రభావం పని మీద పడుతుంది. ఎ. అవును బి. కాదు 5. సమస్యను అధిగమించడానికి ఏం చేయాలన్న దాని మీదనే దృష్టిని కేంద్రీకరించాలి తప్ప, మరొకరి మీద అభియోగం మోపి శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదనుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. మీ ముందున్న లక్ష్యాన్ని చేరడానికి తగినట్లుగా మీ కింది ఉద్యోగులను ఉత్తేజపరచడం, చైతన్యవంతం చేయడం మీకు అలవాటు. ఎ. అవును బి. కాదు 7. సానుకూల ధోరణితోనే సత్సంబంధాలను కొనసాగించవచ్చు, నాయకత్వ లక్షణాల్లో ఇది ప్రధానమైంది. ఎ. అవును బి. కాదు 8. డివైడ్ రూల్ విధానం కొన్నిసార్లు తాత్కాలికంగా ప్రయోజనాలను ఇచ్చినా దీర్ఘకాలంలో అది ప్రతికూలమైన ఫలితాలనిస్తుందని మీ భావన. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సానుకూలదృక్పథంతో ముందుకు పోవడం ఎలాగో మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే మీలో బృందాన్ని నడిపించగలిగిన లక్షణాలు తక్కువనే చెప్పాలి. -
జరిగిపోయినట్లుగా అనిపించే అనుభవం ‘డెజా...వూ!’
మెడి క్షనరీ ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వచ్చే విషయమే. కాకపోతే చాలామందికి ఇది ఒక సాధారణ అంశమనీ, దానికి వైద్యపరిభాషలో ఒక పేరుందనీ తెలియకపోవచ్చు. దాని పేరే ‘డెజా...వూ’ (ఛ్ఛ్జ్చీఠిఠ)! ఈ ఫ్రెంచ్ మాటకు ‘అప్పటికే కనిపించిన దృశ్యం’ అని అర్థం. ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు... ‘అరె... ఇది గతంలో మనకు అనుభవంలోకి వచ్చిన విషయమే కదా’ అనిపిస్తుంటుంది. మెదడులో జరిగే కొన్ని తప్పుడు ప్రక్రియల వల్ల మనకు ఇలా ముందే జరిగిన సంఘటనే పునరావృతమైనట్లుగా తోస్తుంది. ఆ సమయంలో జరిగే సంభాషణలూ ముందే తెలిసినట్లుగా మనకు అనిపిస్తుంటాయి. -
‘పాత్రో’చిత సంభాషణ
గణేష్ పాత్రో మరణంతో మూగబోయిన మాట ఉత్తరాంధ్ర మాండలికానికి వన్నె తెచ్చిన రచయిత. గణేష్ పాత్రో మరణంతోమూగబోయిన మాట ఉత్తరాంధ్ర మాండలికానికి వన్నె తెచ్చిన రచయిత ఉత్తరాంధ్ర యాసలో (మాండలికంలో) సంభాషణలు పలికించడంలో గురజాడ తర్వాత తానే అనిపించుకున్నారు... రావి శాస్త్రి వంటి ఉద్దండుల స్ఫూర్తితో రచయితగా ఎదిగారు... నాటక, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు... ఆయన మాటలతోనే రాణించిన సినిమాలెన్నో ఉన్నాయి... చివరిగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి సంభాషణలు అందించి ఈ తరం ప్రేక్షకులను కూడా మెప్పించారు... గణేష్‌పాత్రో ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ... ఆయన మరణం కళారంగానికి తీరని లోటని ప్రముఖులెందరో సంతాపం తెలిపారు... విశాఖపట్నం-కల్చరల్: ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ చిత్రాల్లో విశాఖ అందాలు కనువిందు చేశాయి. మద్రాసులో తయారైన సినిమాల్లో ఉత్తరాంధ్ర జీవనం ప్రతిఫలించే పాత్రలెన్నో కనిపిస్తాయి. పదునెక్కిన మాటలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి. దీని వెనకు ఉన్న ఒకే ఒక వ్యక్తి గణేష్‌పాత్రో. సమాజాన్ని నిలదీసిన ‘స్వాతి’, తాతయ్యకు మురిపాలు పంచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ ఆయన కలం బలంతోనే అంతగా రాణించారంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లోకి రాకముందే ఆయన ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘లాభం’ వంటి ఎన్నో నాటకాల్లో ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉపయోగించారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, ఆత్మీయ విలువలు ఆయన రచనలో ప్రతిఫలిస్తాయి. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పాత్రో విశాఖపట్నం వెంకటేశ్వరస్వామి మెట్ట నారాయణవీధిలో చాలా కాలం నివాసమున్నారు. టెలిగ్రాఫ్ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయన ఏవీఎన్ కాలేజీలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ప్రఖ్యాత నాటక ప్రయోక్త, ఏయూ సాంస్క ృతిక విభాగం స్టేజ్ డెరైక్టర్‌గా పనిచేసిన కె.వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో ఎన్నో నాటకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నారు. 1975లో సినీ నటుడు గుమ్మడి వేంకటేశ్వరరావు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. కె.బాలచందర్, క్రాంతికుమార్, కోడి రామకృష్ణ వంటి ఎందరో ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంభాషణలు అందించారు. మహాకవి గురజాడ అప్పారావు స్వర్ణోత్తర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సాంస్క ృతిక మండలి ‘గురజాడ సాహితీ పురస్కారం’తో గణేష్పాత్రోను సత్కరించింది. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఉత్తరాంధ్ర గర్వించదగ్గ సృజనాత్మకమైన రచయిత గణేష్‌పాత్రో. ప్రత్యేకమైన శైలిగల సాహితీ పరిమళం. తెలుగు సినిమాలో ‘సంప్రదాయ ఒరవడి’ మాట వినిపిస్తే అది గణేష్‌పాత్రో అనేంతగా గుర్తింపు పొందారు. తనకంటూ ప్రత్యేక ఢతశైలి ఏర్పరుచుకుని చివరి చిత్రం వరకు చక్కని అనుబంధాల మధ్య చిక్కని భావంతో మాటలందించారు. నాటకాల్లోనే కాదు సినిమాల్లోనూ ఆయన ఉత్తరాంధ్రను ప్రతిఫలింపజేశారు. అనేక చిత్రాల్లో దొండపర్తి, నక్కవానిపాలెం వంటి విశాఖ ప్రాంతాలను ప్రస్తావించారు. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో వదినతో గొడవ పడ్డ సరోజ ‘వదినా నువ్వు వీరఘట్టం నేను విశాఖపట్నం...నువ్వు టెన్త్‌క్లాసు నేను బీఎస్సీ’ అంటుంది పొగరుగా. ఆయన మృతి తెలుగు సినిమాకు, ముఖ్యంగా వైజాగ్‌కు తీరని లోటు. -గొల్లపూడి మారుతీరావు, ప్రఖ్యాత రచయిత, నటుడు ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టం కట్టారు... గణేష్‌పాత్రో రచించిన మొట్టమొదటి నాటిక ‘పావలా’లో రంగడిగా నటించాను. సినిమా ఇండస్ట్రీకి వెళ్లడానికి ముందు నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన రాసిన ఎన్నో కథలను నేను దర్శకుడిగా మారి నాటకాలు ప్రదర్శించేవాడిని. ఆయన రాసిన ప్రఖ్యాత పావలా నాటకాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లిన అవకాశం నాకు దక్కింది. ఆయన సృష్టించిన ఎన్నో పాత్రలు ధరించే అవకాశం నాకు దక్కింది. కథా వస్తువులను పరిగ్రహించడంలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి. సినిమాల్లోకి వెళ్లినా అతని మాటల పట్టు మాత్రం ఏ మాత్రం జారలేదు. ఉత్తరాంధ్ర మాండలికానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా అతన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ రోజు మన నుంచి దూరం కావడం నిజంగా బాధాకరం. -మిశ్రో, సీనియర్ నటుడు, దర్శకుడు మంచి క్రియేటివ్ రైటర్ సినీ పరిశ్రమలో విశాఖపట్నం నుంచి గుర్తింపు పొందిన రచయితల్లో గొల్లపూడి మారుతీరావు మొదటి వ్యక్తికాగా, రెండో వ్యక్తి గణేష్‌పాత్రో. ఆయన కేరీర్ విశాఖపట్నం నుంచే ప్రారంభమైంది. ఎంతో పేరు గాంచిన పెద్ద పెద్ద దర్శకులకు కథలు, సంభాషణలు అందించిన మహా సృజనాత్మకమైన రచయిత. తన మాటలతో సినిమాకు ప్రాణం పోసేవారు. మంచి క్రియేటివిటీ ఉన్న రచయిత. నాటక రంగం నుంచి వెళ్లి సినిమాల్లో రాణించిన వారిలో అగ్రగణ్యుడు. నాటక రచనలో ఎంత ప్రతిభ చూపారో... సినిమాల్లోనూ అదేవిధంగా మంచి పట్టుతో రచన సాగించారు. -కాశీవిశ్వనాధ్, సినీ రచయిత ఆయన అభినందన నాకెంతో ప్రత్యేకం నాకు ఆయనతో వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. కానీ చిన్న వయస్సు నుంచే నాటకాలంటే ఉన్న పిచ్చి వలన అనేక నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. ఆయన ఎదురుగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. అవి చూసినప్పుడు దగ్గరకు వచ్చి ఎంతగానో అభినందించేవారు. సినిమాలో ఆయన రాసిన కథ, మాటలు, చాలా అద్భుతంగా ఉండేవి. చాలా సరళంగా ఉంటూ చక్కని సందేశాన్ని అందించే విధంగా పాత్రల మధ్య సంభాషణలు ఉండేవి. అలా మాటలు రాసే సత్తా అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అతని చివరి చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూస్తే అతని డైలాగ్స్ పవర్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. -సత్యానంద్, నట శిక్షకుడు -
నవ్వుల..పువ్వులు..
* జేసీ వర్సెస్ జనం * అందోలులో సరదా సంభాషణ జోగిపేట: ఆహార భద్రత , పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన తనిఖీలో భాగంగా బుధవారం ఆందోలు గ్రామానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ శరత్‌కు పలువురు వృద్ధులు, వివిధ పథకాల లబ్ధిదారులకు మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి.. దీంతో అధికారులు, స్థానికుల మధ్య నవ్వుల పువ్వులు వికసించాయి... గ్రామంలో రోడ్డు పక్కన కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఇలా పలకరించారు.. జేసీ: అమ్మా మీరు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారా? వృద్ధురాలు: ఎలచ్చన్లకు ఇంటికొచ్చి దండాలు పెడ్తరు.. ఇంటికి పా.. (అని వృద్ధురాలు అనగానే జేసీతో సహా అక్కడి వారంతా ఘొల్లున నవ్వారు) జేసీ: అమ్మా నీకు తప్పనిసరిగా పింఛను వస్తది.. నీకు ఎంత మంది కొడుకులు? వృద్ధురాలు: ఒక్కడు సచ్చిపోయిండు, ముగ్గురు కొడుకులున్నా ఒంటరిగానే ఉన్నా.. అంటూ వారిని తిట్టబోయింది... జేసీ: నీవు అన్నదాంట్లో తప్పేమి లేదు.. వచ్చేనెల నుంచి నీకు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తది.. వాళ్లే అమ్మా.. అమ్మా అంటూ నీ చుట్టు తిరుగుతారు. వృద్ధురాలు: దండం పెడుతూ నీ దయ అంది. అందోలులోని అంబేద్కర్ కాలనీలో ఏసయ్య ఇంటి వద్ద రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు పరిశీలిస్తుండగా జేసీ అక్కడికి వెళ్లారు. జేసీ: నీ వయస్సు ఎంత ఉంటుంది? ఏసయ్య: 66 వరకు ఉంటది సార్.. జేసీ: ఏమయ్యా.. మీ అక్క వయస్సు 65 అని చెప్పావ్.. నీ వయస్సు 66 ఎలా ఉంటుంది? ఏసయ్య: మీ దయ సార్. జేసీ: నీకు ఇప్పుడు పెన్షన్ వస్తుందా? ఏసయ్య: వస్తుంది సార్ జేసీ: ఇక నుంచి రాదు, బాధ పడకు, నాలుగేళ్లు ఓపిక పట్టు వస్తుంది. అవును ఈ ఇల్లు ఎప్పుడు మంజూరైంది. ఏసయ్య: తెలుగుదేశం వాళ్లిచ్చారు సార్.. జేసీ: అలా కాదు.. ప్రభుత్వం ఇచ్చిందనాలి. ఏసయ్య: రాజయ్య ఎమ్మెల్యే ఇప్పించిండు సార్. జేసీ: మరి వెయ్యి రూపాయల పెన్షన్ ఎవ్వరు ఇస్తున్నరు? గోపాల్ (స్థానికుడు): బాబూమోహన్ సార్.. జేసీ: నవ్వుతూ ముందుకు కదిలారు.